
శృంగవరప్పాడు (కైకలూరు): వివాదాల కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య, తాను బతిమలాడినా తిరిగి రాలేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన కైకలూరు మండలం శృంగవరప్పాడు గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదైంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. శృంగవరప్పాడు గ్రామానికి చెందిన బలే పోతురాజు (35)కు ఇదే మండలం చటాకాయి గ్రామానికి చెందిన యువతితో 15 సంవత్సరాలు క్రితం వివాహం జరిగింది.
వారికి ఇద్దరు సంతానం. పోతురాజు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 15న పోతురాజు భార్య వద్దకు వెళ్లి తిరిగి కాపురానికి రావాలని బతిమలాడాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తిరిగిన ఇంటికి వచ్చిన పోతురాజు అదే రోజు రాత్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ చల్లా కృష్ణ అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment