భార్యను చంపి భర్త ఆత్మహత్య
Published Wed, Sep 13 2017 3:35 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హతమార్చాడో భర్త. అనంతరం ఉరి వేసుకొని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ముసారాంబాగ్‌లో బుధవారం వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కు చెందిన శుభాష్ రెడ్డి(42) నగరంలోని ఓ హోటల్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఆయన భార్య శోభ(35) గృహిణి. వీరి మధ్య గతకొంతకాలంగా కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం శుభాష్ భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement