గత వారం స్వల్పంగా పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు మరోసారి కాస్త తగ్గుముఖం పట్టాయి.
అనంతపురం అగ్రికల్చర్ : గత వారం స్వల్పంగా పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు మరోసారి కాస్త తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు, మధ్యాహ్న సమయంలో గాలిలో తేమశాతం పెరిగింది. ఈ క్రమంలో రాత్రిళ్లు కొంత చలివాతావరణం కొనసాగుతున్నా మధ్యాహ్న సమయంలో ఎండలు కనిపిస్తున్నాయి. మంగళవారం మడకశిరలో 13.1 డిగ్రీల కనిష్టం ఉష్ణోగ్రత నమోదైంది. అగళి 13.2 డిగ్రీలు, కనగానపల్లి 13.9 డిగ్రీలు, నల్లమాడ 14.3 డిగ్రీలు, రొద్దం 14.4 డిగ్రీలు, కళ్యాణదుర్గం 14.5 డిగ్రీలు, పుట్లూరు 14.6 డిగ్రీలు, రాయదుర్గం 14.8 డిగ్రీలు, గాండ్లపెంట 14.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 15 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి.
జిల్లా అంతటా పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల వరకు నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 68 నుంచి 88 మధ్య ఉండగా మధ్యాహ్న సమయంలో 15 నుంచి 25 శాతానికి పడిపోయింది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కాగా రానున్న నాలుగు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీలు, కనిష్టం 16 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 50 నుంచి 63, మధ్యాహ్నం 29 నుంచి 31 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటలకు 7 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.