కూలీల ఆటో బోల్తా: ఇద్దరి మృతి | 2 killed in auto accidnet at madakasira | Sakshi
Sakshi News home page

కూలీల ఆటో బోల్తా: ఇద్దరి మృతి

Published Fri, May 26 2017 11:00 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

2 killed in auto accidnet at madakasira

పెనుకొండ: అనంతపురం జిల్లా మడకశిర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 15 మంది ఉపాధి కూలీలతో వెళ్తున్న ఆటో మడకశిర రైల్వే గేట్‌ వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న కూలీలలో కురవ నాగప్ప అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలవడంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సావిత్రమ్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు.  చికిత్స పొందుతున్న కూలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement