ఈతకెళ్లి బాలుడి మృతి | The boy died and was killed | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి బాలుడి మృతి

Published Mon, Jun 5 2017 10:58 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

The boy died and was killed

మడకశిర రూరల్‌: మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన నబీరసూల్‌ కుమారుడు షేక్‌ మన్సూర్‌ (12) ఈతకెళ్లి నీటమునిగి మృతిచెందాడు. బాలుడు కల్లుమర్రి ఉన్నతపాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.  వేసవి సెలవుల్లో బాలుడు  కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా కుర్లపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం గ్రామసమీపంలోని చెరువులో ఈతకెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామం కల్లుమర్రిలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement