Swim
-
ఛారిటీ కోసం ఇంగ్లిష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!
చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించేందుకు ఇంగ్లిష్ ఛానెల్‌ని ఈదింది 16 ఏళ్ల భాతర సంతతి విద్యార్థి ప్రిషా తాప్రే. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఉత్తర లండన్‌లోని బుషే మీడ్స్ స్కూల్లో చదువుతున్న ప్రిషా తాప్రే 12 ఏళ్ల వయసులో ఈ ఇంగ్లీష్ ఛానెల్ గురించి తెలసుకుని ఈదాలనే ఆసక్తిని పెంచుకున్నట్లు తెలిపింది. అందుకోసం నాలుగేళ్ల కఠిన శిక్షణ అనంతరం గత వారమే ప్రిషా ఇంగ్లాండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్‌నెజ్ వరకు దాదాపు 34 కిలోమీటర్ల ఈతని 11 గంటల 48 నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రిషా ఈ లక్ష్యాన్ని సోలోగా పూర్తి చేయడం విశేషం. ప్రిషా యూకేలోనే జన్మించగా, ఆమె తల్లిందండ్రులు మహారాష్ట్రాకు చెందినవారు. ఆమె యూకేకి చెందిన అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ(పిల్లల ఆకలిని తీర్చే సంస్థ) కోసం దాదాపు రూ. 4 లక్షలు సేకరించింది. ఈ స్వచ్ఛంద సంస్థనే ప్రిషా ఎంచుకోవడానికి కారణం ఇది ఇంగ్లండ్, భారతదేశంలోని పిల్లలకు సహాయపడుతుండటమేని ఆమె చెబుతోంది. (చదవండి: అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు) -
చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో!
సౌదీ అంటూ ఉలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు అందరూ అభిప్రాయం మార్చుకునేలా సరికొత్త సంస్కరణలకు. శ్రీకారం చుడుతోంది. అసలు సౌదీలో మహిళలు మొత్తం శరీరం అంతా కంపి ఉంచేలా బట్టలు ధరించాలి. అలాంటి సంప్రదాయవాద దేశంలో తొలిసారి స్విమ్‌సూట్ ఫ్యాషన్ షోని భారీ ఎత్తున నిర్వహించింది. ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొనవచ్చు. ఈ స్విమ్‌సూట్ ఫ్యాషన్ గత శుక్రవారమే సెయింట్ రెజిస్ రెడ్ సీ రిసార్ట్‌లోని రెడ్సీ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జరిగింది. ఈ షోలో మెరాకో డిజైనర్ యాస్మినా క్వాన్జల్ వన్ పీస్ ఎరుపు రంగు స్విమ్‌సూట్, నీలరంగులో స్వీమ్సూట్లలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న చాలా మోడల్‌లు భూజాలు బహిర్గతమయ్యేలా స్విమ్‌సూట్ ధరించారు. ఈ క్రమంలో డిజైనర్ క్వాన్జల్ మీడియాతో మాట్లాడుతూ.."ఈ దేశం చాలా సంప్రదాయవాదంగా ఉంది. కానీ తాము అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే సొగసైన స్విమ్‌సూట్‌లో కనిపించేందుకు యత్నం చేస్తున్నాం. ఇది తమ గౌరవంగా భావిస్తున్నాం." అని తెలిపింది క్వాన్జల్. అంతేగాదు నిజానికి సౌదీ అరేబియాలో స్విమ్‌సూట్ ఫ్యాషన్‌షో అనేది చరిత్రాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి షో నిర్వహించడం సౌదీలో ఇదే తొలిసారి. Red Sea Fashion Week లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్‌లో ఈ షో నిర్వహించారు. Red Sea Globalలో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్ సీ రిసార్ట్‌లో ఈ షో జరగడం మరింత ఆసక్తికరంగా మారింది. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్ని నిర్మించింది సౌదీ ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్ చేస్తోంది.ఎన్నో సంస్కరణలు..ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్‌లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్‌కి తీసుకెళ్లి మరీ బలంవంతంగా ప్రార్థన చేయించే వాళ్లు. ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్ వచ్చిన తర్వాత నుంచి ఈ నిర్బంధపు ప్రార్థనల్ని పక్కన పెట్టేశారు. అంతే కాదు సినిమా హాల్స్‌ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పురుషులు, మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్.2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ 12.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే..స్విమ్‌సూట్ ఫ్యాషన్ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని సల్మాన్ఎ దురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి.SAUDI ARABIA HOSTS A SWIMSUIT FASHION SHOW FOR THE FIRST TIME pic.twitter.com/eOcLRnv2K9— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 18, 2024 (చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..) -
కూతురికి స్విమ్ చేయడం నేర్పిస్తూ..పాపం ! ఆ తండ్రి..
ఒక్కసారి కొన్ని ఘటనలు చూస్తే విధి లిఖితమో లేక అనుకోకుండా జరిగిందో అర్థం కావు. మనకళ్ల ముందే అప్పటి వరకు హాయిగా ఉన్నవారు హఠాత్తుగా ఇక లేరు అంటే.. నమ్మశక్యం కాదు. వారితో మనకు ఎలాంటి సంబంధం లేకున్నా బాధనిపిస్తుంది. అలాంటి షాకింగ్ ఘటనే US అమెరికా కుపర్టినోలో ఉంటున్న NRI కుటుంబంలో జరిగింది. అప్పటి వరకు హాయిగా నవ్వుతూ తుళ్లుతూ తిరిగారు ఆ తండ్రి కూతుళ్లు. అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. USలో ఉంటున్న మద్ది రామయ్య ప్రత్తి, తన భార్య పద్మ, ఏడేళ్ల కూతురితో కుపర్టినోలో ఓ అపార్టమెంట్లో నివశిస్తున్నారు. తన కుమార్తెను స్విమ్మింగ్ చేయించడం కోసం అపార్ట్మెంట్ కమ్యూనిటిలో ఉన్న స్మిమ్మింగ్‌పూల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తన బిడ్డ స్విమ్ చేస్తుండగా పక్కనే వేచి చూస్తున్నారు. ఇంతలో పాప కోసం స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లిన రామయ్య హఠాత్తుగా నీళ్లలో పడిపోయారు. రామయ్యను పూల్ నుంచి బయటకు తీసేలోగా నీళ్లు మింగేశారు. రామయ్యను క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ యూనిట్‌కి తరలించినా ఫలితం లేకపోయింది. సుమారు 4 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలతో పోరాడి చివరికి మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ ఘటనతో ఆ అపార్ట్మెంట్ వాసులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాధితుడి మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు అతని బంధువులు. కష్టకాలంలో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు gofundme వెబ్ సైట్ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. కనీసం 3లక్షల డాలర్లు (దాదాపు రెండున్నర కోట్ల రుపాయలు) లక్ష్యంగా పెట్టుకుని విరాళాలను ఆర్ధించగా.. ఇప్పటివరకు లక్షా 67వేల డాలర్లు (దాదాపు కోటి 36 లక్షల రుపాయలను) సేకరించారు. ఈ మొత్తాన్ని ఆస్పత్రి బిల్లుకు, అంత్యక్రియల కోసం వెచ్చించారు. మద్ది రామయ్య ప్రత్తి అంత్యక్రియలను ఇవ్వాళ (బుధవారం) నిర్వహించారు. (చదవండి: నాటా వేడుకలకు వేళాయె!) -
ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట
సాక్షి, నిజామాబాద్: దక్షిణ కాశీగా పేరున్న నీలకంఠేశ్వరాలయంలో జరిగిన ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. ఒకవైపు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో దేవుడి విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఈవో(ఎండోమెంట్ ఆఫీసర్) జలకాలాటకు దిగాడు. నాలుగు ఆలయాలకు ఇంఛార్జిగా పని చేస్తున్న ఈవో వేణు.. పుష్కరిణిలో ఈత కొట్టాడు. ఆ సమయంలో వద్దని అర్చకులు వారిస్తున్నా.. ఆయన వినిపించుకోలేదు. అయితే అక్కడే ఉన్న కొందరు అదంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆలయంలో అపచారం జరిగిందంటూ ఈవో వేణుపై మండిపడుతున్నారు పలువురు. -
బఘేల్ విన్యాసాలు.. భలే భలే
రాయ్‌పూర్: గిర్రున తిరిగి నీటిలో హుషారుగా మునకలు వేస్తున్న పెద్దాయనను చూశారా. వయసు శరీరానికే గానీ మనసు కాదు అన్నట్టుగా విన్యాసాలు చేస్తున్నారాయన. ఆయనేమి సామాన్య వ్యక్తి కాదు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం చత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బఘేల్ పుణ్యస్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన నీటి విన్యాసాలు ప్రదర్శించారు. ఒక్క గెంతున నీటిలోకి దుమికారు. వెనక్కి గెంతి కూడా ఆయనీ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను ట్విటర్లో భూపేశ్ బఘేల్ షేర్ చేశారు. మహాదేవ్ పేరు తలచుకుని.. సంపూర్ణ కార్తీక స్నానం ఆచరించినట్టు పేర్కొన్నారు. గత నెలలో దుర్గ్ జిల్లాలో జరిగిన గౌరి పూజాకార్యక్రమంలో కొరడాతో కొట్టించుకుని ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. (క్లిక్ చేయండి: మా గవర్నర్ అనర్హుడు.. తప్పించండి) -
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్‌స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్‌లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్‌తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్‌తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్‌గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
యూకేలో ఇద్దరు కేరళ యువకులు మృతి
లండన్: యూకేలోని ఐర్లాండ్‌లో ఒక సరస్సులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు కేరళ యువకులు మృతి చెందారు. సోమవారం యూకే సెలవురోజు కావడంతో ఒక స్నేహితుల బృందం డెర్రీ లేదా లండన్ డెర్రీలోని ఎనాగ్‌లాఫ్‌లో ఉన్న సరస్సు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఐతే అనుకోకుండా కేరళకు చెందిన సెబాస్టియన్, రూవెన్ సైమన్ అనే ఇద్దరు యువకులు ఆ సరస్సులో గల్లంతై చనిపోయారు. ఉత్తర ఐరీష్ నగరంలోన ఉన్న కేరళ అసోసియేషన్ ఆ ఇద్దరు యువకులకు నివాళులర్పించింది. ఈ విషాద ఘటన పట్ల స్థానిక కౌన్సిలర్ రాచెల్ ఫెర్గూసన్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు ఉత్తర ఐర్లాండ్ పోలీస్ సర్వీస్ ఆ ఇద్దరు యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఐతే ఈ ఘటనలో ఒక వ్యక్తి సురక్షితంగా రక్షించామని, అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనా స్థలంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డెర్రీ/లండన్ డెర్రీ మేయర్, స్ట్రాబేన్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్, సాండ్రా డఫీ కూడా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, నదులలో ఈత కొడుతున్నప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
ఏం సాహసం చేసినవ్ తాతా.. నీ తెగువకు సలాం
పిడుగులు పడ్డట్లు భారీ శబ్ధం.. ఆపై భూ ప్రకంపనలు.. హఠాత్తుగా ముందుకొచ్చిన సముద్రపు అలలతో సునామీని కళ్లారా వీక్షించింది టోంగా. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వతం బద్ధలైన ఘటనతో ఆ చిన్న ద్వీప దేశానికి తీరని నష్టం వాటిల్లింది. అయితే సముద్రపు అలల్లో 27 గంటలపాటు ఈది.. ప్రాణాలతో బయటపడ్డ ఓ పెద్దాయన సాహసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత శనివారం పసిఫిక్‌లోని భారీ అగ్నిపర్వతం హుంగా టోంగ-హుంగ హాపయ్ అగ్నిపర్వతం బద్ధలైంది. ఆ ధాటికి సునామీ చెలరేగగా.. ఆ మహాసముద్రం అలలు వేల కిలోమీటర్ల దూరంలోని తీరాలను సైతం తాకాయి. ఇదిలా ఉంటే దగ్గర్లో ఉన్న టోంగాను అతలాకుతలం చేసింది ఈ ఘటన. అయితే సముద్రపు అలల్లో చిక్కుకుపోయిన 57 ఏళ్ల లిసలా ఫోలావ్.. తన చావు ఖాయమని అనుకున్నాడు. అలాగని చావుకి లొంగిపోలేదు. ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా ప్రయత్నించి గెలిచాడు. టోంగా రాజధాని నుకువాలోఫాకు ఈశాన్యంవైపు 8 కి.మీ. దూరంలోఉంది అటాటా అనే ఓ చిన్న దీవి. ఈ దీవి జనాభా 60 మంది. లిసలా ఫోలావ్ తన కొడుకుతో పాటు ఆ దీవిలో జీవిస్తున్నాడు. వైకల్యం ఉన్న ఆ పెద్దాయన సరిగా నడవలేడు కూడా. సునామీ ఒక్కసారిగా విరుచుకుపడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా నేల ప్రాంతం వైపు పరుగులు తీశారు. కానీ, ఆ పెద్దాయన మాత్రం పాపం నీటి ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. మొదట ఒడ్డులోని ఓ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడిన ఆ పెద్దాయన.. ఆ టైంలో దూరంగా కనిపిస్తున్న తన కొడుక్కి తన అరుపుల్ని వినిపించాలని ప్రయత్నించాడు. ఇంతలో రెండో అల భారీగా రావడంతో ఆయన సముద్రంలోకి కొట్టుకునిపోయాడు. ఇక తన పని అయిపోయిందని నీళ్లలో మునిగిపోతున్న ఆయన.. వచ్చిన కొద్దిపాటితో ఈతతో ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రాణ తీపి ఆయన్ని అలా 27 గంటలపాటు ముందుకు తీసుకెళ్లింది. మధ్యలో తొమ్మిదిసార్లు నీటి అడుగుభాగానికి చేరుతూ జీనవర్మణ పోరాటం చేశాడట ఆ పెద్దాయన. చివరికి ఏడున్నర కిలోమీటర్లు ఆపసోపాలు పడుతూ ఈదాక.. టోంగాటపు నేల భాగానికి చేరుకున్నాడు. ఆ టైంలో రెస్క్యూ టీం ఆయన్ని గుర్తించి.. ఆస్పత్రికి తరలించింది. అలా పెద్దాయన మృత్యుంజయుడిగా బయటపడడంతో పాటు సోషల్ మీడియాలో హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంత ఓర్పుతో ఆయన చేసిన ప్రయత్నం గురించి చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే రియల్ లైఫ్ అక్వామ్యాన్గా ఈ పెద్దాయన్ని అభివర్ణిస్తున్నారు. ప్రయత్నించకుండా ఫలితం ఆశించడం మనిషి నైజం. అది మారనంత వరకు జీవితంలో ముందుకు వెళ్లలేరన్న విషయం ఈ పెద్దాయన కథ ద్వారా స్పష్టమవుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 ఇదిలా ఉంటే సునామీ ధాటికి లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా ద్వీపదేశం కుదేలు అయ్యింది. ముగ్గురు చనిపోయారని అధికారులు ప్రకటించగా.. తీర ప్రాంతంలోని నివాసాలు, రిసార్టులు ఘోరంగా దెబ్బతిన్నాయి. బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం నెల టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
అప్పటివరకు కేరింతలు.. అకస్మాతుగా విషాదచాయలు
గాలివీడు (వైఎస్సార్ కడప జిల్లా): విహార యాత్ర విషాదకరంగా ముగిసింది. బెంగళూరుకు చెందిన నలుగురు సరదాగా ఈత కొడుతూ నీటిలో మునిగి మృత్యువాత పడిన సంఘటన శనివారం మండల కేంద్రానికి సమీపంలోని వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు దిగువనున్న గండిమడుగులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన దాదాపు 20 మంది కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా వాయల్పాడులోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాసేపు సరదా కోసం వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం సమీపంలోని మడుగులో ఈత కోసం దిగారు. ఈత కొట్టాలని దిగిన తాజ్ మహమ్మద్(41), ఉస్మాఖానం (12), మహమ్మద్ హంజా(11), మహమ్మద్ ఫహాద్(10)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్, ఎస్ఐ చిన్నపెద్దయ్య, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలించి రాత్రి 9 గంటలకు మృతదేహాలను వెలికితీశారు. -
ప్రాణం పోయేలా ఉంటే ప్రాంక్ అనుకుంది
పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎప్పుడూ టిక్టాకేనా, వేరే పనే లేదా? అని ఎంతమంది మొట్టికాయలు వేసినా టిక్‌టాక్ యూజర్లకు చీమకుట్టినట్టైనా ఉండదు. పైపెచ్చు నా వీడియోను ఇంతమంది చూశారు, అంతమంది లైక్ కొట్టారని తెగ మురిసిపోతుంటారు. లేదంటే నా వీడియో ఎవరూ పట్టించుకోవట్లేదంటూనే మరో వీడియోకు పోలోమని రెడీ అయిపోతుంటారు. అన్నం తినకుండా ఒకరోజైనా ఉంటారేమో కానీ టిక్‌టాక్ లేకుండా ఒక పూట కూడా ఉండలేమన్నట్లుగా తయారయ్యారు చాలామంది జనాలు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగాలు ఊడగొట్టుకోగా మరికొంతమంది ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. చావును దగ్గర నుంచి చూశాడు కానీ కొందరు మాత్రం పిచ్చి పిచ్చి ప్రయోగాలతో చావు చివరి అంచుల దాకా వెళ్లి వస్తున్నారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే. టిక్‌టాక్ స్టార్ జాసన్ క్లార్క్ ఓ విన్యాసానికి పూనుకున్నాడు. అందరిలాగా మామూలు నీళ్లలో ఈత కొడితే మజా ఏముంది అనుకున్నాడో ఏమోగానీ గడ్డ కట్టిన మంచు నీటి కింద ఈత కొట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంచు గడ్డ కట్టిన నీళ్లలోకి ప్రవేశించి ఈత కొట్టడం ప్రారంభించాడు. తర్వాత కాసేపటికే ఊపిరాడక చేపలా గిలగిలా కొట్టుకున్నాడు. తిరిగి పైకి రావడానికి దారి కూడా కనిపించలేదు. పైగా అతని కళ్లు కూడా మంచు కట్టడం ప్రారంభించమవడంతో ఊపిరి పోవడం తథ్యం అనుకున్నాడు. కానీ ఎట్టకేలకు ఓ రంధ్రం గుండా నీళ్లలో నుంచి బయట పడ్డాడు. ఊపిరాడక చస్తుంటే ప్రాంక్ అనుకుంది ఈ భయానక అనుభవాన్ని జాసన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నీళ్లలోకి దిగి ఈత కొట్టాక నా చుట్టూ అంతా ఒకేలాగా అన్పించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో ఎలాగోలా పైకి రావాలని మంచుగడ్డను పగలగొట్టేందుకు ప్రయత్నించాను, కానీ అది సాధ్యపడలేదు. కళ్లు కూడా పనిచేయడం మానేసినట్లు అనిపించింది. దీంతో వెంటనే నా శక్తిని కూడగొట్టుకుని పైకి వచ్చేశాను’ అని పేర్కొన్నాడు. ఇక దీన్నంతటినీ చిత్రీకరిస్తున్న మహిళ అతను నీళ్ల లోపల కొట్టుమిట్టాడటాన్ని చూసి అది ప్రాంక్ అని భ్రమపడటం గమనార్హం. ఇక విశేషమేంటంటే ఇంత జరిగినా అతను మరోసారి ఈ సాహసానికి పూనుకుని అందులో సఫలీకృతుడయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకన్నాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
మృత్యు గెడ్డ
పెదబయలు(అరకులోయ): దుస్తులు ఉతకడానికి వెళ్లి మత్స్యగెడ్డలో పడి ఇద్దరు చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ గంపరాయి(ఎలుగులమెట్ట) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎలుగులమెట్ట గ్రామానికి చెందిన కిముడు భవానీ అనే మహిళ ఆమె కుమార్తె కిముడు శైలజ(12), వారి పక్కింట్లో ఉంటున్న అడపా హిందుమతి(9) కలిసి సోమవారం ఇదే పంచాయతీ కాగుల గ్రామ సమీపంలో మత్స్యగెడ్డకు దుస్తులు ఉతకడానికి మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లారు. అయితే కిముడు భవానీ దుస్తులు ఉతికే పనిలో నిమగ్నమై ఉండగా, ఆమెకు కొంతదూరంలో దుస్తులను నీటిలో జాడించే పనిలో ఉన్న చిన్నారులిద్దరూ ప్రమాదవశత్తూ కాలుజారి గెడ్డలో పడి మునిగిపోయారు. మునిగిన తరువాత గమనించిన తల్లి గ్రామంలోకి వెళ్లి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు వచ్చి గెడ్డలో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. గంపరాయి ప్రాథమిక పాఠశాలలో కిముడు సైలజ 6వ తరగతి, అడపా హిందుమతి 4వ తరగతి చదుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు వేసవి సెలవులు కావడంతో అప్పటి వరకు మిగతా పిల్లలతో కలిసి ఆనందంగా ఆడుకున్న ఆ ఇద్దరూ అంతలోనే గెడ్డలో పడి మృతి చెందారన్న విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పక్కనే ఉండి కూడా పిల్లల్ని రక్షించుకోలేకపోయానని శైలజ తల్లి భవానీ భోరున విలపించింది. తండ్రి బొంజుబాబు, హిందుమంతి తండ్రి అడపా కొండబాబు, తల్లి పూర్ణిమ రోదనలు అందర్నీ కంటతడి పెట్టించాయి. స్థానిక తహసీల్దార్ సుధాకర్, సర్పంచ్ వంతాల కమలాకర్, వీఆర్వో వెంకటరమణ తదితరులు చిన్నారుల మృతదేహాలను పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా ఉన్నతాధికారులకు నివేదిస్తానని తహసీల్దార్ తెలిపారు. గతంలో ప్రమాదాలు ♦ 2012లో మత్స్యగెడ్డలో గలగండ పంచాయతీ మంగబంద సమీపంలో చేపల వేటకు వెళ్లి గంపరాయి పంచాయతీ సుండ్రుపుట్టు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.రెండు రోజుల తరువాత మృతదేహాలు వెలికి తీశారు. ♦ 2017 జూలై 5 తేదీన పెదకోడాపల్లి పంచాయతీ పరిదానిపుట్టు గ్రామానికి చెందిన కిల్లో లక్ష్మీ (35)దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశత్తూ కాలిజారి గెడ్డలో పడి కొట్టుకు పోయింది. -
విషాదం నింపిన ఈత సరదా
గొల్లపల్లి (వెల్గటూర్): ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొన్నది. ఈ ఘటన బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం (బీ–జోన్)కు చెందిన వాసాల లక్ష్మణ్–స్వరూప దంపతులకు ఛత్రపతి(10), కూతురు ఉన్నారు. ఛత్రపతి నాలుగో తరగతి చదువుకుంటున్నాడు. పైడిపల్లిలోని అమ్మమ్మ పెరుక పోచమ్మ ఇంటికి పది రోజుల క్రితం వచ్చాడు. ఇతనికి పైడిపల్లికే చెందిన పెరుమాండ్ల నర్సయ్య–మరియ దంపతుల కుమారుడు హర్షవర్ధన్(8)తో స్నేహం పెరిగింది. బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఈతకని వెళ్లారు. ఈత రాకపోవడంతో బావిలోకి దిగిన వెంటనే నీటిలో మునిగి చనిపోయారు. -
ప్రాణాలు తీసిన ఈత సరదా..
దామరచర్ల (మిర్యాలగూడ): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాచ్యా తండాలో ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను తీసింది. తండాకు చెందిన లావూరి రవి, సరోజల పెద్ద కూతురు సంధ్య (13) కట్టంగూరు మండలం అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మరో కూతురు మంజుల (8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఇదే తండాకు చెందిన లావూరి లింగా, శారదల కూతురు పెద్దమంజుల (12) అయిటిపాముల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరతగతి చదువుతోంది. ముగ్గురూ ప్రాణస్నేహితులు. తల్లిదండ్రులు పొలానికి వెళ్తుండగా సంధ్య, మంజులలు వారితో కలసి పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు కుంట సమీపంలోని పొలాల్లో చెట్లు కొట్టుకుంటుండగా, వీరు ముగ్గురు సరదాగా ఈతకోసం నీటి కుంటలో దిగారు. ఇటీవల వచ్చిన వర్షాలకు కుంటలోకి భారీగా నీరు చేరడంతో మగ్గురూ మునిగిపోయారు. రాత్రి అయినా పిల్లలు రాకపోవడంతో కుటుంబీకులు బావి, కుంట దగ్గర వెతికారు. కుంట దగ్గర చున్నీలు, చెప్పులు కనిపిం చడంతో నీటిలో దిగి వెతకడంతో ముగ్గురు బాలికల మృతదేహాలు కనిపించాయి. -
ఇంగ్లీష్ కాలువ ఈదిన అమెరికా బామ్మ
-
ఈతకెళ్లి బాలుడి మృతి
మడకశిర రూరల్: మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన నబీరసూల్ కుమారుడు షేక్ మన్సూర్ (12) ఈతకెళ్లి నీటమునిగి మృతిచెందాడు. బాలుడు కల్లుమర్రి ఉన్నతపాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల్లో బాలుడు కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా కుర్లపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం గ్రామసమీపంలోని చెరువులో ఈతకెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామం కల్లుమర్రిలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆకాశంలో స్విమ్మింగ్
-
విద్యార్థిని బలిగొన్న ఈత సరదా
పెద్దఅంబర్‌పేట: చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందాడు. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మనోజ్‌కుమార్(16), ఆదిత్య, శ్రీకాంత్, ధానోజ్, శ్రీను, సాయికిరణ్ బాల్యమిత్రులు. వీరంతా హైదరాబాద్ పరిసరాల్లో ఉంటూ వివిధ కళాశాలల్లో డిప్లొమా ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. బాటసింగారం గ్రామ పరిధిలోని అన్నమాచార్య కళాశాలలో చదువుతున్న ఆదిత్యను కలిసేందుకు మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాలలో డిప్లొమా చదువుతున్న మనోజ్‌కుమార్‌తో సహా మిగతా నలుగురూ శుక్రవారం వచ్చారు. ఆదిత్య ఉంటున్న హాస్టల్‌కు సమీపంలో ఉన్న బాట సింగారం చెరువు వద్దకు మధ్యాహ్నం వచ్చి.. కట్టపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనంతరం మనోజ్‌కుమార్ చెరువులోకి దిగి మిగిలిన మిత్రులను పిలిచాడు. వారిలో ఆదిత్య అనే విద్యార్థిని మనోజ్ చెరువులోకి బలవంతంగా లాగాడు. మనోజ్ చెరువులో దిగినప్పటి నుంచి ఆ దృశ్యాలను మిత్రులు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తున్నారు. ఈత రాని మనోజ్, ఆదిత్యలు చెరువులో మునిగిపోతుండటం గమనించి రక్షించేందుకు యత్నిం చారు. ఆదిత్యను బయటకు తీయగా, మనోజ్ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. ఆందోళనకు గురైన విద్యార్థులు పోలీసులకు తెలిపారు. అప్పటికే చీకటి పడటంతో మనోజ్ జాడ కనిపించలేదు. శనివారం ఉదయం ఇన్ స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్ఐలు శ్రీనివాస్, కిరణ్‌కుమార్ వచ్చి ఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టగా మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ఓదెల : మండలంలోని పొత్కపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి సిరిశేటి రాము(11) శనివారం ఊరకుంటలో మునిగి మృతిచెందాడు. పాఠశాలకు సెలవు కావటంతో ఈత కోసం మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. మిషన్ కాకతీయ పథకంలో ఇటీవల చెరువలో పూడిక తీశారు. ఆ గుంతల్లో నీరు ఉండడంతో రాము ఈత కొట్టేందుకు దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి ఊపిరాడక మృతిచెందాడు. ఎస్సై టి.శంకరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెలు పగిలేలా..
నలుగురు విద్యార్థుల మృతితో తల్లిదండ్రుల రోదన మృతుల గ్రామాల్లో అలముకున్న విషాదం ప్రత్తిపాడు/పెదనందిపాడు/వట్టిచెరుకూరు: కన్నకొడుకును ప్రయోజకుడిగా చూడాలన్న ఓ తల్లి కలలు కల్లలయ్యాయి. తనయుడిపైనే కోటి ఆశలు పెట్టుకున్న మరో నాన్న ఆశలు అడిఆశలయ్యాయి. కొడుకును ఉన్నతునిగా తీర్చిదిద్దాలన్న ఇంకొక తండ్రి ఆకాంక్ష చెదిరిపోయింది. కన్నకొడుకే శ్వాసగా బతుకుతున్న మరో తల్లికి గర్భశోకమే మిగిలింది... ఇలా విధి ఆ అభాగ్యుల కుటుంబాలపై క్వారీకుంట రూపంలో విషం చిమ్మింది. గుంటూరురూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలోని క్వారీ కుంటలో ఈతకు దిగి నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. పున్నామ నరకం నుంచి తప్పిస్తారనుకున్న కొడుకులను కాటికి సాగనంపాల్సి రావడంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. ఒక్కసారి లేనాన్న.. ఒక్కసారి లే బిడ్డా.. నీ కోసమే కదా ఈడ దాకా వచ్చాం.. అంటూ పందిరి సాయితేజ (14) కుటుంబం బోరున విలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పందిరి అప్పారావు, అమ్మన్న దంపతులు సుమారు పదహారేళ్ల క్రితం గుంటూరురూరల్ మండలం చౌడవరం వలస వచ్చారు. స్థానిక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేసుకుంటూ కూతురు, కుమారుడు సాయితేజను చదివించుకుంటున్నారు. కుమారుడి మృతితో వారి రోదించడం వారిని కంటతడి పెట్టించింది. కంటికి రెప్పలా పెంచి.. కంటికిరెప్పలా పెంచుకున్నాడు. తనకున్నదానిలో అడిగినవన్నీ ఇచ్చాడు. గారాభంగా చూసుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. గుంటూరురూరల్ మండలం జూనంచుండూరు గ్రామానికి చెందిన కనపర్తి మాణిక్యరావు, కనకాంబరం దంపతులు వ్యవసాయకూలీలు. వీరికి కుమార్తె తిరుమల దేవి, కుమారుడు మహేష్ ఉన్నారు. కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతోంది. కొడుకు మహేష్‌ను ఇంగ్లీషుమీడియం చదివిస్తున్నారు. మహేష్ మృతితో తండ్రి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది. కొడుకు మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని పదేపదే ముద్డాడుతూ ఆ తండ్రి తన ప్రేమను చాటడం అక్కడున్న వారందరికీ కన్నీటిని తెప్పించింది. చివరి ఆశగా.. కన్నకొడుకు కళ్ల ఎదుటే నిర్జీవంగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల గుండెలు అవిశిపోయాయి. ఒక్కసారి లేరా అభి.. మా నాన్నవి కదూ ఒక్కసారి లే.. అంటూ గుండెలపై తడుతూ అభిషేక్ తల్లి రోధించిన తీరు స్థానికుల మనసులను కలిచివేసింది. కొన ఊపిరి ఉందేమో అని చివరి ఆశగా కొడుకు గుండెలపై కొడుతూ ఆ తల్లి ప్రయత్నాలు చేయడం స్థానికుల గుండెలను పిండేసింది. గుంటూరురూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ చుక్కా నానిబాబు, చిట్టి మరియమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు అభిషేక్ మరణించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారి చూడయ్యా.. ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా.. నీ కోసమే బతుకుతున్నాం.. ఆ దేవుడు మమ్మల్ని తీసుకోపోకుండా నిన్ను తీసుకుపోయాడు.. అంటూ జూనంచుండూరుకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసరావు, విజయ దంపతులు బోరున విలపించారు. వీరికి కుమార్తె, కుమారుడు గోపీచంద్ ఉన్నారు. తండ్రి ఆటో నడుపుకుంటూ ఇద్దరినీ చదివిస్తున్నాడు. గోపీచంద్ మరణించడంతో వారి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది. -
వాట్సప్‌లో వీడియో కోసం ఈతకు దిగి...
-
వాట్సప్‌లో వీడియో కోసం ఈతకు దిగి...
వీడియో దిగుతూ చెరువులో మునిగిపోయిన యువకుడు ! మిత్రుడి కళ్లెదుటే నీటిలో మునిగి మృత్యువాత బాన్సువాడ : వాట్సప్‌లో తాను ఈదుతున్న క్లిప్పింగ్‌ను అప్లోడ్ చేయాలని తోటి మిత్రునికి స్మార్ట్‌ఫోన్ ఇచ్చి.. ఈతకు దిగిన యువకుడు.... తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ ఎక్క చెరువు వద్ద చోటు చేసుకుంది. పులిగుచ్చతండాకు చెందిన శ్రీనివాస్ (24) ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తన మిత్రుడు గోపాల్‌తో కలిసి సోమవారం సాయంత్రం ఎక్క చెరువుకు వెళ్లాడు. తాను హైదరాబాద్‌కు వెళ్లి శిక్షణ పొందాల్సి ఉంటుందని, మళ్లీ ఎన్ని రోజులకు స్వగ్రామానికి వస్తానోనని ఆలోచించి మిత్రునికి ఫోన్ అందించి తాను ఈదుతున్న వీడియోను వాట్సప్‌లో అప్లోడ్ చేయాలన్నాడు. శ్రీనివాస్ చెరువులో దూకి ఈదడానికి ప్రయత్నించాడు. కానీ అతను కిందికి దిగిపోయాడు. కళ్లముందే మిత్రుడు నీటిలో మునుగుతుండగా, గోపాల్ ఏమీ చేయలేకపోయాడు. ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేకపోవడంతో అతను కేకలు వేసినా... ఎవరూ సహాయానికి రాలేకపోయారు. ఘటనను ఆలస్యంగా తెలుసుకొని వచ్చిన బంధుమిత్రులు మంగళవారం శవం కోసం వెతకగా లభ్యమైంది. మృతుడు తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తండ్రి బాబు విలపించడం అక్కడివారిని కలిచివేసింది. -
స్కూల్ కు 3 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్తున్నాడు!
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజాకు చెందిన ఓ కుర్రవాడు పాఠశాలకు ఈదుకుంటు వెళుతున్నాడు. మిగతా పిల్లలందరూ పడవ కోసం నది దాటడానికి ఒడ్డన ఆగి వేచి చూస్తుంటే అతను మాత్రం మూడు కిలోమీటర్ల పాటు ఈదుతూ వెళ్తాడు. ఉదయాన్నే అందరిలానే స్కూల్ కి ప్రయాణం అయ్యే అర్జున్ పాఠశాల పక్కన ఉన్న పూతోట్టలో ఉండటంతో ఆ ఊరి నుంచి తమ గ్రామానికి బ్రిడ్జి వేయాలని డిమాండ్ చేస్తూ రోజూ ఈదుకుంటూ పాఠశాలకు వెళ్తాడు. తన బ్యాగ్ లోనే స్విమ్ సూట్, కళ్లజోడును అందుబాటులో ఉంచుకునే అర్జున్ వెంబనాద్ నీటిలో ఏకధాటిగా మూడు కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా ఈదేస్తున్నాడు. తమ గ్రామం పెరుంబలం నుంచి పూతోట్టకు ప్రభుత్వం బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నాడు. పడవల్లో రోజూ స్కూల్ కు వెళుతుంట ఆలస్యం అవుతుందని దీంతో టీచర్లు శిక్షిస్తున్నట్లు చెప్పాడు. కొన్ని పడవలు మరీ చిన్నగా ఉంటాయి. కానీ, నదిని దాటడానికి మాత్రం ఎక్కువ మంది వేచిచూస్తుంటారు.. దీంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వెలిబుచ్చాడు. దాదాపు పదివేల మంది జనాభా ఉండే పెరుంబలం గ్రామ పంచాయితీ గత పాతికేళ్లుగా 700 మీటర్ల బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూనే ఉంది. అత్యవసర సమయంలో టైంకి వైద్యం అందకా గత ఏడాది దాదాపు 50 మందికి పైగా గ్రామస్థులు మరణించారు. గ్రామం నుంచి వైద్యం కోసం వెళ్లాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుందని మరో విద్యార్ధి అభిలాష్ తెలిపాడు. అర్జున్ ఇలా ఈత కొట్టుకుంటూ నదిని దాటుతుండటం గ్రామస్థుల ద్వారా అధికారులకు తెలిసింది. 10 రోజుల సమయంలో గ్రామానికి వచ్చిన అధికారులు వారి బాధలను తెలుసుకున్నారు. కానీ, బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం నదిని దాటడానికి ఆరు పడవలు అందుబాటు ఉన్నాయని, అయితే ఇవి సరియైన కండీషన్ లో లేవని పంచాయితీ మెంబర్ శోభన చక్రపాణి తెలిపారు. అధికారులు వచ్చి గ్రామస్థులను కలవడంపై హర్షం వ్యక్తం చేసిన అర్జన్ ప్రస్తుతానికి ఈత కొట్టుకుంటూ స్కూల్ కు వెళ్లనని చెప్పాడు. ఒకవేళ బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి ముందడుగు పడకపోయినా తాను మళ్లీ నదిలో నుంచి ఈదుకుంటూ వెళ్తానని తెలిపాడు. -
ఈతకెళ్లి నలుగురు యువకుల గల్లంతు
హైదరాబాద్‌సిటీ: రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్ పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో లక్ష్మిగూడ చెరువులో ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు బహదూర్‌పురాకు చెందిన అమీర్, ఫారూఖ్, సల్మాన్, ఆసిఫ్‌లుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) : జమ్మికుంట మండలం బిజిగిరిషరీప్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న పంజాల ధనుష్(12) అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మూత్ర విసర్జనకని ఉపాధ్యాయులకు చెప్పి ఇద్దరు స్నేహితులతో కలసి దగ్గర్లో ఉన్న యాగాని కుంట చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
'తలరాత అతడిముందు తలొంచింది'
బ్రెజిల్: ఆలోచన శక్తితో పుట్టిన మానవుడి మెదడు పనిచేసేంత వరకు ఏ శక్తి, ఏ వైకల్యం అతడి పురోగతిని ఆపలేదని మరోసారి రుజువైంది. పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేకుండానే జన్మించిన బ్రెజిల్ కుర్రాడు గేబ్ అడామ్స్ చరిత్ర సృష్టించి ఇదే అంశాన్ని నిరూపించాడు. అతడు వీల్ చైర్‌కే పరిమితంకాకుండా ఎంతో శ్రమకూర్చి తన చుట్టుపక్కలవారికి ఆదర్శంగా నిలిచాడు. కాళ్లుచేతులు లేకపోయినా తన కాలేజ్ ఫ్రెండ్స్ తో డ్యాన్స్ కాంపిటేషన్ షోలో పాల్గొని అబ్బురపరిచాడు. అంతేకాకుండా వారికి అతడే స్వయంగా డ్యాన్స్ లో మెళకువలు బోధించుకున్నాడు. గేబ్ కాళ్లు చేతులు లేకుండానే జన్మించాడు. అతడు ఓ అనాథ ఆశ్రమంలో పెరుగుతుండగా చిన్నతనంలోనే ఓహియోకు చెందిన దంపతులు అతడిని దత్తత తీసుకెళ్లారు. అప్పటికే వారికి 13 మంది సంతానం. అలా తీసుకెళ్లినవారు అతడిని జాగ్రత్తగా చూసుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టారు. కానీ, గేబ్ మాత్రం ఏదో చేయాలని తాపత్రయపడ్డారు. కనీసం ఓ చంటి పిల్లాడిలా కూడా పనిచేయలేకపోతే తన జీవితం వృథా అనుకున్నాడు. స్కూల్‌కు వెళ్లే రోజుల్లో కాలేజీకి వెళుతున్నప్పుడు ఎన్నో ఆలోచనలు అతడిని నిత్యం కొత్త కార్యాచరణ చేపట్టే వ్యక్తిగా తీర్చిదిద్దాయి. పన్నేండేళ్ల వయసులో ఉన్నప్పుడే తనకు తాను డ్యాన్స్ పాఠాలు చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇంట్లో వాళ్లకెవరికీ ఈ విషయం చెప్పకుండా రహస్యంగా ఉంచుకున్నాడు. అనూహ్యంగా అతడు చదువుతున్న పాఠశాల కేస్విల్లే కార్యక్రమానికి తన కుటుంబాన్ని ఆహ్వానించి 29 మందితో కలిసిన డ్యాన్స్ బృందంతో చేరి వేదికపై అనూహ్యంగా కనిపించాడు. మెరుపులాగా డ్యాన్స్ చేస్తూ తన కుటుంబీకులను ఆశ్యర్యంలో ముంచెత్తాడు. ఇతడు ఒక్క డ్యాన్స్ మాత్రమే కాదు.. పరుగెత్తగలడు, స్వయంగా మెట్లు ఎక్కగలడు, ఫాస్ట్ గ డైవింగ్ కూడా చేయగలడు. డైవింగ్ లో కూడా ఇప్పటి వరకు చాలా బహుమతులు పొందాడు. -
ఆ బేబీ ఫస్ట్ స్విమ్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తండ్రిగా ప్రమోషన్ పొందినప్పటి నుంచి తన చిట్టి పాపకు సంబంధించిన వార్తలతో ప్రపంచం చూపును తమ వైపుకు తిప్పుకుంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా పాపాయిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నాడు. తాజాగా మాక్స్ ఫస్ట్ స్విమ్ అంటూ ఒక ఫోటోను జుకర్ బర్గ్ షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ బుజ్జి మాక్స్ ఫోటో చక్కర్లు కొడుతోంది. మొదటి ఫోటో, తొలి టీకా ఇలా ఇలా రకరకాల ఫోటోలతో ఇపుడా చిన్నారి కూడా పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. మాక్స్ జననంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన జుకర్ బర్గ్ బిడ్డ ఆలపానాలనే తన ప్రపంచంగా మార్చుకున్నాడు. తండ్రిగా తన అనుభూతులను ఫేస్బుక్ పోస్టులు, ట్విట్ల ద్వారా షేర్ చేస్తున్నాడు. నీటి మీద తేలియాడుతున్న బుజ్జి పాపాయిని పదిలంగా పట్టుకొని మురిసిపోతూ.. ఇది మాక్స్ ఫస్ట్ స్విమ్....షి లవ్స్ ఇట్ అని ట్విట్ చేశాడు. దీంతో కామెంట్లు, షేర్లు, లైక్ లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్, కుమార్తె మాక్స్ పేరుతో భారీ మొత్తంలో స్వచ్ఛంద సేవ కోసం దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. మాక్స్ రావడంతో తమ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభం అయ్యాయని...తల్లిదండ్రులుగా తాము సంతోషంగా ఉన్నామని జుకర్ బర్గ్ - ప్రిస్కిల్లా దంపతులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఈతరాని చేపలు..!
చేప అంటే నీటిలో ఈది తీరాలి? కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా! నిజమండీ..‘హ్యాండ్ ఫిష్‌లు’ ఆ రకమే. ఇవి ఈదలేవు. సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్నచిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోవడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడుచుకుంటూ నీటి అడుగున ఉండే చిన్నచిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మొత్తం 14 జాతులున్నాయి. 10 సెంటీమీటర్లుండే ఈ చేప చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముప్పు పొంచి ఉన్న జీవుల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి. బ్యాట్‌ఫిష్ కూడా..: ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్‌ఫిష్‌లు కూడా ఉన్నాయి. అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగు సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాలాలంటి మొప్పలు ఉన్నాయి. -
ఆశలు మునిగి.. శోకం మిగిలె!
నాయనా.. నా చిట్టితండ్రీ. నీవే కదరా మాకు దిక్కు. నీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మా ప్రాణం పోయాక నీవే తలకొరివి పెడతావనుకున్నాం. ఇప్పుడు మమ్మల్నే వదిలివెళ్లిపోయావా.. ఆ దేవుడు నా ఒక్క బిడ్డనీ తీసుకెళ్లాడే.. ... ఇదీ ఓ తల్లి రోదన కాయకష్టం చేశాం.. కడుపు కట్టుకుని పెంచాం. పెద్దచదువులు చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నాం. కానీ ఆ దేవుడు మాపై పగబట్టాడేమో.. నా బిడ్డని మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. మమ్మల్ని ఎవరు చూస్తారు నాయనా.. ... ఇదీ మరో తల్లి వేదన తమ బిడ్డలు కళ్లెదుటే విగజీవులై పడి ఉండడం చూసి ఆ తల్లులు తట్టుకోలేకపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. వీరి రోదనలు పలువురికి కన్నీటిని తెప్పించాయి. ఈ విషాద ఘటన శుక్రవారం శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెకు చెందిన కాళప్ప, నాగమణి ఎకైక కుమారుడు తులసీరాం(10), వెంకటరత్నం, సుబ్బలక్ష్మి కుమారుడు గంగాప్రసాద్(9)తోపాటు పది మంది పిల్లలు స్థానికంగా ఉన్న చెరువులో శుక్రవారం బడి వదిలిన తర్వాత ఈతకొట్టేందుకు వెళ్లారు. గంగాప్రసాద్, తులసీరాం ముందు చెరువులో దిగారు. ఆపై పైకిరాలేదు. తోటి స్నేహితులు సమీపంలోని గొర్రెల కాపరికి సమాచారం ఇచ్చారు. ఆయన చెరువులో చిక్కుకున్న పిల్లలిద్దరినీ బయటకు తీశాడు. కానీ అప్పటికే వారు మృతిచెందారు. విషయం తెలుసుకున్న బంధువులు చిన్నారుల మృతదేహాలను గ్రామానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాడు గుంతే ప్రాణం తీసింది ఇటీవల నీరు-చెట్టు పథకం పేరుతో ఎల్లంపల్లి చెరువులో పచ్చబాబులు పూడికతీత పనులు చేపట్టారు. చెరువులో అక్కడక్కడా చాలా గుంతలు తవ్వారు. వాటిలో కొన్ని ఏడు నుంచి పది అడుగుల లోతువరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరింది. గుంతలు.. లోతు తెలియక పోవడంతోనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పాడుగుంతలతోనే పిల్లల ప్రాణాలు పోయాయని పలువురు వాపోయారు. -
బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
అనంతపురం: బావిలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని విడపనకల్ మండలం పాల్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన విద్యార్థి బావిలో ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.