
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు
గాలివీడు (వైఎస్సార్ కడప జిల్లా): విహార యాత్ర విషాదకరంగా ముగిసింది. బెంగళూరుకు చెందిన నలుగురు సరదాగా ఈత కొడుతూ నీటిలో మునిగి మృత్యువాత పడిన సంఘటన శనివారం మండల కేంద్రానికి సమీపంలోని వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు దిగువనున్న గండిమడుగులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన దాదాపు 20 మంది కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా వాయల్పాడులోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో కాసేపు సరదా కోసం వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం సమీపంలోని మడుగులో ఈత కోసం దిగారు. ఈత కొట్టాలని దిగిన తాజ్ మహమ్మద్(41), ఉస్మాఖానం (12), మహమ్మద్ హంజా(11), మహమ్మద్ ఫహాద్(10)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్, ఎస్‌ఐ చిన్నపెద్దయ్య, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలించి రాత్రి 9 గంటలకు మృతదేహాలను వెలికితీశారు.
Comments
Please login to add a commentAdd a comment