
ముగ్గురిలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలోనూ, మరొకరు విశాఖకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించారు.
సాక్షి, విశాఖపట్నం: మాకవరపాలెంలో శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ చెట్టును బలంగా ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలోనూ, ఇంకొకరు విశాఖకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించారు. మృతులను మాకవరపాలెనికి చెందిన పదో తరగతి విద్యార్థులు హేమంత్, అనీశ్, హర్షిత్‌గా పోలీసులు గుర్తించారు.
చదవండి:
హిందూపురంలో హిజ్రా దారుణ హత్య
బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు