
రాయ్‌పూర్: గిర్రున తిరిగి నీటిలో హుషారుగా మునకలు వేస్తున్న పెద్దాయనను చూశారా. వయసు శరీరానికే గానీ మనసు కాదు అన్నట్టుగా విన్యాసాలు చేస్తున్నారాయన. ఆయనేమి సామాన్య వ్యక్తి కాదు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం చత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బఘేల్ పుణ్యస్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన నీటి విన్యాసాలు ప్రదర్శించారు. ఒక్క గెంతున నీటిలోకి దుమికారు. వెనక్కి గెంతి కూడా ఆయనీ విన్యాసాన్ని ప్రదర్శించారు.
ఈ వీడియోను ట్విటర్‌లో భూపేశ్ బఘేల్ షేర్ చేశారు. మహాదేవ్ పేరు తలచుకుని.. సంపూర్ణ కార్తీక స్నానం ఆచరించినట్టు పేర్కొన్నారు. గత నెలలో దుర్గ్ జిల్లాలో జరిగిన గౌరి పూజాకార్యక్రమంలో కొరడాతో కొట్టించుకుని ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. (క్లిక్ చేయండి: మా గవర్నర్ అనర్హుడు.. తప్పించండి)
Comments
Please login to add a commentAdd a comment