ఒక్కసారి కొన్ని ఘటనలు చూస్తే విధి లిఖితమో లేక అనుకోకుండా జరిగిందో అర్థం కావు. మనకళ్ల ముందే అప్పటి వరకు హాయిగా ఉన్నవారు హఠాత్తుగా ఇక లేరు అంటే.. నమ్మశక్యం కాదు. వారితో మనకు ఎలాంటి సంబంధం లేకున్నా బాధనిపిస్తుంది. అలాంటి షాకింగ్ ఘటనే US అమెరికా కుపర్టినోలో ఉంటున్న NRI కుటుంబంలో జరిగింది.
అప్పటి వరకు హాయిగా నవ్వుతూ తుళ్లుతూ తిరిగారు ఆ తండ్రి కూతుళ్లు. అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. USలో ఉంటున్న మద్ది రామయ్య ప్రత్తి, తన భార్య పద్మ, ఏడేళ్ల కూతురితో కుపర్టినోలో ఓ అపార్టమెంట్‌లో నివశిస్తున్నారు. తన కుమార్తెను స్విమ్మింగ్ చేయించడం కోసం అపార్ట్‌మెంట్ కమ్యూనిటిలో ఉన్న స్మిమ్మింగ్‌పూల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తన బిడ్డ స్విమ్ చేస్తుండగా పక్కనే వేచి చూస్తున్నారు. ఇంతలో పాప కోసం స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లిన రామయ్య హఠాత్తుగా నీళ్లలో పడిపోయారు. రామయ్యను పూల్ నుంచి బయటకు తీసేలోగా నీళ్లు మింగేశారు.
రామయ్యను క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ యూనిట్‌కి తరలించినా ఫలితం లేకపోయింది. సుమారు 4 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలతో పోరాడి చివరికి మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ ఘటనతో ఆ అపార్ట్‌మెంట్ వాసులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాధితుడి మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు అతని బంధువులు. కష్టకాలంలో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు gofundme వెబ్ సైట్ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. కనీసం 3లక్షల డాలర్లు (దాదాపు రెండున్నర కోట్ల రుపాయలు) లక్ష్యంగా పెట్టుకుని విరాళాలను ఆర్ధించగా.. ఇప్పటివరకు లక్షా 67వేల డాలర్లు (దాదాపు కోటి 36 లక్షల రుపాయలను) సేకరించారు. ఈ మొత్తాన్ని ఆస్పత్రి బిల్లుకు, అంత్యక్రియల కోసం వెచ్చించారు.
మద్ది రామయ్య ప్రత్తి అంత్యక్రియలను ఇవ్వాళ (బుధవారం) నిర్వహించారు.
(చదవండి: నాటా వేడుకలకు వేళాయె!)
Comments
Please login to add a commentAdd a comment