జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) : జమ్మికుంట మండలం బిజిగిరిషరీప్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న పంజాల ధనుష్(12) అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మూత్ర విసర్జనకని ఉపాధ్యాయులకు చెప్పి ఇద్దరు స్నేహితులతో కలసి దగ్గర్లో ఉన్న యాగాని కుంట చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.