చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించేందుకు ఇంగ్లిష్ ఛానెల్‌ని ఈదింది 16 ఏళ్ల భాతర సంతతి విద్యార్థి ప్రిషా తాప్రే. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఉత్తర లండన్‌లోని బుషే మీడ్స్ స్కూల్‌లో చదువుతున్న ప్రిషా తాప్రే 12 ఏళ్ల వయసులో ఈ ఇంగ్లీష్ ఛానెల్ గురించి తెలసుకుని ఈదాలనే ఆసక్తిని పెంచుకున్నట్లు తెలిపింది.
అందుకోసం నాలుగేళ్ల కఠిన శిక్షణ అనంతరం గత వారమే ప్రిషా ఇంగ్లాండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్‌నెజ్ వరకు దాదాపు 34 కిలోమీటర్ల ఈతని 11 గంటల 48 నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రిషా ఈ లక్ష్యాన్ని సోలోగా పూర్తి చేయడం విశేషం. ప్రిషా యూకేలోనే జన్మించగా, ఆమె తల్లిందండ్రులు మహారాష్ట్రాకు చెందినవారు.
ఆమె యూకేకి చెందిన అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ(పిల్లల ఆకలిని తీర్చే సంస్థ) కోసం దాదాపు రూ. 4 లక్షలు సేకరించింది. ఈ స్వచ్ఛంద సంస్థనే ప్రిషా ఎంచుకోవడానికి కారణం ఇది ఇంగ్లండ్, భారతదేశంలోని పిల్లలకు సహాయపడుతుండటమేని ఆమె చెబుతోంది.
(చదవండి: అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు)
Comments
Please login to add a commentAdd a comment