English Channel
-
ఛారిటీ కోసం ఇంగ్లిష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!
చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించేందుకు ఇంగ్లిష్ ఛానెల్‌ని ఈదింది 16 ఏళ్ల భాతర సంతతి విద్యార్థి ప్రిషా తాప్రే. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఉత్తర లండన్‌లోని బుషే మీడ్స్ స్కూల్లో చదువుతున్న ప్రిషా తాప్రే 12 ఏళ్ల వయసులో ఈ ఇంగ్లీష్ ఛానెల్ గురించి తెలసుకుని ఈదాలనే ఆసక్తిని పెంచుకున్నట్లు తెలిపింది. అందుకోసం నాలుగేళ్ల కఠిన శిక్షణ అనంతరం గత వారమే ప్రిషా ఇంగ్లాండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్‌నెజ్ వరకు దాదాపు 34 కిలోమీటర్ల ఈతని 11 గంటల 48 నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రిషా ఈ లక్ష్యాన్ని సోలోగా పూర్తి చేయడం విశేషం. ప్రిషా యూకేలోనే జన్మించగా, ఆమె తల్లిందండ్రులు మహారాష్ట్రాకు చెందినవారు. ఆమె యూకేకి చెందిన అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ(పిల్లల ఆకలిని తీర్చే సంస్థ) కోసం దాదాపు రూ. 4 లక్షలు సేకరించింది. ఈ స్వచ్ఛంద సంస్థనే ప్రిషా ఎంచుకోవడానికి కారణం ఇది ఇంగ్లండ్, భారతదేశంలోని పిల్లలకు సహాయపడుతుండటమేని ఆమె చెబుతోంది. (చదవండి: అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు) -
కిడ్స్‌కు పాఠం... క్వీన్ స్విమ్మర్
ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలో శ్రీదేవి ఇంగ్లిష్ నేర్చుకుని ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఈతకు బద్దకించే పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి క్వీనీ విక్టోరియా ఏకంగా ఇంగ్లిష్ ఛానల్‌ను ఈది రికార్డ్ సృష్టించింది. ఈ తరానికి ఓ లక్ష్యాన్ని అందించింది. ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. జీవనపోరాటంలో మునిగి కొన్నేళ్లకు ఆ కలలను మర్చిపోతాం. ప్రతి ఒక్కరూ జీవితంలో తమకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలి. ఆ పేజీల్లో కలలను సాకారం చేసుకున్న కథనాలే ఉండాలి. అప్పుడే మన కలకు గౌరవం... కలకన్న మనసుకు సంతోషం... ఇది ఇటీవల ఇంగ్లిష్ చానెల్ ఈదిన క్వీనీ విక్టోరియా మనోగతం.క్వీనీ విక్టోరియా గంధం 2018 వరకు సాధారణ గృహిణి. ఆమె స్విమ్మర్‌గా వార్తల్లోకి వచ్చి కొద్దికాలమే అయింది. 38 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసిన విక్టోరియా గత జూన్ 25వ తేదీ (భారత కాలమానం ప్రకారం) తెల్లవారు జామున ఇంగ్లండ్ – ఫ్రాన్స్ దేశాల మధ్యనున్న ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించారు. 2018లో తొలి రికార్డు, ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్‌లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాల జాబితాలో నలభైకి పైగా ఉంది. క్వీనీ విక్టోరియా ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా గుర్తింపు పోందిన సందర్భంగా సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విషయాలు.పిల్లలతో కలిసి ప్రాక్టీస్‘‘నా స్విమ్మింగ్ జర్నీ చాలా ఆశ్చర్యకరంగా మొదలైంది. మా పిల్లలిద్దరినీ స్విమ్మింగ్‌లో చేర్చాం.ప్రాక్టీస్కెళ్లడానికి బద్దకించేవాళ్లు. అలసట, నీరసం, ఓపికలేదు, ఇంటరెస్ట్ లేదు... రోజూ ఏదో ఓ సాకు చెప్పేవాళ్లు. వాళ్లకు బాధ్యత నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ‘నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది. రోజూ నీటిలో దిగి ఈత కొడితే కదా తెలుస్తుంది’ అన్నారు. ‘అంతకష్టమైన పనా, చూద్దాం పదండి’ అని నేను కూడా జాయినయ్యాను. మొదలు పెట్టిన మూడు నెలల్లోనే సికింద్రాబాద్ స్విమ్మింగ్ పూల్‌లో ΄ోటీలు జరిగాయి. పిల్లలిద్దరూ, నేను ముగ్గురం ఎవరి ఏజ్ కేటగిరీలో వాళ్లు ΄ాల్గొన్నాం. ముగ్గురమూ విజేతలుగా నిలిచాం. ఇక అప్పటినుంచి నేను స్విమ్మింగ్‌ని ఆపలేదు.ఏడు చానెళ్లనూ ఈదాలి దేశవిదేశాల్లో జరిగిన ΄ోటీలకు వెళ్లడం, పతకాలతో తిరిగి రావడం రెగ్యులర్ ్ర΄ాక్టీస్గా మారింది. హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, జాతీయ స్థాయి పోటీలు, దుబాయ్, సెర్బియా, ఈజిప్టు, శ్రీలంక, టర్కీలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాను. ఇంగ్లిష్ చానెల్ ఈదిన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. ఇది అందమైన భావన. గడ్డకట్టే చలి, దేహం బిగుసుకు΄ోయే చల్లదనపు నీటిలో ఈదాలి. రెండు గంటల సేపు చానెల్లో ఉన్నాను. ‘చానెల్ స్విమ్మింగ్ అండ్ ఫ్లోటింగ్ ఫెడరేషన్, లండన్’ నిర్వహించిన పోటీలో భాగంగా ఇంగ్లిష్ చానెల్‌ను ఈదే క్రమంలో ప్రతి సందర్భాన్నీ, ప్రతి సంఘటననూ ఎంజాయ్ చేశాను. ఏడు ఖండాల్లోని ఏడు చానెళ్లనూ ఈది రికార్డు సాధించాలనేది నా ముందున్న లక్ష్యం. నా కుటుంబం... క్లయింట్ల ప్రోత్సాహంమాది మధ్య తరగతి కుటుంబం. పాలమూరు జిల్లా, అమనగల్లు మా సొంతూరు. ఇంటర్ తర్వాత పెళ్లయింది. హైదరాబాద్, బర్కత్‌పురాలో వైవాహిక జీవితం మొదలైంది. ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీఈడీ చేశాను. కుటుంబ అవసరాల రీత్యా బర్కత్‌పురాలో ‘క్వీన్స్ టైలరింగ్ షాప్’ పెట్టాను. నా స్విమ్మింగ్ కెరీర్ మొదలైన తర్వాత నా క్లయింట్లు ‘నెక్ట్స్ ఎక్కడ ఈదుతున్నారు’ అని అడగడంతో΄ాటు, నాకు ఖర్చులకు డబ్బు సమకూర్చడం కోసం వాళ్లు వెంటనే అవసరం లేని దుస్తులు కూడా ఇచ్చి పని చేయించుకునేవాళ్లు. నా భర్త, నా క్లయింట్ల సహకారమే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూ΄ాయి కూడా ్ర΄ోత్సాహకంగా అందుకోలేదు. మొదట్నుంచీ అయిన ఖర్చు లెక్క ఎంతో చెప్పలేను, కానీ ఇంగ్లిష్ చానెల్ కోసం ఎనిమిది లక్షల రూ΄ాయలు ఖర్చయ్యాయి. ఒక మిడిల్ క్లాస్ గృహిణిని, ఇద్దరు పిల్లల తల్లిని. ఆ డబ్బును ఇంటి కోసమో, పిల్లల చదువు కోసమో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న మహిళను. అలాంటి స్థితిలో ఉన్న నేను ఇంత ఖర్చు చేసింది ఒక అచీవ్మెంట్ కోసం. చిన్నప్పుడు స్కూల్లో కబడీ, ఖోఖో ఆడేదాన్ని. ఆడపిల్లనైన కారణంగా, మధ్య తరగతి కుటుంబం అయిన కారణంగా క్రీడాజీవితం తెర వెనక్కి వెళ్లి΄ోయింది. కానీ అనుకోకుండా పిల్లల రూపంలో వచ్చిన అవకాశాన్ని నేను జారవిడుచుకోలేదు. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే. మీరూ కలలు కని ఉంటారు. నిద్రలో జోగుతున్న ఆ కలల కళ్లు తెరవండి. కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు బద్ధకించేవాళ్లుమా పిల్లలిద్దరినీ స్విమ్మింగ్‌లో చేర్చాం. ్ర΄ాక్టీస్కెళ్లడానికి బద్ధకించేవాళ్లు. అలసట, నీరసం, ఓపికలేదు, ఇంటరెస్ట్ లేదు... రోజూ ఏదో ఓ సాకు చెప్పేవాళ్లు. వాళ్లకు బాధ్యత నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ‘నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది. రోజూ నీటిలో దిగి ఈత కొడితే కదా తెలుస్తుంది’ అన్నారు. ‘అంతకష్టమైన పనా, చూద్దాం పదండి’ అని నేను కూడా జాయినయ్యాను.– క్వీనీ విక్టోరియా గంధం, స్విమ్మర్క్వీన్ను కలిసింది! ఇంగ్లిష్ చానెల్ ఈదడం కోసం లండన్‌లో ఉన్న సమయంలోనే నా పుట్టినరోజు (జూన్ 30) వచ్చింది. మా నానమ్మ గంధం కాంతమ్మ. ఆమె దేవరకొండ మిషనరీ స్కూల్లో టీచర్. క్వీన్ విక్టోరియా మన దేశానికి వచ్చినప్పుడు ఆమెను కలిసిందట మా నానమ్మ. ఆమె స్ఫూర్తితోనే నాకు పేరు పెట్టింది. నేను ఆ క్వీన్ నేలమీదకు వెళ్లి ఈత విజేతగా నిలవడానికి నాంది మా నాన్నమ్మ పేరు పెట్టడంతో ముడివడిందేమోననిపించింది. మొత్తంగా నాకు ఈ విజయం అత్యంత సంతోషకరమైన క్షణాలనిచ్చింది’’ అంటూ తన పేరు విజేతగా చరిత్రలో నమోదు కా>వడం గర్వంగా ఉందన్నారు క్వీనీ విక్టోరియా. – వాకా మంజులారెడ్డి .. ఫొటోలు : మోహనాచారి -
31.29 గంటల్లో 72 కి.మీ. ఈత!
కాచిగూడ: భారత్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ ఈతగాళ్లు ఇంగ్లండ్–ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లిష్ చానల్ (అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ భాగం)ను రెండు వైపులా రిలేగా ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన కోచ్ రాజోరియా తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగుడు శివకుమార్‌తోపాటు ఎన్ఏ స్నేహన్ (తమిళనాడు), ఎల్విస్ అలీ హజారికా (అస్సాం), రిమో సాహా (పశ్చిమ బెంగాల్), సత్యేంద్రసింగ్ (మధ్యప్రదేశ్), జయంత్ దూబ్లే (మహారాష్ట్ర)తో కూడిన బృందం ఇంగ్లిష్ చానల్ ఈదడానికి ఈ నెల 8న లండన్‌కు వెళ్లారు. ఈ నెల 18న కెంట్లోని డోవర్లో సమీపంలో ఉన్న షేక్స్పియర్ బీచ్ నుంచి ఈత ప్రారంభించి ఉత్తర ఫ్రాన్స్‌లోని విస్సంట్ ఒడ్డును చేరుకొని తిరిగి డోవర్ వద్ద ఉన్న ఓల్డ్ సౌత్ ఫోర్‌ల్యాండ్ లైట్‌హౌస్ వద్దకు ఈ నెల 19న చేరుకున్నారు. భారీ అలలు, జెల్లీఫిష్‌లు సహా ఇతర ప్రమాదకర సముద్ర జీవుల నుంచి తప్పించుకుంటూ మొత్తం 72 కి.మీ. దూరాన్ని కేవలం 31 గంటల్లోనే ఈదారు. తద్వారా ఇంగ్లిష్ చానల్‌ను రిలేగా ఈదిన ఆసియా ప్రాంత వాసులుగా రికార్డు సృష్టించారు. -
ఇంగ్లీష్ ఛానల్లో ప్రమాదం: 900 మైళ్ల దూరంలో శవం
నార్వే : గత సంవత్సరం బోటులో ఇంగ్లీష్ ఛానల్‌ను దాటుతూ కుటుంబంతో పాటు గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 900మైళ్ల దూరంలో నార్వేలోని కార్మోయ్లో బాలుడి మృతేహాన్ని గుర్తించారు అధికారులు. గత సంవత్సరం అక్టోబర్ 27న తండ్రి రసూల్, తల్లి శివ, అక్క అనిత, అన్న అర్మిన్తో పాటు 15 నెలల ఆర్టిన్ బోటు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మిగిలిన కుటుంబసభ్యుల మృతదేహాలు లభించినప్పటికి చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఇక అప్పటినుంచి అధికారులు బాలుడి మృతదేహం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. గత జనవరి నెలలోనే అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే శవం పూర్తిగా పాడై ఉండగా.. అతడు ఆర్టినో కాదో కనుక్కోవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శవానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల అనంతరం అది ఆర్టినేనని తేలింది. చిన్నారి శవాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లాల్సిందిగా ఇరాన్‌లోని ఆర్టిన్ బంధువులకు అధికారులు సమాచారం అందించారు. కాగా, ఇరాన్‌కు చెందిన రసూల్ కుటుంబం మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో ఆస్తులన్నీ అమ్ముకుని గత సంవత్సరం ఆగస్టు నెలలో యూకే పయనమైంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఫ్రాన్స్‌కు చేరుకుంది. యూకేను చేరుకోవటానికి చేసిన ఓ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈనేపథ్యంలో బోటులో ఇంగ్లీష్ ఛానల్‌ను దాటడానికి ప్రయాణం కట్టారు. అయితే, సామర్థ్యానికి మించి మనషుల్ని కలిగి ఉండటంతో ఆ బోటు అక్టోబర్ 27న సముద్రంలో మునిగిపోయింది. చదవండి : 16 ఏళ్లకు భారీ అదృష్టం.. సరిగ్గా ఏడేళ్లకు ఊహించని విషాదం -
94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’
లండన్ : పండు ముదుసలి. 94 ఏళ్లు. కాటికి కాళ్లు చాపుకునే వయస్సు. అత్యంత సాహసానికి ఒడిగట్టింది. తన కుటుంబ సభ్యులను కలసుకోవాలనే ఆరాటమే అందుకు కారణం. ఇది వర కే లండన్ చేరుకున్న తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఫ్రాన్స్ నుంచి లండన్‌లోని డోవర్ రేవుకు అతి చిన్న పడవలో ఇద్దరు, ముగ్గురితో కలసి బయల్దేరింది. అత్యంత ప్రమాదకరమైన ఇంగ్లీషు ఛానల్లో అతి చిన్న పడవలో డోవర్ రేవు చేరుకునేందుకు బయల్దేరడం అంటే దుస్సాహసమే. ఇలాంటి దుస్సాహసాలకు ఎంతో ఇప్పటి వరకు ఎంతో మంది బలైపోయారు. అయినప్పటికీ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్‌కు అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 94 ఏళ్ల పండు ముసలవ్వ చిన్న పడవలో ఇంగ్లీష్ ఛానల్లో 21 మైళ్లు ప్రయాణించగానే బ్రిటన్ గస్తీ నౌకా దళం గమనించింది. వెంటనే ఆమెను, ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరుముగ్గురిని అదుపులోకి తీసుకొని ఒడ్డుకు చేర్చింది. 94 ఏళ్లు కలిగిన వారు ఇంత వరకు వలస వచ్చేందుకు ప్రయత్నించలేదని, బహూశ వలసకు వచ్చిన వారిలో అతి పెద్ద వయస్కురాలు ఆమెనే కావొచ్చని ఇంగ్లండ్ నౌకాధికారులు తెలిపారు. ఆమె పేరు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. (కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్!) ఇతరులతోపాటు తనకు పౌరసత్వం ఇవ్వాలని డోవర్ ఒడ్డుకు చేరుకున్న 94 ఏళ్ల వృద్ధురాలు దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్యరీత్య ఆమెకు పౌరసత్వం లభించవచ్చని బ్రిటీష్ మీడియా అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఐదువేల మంది ఇంగ్లీష్ ఛానల్ ద్వారా ఫ్రాన్స్ నుంచి లండన్ వలస వచ్చేందుకు ప్రయత్నించారని బ్రిటీష్ అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: ‘ఇంటి నుంచి పని’లో పదనిసలు -
ఇంగ్లీష్ ఛానెల్లో ప్రమాదం
- భారీ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన రవాణా నౌక పారిస్: ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాలను వేరుచేసే ఇంగ్లీష్ ఛానెల్(అట్లాంటిక్ సముద్ర పాయ)లో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను సరుకు రవాణా నౌక ఢీకొట్టింది. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఫ్రాన్స్ తీరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ఆయిల్ ట్యాంకర్లో 38వేల టన్నుల హైడ్రోకార్బన్ ఇంధనం నిండిఉండటంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పొరపాటున అది పేలిపోయినా లేదా ఆయిల్ లీకైనా పెనుత్పాతం సంభవించి ఉండేది. ‘గ్వాటెమాలా దిశగా ప్రయాణిస్తోన్న ఆయిల్ ట్యాంకర్‘ది సీఫ్రంటైర్’ను.. లాగోస్(నైజీరియా) వెళుతోన్న సరుకురవాణా నౌక(ఎండీవర్) ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయని, ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సహాయక సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో రెండు నౌకలూ పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే ఆయిల్ లీకేజీ కాలేదని చెబుతున్నప్పటికీ స్పష్టత రావాల్సిఉంది. ఆయిల్ ట్యాంకర్, సరుకు రవాణా నౌక.. ఇవి రెండూ హాంగ్‌కాంగ్‌కు చెందినవని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో నౌకల్లో ఉన్న భారత్, చైనాలకు చెందిన సిబ్బంది 27మంది సిబ్బంది స్వల్పంగా గాయపడ్డట్లు తెలిపారు. సరుకు రవాణా నౌక తిరిగి ప్రయాణించేందుకు అనుమతి లభించగా, ఆయిల్ ట్యాంకర్‌ను మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు. -
ఇంగ్లీష్ కాలువ ఈదిన అమెరికా బామ్మ
-
ఇంగ్లిష్ చానల్‌ను ఈదేశాడు!
13.13 గంటల్లో లక్ష్యాన్ని ముద్దాడిన పుణేవాసి పింప్రి, న్యూస్‌లైన్: ప్రతికూల వాతావరణం... ఒకదాని వెనుక మరొకటిగా వచ్చి అడ్డుకుంటున్న అలలు... గమ్యం ఎక్కడుందో కనబడని కటిక చీకటి... అయినా ముందుకు సాగాడు. పోటుపాట్లను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ ఉపోద్ఘాతమంతా పుణే నగరానికి చెందిన రోహన్ మోరే గురించి. ఇంతకీ ఆయన ఏం ఘనకార్యం సాధించాడనే కదా? ఆ వివరాల్లోకెళ్తే... పుణేకు చెందిన రోహన్ మోరే ఇంగ్లీష్ చానెల్ సులువుగా ఈది సత్తాను చాటాడు. ఇంగ్లిష్ చానల్‌ను ఈదాలన్న తన చిరకాల వాంచను ఈ నెల 26వ తేదీన నెరవేర్చుకున్నాడు. 13 గంటల 13 నిమిషాల్లో సుమారు 35 కిలోమీటర్ల సముద్రాన్ని ఈది గమ్యం చేరుకున్నాడు. తన సముద్ర ప్రయాణం గురించి ఆయన మాట్లాడుతూ... ‘ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్యగల ఇంగ్లిష్ చానల్‌ను ఈదేందుకు ఈ నెల 26వ తేదీన రాత్రి 10 గంటలకు ఇంగ్లండ్ సముద్ర తీరానికి చేరుకున్నాను. ఈదడం ప్రారంభించిన తర్వాత సుమారు ఐదు గంటలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారింది. అలల తాకిడి పెరిగింది. దీంతో ఈదడం చాలా కష్టమైంది. చిమ్మ చీకటిలో ఎటువైపు వెళ్తున్నానో కూడా తెలియలేదు. సరిగ్గా ఆ సమయంలో ఓ బోటు కనిపించింది. దాని వెనకే వెళ్తే ఫ్రాన్స్ తీరం చేరుకోవచ్చని నిర్ణయించుకొని శక్తినంతా కూడదీసుకున్నా. దానివెంటే ఈదడాన్ని కొనసాగించాను. అయితే బోటువల్ల వచ్చే అలల తాకిడి కూడా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ ముందుకు సాగాను. లక్ష్యసాధన ముందు అలలు, చీకట్లు పటాపంచలయ్యాయి. కనుచూపు మేరలో ఫ్రాన్స్ తీరంలోని ఫినిష్ క్యాప్ పాయింట్ కనిపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వేగం పెంచాను. 13 గంటల్లో తీరాన్ని చేరుకున్నాన’ని చెప్పాడు. 1996లో మహారాష్ర్ట జలతరణ్ సంఘటన ఆధ్వర్యంలో నిర్వహించిన ధురంతర్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు సముద్రంలో మొదటిసారిగా ఈదానని చెప్పాడు. దీంతో ఇంగ్లీష్ చానెల్‌ను ఈదాలన్న పట్టుదల పెరిగిందని, అందుకు అవసరమైన శిక్షణ దేశ విదేశాలు తిరిగానని చెప్పాడు. తన ప్రయత్నానికి నేషన్ స్పోర్ట్స్ ట్రస్టు, పుణే అంతర్జాతీయ మారథాన్ సమితి సహాయ సహకారాలు అందించాయని చెప్పాడు. తన లక్ష్యం నెరవేరేందుకు సహకరించిన ఆర్థిక సాయం చేసిన అభయ్ దాడే, తీర్ఫీదునిచ్చిన ఫ్రెండా స్ట్రీటర్(ఇంగ్లండ్)లకు కృత జ్ఞతలు తెలిపాడు. స్ట్రీటర్ కుమార్తె ఎలీనా స్ట్రీటర్ ఇంగ్లిష్ చానల్‌ను 49 సార్లు ఈదిందని, ఆమె కూడా కొన్ని మెలకువలు నేర్పిందన్నారు.