కిడ్స్‌కు పాఠం... క్వీన్‌ స్విమ్మర్‌ | English Channel's Queen Victoria is charming | Sakshi
Sakshi News home page

కిడ్స్‌కు పాఠం... క్వీన్‌ స్విమ్మర్‌

Published Wed, Jul 10 2024 9:35 AM | Last Updated on Wed, Jul 10 2024 9:58 AM

English Channel's Queen Victoria is charming

ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ సినిమాలో శ్రీదేవి ఇంగ్లిష్‌ నేర్చుకుని ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. ఈతకు బద్దకించే పిల్లల్ని ఇన్‌స్పైర్‌ చేయడానికి క్వీనీ విక్టోరియా ఏకంగా ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈది రికార్డ్‌ సృష్టించింది. ఈ తరానికి ఓ లక్ష్యాన్ని అందించింది. ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. జీవనపోరాటంలో మునిగి కొన్నేళ్లకు ఆ కలలను మర్చిపోతాం. ప్రతి ఒక్కరూ జీవితంలో తమకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలి. ఆ పేజీల్లో కలలను సాకారం చేసుకున్న కథనాలే ఉండాలి. అప్పుడే మన కలకు గౌరవం... కలకన్న మనసుకు సంతోషం... ఇది ఇటీవల ఇంగ్లిష్‌ చానెల్‌ ఈదిన క్వీనీ విక్టోరియా మనోగతం.

క్వీనీ విక్టోరియా గంధం  2018 వరకు సాధారణ గృహిణి. ఆమె స్విమ్మర్‌గా వార్తల్లోకి వచ్చి కొద్దికాలమే అయింది. 38 ఏళ్ల వయసులో స్విమ్మింగ్‌ ప్రాక్టీస్ చేసిన విక్టోరియా గత జూన్‌ 25వ తేదీ (భారత కాలమానం ప్రకారం) తెల్లవారు జామున ఇంగ్లండ్‌ – ఫ్రాన్స్‌ దేశాల మధ్యనున్న ఇంగ్లిష్‌ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించారు. 2018లో తొలి రికార్డు, ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్‌లెవెల్, డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాల జాబితాలో నలభైకి పైగా ఉంది. క్వీనీ విక్టోరియా ఇంగ్లిష్‌ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా గుర్తింపు పోందిన సందర్భంగా సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విషయాలు.

పిల్లలతో కలిసి ప్రాక్టీస్
‘‘నా స్విమ్మింగ్‌ జర్నీ చాలా ఆశ్చర్యకరంగా మొదలైంది. మా పిల్లలిద్దరినీ స్విమ్మింగ్‌లో చేర్చాం.ప్రాక్టీస్కెళ్లడానికి బద్దకించేవాళ్లు. అలసట, నీరసం, ఓపికలేదు, ఇంటరెస్ట్‌ లేదు... రోజూ ఏదో ఓ సాకు చెప్పేవాళ్లు. వాళ్లకు బాధ్యత నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ‘నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది. రోజూ నీటిలో దిగి ఈత కొడితే కదా తెలుస్తుంది’ అన్నారు. ‘అంతకష్టమైన పనా, చూద్దాం పదండి’ అని నేను కూడా జాయినయ్యాను. మొదలు పెట్టిన మూడు నెలల్లోనే సికింద్రాబాద్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో ΄ోటీలు జరిగాయి. పిల్లలిద్దరూ, నేను ముగ్గురం ఎవరి ఏజ్‌ కేటగిరీలో వాళ్లు ΄ాల్గొన్నాం. ముగ్గురమూ విజేతలుగా నిలిచాం. ఇక అప్పటినుంచి నేను స్విమ్మింగ్‌ని ఆపలేదు.

ఏడు చానెళ్లనూ ఈదాలి 
దేశవిదేశాల్లో జరిగిన ΄ోటీలకు వెళ్లడం, పతకాలతో తిరిగి రావడం రెగ్యులర్‌ ్ర΄ాక్టీస్‌గా మారింది. హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, జాతీయ స్థాయి పోటీలు, దుబాయ్, సెర్బియా, ఈజిప్టు, శ్రీలంక, టర్కీలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాను. ఇంగ్లిష్‌ చానెల్‌ ఈదిన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. ఇది అందమైన భావన. గడ్డకట్టే చలి, దేహం బిగుసుకు΄ోయే చల్లదనపు నీటిలో ఈదాలి. రెండు గంటల సేపు చానెల్‌లో ఉన్నాను. ‘చానెల్‌ స్విమ్మింగ్‌ అండ్‌ ఫ్లోటింగ్‌ ఫెడరేషన్, లండన్‌’ నిర్వహించిన పోటీలో భాగంగా ఇంగ్లిష్‌ చానెల్‌ను ఈదే క్రమంలో ప్రతి సందర్భాన్నీ, ప్రతి సంఘటననూ ఎంజాయ్‌ చేశాను. ఏడు ఖండాల్లోని ఏడు చానెళ్లనూ ఈది రికార్డు సాధించాలనేది నా ముందున్న లక్ష్యం.   

నా కుటుంబం... క్లయింట్‌ల ప్రోత్సాహం
మాది మధ్య తరగతి కుటుంబం. పాలమూరు జిల్లా, అమనగల్లు మా సొంతూరు. ఇంటర్‌ తర్వాత పెళ్లయింది. హైదరాబాద్, బర్కత్‌పురాలో వైవాహిక జీవితం మొదలైంది. ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ, బీఈడీ చేశాను. కుటుంబ అవసరాల రీత్యా బర్కత్‌పురాలో ‘క్వీన్స్‌ టైలరింగ్‌ షాప్‌’ పెట్టాను. నా స్విమ్మింగ్‌ కెరీర్‌ మొదలైన తర్వాత నా క్లయింట్‌లు ‘నెక్ట్స్‌ ఎక్కడ ఈదుతున్నారు’ అని అడగడంతో΄ాటు, నాకు ఖర్చులకు డబ్బు సమకూర్చడం కోసం వాళ్లు వెంటనే అవసరం లేని దుస్తులు కూడా ఇచ్చి పని చేయించుకునేవాళ్లు. నా భర్త, నా క్లయింట్‌ల సహకారమే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూ΄ాయి కూడా ్ర΄ోత్సాహకంగా అందుకోలేదు. మొదట్నుంచీ అయిన ఖర్చు లెక్క ఎంతో చెప్పలేను, కానీ ఇంగ్లిష్‌ చానెల్‌ కోసం ఎనిమిది లక్షల రూ΄ాయలు ఖర్చయ్యాయి. ఒక మిడిల్‌ క్లాస్‌ గృహిణిని, ఇద్దరు పిల్లల తల్లిని. ఆ డబ్బును ఇంటి కోసమో, పిల్లల చదువు కోసమో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న మహిళను. అలాంటి స్థితిలో ఉన్న నేను ఇంత ఖర్చు చేసింది ఒక అచీవ్‌మెంట్‌ కోసం. చిన్నప్పుడు స్కూల్లో కబడీ, ఖోఖో ఆడేదాన్ని. ఆడపిల్లనైన కారణంగా, మధ్య తరగతి కుటుంబం అయిన కారణంగా క్రీడాజీవితం తెర వెనక్కి వెళ్లి΄ోయింది. కానీ అనుకోకుండా పిల్లల రూపంలో వచ్చిన అవకాశాన్ని నేను జారవిడుచుకోలేదు. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే. మీరూ కలలు కని ఉంటారు. నిద్రలో జోగుతున్న ఆ కలల కళ్లు తెరవండి. కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.  

పిల్లలు బద్ధకించేవాళ్లు
మా పిల్లలిద్దరినీ స్విమ్మింగ్‌లో చేర్చాం. ్ర΄ాక్టీస్‌కెళ్లడానికి బద్ధకించేవాళ్లు. అలసట, నీరసం, ఓపికలేదు, ఇంటరెస్ట్‌ లేదు... రోజూ ఏదో ఓ సాకు చెప్పేవాళ్లు. వాళ్లకు బాధ్యత నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ‘నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది. రోజూ నీటిలో దిగి ఈత కొడితే కదా తెలుస్తుంది’ అన్నారు. ‘అంతకష్టమైన పనా, చూద్దాం పదండి’ అని నేను కూడా జాయినయ్యాను.
– క్వీనీ విక్టోరియా గంధం, స్విమ్మర్‌

క్వీన్‌ను కలిసింది! 
ఇంగ్లిష్‌ చానెల్‌ ఈదడం కోసం లండన్‌లో ఉన్న సమయంలోనే నా పుట్టినరోజు (జూన్‌ 30) వచ్చింది. మా నానమ్మ గంధం కాంతమ్మ. ఆమె దేవరకొండ మిషనరీ స్కూల్‌లో టీచర్‌. క్వీన్‌ విక్టోరియా మన దేశానికి వచ్చినప్పుడు ఆమెను కలిసిందట మా నానమ్మ. ఆమె స్ఫూర్తితోనే నాకు పేరు పెట్టింది. నేను ఆ క్వీన్‌ నేలమీదకు వెళ్లి ఈత విజేతగా నిలవడానికి నాంది మా నాన్నమ్మ పేరు పెట్టడంతో ముడివడిందేమోననిపించింది. మొత్తంగా నాకు ఈ విజయం అత్యంత సంతోషకరమైన క్షణాలనిచ్చింది’’ అంటూ తన పేరు విజేతగా చరిత్రలో నమోదు కా>వడం గర్వంగా ఉందన్నారు క్వీనీ విక్టోరియా. 
– వాకా మంజులారెడ్డి .. ఫొటోలు : మోహనాచారి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement