queen victoria
-
కలల ముందు అలలు చిన్నవే!
ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా గంధం క్వీని విక్టోరియా గుర్తింపు పొందారు. హైదరాబాద్ వాసి అయిన విక్టోరియా ఈ నెల 19న ‘సేవ్ అవర్ ఓషన్స్’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా నవతరాన్ని ప్రోత్సహించడం కోసం ముంబయి సమీపంలోని మండ్వాజెట్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు తన కుమారుడు స్టీఫెన్ కుమార్‌తో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేశారు. తల్లీ కుమారుడు కలిసి ఓపెన్ స్విమ్మింగ్లోపాల్గొనడం దేశంలోనే మొదటిసారి. సప్తసముద్రాలను పిల్లలతో కలిసి ఈదుతా అంటూ తన కలల అలలను ‘సాక్షి’తో పంచుకున్నారు.హైదరాబాద్ బర్కత్‌పురలో ఉంటున్న గంధం క్వీని విక్టోరియా గృహిణిగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన కలల సాధనకోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ‘‘నా పిల్లల కలలకు ఓ మార్గం వేయాలనుకున్నాను. పిల్లలు చురుగ్గా ఉండాలంటే వారికి స్పోర్ట్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో భాగంగా వారిని స్కూల్ ఏజ్‌లో స్విమ్మింగ్‌లో చేర్చాను. నేనూ వారితోపాటు స్విమ్మింగ్‌లో చేరాను. పిల్లల కోసం నేర్చుకున్న స్విమ్మింగ్ నేను ఇంగ్లిష్ ఛానెల్ ఈదేంత వరకు వెళ్లింది. గుర్తింపు వచ్చింది.విమర్శలను పక్కన పెట్టి.. చాలా మంది విమర్శించారు. ఈ వయసులో స్విమ్మింగ్ అవసరమా? అన్నవాళ్లు ఉన్నారు. గుర్తింపు కోసం చేస్తున్న తపన అని, డబ్బులు ఎక్కువయ్యాయి అని.. ఒక్కొక్కరు ఒక్కో మాట. మాది మధ్య తరగతి కుటుంబం. పెళ్లితో ఆగిపోయిన ఇంటర్మీడియెట్ చదువును కొనసాగించాను. పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీతోపాటు బీఎడ్ చేశాను. మావారు అనిల్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు పిల్లల పెంపకంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో నాకు వచ్చిన కుట్టుపనితో టైలర్‌గా మారాను. మా వారి సంపాదనకు తోడుగా బొటిక్‌లో వచ్చిన ఆదాయంతో నిలదొక్కుకున్నాం.పిల్లలు మాట విన్నారు... పిల్లలతోపాటు స్విమ్మింగ్‌లో చేస్తున్నప్పుడు నీటి కాలుష్యం గురించి అనేక ఆలోచనలు వచ్చేవి. స్విమ్మింగ్ పూల్స్ నుంచి నదుల్లో ఈత వరకు నా ప్రయాణం, అటునుంచి సముద్రాలను ఈదాలనే తపనను పెంచింది. దాంట్లో భాగంగా ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు వచ్చింది. సముద్రాలలో ఉండే శక్తి అర్థమైంది. ఆ ఆనందంలో ఉండగా నా పిల్లల గురించి ఆలోచన చేశాను. నేను నా ప్రయాణంలో ముందుకు వెళుతున్నాను. కానీ, నా పిల్లలు వెనకబడి పోతున్నారా.. అని ఆలోచించాను. మా అమ్మాయి ఎలిజబెత్ క్వీన్, అబ్బాయి స్టీఫెన్ కుమార్‌లను కూర్చోబెట్టి వారితో చర్చించాను. ‘సప్తసముద్రాలను మీతో కలిసి ఈదాలని ఉంది’ అన్నాను. ఇద్దరూ నా మాటలతో ఏకీభవించారు. అయితే, ఆర్థిక సమస్యలతో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మా అమ్మాయి ప్రస్తావించింది. ‘సముద్రాలను ఈదాలంటే ఖర్చుతో కూడిన పని. ముగ్గురంపాల్గొంటే డబ్బు సమస్యలను ఎదుర్కోవాలి. ముందు మీ ఇద్దరుపాల్గొనండి. తర్వాత నేనూ జాయిన్ అవుతాను’ అంది. దీంతో ‘సేవ్ అవర్ ఓషన్స్’ కాన్సెప్ట్‌తో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా అబ్బాయి స్టీఫెన్ కుమార్‌తో కలిసి, ఈ నెల 19న అరేబియా సముద్రంలోని మాండ్వా జెట్ నుంచి ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వరకు 17.1/2 కి.మీ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి, రికార్డు నెలకొల్పాం.తల్లిదండ్రులకు అవగాహనఉదయం 7 గంటల 36 నిమిషాలకు స్విమ్మింగ్ చేయడం ్రపారంభిస్తే మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాలకు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకున్నాం. చివరి 800 మీటర్ల స్విమ్మింగ్ మాత్రం గంటకు పైగా సమయం పట్టింది. తల్లిదండ్రులు స్పోర్ట్స్ నుంచి వారి పిల్లలను యాక్టివిటీస్‌కు దూరం పెడుతున్నారు. వీటివల్ల ఏం లాభం అనుకుంటున్నారు. కానీ, పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎలా తోడ్పడతాయో గుర్తించడం లేదు. ఆ ఆలోచన కూడా కలిగించాలనేది మరో ఉద్దేశ్యం.డిజిటల్ ప్రపంచం నుంచి బయటకుసోషల్ మీడియా నుంచి, ఒత్తిడితో కూడుకున్న చదువుల నుంచి నా పిల్లలను బయటకు తీసుకు రావాలనుకున్నాను. అది క్రీడల వల్ల సాధ్యం అవుతుందని నమ్మాను. పిల్లలతో తల్లిదండ్రులు టైమ్ గడపాలంటే ఏదో ఒకటి ఇలాంటి యాక్టివిటీ పెట్టుకోవాలి అనుకున్నాను. ముందు పిల్లల ప్రపంచంలోకి నేను వెళ్లాను. ఇప్పుడు మా ప్రపంచం ఒకటే అయ్యింది. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం 4 గంటలు స్విమ్మింగ్‌కి కేటాయిస్తాం. పోటీ ఉంటే మాత్రం మరో రెండు గంటల సమయం కేటాయిస్తాం. శరీరానికి కావల్సిన శక్తి కోసం పోషకాహారాన్ని ఇంట్లోనే తయారు చేస్తాను. టైలరింగ్ చేస్తాను. పిల్లలిద్దరూ డిగ్రీ చేస్తున్నారు. వాళ్లతో కలిసి ప్రపంచంలోని ఏడు మహా సముద్రాలను ఈదాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాం. ప్రతిరోజూ నాకు వచ్చే ఆదాయంలో కొంత ఈ ఇవెంట్స్ కోసం ΄÷దుపు చేస్తుంటాను. చివరి నిమిషంలో అమౌంట్ తక్కువ పడితే మా వారి సాయం, లోన్, స్పాన్సర్స్ కోసం ట్రై చేస్తుంటాం. మొన్న జరిగిన ఈవెంట్‌కు సిటీ పోలీస్ డిపార్ట్మెంట్, డ్రీమాక్సిజ్ సాఫ్ట్వేర్ కంపెనీ, నా దగ్గర బట్టలు కుట్టించుకునేవారు సాయం అందించారు. రాబోయే ఏప్రిల్‌లో సౌత్ ఆఫ్రికాలోని రాబిన్ ఐలాండ్‌లో స్విమ్ చేయడానికి సాధన చేస్తున్నాం. కొందరు ఈ వయసులో అవసరమా.. అని కామెంట్ చేస్తుంటారు. సముద్రాల్లో ఈదుతూ ఉంటే ఇంటిని వదిలేసినట్టేగా అని సెటైర్లు వేస్తుంటారు. ఏ స్త్రీ అయినా వారి వయసుకు సంబంధం లేకుండా సాహసాలు చేస్తోందంటే దాని వెనక ఎన్నో కలలు, లక్ష్యాలు ఉంటాయి. భవిష్యత్తులో ఎవరైనా క్వీని విక్టోరియా అనగానే తన ఇద్దరు పిల్లలతో కలిసి సప్త సముద్రాలను ఈదింది అనే గుర్తింపు, తల్లిగా తన విజయంలో పిల్లలను ఎలా భాగస్వామ్యం చేసింది.. అనే విషయాలు అందరికీ గుర్తుకు రావాలి. తల్లిదండ్రులు చేసే కృషిని పిల్లలు ఎంత బాగా అర్థం చేసుకుంటారో కూడా మా ఈ ప్రయత్నం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను’ అని వివరించారు విక్టోరియా.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..
భారత్‌లోని తొలి విడాకులు కేసు లేదా విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ ఆమె. ఆమె విడాకుల కేసులో ఏకంగా బ్రిటన్ క్వీన్ జోక్యంతో తనకు అనుకూలంగా తీర్పు పొందింది. ఆ రోజుల్లో దీన్ని అందరూ విమర్శించినా..ఒంటరిగానే మహిళల హక్కుల కోసం పోరాడింది. పైగా పాశ్చాత్య వైద్యంలో సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి వైద్యురాలు కూడా ఈమెనే కావడం విశేషం. ఇంతకీ ఎవరామె..? ఆ కాలంలో అంతటి తెగువను ఎలా పదర్శించ గలిగిందంటే..?ఇది 1885లో జరిగిన ఘటన. చెప్పాలంటే భారత్లొని మొట్టమొదటి విడాకులు కేసు(Divorce Case) లేదా విడాకుల తీసుకున్న తొలి హిందు మహిళగా చెప్పొచ్చు. ఆ మహిళ పేరు రఖ్మాబాయి రౌత్. విడాకులు అనే పదం మన దేశంలో కనిపించే అవకాశం లేని రోజులవి. అలాంటి రోజుల్లో ధైర్యంగా కోర్టులో పోరాడి విడాకులు తీసుకుందామె. రఖ్మాబాయికి కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే దాదాజీ భికాజీ అనే 19 ఏళ్ల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే ఆమె మెడిసిన్ చదవాలనే తపనతో తన తల్లిదండ్రుల వద్దే ఉండేది. అక్కడే తన చదువుని కొనసాగించింది కూడా. అయితే ఇది ఆమె భర్తకు నచ్చక తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు. అందుకు రుఖ్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా కోర్టులో ధైర్యంగా తన వాదన వినిపించింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాని, అందువల్ల తనతో కలిసి జీవించలేనని నిర్భయంగా చెప్పింది. ఈ విషయం ఊరంతా దావానంలా వ్యాపించడమే గాక, చదువే ఆమెను భ్రష్టుపట్టించిందని ప్రజలంతా ఆమెను ఆడిపోసుకునేవారు. అయితే కోర్టు.. రుఖ్మాబాయిని భర్తతో కలిసి ఉండకపోతే జైలులో ఆరు నెలలు ఉండాల్సి వస్తుందని తీర్పు ఇచ్చింది. అయితే ఆమె ఆశ్చర్యకరంగా జైల్లో ఉండేందుకు మొగ్గు చూపింది. అలా ఆమె జైల్లో శిక్షను అనుభవిస్తూనే 'ఎ హిందూ లేడీ' అనే పేరుతో లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలు, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి రాశారు. ఆమె రచనలు క్వీన్ విక్టోరియా(Queen Victoria) దృష్టికి రావడమే గాక అవి ఎంతగానో ఆమెను ఆకర్షించాయి. దీంతో ఆమె రఖ్మాబాయి కేసులో జోక్యం చేసుకుని మరీ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. అలాగే విడాకులు కూడా మంజూరయ్యేలా చేశారామె. మహిళలను హేళనగా చూసే ఆ రోజుల్లో అత్యంత సాధారణ మహిళగా ఆమె సాధించిన మొట్టమొదటి విజయం. అయితే ఆ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్‌లో చదవాలని నిర్ణయించుకుంది. అలా 35 ఏళ్ల పాటు సూరత్‌లోని ఉమెన్స్ హాస్పిటల్ చీఫ్‌గా పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. చెప్పాలంటే పాశ్చాత్య వైద్యంలో హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ రుఖ్మాబాయి. అంతేగాదు ఆమె కారణంగానే భారత్‌లో బాల్యవివాహాలపై చర్చలు, వ్యతిరేకించడం ఊపందుకున్నాయి. అలాగే మహిళలు దీనిపై పోరాటం చేసేందుకు ముందుకొచ్చేలా ప్రేరణనిచ్చింది ఆమె గాథ. (చదవండి: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!) -
కిడ్స్‌కు పాఠం... క్వీన్ స్విమ్మర్
ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలో శ్రీదేవి ఇంగ్లిష్ నేర్చుకుని ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఈతకు బద్దకించే పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి క్వీనీ విక్టోరియా ఏకంగా ఇంగ్లిష్ ఛానల్‌ను ఈది రికార్డ్ సృష్టించింది. ఈ తరానికి ఓ లక్ష్యాన్ని అందించింది. ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. జీవనపోరాటంలో మునిగి కొన్నేళ్లకు ఆ కలలను మర్చిపోతాం. ప్రతి ఒక్కరూ జీవితంలో తమకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలి. ఆ పేజీల్లో కలలను సాకారం చేసుకున్న కథనాలే ఉండాలి. అప్పుడే మన కలకు గౌరవం... కలకన్న మనసుకు సంతోషం... ఇది ఇటీవల ఇంగ్లిష్ చానెల్ ఈదిన క్వీనీ విక్టోరియా మనోగతం.క్వీనీ విక్టోరియా గంధం 2018 వరకు సాధారణ గృహిణి. ఆమె స్విమ్మర్‌గా వార్తల్లోకి వచ్చి కొద్దికాలమే అయింది. 38 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసిన విక్టోరియా గత జూన్ 25వ తేదీ (భారత కాలమానం ప్రకారం) తెల్లవారు జామున ఇంగ్లండ్ – ఫ్రాన్స్ దేశాల మధ్యనున్న ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించారు. 2018లో తొలి రికార్డు, ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్‌లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాల జాబితాలో నలభైకి పైగా ఉంది. క్వీనీ విక్టోరియా ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళగా గుర్తింపు పోందిన సందర్భంగా సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విషయాలు.పిల్లలతో కలిసి ప్రాక్టీస్‘‘నా స్విమ్మింగ్ జర్నీ చాలా ఆశ్చర్యకరంగా మొదలైంది. మా పిల్లలిద్దరినీ స్విమ్మింగ్‌లో చేర్చాం.ప్రాక్టీస్కెళ్లడానికి బద్దకించేవాళ్లు. అలసట, నీరసం, ఓపికలేదు, ఇంటరెస్ట్ లేదు... రోజూ ఏదో ఓ సాకు చెప్పేవాళ్లు. వాళ్లకు బాధ్యత నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ‘నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది. రోజూ నీటిలో దిగి ఈత కొడితే కదా తెలుస్తుంది’ అన్నారు. ‘అంతకష్టమైన పనా, చూద్దాం పదండి’ అని నేను కూడా జాయినయ్యాను. మొదలు పెట్టిన మూడు నెలల్లోనే సికింద్రాబాద్ స్విమ్మింగ్ పూల్‌లో ΄ోటీలు జరిగాయి. పిల్లలిద్దరూ, నేను ముగ్గురం ఎవరి ఏజ్ కేటగిరీలో వాళ్లు ΄ాల్గొన్నాం. ముగ్గురమూ విజేతలుగా నిలిచాం. ఇక అప్పటినుంచి నేను స్విమ్మింగ్‌ని ఆపలేదు.ఏడు చానెళ్లనూ ఈదాలి దేశవిదేశాల్లో జరిగిన ΄ోటీలకు వెళ్లడం, పతకాలతో తిరిగి రావడం రెగ్యులర్ ్ర΄ాక్టీస్గా మారింది. హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, జాతీయ స్థాయి పోటీలు, దుబాయ్, సెర్బియా, ఈజిప్టు, శ్రీలంక, టర్కీలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాను. ఇంగ్లిష్ చానెల్ ఈదిన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. ఇది అందమైన భావన. గడ్డకట్టే చలి, దేహం బిగుసుకు΄ోయే చల్లదనపు నీటిలో ఈదాలి. రెండు గంటల సేపు చానెల్లో ఉన్నాను. ‘చానెల్ స్విమ్మింగ్ అండ్ ఫ్లోటింగ్ ఫెడరేషన్, లండన్’ నిర్వహించిన పోటీలో భాగంగా ఇంగ్లిష్ చానెల్‌ను ఈదే క్రమంలో ప్రతి సందర్భాన్నీ, ప్రతి సంఘటననూ ఎంజాయ్ చేశాను. ఏడు ఖండాల్లోని ఏడు చానెళ్లనూ ఈది రికార్డు సాధించాలనేది నా ముందున్న లక్ష్యం. నా కుటుంబం... క్లయింట్ల ప్రోత్సాహంమాది మధ్య తరగతి కుటుంబం. పాలమూరు జిల్లా, అమనగల్లు మా సొంతూరు. ఇంటర్ తర్వాత పెళ్లయింది. హైదరాబాద్, బర్కత్‌పురాలో వైవాహిక జీవితం మొదలైంది. ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీఈడీ చేశాను. కుటుంబ అవసరాల రీత్యా బర్కత్‌పురాలో ‘క్వీన్స్ టైలరింగ్ షాప్’ పెట్టాను. నా స్విమ్మింగ్ కెరీర్ మొదలైన తర్వాత నా క్లయింట్లు ‘నెక్ట్స్ ఎక్కడ ఈదుతున్నారు’ అని అడగడంతో΄ాటు, నాకు ఖర్చులకు డబ్బు సమకూర్చడం కోసం వాళ్లు వెంటనే అవసరం లేని దుస్తులు కూడా ఇచ్చి పని చేయించుకునేవాళ్లు. నా భర్త, నా క్లయింట్ల సహకారమే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూ΄ాయి కూడా ్ర΄ోత్సాహకంగా అందుకోలేదు. మొదట్నుంచీ అయిన ఖర్చు లెక్క ఎంతో చెప్పలేను, కానీ ఇంగ్లిష్ చానెల్ కోసం ఎనిమిది లక్షల రూ΄ాయలు ఖర్చయ్యాయి. ఒక మిడిల్ క్లాస్ గృహిణిని, ఇద్దరు పిల్లల తల్లిని. ఆ డబ్బును ఇంటి కోసమో, పిల్లల చదువు కోసమో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న మహిళను. అలాంటి స్థితిలో ఉన్న నేను ఇంత ఖర్చు చేసింది ఒక అచీవ్మెంట్ కోసం. చిన్నప్పుడు స్కూల్లో కబడీ, ఖోఖో ఆడేదాన్ని. ఆడపిల్లనైన కారణంగా, మధ్య తరగతి కుటుంబం అయిన కారణంగా క్రీడాజీవితం తెర వెనక్కి వెళ్లి΄ోయింది. కానీ అనుకోకుండా పిల్లల రూపంలో వచ్చిన అవకాశాన్ని నేను జారవిడుచుకోలేదు. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే. మీరూ కలలు కని ఉంటారు. నిద్రలో జోగుతున్న ఆ కలల కళ్లు తెరవండి. కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు బద్ధకించేవాళ్లుమా పిల్లలిద్దరినీ స్విమ్మింగ్‌లో చేర్చాం. ్ర΄ాక్టీస్కెళ్లడానికి బద్ధకించేవాళ్లు. అలసట, నీరసం, ఓపికలేదు, ఇంటరెస్ట్ లేదు... రోజూ ఏదో ఓ సాకు చెప్పేవాళ్లు. వాళ్లకు బాధ్యత నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ‘నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది. రోజూ నీటిలో దిగి ఈత కొడితే కదా తెలుస్తుంది’ అన్నారు. ‘అంతకష్టమైన పనా, చూద్దాం పదండి’ అని నేను కూడా జాయినయ్యాను.– క్వీనీ విక్టోరియా గంధం, స్విమ్మర్క్వీన్ను కలిసింది! ఇంగ్లిష్ చానెల్ ఈదడం కోసం లండన్‌లో ఉన్న సమయంలోనే నా పుట్టినరోజు (జూన్ 30) వచ్చింది. మా నానమ్మ గంధం కాంతమ్మ. ఆమె దేవరకొండ మిషనరీ స్కూల్లో టీచర్. క్వీన్ విక్టోరియా మన దేశానికి వచ్చినప్పుడు ఆమెను కలిసిందట మా నానమ్మ. ఆమె స్ఫూర్తితోనే నాకు పేరు పెట్టింది. నేను ఆ క్వీన్ నేలమీదకు వెళ్లి ఈత విజేతగా నిలవడానికి నాంది మా నాన్నమ్మ పేరు పెట్టడంతో ముడివడిందేమోననిపించింది. మొత్తంగా నాకు ఈ విజయం అత్యంత సంతోషకరమైన క్షణాలనిచ్చింది’’ అంటూ తన పేరు విజేతగా చరిత్రలో నమోదు కా>వడం గర్వంగా ఉందన్నారు క్వీనీ విక్టోరియా. – వాకా మంజులారెడ్డి .. ఫొటోలు : మోహనాచారి -
రైలుపల్లె.. రెడ్డిపల్లి
వైఎస్సార్: చైన్నె–ముంబై రైలు మార్గంలో తొలుత ఏర్పడిన స్టేషన్ రెడ్డిపల్లి. రైలు రావడానికి కారణమైన పల్లె గనుక ఇప్పటికీ రైలు పల్లెగా ప్రసిద్ధి కెక్కింది. అయితే రైల్వేశాఖ ఈ రైల్వేస్టేషన్ ఆనవాళ్లు లేకుండా చేసిందనే విమర్శలను మూటకట్టుకుంది. దక్షిణ భారతదేశంలో తొలి రైల్వేస్టేషన్‌గా రెడ్డిపల్లిను చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడి నుంచి నందలూరు వరకు రైలు మార్గం వేశారు. చెయ్యేరు నీరు శ్రేష్టమని భావించి రైలు ఇంజిన్ల నిర్వహణ కోసం లోకోషెడ్ నిర్మించేందుకు బ్రిటీషు రైల్వేపాలకులు ముందుకొచ్చారు. ► రెడ్డిపల్లి రైల్వేస్టేషన్లో విక్టోరియా రాణి.... రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు రైల్వేట్రాక్ వేశారు. విక్టోరియా రాణి ఇక్కడికి వచ్చి దీనిని ప్రారంభించారు. రైల్వేమార్గం పురోగతిపై నాటి రైల్వేపాలకులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వేకు ఎకరాల్లో స్థలం ఉంది. నిన్న మొన్నటివరకు బ్రిటీష్ రైల్వేపాలకుల చిహ్నాలు ఉండేవి. రాయపురం నుంచి..... మద్రాసు, సందరన్ మరాఠా రైల్వేస్ పరిధిలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తమిళనాడులోని రాయపురం వరకు 153 కిలోమీటర్లు రైల్వేట్రాక్ నిర్మించారు. ఇదంతా 1857 ప్రాంతంలో జరిగింది. దేశంలో తొలి రైలుమార్గం ముంబై–థానా మధ్య నిర్మితమైన క్రమంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు ట్రాక్ నిర్మితమైందని సమాచారం. రైల్వేస్టేషన్‌ను పూర్తి బర్మా టేకుతో నిర్మించారు. మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు..... మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. బొగ్గుతో నడిచే రైలింజన్లతో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. ఈ స్టేషన్లో మద్రాసు–రాయచూరు–రేణిగుంట–గుంతకళ్లు ప్యాసింజర్ రైళ్లు ఆగేవి. అరక్కోణం , కడప ప్యాసింజర్ రైళ్లు కూడా నిలిచేవి. 2003–2004 మధ్యలో రైల్వేస్టేషన్ మూసివేత ఇండియా రైల్వేలో మీటర్గేజ్లను బ్రాడ్‌గేజ్‌లుగా మార్చడం.. సింగల్ లైన్ ఉన్న రైల్వేస్టేషన్‌ను డబుల్ లైన్ చేశారు. ఈ క్రమంలో 2003–2004లో స్టేషన్‌ను మూసివేశారు. స్టేషన్ మాస్టర్లను, పాయింట్మెన్లను అందరినీ బదిలీ చేశారు. తర్వాత కాంట్రాక్టు పద్దతిలో రైల్వే టికెట్లు ఇచ్చేందుకు బుకింగ్ రూమ్ నిర్మించారు. లెవెల్ క్రాసింగ్ గేటు బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. ► స్టేషన్ మూసివేతకు ప్రధానంగా రెడ్డిపల్లికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో పుల్లంపేట రైల్వేస్టేషన్, ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఓబులవారిపల్లె స్టేషన్లు ఉన్నాయి. రైళ్లవేగం పెరిగిన క్రమంలో నాలుగు, ఐదు నిమిషాల్లో రైలు రెడ్డిపల్లి స్టేషన్ దాటి పోతుంది. ఆ స్టేషన్ ఉండటం వల్ల రైల్వేకు ఎలాంటి లాభదాయకం కాదని అప్పటి డీఆర్ఎం నివేదిక సమర్పించారు. దీంతో రైల్వేబోర్డు స్టేషన్‌ను మూసివేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. స్టేషన్‌ను మూసి వేయవద్దని కార్మికసంఘాలు చేసిన విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టారు. ► బ్రిటీషు రైల్వేపాలకుల హయాంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకొని ముంబై–చైన్నె రైలు మార్గం నిర్మించారు. ఈ స్టేషన్లో రెండు లైన్లు, ఒక ప్లాట్‌ఫామ్ ఉండేది. గూడ్స్ సైడింగ్‌ను కూడా బ్రిటీషర్లు ఏర్పాటు చేసుకున్నారు. 1980లో ఈ సైడింగ్‌ను మూసివేశారు. ఇక్కడి నుంచి గూడ్స్ వ్యాగన్లో కర్రబొగ్గు, ఎర్రగడ్డలు, తమలపాకు, నిమ్మకాయలు మద్రాస్ హార్బర్‌కు తీసుకెళ్లి అక్కడ నుంచి గోధుమలు, బార్లీ దిగుమతి అయ్యేవి. భావితరాలకు తెలియాలి బ్రిటీషు కాలం నుంచి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్లు గురించి, ఆనాటి పరిజ్ఞానం, రైళ్ల గురించి భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు రైల్వే లాభాలు చూసుకుంటోంది. చరిత్ర కల్గిన స్టేషన్లు కాలగర్భంలో కలిసిపో యాయి. ఇందులో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ఒకటి. – తల్లెం భరత్ కుమార్ రెడ్డి, గుంతకల్ రైల్వే బోర్డు మెంబర్ సరుకుల రవాణాకు అనుకూలం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి.దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇక్కడి నుంచి ఇంగ్లాడుకు సరుకుల రవాణ జరిగింది. బ్రిటీషు రైల్వేపాలకులు రెడ్డిపల్లికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు స్టేషన్ లేకుండా పోవడం విచారకరం. – ముస్తాక్, మండల కనీ్వనర్ పునరుద్ధరించాలి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి జిల్లాలో ఉండడం గర్వకారణం. మా పూర్వీకుల నుంచి స్టేషన్ రాకపోకలకు అనుకూలంగా ఉండేది. నేడు దీనిని ఆనవాళ్లు లేకుండా చేయడం బాధాకరం. ఈ స్టేషన్‌ను పునరుద్ధరిస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. – జనార్దన్, రెడ్డిపల్లి, పుల్లంపేట మండలం -
సామ్రాజ్య భారతి.. 1876/1947
ఘట్టాలు 1. క్వీన్ విక్టోరియా ఇండియా ‘సామ్రాజ్ఞి’ అయ్యారు. ఈస్టిండియా కంపెనీ నుంచి అధికారాలన్నీ బ్రిటన్ రాజ్యానికి బదలీ అయ్యాయి. చట్టాలు రాయల్ టైటిల్స్ యాక్ట్, కస్టమ్స్ కన్సాలిడేషన్ యాక్ట్, స్లేవ్ ట్రేడ్ యాక్ట్, స్టాట్యూట్ లా రివిజన్ (సబ్స్టిట్యూటెడ్ ఎనాక్ట్‌మెంట్స్) యాక్ట్. 2.అస్సాంలో.. లోకోప్రియ గోపీనాథ్ బార్డోలాయ్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్.. ‘తేజ్‌పూర్ లూనాటిక్ అస్సిలం’ అనే పేరుతో ప్రారంభం అయింది. జననాలు శరత్చంద్ర చటర్జీ : ప్రఖ్యాత నవలాకారుడు (హుగ్లీ); మహ్మద్ అలీ జిన్నా : రాజనీతిజ్ఞులు, పాకిస్థాన్ వ్యవస్థాపకులు (కరాచీ); లాలా : విక్టోరియా క్రాస్ట్ అవార్డ్ గ్రహీత (హిమాచల్ ప్రదేశ్); పింగళి వెంకయ్య : భారత జాతీయ పతాక రూపకర్త (మచిలీపట్నం); భాయ్ పరమానంద్ : జాతీయవాది, హిందూ మహాసభలో ముఖ్య నాయకులు (జీలం); గణేశ్ ప్రసాద్ : గణిత శాస్త్రవేత్త (ఉత్తరప్రదేశ్); ధనిరామ్ ఛత్రిక్ : కవి, టైఫోగ్రాఫర్, అమృత్సర్; మరైమలై అడిగల్ : తమిళ వక్త, రచయిత (నాగపట్నం); పల్వాంకర్ బలూ: క్రికెటర్, రాజకీయ కార్యకర్త (కర్ణాటక); ఘులామ్ భిక్ నైరంగ్ : న్యాయవాది, కవి, రచయిత (హర్యానా); స్వామీ కల్యాణ్ దేవ్ : సాధువు, పద్మభూషణ్ గ్రహీత (యు.పి.) -
కట్టలు తెగిన ప్రజాగ్రహం.. నేలకూలిన విగ్రహాలు
తమ పిల్లలపై జరిగిన మారణ హోమం పట్ల అక్కడి జనాలు రగిలిపోతున్నారు. సంబురంగా జరపాల్సిన పూర్తి స్వాతంత్రోత్సవ వేడుకల్ని.. నిరసన దినంగా పాటించారు. వలస పాలనతో ఆ మారణహోమాలకు కారకులంటూ రాణుల విగ్రహాలను కూల్చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యావత్ ప్రపంచం నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒట్టావా: నారింజ దుస్తుల్లో రోడ్డెక్కిన నిరసనకారులు.. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, కూలిన రాణుల విగ్రహాలు.. ఇది కెనడా డే నాడు కనిపించిన దృశ్యాలు. జులై 1న కెనడా డే వేడుకలపై ‘కరోనా’ ప్రభావం కనిపించింది. సంబురాలు భారీగా జరుపలేదు అక్కడి జనం. పైగా ఈ మధ్యకాలంలో స్కూళ్ల నుంచి వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాల అవశేషాలు భారీగా బయటపడడం వాళ్లలో తీవ్ర విషాదం నింపింది. అందుకే నిరసన దినం పాటించారు. అయితే బ్రిటిష్ పాలనలో జరిగిన ఆ మారణహోమాలను గుర్తు చేసుకుంటూ.. కనిపించిన రాణుల విగ్రహాలను కూల్చేశారు. తాళ్లతో లాగేసి మరీ.. కెనడా వ్యాప్తంగా ఆరెంజ్ దుస్తుల్లో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. విన్నిపెగ్‌లో క్వీన్ విక్టోరియా విగ్రహం దగ్గర తొలుత ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ రాచరికపు గుర్తులు కెనడా గడ్డపై ఉండకూడదని అరుస్తూ ఆపై విగ్రహాన్ని కూల్చిపడేశారు. విగ్రహంపైకి ఎక్కి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆపై అక్కడున్న శిలాఫలకంపై ఎర్ర చేతి గుర్తులు వేశారు. ఇక ఆ దగ్గర్లోనే ఉన్న క్వీన్ ఎలిజబెత్ విగ్రహాన్ని కూడా తాళ్లతో లాగి కిందపడేశారు. రాణి కాదు.. రాక్షసి అంటూ అభ్యంతరకర నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఒట్టవాలో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఇక ఈ ఘటనలను బ్రిటన్ ఖండించిది. ‘‘కెనడాలో జరిగిన విషాదాలకు మేం బాధపడుతున్నాం.ఈ వ్యవహారంలో కెనడాతో విచారణకు మేం సహకరిస్తాం. కానీ, విగ్రహాలు కూల్చేయడం సరికాదు’’ అని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆరువేల మందికిపైనే.. బ్రిటీష్ కొలంబియా, సస్కట్చేవాన్ లో క్యాథలిక్ చర్చల ద్వారా నడిచే స్కూళ్లలో భారీగా పిల్లల అస్థిపంజరాలు బయటపడడం తెలిసిందే. కెనడా దాదాపు 165 ఏళ్లపాటు బ్రిటిష్ కాలనీ పాలనలో ఉంది. ఆ టైంలో సంప్రదాయ మారణహోమం పెద్ద ఎత్తున్న జరిగిందని 2015లో ఓ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. బలవంతపు మతమార్పిళ్లు.. వినని వాళ్లపై వేధింపులు జరిగేవని తెలుస్తోంది. సుమారు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు ఆరువేల మంది పిల్లలు చనిపోగా.. వాళ్లను అక్కడే ఖననం చేశారు. ఆ అస్థిపంజరాలే ఇప్పుడు బయటపడుతున్నాయి. చదవండి: మూసేసిన స్కూల్లో వందల అస్థిపంజరాలు మతం, మాతృభాష ఆ పిల్లల పాలిట శాపం! -
రాణిగారి ‘తీపి’ బహుమతికి 121 ఏళ్లు..
ఎప్పుడో ఒకసారి మనకు బుద్ధి పుట్టినప్పుడు అటకెక్కి చూస్తే అబ్బురపరిచే అలనాటి వస్తువులు గత జ్ఞాపకాలెన్నింటినో తట్టి లేపుతాయి. తాజాగా బ్రిటన్‌లో 121 ఏళ్ల నాటి చాక్లెట్ బార్ ఒకటి దొరికింది. వందేళ్ల తరువాత దొరికిన ఈ చాక్లెట్ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. తూర్పు ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్లో ఓ ఇంట్లో అటకపై ఉన్న హెల్మెట్‌లో చాక్లెట్బార్ కనిపించింది. ఈ చాక్లెట్ ‘సర్ హెన్రీ ఎడ్వర్డ్ పాస్టన్ బేడింగ్ ఫీల్డ్’ అనే సైనికుడిదని యునైటెడ్ కింగ్డమ్ ద నేషనల్ ట్రస్టు ధ్రువీకరించింది. 1899, 1902 లలో రెండో బోయర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరాడుతున్న బ్రిటిష్ దళాలను ప్రోత్సహించేందుకు. క్వీన్ విక్టోరియా ఒక చిన్న బాక్స్‌లో చాక్లెట్ పెట్టి..‘సౌత్ ఆఫ్రికా 1900! ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్’ అని విక్టోరియా స్వదస్తూరిని రేపర్ మీద ముద్రించి బ్రిటిష్ దళాలకు పంపింది. ఈ చాక్లెట్ బరువు 226 గ్రాములు. అయితే గతేడాది సర్ హెన్రీ (100) మరణించడంతో ఆయన కుమార్తె హెన్రీకి సంబంధించిన వస్తువులను పరిశీలించగా ఈ చాక్లెట్ బయటపడింది. ఇప్పుడు ఈ చాక్లెట్‌ను ఇంగ్లాండ్ వారసత్వ సంపదగా భద్రపరుస్తున్నట్లు నేషనల్ ట్రస్టు ప్రకటించింది. బ్రిటిష్ సైనికులకు చాక్లెట్లు సరఫరా చేసేందుకు క్వీన్ విక్టోరియా మూడు చాక్లెట్ కంపెనీలను సంప్రదించారు. దీనికి ఆ కంపెనీలు ఎటువంటి రుసుమును తీసుకోకుండా చాక్లెట్‌ను తయారు చేసి ఇస్తామని చెప్పి అలానే ఇచ్చాయి. అంతేగాకుండా తమ కంపెనీ బ్రాండ్ నేమ్‌ను ఎక్కడా కనిపించనియ్యలేదు. పేరులేని బాక్సుల్లో చాక్లెట్‌ను పెట్టి సైనికులకు ఇచ్చారు. అయితే దక్షిణాఫ్రికాపై నియంత్రణ సాధించడానికి గ్రేట్ బ్రిటన్.. రెండు స్వతంత్ర బోయర్ రాష్ట్రాలపై యుద్ధాలు చేసింది. రెండవ బోయర్ యుద్ధం 1899–1902 మధ్య కాలంలో జరిగింది. 1902 మేనెలలో బోయర్ పక్షం బ్రిటిష్ నిబంధనలను అంగీకరించి, వెరెనిగింగ్ ఒప్పందంపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. -
ప్రిన్సెస్ గౌరమ్మ
స్వేచ్ఛను కోరుకునే మనసు ప్రేమలోనైనా బందీగా ఉండలేదు. బ్రిటన్ కుటుంబంలో రాణిలానూ ఉండిపోలేదు. భర్త నుంచి డయానా, బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి మేఘన్.. ఇద్దరూ స్వేచ్ఛను కోరుకున్న వాళ్లే. ఆ స్వేచ్ఛ కోసమే వాళ్లు తమ రెక్కల్ని తెంపుకున్నారు! వాళ్లిద్దరికంటే ముందు ఆ అంతఃపురంలో గౌరమ్మ అనే బాలిక.. ‘ప్రిన్సెస్’ గా స్వేచ్ఛ కోసం పెనుగులాడింది. తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన భర్తలోని తండ్రి ప్రేమను భరించలేక, క్వీన్ విక్టోరియా కనురెప్పల కింద భద్రంగా జీవించలేక పారిపోవాలని అనుకుంది. సాధ్యం కాలేదు. ప్రేమకు, భద్రతకు బందీగా 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది! ఎవరీ ప్రిన్సెస్ గౌరమ్మ? ప్యాలెస్‌లోకి ఎలా దారి తప్పింది? మేఘన్ రాణివాస జీవితానికి పూర్వఛాయలా అనిపిస్తున్న గౌరమ్మ అసలు ఏ ఊరి చిన్నారి?! ఎవరి పొన్నారి? అన్నమూ నీళ్లూ లేకున్నా మనుషులు కొన్నాళ్లు జీవించి ఉండగలరు. ప్రేమ లేని చోట ఒక్కక్షణం కూడా ఉండలేరు. అది పూరిల్లు అయినా, అంతఃపురం అయినా! లేడీ డయానాకు బకింగ్ హామ్ ప్యాలెస్‌లో ప్రేమ లభించలేదు. ఆమె కోరుకున్న ప్రేమ.. ప్యాలెస్ నుంచి కాదు. భర్త నుంచి. చివరికి మానసికంగా భర్తకు, ప్యాలెస్‌కు కూడా దూరం అయ్యారు డయానా. ప్రేమ లేని జీవితం భారమై, దుర్భరమై ప్రేమ కోసం పరుగులు తీస్తూ బతుకునే పోగొట్టుకున్నారు. 1997 ఆగస్టు 31న ప్యారిస్ లో ఆమె ప్రయాణిస్తున్న కారు టన్నెల్ రోడ్డుకు ఢీకొని మరణించారు. బ్రిటన్ ప్యాలెస్ ఎన్నటికీ మరువలేని విషాదం అది. విషాదం కన్నా కూడా విపత్తు. రాజవంశానికి అప్రతిష్టగా మాత్రమే ఆ దుర్ఘటనను ప్యాలెస్ ఆనాడు పరిగణించింది! ∙∙ బ్రిటన్ రాజప్రాసాదం దృష్టిలో అలాంటి అప్రతిష్టనే ఇప్పుడు మేఘన్ మార్కెల్ తెచ్చిపెట్టారు. క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెరికన్ యువతి మేఘన్. భర్త నుంచి దొరికిన ప్రేమ ఆమెకు అతడి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం లభించలేదు. ఉన్నన్నాళ్లు గుట్టుగా ఉన్నారు. ఇంక ఉండలేను అనుకోగానే ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రిన్స్ హ్యారీ ఆమె వైపు గట్టిగా నిలబడ్డారు కనుకే ఆమె స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలిగారు. ప్యాలñ స్ నుంచి మేఘన్ వెళ్లిపోవడాన్ని పెద్ద విషయంగా లెక్కలోకి తీసుకోని రాణిగారు, తామెందుకని రాచకుటుంబంతో తెగతెంపులు చేసుకుని బయటికి వచ్చారో ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో ఆమె చెప్పడాన్ని మాత్రం తలవంపులుగా భావించారు. ఇప్పుడిక ప్రిన్సెస్ గౌరమ్మ వార్తల్లోకి వచ్చారు. అయితే బ్రిటన్ వార్తల్లోకి కాదు. భారతీయ పత్రికల్లోకి. ‘‘పెళ్లితో ఆ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టి నిరాదరణకు గురైన మహిళల్లో డయానా, మేఘన్ మాత్రమే తొలి వ్యక్తులు కారు. పందొమ్మిదో శతాబ్దంలోనే క్వీన్ విక్టోరియా హయాంలో గౌరమ్మ అనే బాలిక ‘ప్రిన్సెస్’గా ఆ బంగారు పంజరంలో చిక్కుకుని బయటికి వచ్చే దారిలేక పారిపోయేందుకు ఆలోచనలు చేసిందని చరిత్రకారులు నాటి సంగతుల్ని మళ్లీ తవ్వి తీస్తున్నారు. ప్రిన్సెస్ గౌరమ్మతో ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ని పోల్చి చూస్తున్నారు. ఎవరీ గౌరమ్మ?! నిజంగానే బ్రిటన్ రాచ కుటుంబం గౌరమ్మ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందా? అది దయలేకపోవడమా లేక కట్టుబాట్లను శిరసావహించమని ఆదేశించడమా? ∙∙ డయానాను పక్కన పెడితే.. బ్రిటన్ రాజకుటుంబంలో వివక్షకు గురైన గోధుమవర్ణ చర్మం గల రెండో మహిళ మేఘన్ మార్కెల్. మొదటి మహిళ ప్రిన్స్ గౌరమ్మ. పదేళ్ల వయసు లో గౌరమ్మ అంతఃపురానికి వచ్చేనాటికి బ్రిటన్ ను క్వీన్ విక్టోరియా పరిపాలిస్తూ ఉన్నారు. గౌరమ్మ తండ్రి కూర్గ్ రాజు చిక్కా వీర రాజేంద్ర. ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అతడిని పదవీచ్యుతుడిని చేసి, సంపదను కొల్లగొట్టారు. అందులో కొంత భాగాన్నయినా తిరిగి తనకు దక్కులా చేయమని విన్నవించుకోడానికీ, తన ముద్దుల కూతురు గౌరమ్మను ఆమె రక్షణ కోసం రాణిగారికి దత్తత ఇవ్వడానికి.. ఆ రెండు కారణాలతో.. ఆయన గౌరమ్మను వెంటబెట్టుకుని వెళ్లి రాణిగారిని కలిశారు. అది 1852వ సంవత్సర ఆరం¿¶ కాలం. మొదటి పని కాలేదు. రెండో పని అయింది. విక్టోరియా రాణి గౌరమ్మను దత్తత తీసుకున్నారు. ‘‘నా తల్లి ఇక మీది. తనని మీలో కలిపేసుకున్నా (బాప్తిజం) అభ్యంతరం లేదు’’ అని కూతుర్ని రాణిగారి చేతుల్లో పెట్టి వెనుదిరిగారు వీర రాజేంద్ర. గౌరమ్మ అందంగా ఉంది. ఇకపై మరింత అందంగా మారబోతోంది. అందం మాత్రమే కాదు అలవాట్లు, ఆచారాలు కూడా. 1852 జూన్‌లో విండ్సర్ క్యాజిల్‌లో (మరొక రాజసౌధం) గౌరమ్మకు రాచ కుటుంబం బాప్తిజం ఇప్పించడం ఆనాటి పత్రికల్లో విశేష ప్రచారానికి నోచుకుంది. రాణిగారితో కలిసి ఉన్న గౌరమ్మ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆనాటి నుంచి గౌరమ్మ ‘ప్రిన్సెస్ గౌరమ్మ’ అయింది. అయితే అది రాణిగారి సంతోషమే కానీ గౌరవ సంతోషం కాదు. ఆ చిన్నారి తన కొత్త పాత్రలో, కొత్త మనుషుల మధ్య, కొత్త ఆచారాల వ్యవహారాలలో ఇమడలేకపోయింది. క్వీన్ విక్టోరియా ఆమెను అమితంగా ఇష్టపడేవారు. అదే ఆ పసిదానికి కష్టాలను తెచ్చిపెట్టింది. చుట్టూ పరిచారకులు ఉండేవారు. తన ఇష్టానుసారం కాలూ చెయ్యి ఆడనిచ్చేవారు కాదు. రాణిగారితో మాటొస్తుందని వారి భయం. అసలు కష్టం ప్రిన్స్ గౌరమ్మకు తన 16వ యేట వచ్చింది. గౌరమ్మను మహారాజా దులీప్ సింగ్‌కు ఇచ్చి చేయాలని రాణి గారు తలపోయడమే ఆ కష్టం. గౌరమ్మ కన్నా పదహారేళ్లు పెద్దవాడు దులీప్‌సింగ్. గౌరమ్మకూ పెళ్లంటే ఇష్టం లేదు. ఎప్పుడు ఆ బంధనాల్లోంచి పారిపోదామా అన్నట్లు ఉండేదా అమ్మాయి. అది గమనించాడు దులీప్‌సింగ్. తనకు ఆమెతో పెళ్లి ఇష్టం లేదన్నాడు. అలా ఆ కష్టాన్ని అతడే తప్పించాడు. అయితే గౌరమ్మకు నిజమైన కష్టం తండ్రిని కలవనివ్వకుండా కట్టడి చెయ్యడం! కలిస్తే మళ్లీ పాతబుద్ధులే వస్తాయని రాణిగారు ఆందోళన చెందేవారట. ‘‘ఎక్కడికైనా పారిపోయి, పనిమనిషిగానైనా బతికేందుకు గౌరమ్మ సిద్ధపడింది’’ అని క్వీన్ విక్టోరియా ఆంతరంగిక కార్యదర్శి ఆ తర్వాతి కాలంలో బహిర్గతం చేసినట్లు చరిత్రకారులు రాశారు. మొత్తానికి ఇప్పుడు మేఘన్‌కు అయినట్లే, అప్పుడు గౌరమ్మ కు అయింది. ఒక్కరైనా ఆమెను పట్టించుకోలేదు. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న ఆ మనసును తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి కల్నల్ జాన్ కాంప్‌బెల్. ప్రిన్స్ గౌరమ్మ కొత్త పరిచారిక లేడీ లోజిన్ సోదరుడే జాన్ కాంప్‌బెల్. ∙∙ కాంప్‌బెల్.. గౌరమ్మ కన్నా 30 ఏళ్లు పెద్ద. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు అక్కడికి రాకపోకలు సాగిస్తుండే దులీప్ సింగ్ గమనించి, రాణిగారికి ఆ విషయాన్ని చేరవేయడంతో క్షణమైనా ఆలస్యం చేయకుండా ఇద్దరికీ వివాహం జరిపించారు. లేడీ లోజిన్ నిర్ఘాంతపోయారు. గౌరమ్మ తమ ఆడపడుచు అవడం లోజిన్కు ఇష్టం లేదు. కానీ రాణిగారి నిర్ణయం! 1861లో ప్రిన్స్ గౌరమ్మకు ఇరవై ఏళ్ల వయసులో ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు ఎడిత్ విక్టోరియా కాంప్‌బెల్ అని పేరు పెట్టారు. తర్వాత మూడేళ్లకు ప్రిన్స్ గౌరమ్మ 1864లో తన ఇరవై మూడవ యేట చనిపోయింది. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది మాత్రం చరిత్రలో నమోదు అవలేదు! కుటుంబ సభ్యుల ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పెనుగులాడిన లేడీ డయానా, మేఘన్ మార్కెల్‌ల జీవితంలోనూ నమోదు కానీ, నమోదు అయ్యే అవకాశం లేని వ్యక్తిగత విషయాలు ఉంటే ఉండొచ్చు. ఓప్రా విన్ ఫ్రేకు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ -
అబ్దుల్ కరీం... రాణి విక్టోరియా!
లండన్: 19వ శతాబ్దం చివర్లో బ్రిటన్ రాజదర్బార్‌లో ఉన్నత పదవిలో పనిచేసిన తొలి భారతీయుడు అబ్దుల్ కరీంకు ‘విక్టోరియా అండ్ అబ్దుల్’ సినిమా ద్వారా చరిత్రలో మళ్లీ సముచిత స్థానం లభించిందని ఆ సినిమాకు మూలాధారమైన నవలా రచయిత పేర్కొన్నారు. ‘విక్టోరియా అండ్ అబ్దుల్: ద ఎక్స్ట్రార్డినరీ ట్రూ స్టోరీ ఆఫ్ ద క్వీన్స్ క్లోజెస్ట్ కాన్ఫిడాంట్’ (రాణికి అత్యంత విశ్వాసపాత్రుడి గొప్ప వాస్తవ కథ) నవలను యూకేకు చెందిన శర్బానీ బసు రచించారు. దీని ఆధారంగా తెరకెక్కించిన విక్టోరియా అండ్ అబ్దుల్ సినిమా బ్రిటన్‌లో సెప్టెంబర్‌లో విడుదలైంది. భారత్‌లోనూ శుక్రవారం విడుదల కానుంది. అబ్దుల్ కరీంను నాటి బ్రిటన్ రాణి విక్టోరియా అమితంగా అభిమానిం చేది. దర్బారులో ఆయనకు గౌరవం కల్పించడంతోపాటు మున్షీ (భాషా ఉపాధ్యాయుడు) పదవి ఇచ్చింది. కరీం ఆమెకు భారతీయ వంటకాలు చేసిపెట్టడంతోపాటు, ఉర్దూ కూడా నేర్చించారు. అయితే ఈ విషయాలు చాలామందికి నచ్చేవి కావు. చివరకు 1901లో విక్టోరియా చనిపోయాక కరీంను భారత్‌కు పంపారు. 1909లో కరీం మరణించారు. -
లండన్ నగరానికి ఉపద్రవం
దుర్గంధంతో లండన్ ఉక్కిరిబిక్కిరి మన దేశంలో మురుగు కాలువల పక్క నుంచి వెళుతుంటే వ్యాపించే దుర్గంధానికి ముక్కుమూసుకుని వీలైనంత త్వరగా ఆ పరిసరాలను దాటుకుని ముందుకు సాగిపోవడానికి ప్రయత్నిస్తాం. ముక్కు మూసుకునేలా చేసిన ఆ కాస్త అసౌకర్యానికి కూడా మునిసిపాలిటీ నిర్వాహకులను మనసులోనే ముక్కచీవాట్లు తిట్టుకుంటాం. మన నగరాలు, పట్టణాల్లో ఇలాంటి పరిస్థితులు చాలా మామూలే. అయితే నగరానికి నగరమే లేదా పట్టణానికి పట్టణమే రోజుల తరబడి దుర్గంధభూయిష్టంగా మారిన ఉదంతాలైతే మన దేశ చరిత్రలో లేవు. అలాంటి ఘన చరిత్ర రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాజధాని లండన్ నగరానికే దక్కింది. విక్టోరియా మహారాణివారి ఏలుబడి కొనసాగుతున్న కాలంలో 1858వ సంవత్సరం నడివేసవి కాలంలో లండన్ నగరానికి ఆ ఉపద్రవం తటస్థించింది. మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో నగరానికి నగరమే దుర్గంధభూయిష్టంగా మారింది. మురుగు నీరంతా థేమ్స్ నదిలోకి చేరడంతో థేమ్స్ కాస్తా వైతరణి నదిలా మారింది. పిల్లా పీచూ ముసలీ ముతకా ఊపిరి పీల్చుకోలేక రోజుల తరబడి ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు రాణిగారు కూడా ముక్కుకు క్లిప్పు పెట్టుకునే పరిస్థితి వాటిల్లింది. దుర్గంధాన్ని అరికట్టడానికి పార్లమెంటు భవనానికి వేసిన కర్టెన్లను సున్నపు క్లోరైడ్‌తో తడిపేవారు. ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా ఫలితం లేకపోవడంతో లండన్‌లోని చాలా దుకాణాలను రోజుల తరబడి మూసివేశారు. లండన్ పారిశుద్ధ్య యంత్రాంగం పద్దెనిమిది రోజుల పాటు నానా తంటాలు పడిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చి జనాలు కాస్త ధైర్యంగా ఊపిరి పీల్చుకోగలిగారు. -
రాణీగారు... మీ సొంతసొమ్ము ఉంది కదా!
బకింగ్‌హామ్ ప్యాలెస్ మరమ్మతుల కోసం ప్రజల సొమ్ము వాడొద్దు లండన్: ‘ప్రజల సొమ్ముతో కాకుండా మీ సొంత డబ్బుతో రాజభవనానికి మరమ్మతులు చేయించుకోండి’ ఇది బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2కు ఆన్లైన్లో వెల్లువెత్తుతున్న విన్నపం. క్వీన్ ఎలిజబెత్ నివసించే బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను నవీకరించడానికి 370 మిలియన్ పౌండ్లు (రూ. 3109 కోట్లు) ఖర్చు అవ్వనున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో ఈ ప్యాలెస్ నవీకరణకు అయ్యే ఖర్చును రాణీ సొంత ఆస్తుల నుంచి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తూ 38డిగ్రీస్ క్యాంపెయిన్ వెబ్సైట్లో ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌కు మద్దతుగా ఇప్పటికే 88వేలకు పైగా సంతకాలు లభించాయి. ఇంకా సంతకాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఈ చారిత్రక భవనం కోసం పన్నుంచెల్లింపుదారుల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేయడకూడదని ఈ పిటిషన్ కోరింది. రాణికి వ్యక్తిగతంగా 340 మిలియన్ పౌండ్ల సంపద ఉందని, అంతేకాకుండా సండ్రింగ్హామ్ హౌస్, బాల్మోరల్ కాజల్ ఉన్నాయని, కాబట్టి ఈ ఖర్చును ఆమెనే భరించాలని పిటిషన్ కోరింది. ‘ దేశంలో గృహ సంక్షోభం నెలకొని ఉంది. ప్రభుత్వ పొదుపుచర్యల కారణంగా ఎన్నో సంక్షేమ సేవలు ఆగిపోయాయి. ఇప్పుడు బకింగ్‌హామ్ ప్యాలెస్ మరమ్మతుల కోసం ప్రజలు మరింత కష్టాలు పడాలని రాజకుటుంబం కోరుతోంది. రాణికి అపారమైన సంపద ఉంది. అయినా ఇలా చేయడం గర్హనీయం’ అని యూకే చాన్స్‌లర్‌ను ఉద్దేశించి పిటిషన్లో పేర్కొన్నారు. -
కేకు ముక్క ఖరీదు.. రూ. 1.33 లక్షలు!
విక్టోరియా మహారాణి పెళ్లినాటి కేకు ముక్కను వేలం వేస్తే.. ఏకంగా రూ. 1.33 లక్షలు పలికింది. అది 19వ శతాబ్దం నాటి కేకు ముక్క కావడం, అది కూడా రాణీగారి పెళ్లి కేకు కావడంతో ఈ స్థాయిలో ధర వచ్చింది. యువరాజు ఆల్బర్ట్‌తో విక్టోరియా మహారాణి పెళ్లి 1840లో జరిగింది. దీన్ని డేవిడ్ గైన్స్బరో రాబర్ట్స్ వేలానికి పెట్టారు. దాన్ని ప్యాక్ చేసిన ప్రజంటేషన్ బాక్సుమీద ''రాణీగారి పెళ్లి కేకు బకింగ్‌హామ్ ప్యాలెస్, ఫిబ్రవరి 10, 1840'' అని చెక్కి ఉంది. రాజముద్ర ఉన్న కాగితం మీద విక్టోరియా మహారాణి సంతకం కూడా ఆ కేకుతో పాటు ఉంచారు. లండన్‌లోని క్రిస్టీస్ వేలం శాలలో మోనార్క్ నిక్కర్లు, టైటానిక్ తాళాలు, విన్స్టన్ చర్చిల్ టోపీ కూడా వేలానికి వేశారని బీబీసీ తెలిపింది. అండర్‌వేర్‌కు రూ. 14.42 లక్షల రేటు పలికింది. నిజానికి దీనికి మహా అయితే 88 వేల నుంచి 1.6 లక్షల వరకు మాత్రమే వస్తుందని అంచనా వేశారు. జీవితాంతం అరుదైన వస్తువులను సేకరిస్తూ వచ్చిన రాబర్ట్స్ (70).. ఇప్పుడు వాటిని వేలం వేసి లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు. -
విక్టోరియా రాణి కంటే నా గేదెలే గొప్పవి: ఆజమ్
లక్నో: గేదేల అపహరణ సంఘటన ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజమ్ ఖాన్ ను గందరగోళంలో పడేసింది. గేదెల అపహరణ సంఘటనపై మీడియా కవరేజి మరింత ఇబ్బందిని సృష్టిస్తోంది. ఓ దశలో సహనం కోల్పోయిన మంత్రి తన గేదేలు బ్రిటన్ రాణి విక్టోరియా కంటే గొప్ప అని వ్యాఖ్యలు చేశారు. నా గేదేలు నాకు అదృష్టం అని భావిస్తాను అని మీడియాకు తెలిపారు. ఏ చానెల్ చూసినా.. గేదేలతోపాటు తలపై పేడ మోస్తున్నట్టు ప్రసారమవుతున్నాయి అని ఆజమ్ ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. ఫిబ్రవరి 1 తేదిన తన ఫామ్ హౌజ్ నుంచి గేదేలు కనిపించకుండా పోవడంతో డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్, ఇతర పోలీసు అధికారులకు వెతికే కార్యక్రమాన్ని అప్పగించడం వివాదస్పదంగా మారింది. రెండు రోజుల తర్వాత గేదేల ఆచూకీ లభ్యమైనా.. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ సబ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.