ఘట్టాలు
1. క్వీన్ విక్టోరియా ఇండియా ‘సామ్రాజ్ఞి’ అయ్యారు. ఈస్టిండియా కంపెనీ నుంచి అధికారాలన్నీ బ్రిటన్ రాజ్యానికి బదలీ అయ్యాయి.
చట్టాలు
రాయల్ టైటిల్స్ యాక్ట్, కస్టమ్స్ కన్సాలిడేషన్ యాక్ట్, స్లేవ్ ట్రేడ్ యాక్ట్, స్టాట్యూట్ లా రివిజన్ (సబ్‌స్టిట్యూటెడ్ ఎనాక్ట్‌మెంట్స్) యాక్ట్.
2.అస్సాంలో.. లోకోప్రియ గోపీనాథ్ బార్డోలాయ్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్.. ‘తేజ్‌పూర్ లూనాటిక్ అస్సిలం’ అనే పేరుతో ప్రారంభం అయింది.
జననాలు
శరత్‌చంద్ర చటర్జీ : ప్రఖ్యాత నవలాకారుడు (హుగ్లీ); మహ్మద్ అలీ జిన్నా : రాజనీతిజ్ఞులు, పాకిస్థాన్ వ్యవస్థాపకులు (కరాచీ); లాలా : విక్టోరియా క్రాస్ట్ అవార్డ్ గ్రహీత (హిమాచల్ ప్రదేశ్); పింగళి వెంకయ్య : భారత జాతీయ పతాక రూపకర్త (మచిలీపట్నం); భాయ్ పరమానంద్ : జాతీయవాది, హిందూ మహాసభలో ముఖ్య నాయకులు (జీలం); గణేశ్ ప్రసాద్ : గణిత శాస్త్రవేత్త (ఉత్తరప్రదేశ్); ధనిరామ్ ఛత్రిక్ : కవి, టైఫోగ్రాఫర్, అమృత్‌సర్; మరైమలై అడిగల్ : తమిళ వక్త, రచయిత (నాగపట్నం); పల్వాంకర్ బలూ: క్రికెటర్, రాజకీయ కార్యకర్త (కర్ణాటక); ఘులామ్ భిక్ నైరంగ్ : న్యాయవాది, కవి, రచయిత (హర్యానా); స్వామీ కల్యాణ్ దేవ్ : సాధువు, పద్మభూషణ్ గ్రహీత (యు.పి.)
Comments
Please login to add a commentAdd a comment