2024 యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన, మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ సంచలనం రేపారు. కన్జర్వేటివ్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫేర్‌హామ్ అండ్ వాటర్‌లూవిల్లే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. లేబర్‌కు చెందిన గెమ్మా ఫర్నివాల్‌పై 6,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2015 నుండి ఆమె ఫారెహామ్‌కు ఎంపీగా ఉన్నారు . అక్టోబర్ 2022-నవంబర్ 2023 వరకు హోం సెక్రటరీగా పనిచేశారు.
తన విజయం గత 14 సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ పనితీరుపై ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పారు. వాగ్దానాలను నిలబెట్టు కోలేకపోయిందనీ, కన్సర్వేటివ్ పార్టీ ప్రజల్ని నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పార్టీ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తాజా ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారాన్నిచేజిక్కించుకుంది. 10 లక్షల మందికి పైగా భారత సంతతి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 107 మంది బ్రిటీష్ ఇండియన్లు పోటీ చేశారు. 2019లో ఈ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment