UK elections
-
యూకే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రేవర్మాన్ సంచలనం
2024 యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన, మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ సంచలనం రేపారు. కన్జర్వేటివ్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫేర్‌హామ్ అండ్ వాటర్లూవిల్లే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. లేబర్‌కు చెందిన గెమ్మా ఫర్నివాల్పై 6,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2015 నుండి ఆమె ఫారెహామ్‌కు ఎంపీగా ఉన్నారు . అక్టోబర్ 2022-నవంబర్ 2023 వరకు హోం సెక్రటరీగా పనిచేశారు.తన విజయం గత 14 సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ పనితీరుపై ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పారు. వాగ్దానాలను నిలబెట్టు కోలేకపోయిందనీ, కన్సర్వేటివ్ పార్టీ ప్రజల్ని నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పార్టీ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.తాజా ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారాన్నిచేజిక్కించుకుంది. 10 లక్షల మందికి పైగా భారత సంతతి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 107 మంది బ్రిటీష్ ఇండియన్లు పోటీ చేశారు. 2019లో ఈ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది నెగ్గారు. -
UK general elections: ముందస్తు ఓటమే?!
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్‌లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు. లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్ తదితరులున్నారు.ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్.. లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్
సాక్షి, హైదరాబాద్: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న హైదరాబాద్ మూలాలుగల తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజు తాజాగా ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉదయ్ ఆశిస్తున్నారు. యూకే పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వందలాది మంది వ్యక్తులు తొలుత తాము అభ్యర్తిత్వం కోరకుంటున్న పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను వడపోసి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి లాంగ్‌లిస్ట్ రూపొందిస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థే పార్టీ తరఫున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు. రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తదితరాల ఆధారంగా లాంగ్ లిస్ట్‌ను లేబర్ పార్టీ రూపొందించగా ఉదయ్ అందులో చోటు సంపాదించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన ఉదయ్ నాగరాజు.. అంతర్జాతీయ వక్తగా, లేబర్ పార్టీ విధాన నాయకుడిగా మేథో విభాగాన్ని నడిపిస్తున్నారు. ఇదీ చదవండి: UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
‘ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి’.. బోరిస్‌కు పెరుగుతున్న మద్దతు!
లండన్: కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషీ సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మందికిపైగా ఎంపీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీకి సిద్ధమయ్యారు. విహారయాత్రను అర్ధాంతరంగా ముగించుకుని బ్రిటన్ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత సంతతి వ్యక్తి, బోరిస్ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా పని చేసిన ప్రీతి పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని పదవి చేపట్టేందుకు బోరిస్ జాన్సన్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఓవైపు.. రిషీ సునాక్‌కు ఎంపీల మద్దతు పెరుగుతున్న క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోరిస్ జాన్సన్‌కు మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా వెల్లడించారు ప్రీతి పటేల్.‘ ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగల సత్తా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఉందనటంలో ఆయనకు సరైన ట్రాక్ రికార్డ్ ఉంది. మన మేనిఫెస్టోను అమలు చేయగలరు. ఈ నాయకత్వ పోటీలో నేను ఆయనకు మద్దతు ఇస్తున్నాను.’అనిపేర్కొన్నారు ప్రీతి పటేల్. ప్రధాని రేసులో నిలవాలని భావిస్తున్న బోరిస్ జాన్సన్ హుటాహుటిన బ్రిటన్ తిరిగి వచ్చిన క్రమంలో ప్రీతి పటేల్ ట్వీట్ చేయటం గమనార్హం. బోరిస్ జాన్సన్ ఆరు వారాల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. తన కేబినెట్లోని అసమ్మతి నేతలు రాజీనామాలు చేయటం వల్ల ఆయన పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే, ఇప్పటికీ ఆయనకు పార్టీలో ఆదరణ తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు బోరిస్‌కు మద్దతు ప్రకటించారు. వాణిజ్య శాఖ మంత్రి జాకబ్ రీస్ మోగ్, రక్షణ మంత్రి బెన్ వల్లాస్, సిమోన్ క్లెర్క్‌లు బోరిస్‌కు అండగా నిలిచారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌కు 46 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రిషీ సునాక్‌కు 100 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎవరు పోటీలో ఉండనున్నారని తెలనుంది. అయితే, ఒక్కరే పోటీలో ఉన్నట్లు తెలితే వచ్చే వారమే కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కానీ, ఒకవేళ ఇద్దరు బరిలో ఉంటే 1,70,000 మంది పార్టీ సభ్యులు వచ్చే శుక్రవారం ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొని తమ నాయకుడిని ఎన్నుకుంటారు. I'm backing @BorisJohnson to return as our Prime Minister, to bring together a united team to deliver our manifesto and lead Britain to a stronger and more prosperous future. pic.twitter.com/6wyGmASLda — Priti Patel MP (@pritipatel) October 22, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
ట్రస్ కేబినెట్ ...హోంమంత్రిగా భారత్ సంతతికి చెందిన వ్యక్తి
-
రిషి సునాక్ చరిత్ర సృష్టిస్తారా...!
-
బ్రిటన్ ఎన్నికలు : నష్టాల్లో మన మార్కెట్లు
బ్రిటన్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు థెరిసా మేకు ప్రతికూలంగా రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 104.24 పాయింట్ల నష్టంతో 31,109 వద్ద, నిఫ్టీ 31.20 పాయింట్ల నష్టంలో 9,650 కిందకి పడిపోయి 9616 వద్ద ట్రేడవుతోంది. గురువారంతో ముగిసిన బ్రిటన్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాల్లో ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మే కన్జర్వేటివ్ పార్టీకి మెజార్టి రాదని తెలిసింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు అస్థిరంగా ట్రేడవుతున్నాయి. అంతేకాక నేడు జరుగుతున్న కౌంటింగ్ లో కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ హోరాహోరీగా పోటీపడుతున్నాయని తెలిసింది. కరెన్సీ మార్కెట్లు మాత్రం థెరిసా మే కన్జర్వేటివ్ పార్టీకి క్లియర్ మెజార్టీ వస్తుందని అంచనావేశాయి. బ్రిటన్ ఎన్నికల ఫలితాలతో పాటు ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు, గెయిల్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, టెక్ మహింద్రా నష్టాల బాట పట్టడంతో మార్కెట్లు నష్టపోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి ట్రేడింగ్ లో అతిపెద్ద గెయినర్ గా 1.5 శాతం మేర లాభాలు పండిస్తోంది. హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, యస్ బ్యాంకు, కొటక్ మహింద్రాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపీ కొంత కరెక్షన్ కు గురైంది. గురువారం ముగింపుకు 6 పైసలు నష్టంలో 64.27 వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా భారీగా 307 రూపాయల మేర పడిపోతూ 29,133 వద్ద ట్రేడవుతున్నాయి.