బ్రిటన్ ఎన్నికలు : నష్టాల్లో మన మార్కెట్లు
బ్రిటన్ ఎన్నికలు : నష్టాల్లో మన మార్కెట్లు
Published Fri, Jun 9 2017 9:49 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
బ్రిటన్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు థెరిసా మేకు ప్రతికూలంగా రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 104.24 పాయింట్ల నష్టంతో 31,109 వద్ద, నిఫ్టీ 31.20 పాయింట్ల నష్టంలో 9,650 కిందకి పడిపోయి 9616 వద్ద ట్రేడవుతోంది. గురువారంతో ముగిసిన బ్రిటన్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాల్లో ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మే కన్జర్వేటివ్ పార్టీకి మెజార్టి రాదని తెలిసింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు అస్థిరంగా ట్రేడవుతున్నాయి. అంతేకాక నేడు జరుగుతున్న కౌంటింగ్ లో కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ హోరాహోరీగా పోటీపడుతున్నాయని తెలిసింది. కరెన్సీ మార్కెట్లు మాత్రం థెరిసా మే కన్జర్వేటివ్ పార్టీకి క్లియర్ మెజార్టీ వస్తుందని అంచనావేశాయి.
బ్రిటన్ ఎన్నికల ఫలితాలతో పాటు ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు, గెయిల్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, టెక్ మహింద్రా నష్టాల బాట పట్టడంతో మార్కెట్లు నష్టపోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి ట్రేడింగ్ లో అతిపెద్ద గెయినర్ గా 1.5 శాతం మేర లాభాలు పండిస్తోంది. హెచ్యూఎల్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, యస్ బ్యాంకు, కొటక్ మహింద్రాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపీ కొంత కరెక్షన్ కు గురైంది. గురువారం ముగింపుకు 6 పైసలు నష్టంలో 64.27 వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా భారీగా 307 రూపాయల మేర పడిపోతూ 29,133 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement
Advertisement