
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 102.15 పాయింట్లు లేదా 0.44 శాతం తగ్గి 22,929.25 వద్ద ముగిసింది. ఈ రోజు ఈ ఇండెక్స్ గరిష్టంగా 23,133.7 వద్ద, కనిష్టంగా 22,774.85 వద్ద నమోదైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 199.76 పాయింట్లు లేదా 0.26 శాతం తగ్గి 75,939.21 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టం 76,138.97, కనిష్టం 75,439.64 వద్ద నమోదైంది.
బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా లాభాలను అందుకోగా, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్, సన్ ఫార్మా షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి.
భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్న సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి.
నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ శుక్రవారం అధికారికంగా 'బేర్' దశలోకి ప్రవేశించింది. ఇండెక్స్ దాని గరిష్ట స్థాయి 19,716.20 నుండి దాదాపు 22 శాతం పడిపోయింది. శుక్రవారం ఇండెక్స్ దాదాపు 4 శాతం నష్టపోయి 15,373.70 స్థాయిల వద్ద ముగిసింది. శుక్రవారం నాటి పతనం విస్తృత మార్కెట్లలో అంతటా అమ్మకాల ఒత్తిడితో జరిగింది. దీంతో మిడ్‌క్యాప్‌లు కూడా బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 2.5 శాతం నష్టపోయి 18,325.40 స్థాయిల వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment