![Stock Market updates On Febraury 12](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/stock%20markt002.jpg.webp?itok=LYsjFOft)
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,045 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 122 పాయింట్లు దిగజారి 76,171 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్‌లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమయ్యాయి.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, జొమాటో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment