
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్ళీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 223.97 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో.. 76,069.63 వద్ద, నిఫ్టీ 105.85 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 22,965.95 వద్ద సాగుతున్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైనవి నష్టాల్లో సాగుతున్నాయి.

అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు వసరుసగా నష్టాలనే చవి చూస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment