భారత్ లో ఇంగ్లిష్ కు సొగసులెక్కువ! | Invest more in teachers' training than technology, says Andy Curtis professor | Sakshi
Sakshi News home page

భారత్ లో ఇంగ్లిష్ కు సొగసులెక్కువ!

Published Tue, Aug 12 2014 12:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

భారత్ లో ఇంగ్లిష్ కు సొగసులెక్కువ!

కోల్ కతా:ఇంగ్లండ్ లో మాట్లాడే ఇంగ్లిష్ కంటే భారత్ లో మాట్లాడే ఇంగ్లిష్ భాషకు సొగుసులు ఎక్కువని బ్రిటీష్ విద్యావేత్త ఆండీ కర్టీస్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ (భారత్)లో ఇంగ్లిష్ కు మాధుర్యం ఎక్కువ.  ఇంగ్లండ్ లో ఉచ్ఛరించే దానికంటే భారత్ లో ఇంగ్లిష్ ఉచ్ఛారణ మాత్రం అందగా  ఉంటుందని తెలిపారు. కాలిఫోర్నియాలోని ఆంథేమ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆయన సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. 'స్కూల్ టీచర్ల ట్రైనింగ్ కు ఎక్కువ పెట్టుబడులు పెట్టండి. ప్రస్తుతం భారత్ లో టెక్నాలజీ మీద అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. ముందు టీచర్లను తయారు చేయండి' అని ఆయన హితవు పలికారు.

ఉపాధ్యాయ శిక్షణకు ప్రాధాన్యత ఇస్తే.. అది టెక్నాలజీ అభివృద్ధికి దోహం చేస్తుందన్నారు.  దీంతో పాటు ఇంగ్లండ్  వీధుల్లో వినిపించే భాషను.. భారత్ లో మాట్లాడే ఇంగ్లిష్ ను పోల్చారు. భారత్ లో మాట్లా డే ఇంగ్లిష్ చక్కగా, వినసొంపుగా ఉంటుదన్నారు. ఈ విషయాన్ని పలువురు శాస్త్రవేత్తలు ఆహ్వానించారు. భాష అనేది చాలా ముఖ్యమైనదని, ఏ విషయంలోనైనా పరిజ్ఞానం సంపాదించాలంటే భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవీ కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దూసుకుపోతున్నప్రపంచాన్నిఅందిపుచ్చుకోవాలంటే ప్రజలకు ఇంగ్లిష్ ను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement