సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. లగచర్ల ఘటనలో రిమాండ్‌ను కొట్టివేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం.. ప్రస్తుతం చర్లపలి జైలులో ఉన్నారు.
లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో పట్నం నరేందర్ రెడ్డి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నరేందర్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
పట్నం న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ..
- పట్నం నరేందర్‌ది అక్రమ అరెస్ట్..
- ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసోడింగ్స్ ఫాలో కాలేదు..
- ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు..
- 11వతేదీన ఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేడు.
- సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.
- 11వ తేదీన కేవలం ఒకే ఒకసారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.
- సుప్రీంకోర్టు తీర్పులను పోలీసులు ఉల్లఘించారు.
- సుప్రీంకోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదు
- అరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారు.
- అదుపులోకి తీసుకున్న పోలీసులు కన్ఫెషన్ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు
- పోలీసులకు నచ్చింది రాసుకునీ అదే కన్ఫెషన్ రిపోర్ట్ అని కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ..
- లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరించేందుకు కుట్ర చేశారు.
- కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారు.
- అన్నింటికీ ప్రధాన సూత్రదారి పట్నం నరేందర్ రెడ్డి.
హైకోర్టు ప్రశ్న..
- నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించిన హైకోర్టు..
- తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని పీపీ చెప్పుకొచ్చారు.
- ఎవరు అనుచరులు అతని హోదా? ఏంటని కోర్టు ప్రశ్న.
పీపీ వాదనలు..
- సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు
- ఘటన జరిగిన రోజు సురేష్, నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారు.
- అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని ప్రశ్నించిన హైకోర్టు..
- కేటీఆర్ పార్కులో ఒక మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారన్న హైకోర్టు..
- పార్కులో అరెస్ట్ చేయలేదని తన ఇంట్లో అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపిన పీపీ..
- సుప్రీం తీర్పులను ఎందుకు పాటించలేదన్న హైకోర్టు.
- ఈ కేసులో కుట్ర కోణం ఉంది చాలా విషయాలు బయటకు వచ్చాయి అన్న పీపీ.
- ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును కోర్టు వాయిదా వేసింది. రిజర్వ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment