గుంటూరు, సాక్షి: నిత్య అబద్ధాలు.. పాలనలోనూ గారడీ చేస్తున్న కూటమి సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ నిలదీయనున్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మధ్యాహ్నాం మీడియా ద్వారా మాట్లాడనున్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలన మొదలుపెట్టింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ఒకవైపు వైఎస్సార్‌సీపీపై ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తూనే.. మరోవైపు కీలక హామీల విషయంలో ప్రజలను మోసం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐదు నెలలు గడిచినప్పటికీ ఎన్నికల హామీల్లోని ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా.. జగన్ పాలనలో సమర్థవంతంగా సాగిన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పోతోంది.
రైతులు, విద్యార్థులు, ఆడపడుచులు.. ఇలా అన్నివర్గాలు బాబు సర్కార్ చేతిలో మోసపోతున్నారు. జగన్ హయాంలోని సంక్షేమ లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిస్తూ వస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. గత వైఎస్సార్‌సీపీ పాలనపై అడ్డగోలుగా ఆరోపణలు గుప్పిస్తూ కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటిని తోడు.. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ కూటమి ప్రభుత్వ కుట్రల పర్వం కొనసాగుతోంది.
కనీసం అసెంబ్లీలో అయినా గళం వినిపించే అవకాశం లేకపోవడంతో మీడియా చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తున్నారు వైఎస్ జగన్. గత సమావేశంలో బడ్జెట్ లెక్కలను తీసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడి.. చంద్రబాబు సర్కార్‌కు పలు ప్రశ్నాస్త్రాలు సంధించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment