
విడాకులు.. రీసెంట్ టైంలో సినీ ఇండస్ట్రీలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది.

చాన్నాళ్లుగా కలిసున్న పలువురు స్టార్ సెలబ్రిటీలే విడిపోవడం చాలామందికి షాక్.

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 29 ఏళ్ల బంధానికి పుల్‌స్టాప్ పెట్టాడు.

ఇతడి భార్య సైరా భాను లాయర్లు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

అంతకు ముందు తమిళ హీరో జయం రవి.. 15 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశాడు.

భార్య ఆర్తికి విడాకులు ఇచ్చేశాడు. మరో అమ్మాయితో రిలేషన్ జయం రవి విడాకులకు కారణమని టాక్.

18 ఏళ్ల బంధాన్ని వద్దనుకుని తమిళ హీరో ధనుష్ కూడా భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చాడు.

రెండేళ్ల క్రితమే ఇది జరగ్గా.. మళ్లీ ధనుష్-ఐశ్వర్య కలిసి ఛాన్స్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్.. తన భార్య సైంధవికి ఈ మధ్యే విడాకులు ఇచ్చేశాడు.

2013లో వీళ్లు పెళ్లి చేసుకోగా.. వ్యక్తిగత కారణాలతో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు.

నాలుగేళ్ల క్రితం హీరో నాగచైతన్య కూడా సమంతకు విడాకులు ఇచ్చాడు.

ఇన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న చైతూ.. మరికొన్ని రోజుల్లో హీరోయిన్ శోభితని పెళ్లాడబోతున్నాడు.

కన్నడ యంగ్ హీరో యువరాజ్ కుమార్ కూడా భార్యకు కొన్నినెలల క్రితం విడాకులు ఇచ్చాడు.

నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్-అభిషేక్ కూడా విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ కొన్నాళ్లుగా వైరల్ అవుతూనే ఉంది.