శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.పంచమి రా.8.33 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పునర్వసు రా.7.07 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.7.05 నుండి 8.41 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.25 నుండి 12.13 వరకు, అమృతఘడియలు: సా.4.34 నుండి 6.21 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.11, సూర్యాస్తమయం: 5.20.
మేషం.....కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సన్మానాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
వృషభం....ఆదాయానికి మించి ఖర్చులు. బ«ంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.
మిథునం....నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం...దూరప్రయాణాలు. «బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.
సింహం....ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.
కన్య...ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
తుల....ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృశ్చికం....దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.
ధనుస్సు...ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
మకరం....కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.
కుంభం...రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మీనం....పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.
Comments
Please login to add a commentAdd a comment