గత రెండు మూడు రోజులుగా నయనతార-ధనుష్ వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 3 సెకన్ల ఫుటేజీ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయడం ఏంటా అని నయన్ అడగడంతో ధనుష్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మరోవైపు ఈమె అభిమానులు.. తామేం తక్కువ కాదన్నట్లు పాత విషయాల్ని తవ్వి తీస్తూ ఏందిరి ఈ పంచాయతీ అనేలా చేస్తున్నారు.
ఈ కాంట్రవర్సీ అలా ఉంచితే నయనతార జీవితం, పెళ్లి గురించి తీసిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ద లైఫ్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్ సోమవారం రిలీజైంది. ఏదో అంతంత మాత్రంగానే ఉందనే రివ్యూస్ వచ్చాయి. అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన మహేశ్ బాబు.. మూడు లవ్ ఏమోజీలతో ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.
(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)
నయన్ డాక్యుమెంటరీ మహేశ్‌కి అంత నచ్చేసిందా? షూటింగ్ లేకపోయేసరికి ఫుల్ ఖాళీగా ఉన్నట్లున్నాడు? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలని కూడా వదలకుండా రివ్యూస్ ఇచ్చేస్తున్నాడుగా అనే ఫన్నీ సెటైర్లు నుంచి స్వయంగా అతడి అభిమానుల నుంచే వస్తున్నాయి.
ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్ అవుతున్న మహేశ్ బాబు.. మొన్నటివరకు గడ్డంతో కనిపించాడు. తాజాగా కీరవాణి కొడుకు ప్రీ వెడ్డింగ్‌లో క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.
(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)
Comments
Please login to add a commentAdd a comment