
సాక్షి, నిజామాబాద్: దక్షిణ కాశీగా పేరున్న నీలకంఠేశ్వరాలయంలో జరిగిన ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. ఒకవైపు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో దేవుడి విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా.. ఈవో(ఎండోమెంట్ ఆఫీసర్) జలకాలాటకు దిగాడు.
నాలుగు ఆలయాలకు ఇంఛార్జిగా పని చేస్తున్న ఈవో వేణు.. పుష్కరిణిలో ఈత కొట్టాడు. ఆ సమయంలో వద్దని అర్చకులు వారిస్తున్నా.. ఆయన వినిపించుకోలేదు. అయితే అక్కడే ఉన్న కొందరు అదంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆలయంలో అపచారం జరిగిందంటూ ఈవో వేణుపై మండిపడుతున్నారు పలువురు.
Comments
Please login to add a commentAdd a comment