ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
Published Sat, Aug 13 2016 9:33 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
ఓదెల : మండలంలోని పొత్కపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి సిరిశేటి రాము(11) శనివారం ఊరకుంటలో మునిగి మృతిచెందాడు. పాఠశాలకు సెలవు కావటంతో ఈత కోసం మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. మిషన్ కాకతీయ పథకంలో ఇటీవల చెరువలో పూడిక తీశారు. ఆ గుంతల్లో నీరు ఉండడంతో రాము ఈత కొట్టేందుకు దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి ఊపిరాడక మృతిచెందాడు. ఎస్సై టి.శంకరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement