జిల్లాలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితో పాటు ఎండలు కొనసాగుతున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితో పాటు ఎండలు కొనసాగుతున్నాయి. ఆదివారం తనకల్లు, అగళి, మడకశిరలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా రొద్దం 12.5 డిగ్రీలు, బెళుగుప్ప, అమరాపురం 12.9 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగింది.
చెన్నేకొత్తపల్లిలో 37.2 డిగ్రీల గరిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 32 నుంచి 35 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 62 నుంచి 82, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ విభాగం నివేదిక తెలియజేసింది.