Man Cuts Young Man Genitals in Madakasira Over Extramarital Affair - Sakshi
Sakshi News home page

ఒకే మహిళతో ఇద్దరు వివాహేతర సంబంధం.

Published Sun, Oct 30 2022 7:57 AM | Last Updated on Mon, Oct 31 2022 8:06 PM

man cuts Young man Genitals in Madakasira over extramarital affair - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, సత్యసాయి జిల్లా(మడకశిర): పురుషాంగాన్ని కోసిన కేసులో నిందితుడిని మడకశిర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను శనివారం మడకశిర పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగేంద్ర వెల్లడించారు. మడకశిరలోని పాత, కొత్త ఎస్సీ కాలనీలకు చెందిన బాలకృష్ణ, నాని.. ఒకే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో నానిపై కక్ష పెంచుకున్న బాలకృష్ణ ఎలాగైనా అతణ్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల 21న రాత్రి మడకశిరలోని ఓ థియేటర్‌ వద్దకు నానిని రప్పించుకున్నాడు. అనంతరం థియేటర్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఇద్దరూ కలసి మద్యం సేవించారు. మద్యం మత్తులో నానితో గొడవ పడిన బాలకృష్ణ పక్కనే ఉన్న ఖాళీ సీసాతో నాని తలపై బలంగా కొట్టాడు. కట్టెలతో దాడి చేశాడు. ఘటనతో నాని స్పృహ కోల్పోయాడు.

అనంతరం అక్కడే పడి ఉన్న గాజు ముక్కలు తీసుకుని దారుణంగా దాడి చేసిన బాలకృష్ణ పరారయ్యాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం ఉదయం వడ్రపాళ్యం వద్ద తచ్చాడుతున్న బాలకృష్ణను గుర్తించి అరెస్ట్‌ చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement