
సాక్షితో కిరీటీ
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 హౌస్ నుంచి ఇటీవల ఎలిమినేట్ అయిన కిరీటి దామరాజు ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిపాడు. మంగళవారం సాక్షితో మాట్లాడుతూ.. హౌస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన అంచనా ప్రకారం రోల్‌రైడా లేక అమిత్ ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. తన ఎలిమినేషన్‌కు గల కారణాలు తెలియదని, అది ప్రేక్షకులకే తెలియాలన్నాడు. కౌశల్‌తో జరిగిన ఘటనపై స్పందిస్తూ.. ఇది ఇంత సీరియస్ అవుతుందని ఊహించలేదని, టాస్క్‌లో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా నచ్చని వ్యక్తిని విసగించవచ్చని టాస్క్‌లో ఉందని, తేజస్వీతో కౌశల్ గొడవ పెట్టుకోవడం తనకు నచ్చకపోవడంతో అలా చేశానన్నాడు. అతన్ని విసిగించే ముందు ఏదైన మాట్లాడి చేయాలనిపించందన్నాడు. కానీ ప్రేక్షకులు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని, కౌశల్ తనకు మంచి స్నేహితుడని కిరీటీ చెప్పుకొచ్చాడు. ఇక టాస్క్‌లతో చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు. ముఖ్యంగా చెరుకు రసం టాస్క్ తమ సహనానికి పరీక్షగా నిలిచిందన్నాడు. బయట చెరకు రసంతో ఎవరైనా కనిపిస్తే వారికి దండం పెడుతానని కూడా చెప్పుకొచ్చాడు. కామన్ మ్యాన్ గణేశ్ మూడో వారంలో రాణించడానికి తానే కారణమని, తనే టీమ్ కావడంతో కెప్టెన్‌గా ప్రోత్సహించానని కిరీటి పేర్కొన్నాడు. కిరీటి కౌశల్ పట్ల వ్యవహరించిన తీరుతోనే అతను ప్రేక్షకుల దృష్టిలో విలన్ అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment