బిగ్‌బాస్2.. అదే జరిగింది
బిగ్‌బాస్2 ఏదైనా జరగొచ్చు.. అవును.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. ప్రేక్షకుల అసహనానికి గుడ్ బై చెప్తూ.. అందరూ అనుకున్న విధంగా కాకుండా ఈ సారి బిగ్‌బాస్ కన్ను ఓ సామాన్యుని మీద నుంచి సెలబ్రిటీల మీదకు మళ్లింది. సామాన్యుడు గణేష్‌కు బదులుగా సెలబ్రిటీ కిరీటి దామరాజు ఎలిమినేషన్‌తో షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఉహించటం ఇప్పుడు కొంచెం కష్టంగా మారింది. ఇప్పటి వరకు ఇద్దరు సామాన్యులు సంజన, నూతన్ నాయుడు బిగ్‌బాస్ షో నుంచి బయటకు రావటంతో ఈ సారికూడా ఓ సామన్యుని పని అంతే అనుకున్నారు అంతా.. కానీ అందుకు భిన్నంగా కిరీటి బయటకు రావటంతో గణేష్ సేఫ్ అయ్యాడు. మొదట్లో బిగ్‌బాస్ తిక్కేంటో అర్థంకాక ప్రేక్షకులు కొంచెం తికమక పడ్డారు. మూడు వారాల తర్వాత తిక్కకు లెక్కను.. అందరి లెక్కలను తేలుస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న.. తర్వాత ఎవరు?
అసలేం జరిగింది..
ఇక ప్రతీవారం ఎలిమినేషన్ ప్రక్రియలో సామాన్యులను టార్గెట్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసిన హౌస్‌మెట్స్ మళ్లీ ఈ సారి కూడా కామన్ మ్యాన్ గణేశ్‌నే టార్గెట్ చేశారు. ఇక గణేశ్ హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయి ప్రజల మద్దతుతో హౌస్‌లో కొనసాగుతున్నాడు. ఈ సారీ ఇక అతనికి చాలా మాద్దతు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సామాన్యుడు హౌస్‌లో ఉండాలని ప్రతీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు. దీంతోనే అతను హౌస్‌లో కొనసాగే అవకాశం ఉంది.ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో సింగర్ గీతా మాధురి, తేజస్వీ, భానుశ్రీలకు సైతం ప్రేక్షకుల మద్దతు లభించనుంది. తేజస్వీ హౌస్‌లో ప్రేక్షకులకు కావాల్సిన మంచి మసాల అందిస్తుండగా.. సింగర్ గీతా మాధురి పెద్దక్క పాత్ర పొషిస్తోంది. ఇక భాను శ్రీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసిరానుంది.
ఆమెకు మద్దతుగా ఫేస్‌బుక్‌లో విపరీత ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారం కిరీటి దామరాజు ఎలిమినేషన్ తప్పేట్లేదు. గత సీజన్‌తో బిగ్‌బాస్‌తో ప్రేక్షకాదరణ పొందిన, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన ఫేస్ బుక్‌లో ‘ఈ వారం కిరీటి బిగ్ బాస్2 నుంచీ వెళ్లిపోతాడేమో...అని నా ఫీలింగ్!’ అని పేర్కొన్నాడు. చివరకు కిరీటి తన చేతులారా చేసుకున్న పని.. అందరికి దూరం అవ్వటం. ఇదే అతనికి పెద్ద మైనస్‌గా మారింది. హౌస్‌లో ఉన్నంత సేపు గొడవలు పడుతూ.. గొడవలు పెడుతూ.. తన గొయ్యి తానే తొవ్వుకున్నాడు. కిరీటి ప్రవర్తనతో విసుగు చెందిన తోటి కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌తో ఇంటి నుంచి సాగనంపారు. ఏం చేస్తేం చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నారు పెద్దలు
Comments
Please login to add a commentAdd a comment