మడకశిర రూరల్ : మడకశిర ఆరేపేటలో నివాసముంటున్న కలీం భార్య నజియాబాను(23)అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం తరచూ తమ బిడ్డను వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ముందస్తు పథకం ప్రకారం నజియాబానును హతమార్చి, ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బానుది మూమ్మటీకి హత్యేనని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కాగా అత్తమామలు పరారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.