Maunadiksha
-
మాకు ఎన్నాళ్లీ శిక్ష?
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న తమను ఒకేచోటుకు బదిలీ చేయాలంటూ 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు పిల్లలతో కలసి సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లు ఎక్కించడాన్ని ఉపాధ్యాయ దంపతులు తీవ్రంగా ప్రతి ఘటించారు. గాంధీ జయంతి సాక్షిగా ఈ తరహా పోలీసు దౌర్జన్యం సరికాదంటూ నినదించారు. 317 జీవో అమల్లో భాగంగా గతేడాది ఉపాధ్యాయ భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో కొన్ని జిల్లాల స్పౌజ్ కేసులను పరిష్కరించారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్‌ల బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తాము తీవ్ర మనోవేదనతో ఉన్నామని, కిలోమీటర్ల దూరంలో భార్య ఒకచోట, భర్త ఒకచోటపనిచేయడం సమస్యగా మారిందని, పిల్లల ఆలనాపాలన చూసే దిక్కులేకుండా పోయిందని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మౌనదీక్షకు దిగారు. మాకెందుకీ అన్యాయం గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టారు. ఇంకా 1500 మంది బదిలీలకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను సానుభూతిలో పరిష్కరించాలి. – నరేశ్, స్పౌజ్ ఫోరంకో–కన్వీనర్ మానసిక క్షోభకు పరిష్కారం లేదా? గత 22 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు బదిలీల్లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం లేదా అనే అనుమానం కలుగుతోంది. పెద్ద మనసుతో వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. – వివేక్, స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
పాలకుల పట్ల అప్రమత్తంగా ఉండండి
రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్ రఘువీరా హెచ్చరిక మడకశిర : హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా లేకుంటే పాలకుల చేతిలో మోసపోవడం ఖాయమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉగాది పండుగ సందర్భంగా బుధవారం మడకశిరలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద లౌకికవాద పరిరక్షణ, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు మౌనదీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి రైతుల ఆత్యహత్యలు పెరుగుతున్నా, నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో లౌకికవాదానికి ముప్పు ఏర్పడిందన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు అభద్రతాభావంతో జీవనం సాగిస్తున్నారని, హిందువులకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. మౌనదీక్షలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురంగలనాగరాజు, మండల కన్వీనర్ మంజునాథ్, పట్టణ కన్వీనర్ నాగేంద్ర, మాజీ మండల కన్వీనర్ ఆశ్వర్థనారాయణ, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.