మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులతో పాటు ఇంకా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌ను కోరింది. సంఘం ప్రతినిధులు వివేక్, ఖాదర్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు ఆదివారం మంత్రులను కలిసి, ఈమేరకు వినతి పత్రం సమర్పించారు.
ఇటీవల 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్‌లను బదిలీ చేశారని, ఇంకా కొన్ని బదిలీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపి వేశారని వివరించారు. ఉపాధ్యాయి నులు 200 కిలోమీటర్లు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment