teachers association
-
సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు
-
గూడు చెదిరి.. గుండె పగిలి..
ఖమ్మం: శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో.. దుండగుల బారి నుంచి సమాజాన్ని కాపాడటంలో పోలీసులదే కీలక పాత్ర. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ప్రజారక్షణ కోసం పరి తపిస్తూ.. ఓ వైపు లా అండ్ ఆర్డర్.. మరోవైపు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో దంపతులిద్దరూ కూడా సేవలందించేవారున్నారు. అలాంటి వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఉద్యోగం ఉందన్న ఓ ఆశ తప్పితే వారి జీవితంలో సుఖసంతోషాలు కరువై నరకయాతన అనుభవిస్తున్నారు. భర్త ఒకచోట.. భార్య మరోచోట.. వారి పిల్లలు ఇంకోచోట.. ఇలా గూడు చెదిరిన పక్షుల వలె స్పౌజ్ పరిధిలోని కానిస్టేబుళ్లు కన్నీళ్లను దిగమింగుకుని విధులకు హాజరవుతున్నారు. కుటుంబం, విధులు అనే రెండింటి మధ్య తల్లడిల్లుతూ ఆగమ్యగోచరంగా మారిన తమ తలరాత ఎప్పుడు మారుతుందోనంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. 317 జీఓతో చెల్లాచెదురు తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 2021లో తీసుకొచ్చిన 317 జీఓ పోలీస్ శాఖలో ఒకే జిల్లాలో పనిచేసుకుంటున్న దంపతులకు శాపంగా మారిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దంపతులు చెరో జిల్లాలకు బదిలీ అయ్యారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేయడంతో భార్య ఒకచోట, భర్త మరోచోట విధులు నిర్వర్తిస్తూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి ఆలనా, పాలన, చదువు, ఇలా ప్రతిదీ కష్టంగా మారడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలంటే ఆ బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులిద్దరూ పోలీసులే.. కానీ.. ఉద్యోగమున్నా అటు పిల్లలను చూసుకోలేక, ఇటు కుటుంబాన్ని పట్టించుకోక దంపతులిద్దరూ బాధను దిగమింగుకుంటూ విధులకు హాజరవుతున్నారు. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్నా సంతోషం కరువైందని, కుటుంబం దగ్గరగా లేకపోవడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కనీసం కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కరుణ చూపి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. పిల్లల భవిష్యత్‌ను అర్థం చేసుకుని తమకొక దారిచూపాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల మాదిరి కరుణ చూపండి.. క్రమబదీ్ధకరణ సమయంలో ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్ లిస్టులో ఉంచి దంపతులైన ఉద్యోగుల బదిలీలను నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. గత నెల 26న విద్యాశాఖ 13 జిల్లాల్లోని దంపతులైన ఉపాధ్యాయులను (స్పౌజ్) ఒకే జిల్లాకు బదిలీ చేసింది. అయితే ఎస్జీటీల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్పౌజ్ పరిధిలోని ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని పోలీసులు ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలో స్పౌజ్ కింద పనిచేసే వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది ఉంటారు. బదిలీ అవకాశం కల్పించమని దరఖాస్తు చేసుకొని సంవత్సరం దాటినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇబ్బంది ఉందని సిక్ లీవ్, ఎర్న్ లీవ్స్ అడిగినప్పటికీ బందోబస్తు ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో సెలవులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. అసలే సెలవులు లేని ఉద్యోగం, పిల్లలను చూసుకునేందుకు ఒక పూట అనుమతి తీసుకుని ఇంటికి బయలు దేరినా మార్గమధ్యలో ఎమర్జెన్సీ డ్యూటీ అని ఫోన్ వస్తే కుటుంబాన్ని చూడకుండానే వెనుదిరిగే పరిస్థితి ఉందని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. పోలీసులు మినహా మిగతా ఉద్యోగులకు తమకేమైనా సమస్య వస్తే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతారు. కానీ పోలీసులకు అలాంటి పరిస్థితి ఉండదు. యూనిఫాం వేసుకున్న రోజే వారు ఆ హక్కును కోల్పోతారు. ప్రభుత్వం తమ దీనగాథను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో భార్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇటీవల రెండు సంవత్సరాలు వయసు కలిగిన చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచి్చంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు విధి నిర్వహణలో ఉండడం, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ చేసి చెప్పగా వారు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. నాలుగైదు గంటల తర్వాత వారు ఆసుపత్రికి వెళ్లాల్సి వచి్చంది. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేరి్పంచలేక, మరోవైపు విధులను వదిలేసి రాలేక వారు నరకయాతన అనుభవించారు. -
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులతో పాటు ఇంకా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌ను కోరింది. సంఘం ప్రతినిధులు వివేక్, ఖాదర్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు ఆదివారం మంత్రులను కలిసి, ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్‌లను బదిలీ చేశారని, ఇంకా కొన్ని బదిలీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపి వేశారని వివరించారు. ఉపాధ్యాయి నులు 200 కిలోమీటర్లు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు వినతి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్, ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు మంగళవారం మంత్రిని హైదరాబాద్‌లో కలిశారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. -
జీవో 317ను సవరించే వరకు ఉద్యమం ఆగదు
కవాడిగూడ (హైదరాబాద్): ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎన్) ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిర్వ హించిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. టీపీ యూఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరా కరించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు దశలవారీగా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నాకు హాజరు కాగా వారిని ఇందిరాపార్కు చౌరస్తాలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఓ దశలో ఉపాధ్యాయులు ధర్నాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద బైఠాయించి ప్లకార్డులతో ప్రభుత్వానికి, జీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయులను అరెస్టుచేయడంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహాధర్నాకు మద్దతు తెలపడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ రాం చందర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపా ధ్యాయుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధం గా లేదని కొందరి లబ్ధికోసమే జీవో 317ను తీసు కొచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హను మంతరావు మాట్లాడుతూ 317జీవోను వెంటనే సవరించాలని డిమాంద్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మల్లికార్జున్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జీవో 5ను యథావిధిగా అమలు చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పించాలని, అందుకోసం జీవో 5ను యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే జీవో నంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, జాక్టో చైర్మన్ సదానంద్‌గౌడ్ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన పోరాటాలకు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. దేశంలో నేటికీ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చట్టసభల్లో ప్రస్తావించడంతోపాటు ప్రత్యక్షంగా చేసే పోరాటాల్లో కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారు. -
నటి జ్యోతికపై ఫిర్యాదు
చెన్నై ,పెరంబూరు: నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రాక్షసి. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ చిత్రంలో ఉపాధ్యాయులు పిల్లలకు సరిగా పాఠాలు బోధించకుండా కథల పుస్తకాలు చదుకుంటున్నట్లు, సెల్ఫోన్లతో కాలం గడపడం వంటి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా విద్యార్థులు సిగరెట్లు తాగడం, గొడవలు పడడం లాంటి సన్నివేశాలు పొందుపరిచారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే అధిక వేతనాలు తీసుకుంటున్నారని, అయినా విద్యార్థులపై సరిగా దృష్టి పెట్టకపోవడం వల్లే వారు వైద్య విద్య లాంటి ఉన్నత చదువులు చదవలేకపోతున్నారనే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కాగా రాక్షసి చిత్రంలోని ఇలాంటి సన్ని వేశాలు నిజాయితీగా పని చేసే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కించపరచేవిగా ఉన్నాయన్న విమర్శలు తలెత్తాయి. దీంతో తమిళనాడు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీకే.ఇళమారన్ ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రాక్షసి చిత్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అందులో నటి జ్యోతిక నటించిన రాక్షసి చిత్రంలో ఉపాధ్యాయుల వల్లే దేశం నాశనం అవుతోందన్నట్లు సంభాషణలు, సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. ఇది ఉపాధ్యాయులందరినీ కించపరచే చర్యగా పేర్కొన్నారు. కాబట్టి రాక్షసి చిత్రంపై నిషేధం విధించాలని, నటి జ్యోతిక, చిత్ర యూనిట్‌పై చర్యలు చేపట్టాలని కోరారు. -
ఇక పోరు బాటే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న 42 ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ చిలగాని సంపత్ కుమారస్వామి ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ధర్మాగ్రహసభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉన్న జేఏసీ నేతల స్వార్థం వల్లే సమస్యలకు పరిష్కారం లభించలేదన్నారు. అందుకే 83 సంఘాలను ఏకం చేసి కొత్త జేఏసీని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పాత జేఏసీ నేతలను ఇకపై పక్కన పెట్టి తమ జేఏసీ ఆధ్వర్యంలో క్రియాశీల పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రధానంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలన్న 42 ప్రధాన సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యామని పేర్కొన్నారు. గత జేఏసీ నేతల నిర్వాకం కారణంగా రోటీన్‌గా రావాల్సిన వాటిని కూడా పోరాటం చేసి సాధించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వమే జూన్ 2వ తేదీన ఐఆర్ ఇస్తామన్నదని, అది ఇవ్వకపోగా ఆగస్టు 15న పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించి, ఆ తరువాత పక్కనపెట్టేసిందన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉన్నట్లుగానే ఉద్యోగులు, పెన్షనర్ల సమ్యలపై చట్టసభల్లో చర్చించేందుకు వీలుగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు మాట్లాడుతూ ఒక శాతం ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లతో అయ్యేది ఏముందన్న భావనకు ప్రభుత్వం రావడం వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బతిందని, అందుకే పోరాటానికి దిగాల్సి వచ్చిందన్నారు. రాబోయే ప్రభుత్వాలు తమ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ సంకల్పం తీసుకోవాలన్నారు. ఈ సభ తరువాత తమ ఉద్యమం ఎలా ఉంటుందో.. కల్తీ లేని నాయకత్వం ఎలా పని చేస్తుందో తెలుస్తుందన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయం... ఏ ప్రభుత్వం వచ్చినా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిలబడుతామని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. సీపీఎస్ రాష్ట్ర పరిధిలోని సమస్యే అయినా కేంద్రంపై నెట్టేశారన్నారు. సీపీఎస్ అమలు చేయడం, ధర్నాచౌక్ ఎత్తివేయడం, హామీలను నిలబెట్టుకోకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, పీఆర్సీ సిఫారసులను అమలు చేయకపోవడమే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల సమాఖ్య చైర్మన్ బాసబత్తిని రాజేశం మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హౌసింగ్ శాఖలో 1,100 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిందన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు వచ్చే ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని 2.68 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ శుభాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమైనా తెలంగాణ ఇంక్రిమెంటు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. జేఏసీ గౌరవ సలహాదారు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్యోగుల సమస్యలనే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేస్తే పాలాభిషేకం చేస్తామని పాత జేఏసీ నేతలు అన్నారని, దాని పర్యవసానాలను మాత్రం ఆలోచించలేదన్నారు. సభలో జేఏసీ నేతలు రఘునందన్, నిర్మల, బాలస్వామి, రాములు, కమలాకర్, కేజీ టు పీజీ జేఏసీ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎస్ రద్దు కోసం సంతకాల సేకరణ నిర్వహించారు. ధర్మాగ్రహసభ చేసిన ప్రధాన తీర్మానాలివీ.. – సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి – సీఎం హామీ మేరకు 43 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలి – పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి – 2014 జూన్ 2 నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంటు వర్తింపజేయాలి – పెన్షనర్లందరికీ తెలంగాణ ఇన్సెంటివ్ ఇవ్వాలి – 70 ఏళ్లు దాటిన వారికి క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలి – ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు చర్యలు చేపట్టాలి – ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ తెలంగాణకు రప్పించాలి –అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి డాక్టర్లు, మందులను అందుబాటులో ఉంచాలి – ఉద్యోగి మరణించిన సందర్భంలో వారసులకు 10 రోజుల్లో కారుణ్య నియామకం కల్పించాలి -
విద్యాశాఖలో గందరగోళం !
కాళోజీ సెంటర్: లక్షలాది మంది విద్యార్థులు.. వేలాది మంది ఉపాధ్యాయులు... తల్లిదండ్రుల అశలతో ముడిపడి ఉన్న విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన అధికారులు శాఖను పట్టించుకోకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది. దీంతో విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వచ్చేది పరీక్షల కాలం. అందుకు అనుగుణంగా పరీక్షలకు విద్యార్థులు, ఉపాధ్యాయులను సమయత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను చూస్తే అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు కనపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఈఓగా బాధ్యతలు చేపట్టిన కంకటి నారాయణరెడ్డి మొదట్లో విద్యాశాఖపై దృష్టి పెట్టినప్పటికీ అదనపు బాధ్యతలతో అసలు బాధ్యతలు మరిచిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సైతం సంతకాల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. డీఈఓ తన కార్యాలయానికి చుట్టపు చూపుగా రావడంతో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఉపాధ్యాయు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహర శైలిలో వచ్చిన మార్పులపై విద్యాశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నెలల తరబడి ఫైళ్ల పెండింగ్... విద్యాశాఖ కార్యాలయం పైళ్లు నెలల తరబడి పెండింగ్ ఉంటున్నాయి. అధికారుల ఫోన్ బిల్లులకు సంబంధించిన ఫైళ్లపై కూడా డీఈఓ సంతకాలు చేయకపోవడంతో మూడు నెలలుగా అధికారిక ఫోన్లు మూగబోయాయి. దీంతోపాటు కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపాధ్యాయుల సర్వీస్ సంబంధ విషయాలకు సంబంధించిన ఫైళ్లు కూడా నెలల తరబడి కార్యాలయంలో మూలుగుతున్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివిధ పనులపై డీఈఓ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నా స్పందన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుబాటులో ఉండని డీఈఓ.. అనేక పనులపై జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేసినా స్పందన ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం కొంతమంది ఫోన్లు మాత్రమే డీఈఓ ఎత్తుతారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది డీఈఓ కార్యాలయంలో దొరకరు... ఫోన్లో పలకరు అనే ఫిక్స్ అయ్యారు. సమస్యలను పరిష్కరించే అధికారుల పనితీరు ఇలా ఉంటే ఇంకా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఎలా పనిచేస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు డీఈఓ నారాయణరెడ్డికి ప్రభుత్వం వరంగల్ అర్బన్ జిల్లా డీఈఓగా, డైట్ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ప్రస్తుతం మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో డీఈఓ ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సిబ్బంది ఫైళ్లు పట్టుకుని అర్బన్ డీఈఓ కార్యాలయం, డైట్ కళాశాల చుట్టూ తిరగడంతో సందర్శకులకు కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. కలెక్టర్‌కు జీసీడీఓ ఫిర్యాదు.. అధికారిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర అధికారులు డీఈఓ నారాయణరెడ్డికి ఇటీవల చివాట్లు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన జీసీడీఓ సంధ్యారాణిని అకారణంగా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లు దూషించడంతో ఆమె ఆవేదనకు గురై కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు కార్యాలయంలో జరుగుతున్న తంతును కలెక్టర్‌కు వివరించారు. జీసీడీఓ ఫిర్యాదు తర్వాత కొందరు మహిళా హెచ్ఎంలు డీఈఓతో వారికి జరిగిన చేదు అనుభవాలను కొంతమందితో పంచుకున్నట్లు సమాచారం. త్వరలోనే వారంతా కలెక్టర్‌కు కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. సమస్యలను చక్కదిద్దాల్సిన డీఈఓ సమస్యలను సృష్టించడంపై ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఈఓ మాత్రం పదేపదే తనకు మంత్రి అండదండలు ఉన్నాయని, తనను ఎవ్వరు ఏమి చేయారని సిబ్బందితో గర్వంగా చెప్పుకోవడం మరో విశేషం. దీంతోపాటు తనకు అనుకూలంగా ఉన్న కొందరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ల పేరిట వారికి నచ్చిన దగ్గర కొలువు చేసుకునే అవకాశం కల్పించారని, దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కొన్ని సంఘాల నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. డీఈఓ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది నిజమే.. హైదరాబాద్‌లో జరిగే మీటింగ్‌కు హాజరుకావడానకి డీఈఓ రిలీవ్ ఆర్డర్ ఇవ్వలేదు. కాబట్టి వెళ్లలేక పోయాను.రిలీవ్ ఆర్డర్ సెక్షన్ సిబ్బంది తయారు చేయాలంటే డీఈఓ ఆదేశాలివ్వాల్సి ఉంటుంది. కానీ ఆయన ఇవ్వలేదు. అందువల్లే మీటింగ్‌కు వెళ్లలేకపోయా. దీనిమీద హెడ్ ఆఫీస్ నుంచి డీఈఓకు మెమో జారీ చేశారు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ముందు నన్ను ఆయన చులకనగా మాట్లాడారు. కాబట్టి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. – సంధ్యారాణి, రూరల్ జిల్లా జీసీడీఓ -
ఉపాధ్యాయులను మోసం చేసిన కేసీఆర్
కొండపాక(గజ్వేల్) : ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పడం దారుణమని తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బాకి చంద్రభాను పేర్కొన్నారు. మండల పరిధిలోని దుద్దెడలో శుక్రవారం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను అమలు చేస్తామంటూ రెండు పేజీల వ్యాసం రాసిన ప్రభుత్వం మాట తప్పడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల జీవన్మరణ సమస్యగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయకుండా ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. జూన్ 2న ఐఆర్‌ను, ఆగస్టు 15న పీఆర్సీనీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్నారు. మోసకార్లకు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్సీలు ఇప్పటికైనా స్వార్థ రాజకీయాన్ని వదిలి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రవీందర్, నేతాజీ, రాధిక తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఎమ్మెల్సీలదే బాధ్యత: టీటీఎఫ్ కొండపాక(గజ్వేల్) : ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరి కారణంగానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి ఆరోపించారు. మండల పరిధిలోని దుద్దెడ, అంకిరెడ్డిపల్లి, బందారం, దర్గా, వెలికట్ట, మర్పడ్గ, ఖమ్మంపల్లి, సిర్సనగండ్ల, కొండపాక గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులచే శుక్రవారం సభ్యత్వ నమోదును స్వీకరించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలకడంతోనే ఏకీకృత సర్వీస్ రూల్స్, పదోన్నతులు,స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఈ సమస్యలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూర్తి బాధ్యత వహింయి రాజీనమా చేయాలని రామస్వామి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు కనకయ్య, రాములు, రవీందర్, వెంకటయ్య, లక్ష్మారెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేయకుండా అసెంబ్లీని రద్దు చేస్తారా హుస్నాబాద్: ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్‌రూల్స్‌ను రెండు పేజీల్లో రాసి అమలు చేస్తానాని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఉపాధ్యాయులకు మొండిచేయి చూపారని టీడీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ నన్నెబోయిన తిరుపతి, జిల్లా కార్యదర్శి వేముల శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం పట్టణంలో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా సీపీఎస్ రద్దు చేయకుండా శాసన సభను రద్దు చేయడం మోసమన్నారు. జూన్ 2న ఐఆర్, ఆగష్టు 15న పీఆర్సీ ప్రకటిస్తామని చేప్పిన కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారని అన్నారు. మోసకారులకు వత్తాసు పలుకుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేసి ఉపాధ్యాయుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం మండలాధ్యక్షుడు కొటిచింతల రవీందర్, నాయకులు రమేశ్, అశోక్, రాధిక, శ్రీనివాస్, రవీందర్ తదితరులు ఉన్నారు. -
మహదర్నాకు సిద్ధమవుతున్న ఏపీ ఉపాద్యయ సంఘాలు
-
ఓయూలో అంగుళం స్థలం వదులుకోం
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ భూములలో అంగుళం స్థలాన్ని కూడా వదులుకోమని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షులు ప్రొ.భట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఔటా సంయుక్త కార్యదర్శికి జరిగిన పోటీలో ప్రొ.భట్టు సత్యనారాయణ ప్యానెల్ అభ్యర్థులు డాక్టర్ దిప్లా, డాక్టర్ శ్రీరాంరామిరెడ్డి అత్యధిక ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. ఔటా అధ్యక్షునిగా ప్రొ.భట్టు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ప్రొ.మనోహార్, ఉపాధ్యక్షులుగా ప్రొ.కృష్ణయ్య, మహిళా ఉపాధ్యక్షులుగా డాక్టర్ లావణ్య, కోశాధికారిగా డాక్టర్ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విధితమే. కేవలం సంయుక్త కార్యదర్శి పదవీ జరిగిన ఎన్నికల్లో సైతం ప్రొ.భట్టు ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించారు. ఔటా విజయం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఔటా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు ప్రొ.భట్టు సత్యనారాయణ మాట్లాడుతూ... అధ్యాపకుల సమస్యలతో పాటు, యూనివర్సిటీ అభివృద్ధి, బోధన పరిశోధనలకు ఔటా కృషి చేస్తుందన్నారు. ఓయూ భూములను అంగుళం కూడా వదులుకోబోమని ప్రొ.సత్యనారాయణ పేర్కొన్నారు. క్యాంపస్‌లోని ప్రైవేటు వాహనాల నియంత్రణకు బై పాస్ రోడ్డు నిర్మిస్తే అభ్యంతరం లేదన్నారు. కానీ క్యాంపస్‌లో అక్రమంగా నివాసముంటున్న వారి కోసం ఓయూ భూములలో నివాసాలు ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామన్నారు. పేదల పై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఇతర ప్రదేశాలలో క్యాంపు వాసులకు ఇళ్లు నిర్మించాలన్నారు. గతంలో అన్యక్రాంతం అయిన ఓయూ భూములను పరిరక్షించాల్సిన బాధ్యతన ప్రభుత్వానిదే అన్నారు. -
ఆందోళనలో వేల మంది పెన్షనర్లు
♦ 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు రిటైరైన ♦ 10 వేల మంది వారికి వర్తించని ♦ పదో పీఆర్సీ గ్రాట్యుటీ పెంపు ♦ ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల చొప్పున నష్టం సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ ప్రయోజనాల వర్తింపులో వేల మంది పెన్షనర్లు అన్యాయానికి గురయ్యారు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి నాటికి రిటైరైన ఉద్యోగులకు పెరిగిన గ్రాట్యుటీ వర్తించకపోవడంతో ఒక్కొక్కరూ రూ. 4 లక్షల చొప్పున నష్టపోయారు. దీంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడినప్పటికీ పదో పీఆర్సీ సిఫార సులను కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయలేకపోయింది. దీనిపై ఉద్యోగుల ఆందోళనల ఫలితంగా 2015 మార్చి నుంచి పీఆర్సీని ఉద్యోగులకు నగదు రూపంలో వర్తింపజేసింది. అంటే 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలలపాటు పీఆర్సీని నోషనల్‌గానే (రికార్డుల్లోనే ఉంటుంది) ఇచ్చింది. కానీ గ్రాట్యుటీ విషయంలో పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పదో పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ సిఫారసుల ప్రకారం.. రిటైరైన ఉద్యోగులకు గతంలో ఉన్న రూ. 8 లక్షల గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచారు. అయితే ఈ పెంపును ప్రభుత్వం 2015 మార్చి తరువాత నుంచి రిటైరైన వారికే వర్తింపజేసింది. అంతకుముందు 9 నెలల కాలంలో రిటైరైన వారికి రూ. 8 లక్షల గ్రాట్యుటీనే వర్తింపజేసింది. దీంతో ఒక్కో రిటైర్డ్ ఉద్యోగి రూ. 4 ల క్షల చొప్పున నష్టపోయారు. ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 12 లక్షల గ్రాట్యుటీని వర్తింపజేయాలని, నష్టపోయిన గ్రాట్యుటీ ఇవ్వాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్, టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి, అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ 9 నెలల కాలంలో సుమారు 10 వేల మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేశారని...అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పెన్షనర్లకు న్యాయం చేయాలని కోరారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
అనంతపురం : అనంతపురం జిల్లాలోని నగర పాలక పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమిస్తామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే పెద్దన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం ఆందోళనకు దిగారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా కార్పొరేషన్ చేరుకుని మేయర్ స్వరూపకి వినతిపత్రం అందజేశారు. సమస్యలను మేయర్‌కి వివరించారు. ప్రధానంగా ఐదు సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. యాజమాన్యం అలసత్వ ధోరణి సర్వీసుపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఉపాధ్యాయులు నష్టపోయేలా చేస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వెంకటనారాయణ, నాయకులు బండారు శంకర్, ఎంటీఎఫ్ నాయకులు రమేష్, రాంనాయక్, ఇతర సంఘాల నాయకులు రామాంజనేయులు, రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఉస్మానియా మెడపై న్యాక్ కత్తి
రూ.150 కోట్ల్లు ఆగిపోయే ప్రమాదం సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మెడపై న్యాక్ గుర్తింపు కత్తి వేలాడుతోంది.‘ఏ’ గ్రేడ్ గుర్తింపుతో దేశంలోనే ఓ వెలుగు వెలుగుతున్న ఉస్మా నియాపై చీకట్లు కమ్ముకోనున్నాయి. పరిశోధనలకు ఏటా యూజీసీ నుంచి మంజూరవుతున్న ఫెలోషిప్‌లు, ఇత ర అభివృద్ధి పనుల కోసం ఇస్తున్న నిధులు నిలిచిపోనున్నాయి. ఇన్నోవేటివ్ యూనివర్సిటీల పథకంలో భాగంగా ఇప్పటి వరకు వర్సిటీకి మంజూరైన రూ.150 కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదముంది. అసలేం జరిగిందంటే...: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన వర్సిటీలకు న్యాక్ గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు ఉన్న వర్సిటీలకు ఫెలోషిప్‌లు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఏటా యూజీసీ అదనంగా నిధు లు మంజూరు చేస్తుంది. 2018తో వందేళ్లు పూర్తి చేసుకోనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2001లో తొలిసారిగా న్యాక్ గుర్తింపు లభిం చింది. 2008లో రెండోసారి లభించిన ఈ గుర్తింపు 2013 ఫిబ్రవరితో ముగిసింది. గుర్తింపు రెన్యూవల్ కోసం 2014 జూన్ ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా వర్సిటీ అధికారులు దీన్ని పట్టించుకోలేదు. వీసీ, ఇతర అధికారుల నిర్లక్ష్యం వల్ల న్యాక్ గుర్తింపును కోల్పోవాల్సి రావడంతో పాటు ఇప్పటి వరకు యూజీసీ నుంచి విద్యార్థులకు అందుతున్న వివిధ రకాల ఫెలోషిప్‌లు, అభివృద్ధి నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర మంత్రి దృష్టికి గుర్తింపు రగడ..: ఉస్మానియా నాక్ గుర్తింపు విషయంలో పాలక మండలి, ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్(ఔటా) మధ్య నెలకొన్న వివాదం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి వెళ్లింది. త్వరలో తానే స్వయంగా వర్సిటీని సందర్శించి, న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. -
సైన్స మెథడాలజీ టెట్ + డీఎస్సీ పేపర్ - 2
జీవశాస్త్ర మూల్యాంకనం 1. ఉపాధ్యాయుడు తను బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించగలుగుతున్నాడో తెలుసుకోవడానికి వాడే ప్రక్రియ? 1) బోధనా పద్ధతి 2) బోధనా ఉద్దేశం 3) మూల్యాంకనం 4) ఉన్ముఖీకరణ 2. మూల్యాంకనంలో పరస్పరం ఆధారపడిన అంశాల్లో.. అభ్యసనా అనుభవాలు, మూల్యాంకనం సాధనాలతోపాటు ఉండేది? 1) లక్ష్యాలు 2) బోధనోపకరణాలు 3) బోధనా పద్ధతులు 4) పరీక్షలు 3. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ, మొత్తం విద్యావ్యవస్థలో ఒక సమైక్య భాగమై విద్యకు అన్ని లక్ష్యాల తోనూ దగ్గర సంబంధం ఉంటుంది అని తెలిపినవారు? 1) కొఠారి కమిషన్ 2) మొదలియార్ కమిషన్ 3) తారాదేవి రిపోర్ట 4) రాధాకృష్ణన్ కమిషన్ 4. {పాచీన పరీక్షా విధానం కేవలం ఏ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చింది? 1) మానసిక చలనాత్మక రంగం 2) భావావేశ రంగం 3) క్రీడా రంగం 4) జ్ఞానాత్మక రంగం 5. ఒక విషయాన్ని గురించి లేదా వ్యక్తిని గురించి పరిమాణాత్మకంగా అంచనా కట్టడానికి విద్యాసంబంధమైన వాటిని గురించి మాత్రమే నిర్వహించేది? 1) మాపనం 2) మూల్యాంకనం 3) పరీక్ష 4) పైవన్నీ 6. మూల్యాంకనానికి ఒక ఆకారాన్ని ఒక అధికారాన్ని కల్పించి విద్యార్థి వర్తమాన ప్రగతిని అంచనా వేసేది? 1) పరీక్ష 2) మాపనం 3) మూల్యాంకనం 4) ఇవేవీకావు 7. నిరంతర ప్రక్రియ విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తెలియజేస్తూ, భూత, భవిష్యత్, వర్తమాన ప్రగతిని అంచనా వేసేది? 1) పరీక్ష 2) మాపనం 3) మూల్యాంకనం 4) స్లిప్‌టెస్ట్ 8. బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల సామర్థ్యాలను తెలుసు కోవడానికి ఉపయోగించే మూల్యాంకనం? 1) సంకలన మూల్యాంకనం 2) లోపనిర్ధారణ మూల్యాంకనం 3) నిర్మాణాత్మక, రూపణ మూల్యాంకనం 4) 1, 2 9. బోధన మధ్యలో విద్యార్థి అభ్యసనాన్ని అంచెలంచెలుగా తెలుసుకొని బోధనా పద్ధ తిలో మార్పులు చేసుకునేందుకు ఉపాధ్యా యుడు ఏ మూల్యాంకనం చేస్తాడు? 1) సంకలన 2) రూపణ, నిర్మాణాత్మక 3) సంకలన, రూపణ 4) లోపనిర్ధారణ 10. సంకలనాత్మక మూల్యాంకనం ఏ విధంగా జరుగుతుంది? 1) బోధనకు ముందు 2) బోధన మధ్యలో 3) బోధన పూర్తై తర్వాత 4) బోధనకు ముందు, తర్వాత 11. వార్షిక పరీక్షలను ఏ మూల్యాంకనానికి సాధనాలుగా చెప్పొచ్చు? 1) నిర్మాణాత్మక 2) సంకలన 3) లోప నిర్ధారణ 4) పైవన్నీ 12. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని అర్థం చేసు కున్న లక్ష్మీ అనే బాలిక ప్రవర్తనా సరళిని, అదే పాఠ్య విషయాలను అర్థం చేసుకున్న సీతలో ఆశించిన మార్పులకు చేపట్టాల్సిన అభ్యసనానుభవాలను నిర్ణయించే విధానం? 1) వైషమ్య విధానం 2) గుర్తింపు విధానం 3) పరీక్ష విధానం 4) విధానమేకానిది 13. ‘కణ విభజనలో క్షయకరణ విభజనకు సంబంధించిన దశలను వివరించండి?’ పై ప్రశ్న ఏ రకమైన పరీక్షల్లో వస్తుంది? 1) పరిపృచ్ఛ 2) మౌఖిక పరీక్ష 3) లక్ష్యాత్మకపరీక్ష 4) వ్యాసరూప పరీక్ష 14. ఉపాధ్యాయుడి ఆత్మాశ్రయ భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల విద్యార్థికి ఏ పరీక్షల్లో న్యాయం జరగకపోవచ్చు? 1) లక్ష్యాత్మక పరీక్ష 2) అభిరుచి శోధిక 3) వ్యాసరూప పరీక్ష 4) సహజ సామర్థ్య పరీక్ష 15. ‘ఆవరణ వ్యవస్థలో వినియోగదారులు--- పై ఆధారపడే ఉంటాయి?’ ఇది ఏ రకమైన పరీక్షల్లో వస్తుంది. 1) వ్యాసరూప 2) లక్ష్యాత్మక 3) పరిపృచ్ఛ 4) సహజ సామర్థ్య 16. ఏ పరీక్షల్లో విశ్వసనీయత ఎక్కువ? 1) ప్రశ్నావళి 2) వ్యాసరూప 3) పరిపృచ్ఛ 4) లక్ష్యాత్మక 17. లక్ష్యాత్మక పరీక్షల్లో దేనికి అవకాశం లేదు? 1) మాస్ కాపీయింగ్ 2) జ్ఞానం 3) ఉపాధ్యాయుడి ఆత్మాశ్రయత 4) విశ్వసనీయత 18. ముద్రణాయంత్రం కనిపెట్టక ముందు నుంచే ఏ పరీక్షలు ఉన్నాయి? 1) వ్యాసరూప 2) లక్ష్యాత్మక 3) ప్రశ్నావళి 4) మౌఖిక 19. డీఎస్సీ పరీక్షలు ఏ రకం పరీక్షలకు ఉదాహరణ? 1) లక్ష్యాత్మక 2) మౌఖిక 3) వ్యాసరూప 4) అభిరుచి శోధిక 20. విద్యార్థుల మానసిక ప్రవృత్తి, భావవ్యక్తీక రణ పరీక్షించడానికి తోడ్పడే పరీక్షలు? 1) వ్యాసరూప 2) లక్ష్యాత్మక 3) మౌఖిక 4) ప్రామాణీకరణం చేసిన పరీక్షలు 21. శిక్షణ సామర్థ్యం ఉన్న వ్యక్తులను ఆ సామ ర్థ్యం లేని వ్యక్తుల నుంచి వేరు చేయడానికి ఉపయోగపడేవి? 1) సమస్యా విధాన పరీక్షలు 2) సహజ సామర్థ్య పరీక్షలు 3) ప్రామాణీకరణ పరీక్షలు 4) లక్ష్యాత్మక పరీక్షలు 22. విద్యార్థికి జీవశాస్త్ర, ప్రయోగశాల్లో అమీబా నమూనాను చూపి గుర్తించమనడం ఏ పరీక్షకు ఉదాహరణ? 1) లక్ష్యాత్మక 2) సహజ సామర్థ్య 3) నిష్పాదన 4) ప్రామాణీకరణ 23. పరిస్థితిని బట్టి సందర్భానుసారంగా ప్రశ్న లను ప్రత్యక్షంగా అడగటం? 1) అనియత పరిపృచ్ఛ 2) నియత పరిపృచ్ఛ 3) సామూహిక పరిపృచ్ఛ 4) ప్రశ్నావళి 24. ఉపాఖ్యాన రికార్డు అని దేన్ని పిలుస్తారు? 1) అభిరుచి శోధిక 2) నియత పరిపృచ్ఛ 3) జీవిత సంఘటన పత్రావళి 4) ప్రశ్నావళి 25. ఒక విద్యార్థికి చెందిన నాయకత్వ లక్షణాలను అంచనా వేయడానికి ఉపకరించే సాధనం? 1) అభిరుచి శోధిక 2) చెక్‌లిస్ట్ 3) జీవిత సంఘటన పత్రావళి 4) అంచనా మాపని 26. ఈ రకం పరీక్షల్లో ప్రశ్నకు ఎదురుగా అవును, కాదు అనేవి మాత్రమే ఉంటాయి. ఇది మూర్తిమత్వ పరీక్ష? 1) లక్ష్యాత్మక 2) వ్యాసరూప 3) చెక్‌లిస్ట్ 4) అభిరుచి శోధిక 27. విద్యార్థి గురించిన పూర్తి చిత్రం సంవత్సరం వారీగా అతని వికాసం తెలుసుకునేది? 1) జీవిత సంఘటన పత్రావళి 2) అభిరుచి శోధిక 3) చెక్‌లిస్ట్ 4) క్రమాభివృద్ధి, సంచిత పత్రావళి 28. తారాదేవి రిపోర్ట పరీక్షల సంస్కరణల్లో సూచించిన ప్రకారం, ప్రశ్నపత్రంలో లక్ష్యా త్మక ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమయం? 1) 1 గంట 2) 2 బీ గంటలు 3) బీ గంట 4) 3 గంటలు 29. ఎవరైతే బోధిస్తారో వారే పరీక్షించడం ఆవశ్యకం అని వివరించిన వారు? 1) తారాదేవి రిపోర్ట 2) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 3) కొఠారి కమిషన్ 4) మొదలియార్ కమిషన్ 30. విద్యార్థుల ఫలితాలను చూపే యోగ్యతా పత్రాలు వేర్వేరు సబ్జెక్టుల్లో విద్యార్థుల నిష్పాదనాన్ని తెలిపేవిగా ఉండాలి - కానీ మొత్తం పరీక్షలో పాస్, ఫెయిల్ అని నిర్ణ యించేవిగా ఉండొద్దు అని సూచించింది? 1) కొఠారి కమిషన్ 2) తారాదేవి రిపోర్ట 3) యూజీసీ 4) మొదలియార్ కమిషన్ 31. ఉత్తమ నికషకు ఉండాల్సిన లక్షణం కానిది? 1) సప్రమాణత 2) లక్ష్యాత్మకత 3) ఆచరణాత్మకత 4) ఆత్మాశ్రయత 32. లక్ష్యాత్మక అంటే ఒక పరీక్ష పత్రాన్ని వేర్వేరు ఉపాధ్యాయులు దిద్దినప్పుడు? 1) వేర్వేరు మార్కులు రావాలి 2) ఒకే మార్కులు రావాలి 3) మొదటి ఉపాధ్యాయుడి మార్కులు పరిగణించాలి. 4)చివర దిద్దిన ఉపాధ్యాయుడి మార్కులు పరిగణించాలి 33. కింది వాటిలో ఏ పరీక్షలకు విశ్వసనీయత తక్కువగా ఉంటుంది? 1) నిష్పాదన పరీక్షలు 2) లక్ష్యాత్మక పరీక్షలు 3) వ్యాసరూప పరీక్షలు 4) పైవన్నీ 34. అన్ని పాఠ్యాంశాల్లోని అన్ని విషయాలను పరీక్షించేటట్లు పరీక్షా పత్రం ఇస్తే దానికి ఏ లక్షణం ఉందని అంటారు? 1) ఆచరణాత్మకత 2) విశ్వసనీయత 3) లక్ష్యాత్మకత 4) సమగ్రత 35. పాఠ్య విభాగాన్ని బోధించిన తర్వాత రూపొందించుకున్న బోధనా లక్ష్యాలు నెరవేరింది? 1) వార్షిక పరీక్ష 2) త్రైమాసిక పరీక్ష 3) యూనిట్ పరీక్ష 4) అర్ధసంవత్సర పరీక్ష 36. యూనిట్ పరీక్షలో నైపుణ్యానికి ఇచ్చే మార్కుల శాతం? 1) 24 2) 32 3) 12 4) 18 37. యూనిట్ పరీక్షలో కఠిన స్థాయి ప్రశ్నలకు ఇచ్చే మార్కుల శాతం? 1) 24 2) 53 3) 14 4) 100 38. యూనిట్ పరీక్షలో ప్రశ్నపత్రం రూపకల్పనలో కింది వాటిలో దేనికి ఎక్కువ మార్కులు కేటాయించాలి? 1) కఠిన స్థాయి 2) సాధారణ స్థాయి 3) తేలిక స్థాయి 4) అన్నింటికీ సమానంగా 39. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో ప్రశ్నపత్రం సప్రమాణత రూపొందించడానికి తోడ్పడేది? 1) అమోనియా ప్రింట్ 2) న్యూస్ ప్రింట్ 3) జిరాక్స్ ప్రింట్ 4) బ్లూ ప్రింట్ 40. బ్లూ ప్రింట్ తయారీలో దేనికి ప్రాముఖ్యత ఉండదు? 1) లక్ష్యాలు 2) ఉపప్రమాణం 3) ఉపాధ్యాయుల అభిరుచి 4) పరీక్షాంశ రకం సమాధానాలు 1) 3; 2) 1; 3) 1; 4) 4; 5) 3; 6) 2; 7) 3; 8) 2; 9) 2; 10) 3; 11) 2; 12) 1; 13) 4; 14) 3; 15) 2; 16) 4; 17) 3; 18) 4; 19) 1; 20) 3; 21) 2; 22) 3; 23) 1; 24) 3; 25) 4; 26) 3; 27) 4; 28) 3; 29) 2; 30) 1; 31) 4; 32) 2; 33) 3; 34) 4; 35) 3; 36) 3; 37) 1; 38) 2; 39) 4; 40) 3. -
జీవోలపై అవగాహన పెంచుకోవాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:ఉపాధ్యా య సంఘాలు, దళిత సంఘాలు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులతో నిబంధనల ను పాటించడం లేదన్న విమర్శలలో ఏ మాత్రం వాస్తవం లేదని జీవోలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రమే శ్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘా లు తనపై చేస్తున్న విమర్శలు సరైనవి కావన్నారు. 2004 జనవరి 9న జారీ అయిన జీవో నంబరు 2, 2005 ఫిబ్రవరి 17న జారీ అయిన జీవోలు 16, 18, 2004 అక్టోబర్ 19న జారీ అయిన జీవో నంబరు 76, 2007 జనవరి 24న జారీ ఆయిన జీవో నంబరు 4 ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ జీవోల ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తాను వ్యక్తిగతంగా ప్రమోషన్ల లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఈ జీవోల ఆధారంగానే ఖమ్మం, కరీంనగర్, ఆది లాబాద్ జిల్లాలలో ఎస్సీలకు 16, ఎస్టీల 6 శాతం అంతకంటే ఎక్కువగా ఉంటే జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ కల్పించడం జరిగిందని ఆ జిల్లాలలో జరిగిన మాదిరిగానే నిబంధనల మేరకు తాను పదోన్నతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ జీవో కాపీలను ఠీఠీఠీ.ఛీౌ్ఛఝ్ఛఛ్చీజు.జీ వెబ్సైట్లో ఉంచామని ఎంఈవో, డిప్యూటీ ఈవో కార్యాలయాలలో జీవో కాపీల ప్రతుల ను అందుబాటులో ఉంచామని తెలిపారు.వీటిపై అవగాహన చేసుకుని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌కు సహరించాలని డీఈవో ఆయా సంఘాలను కోరారు. -
ముదురుతున్న వివాదం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా విద్యా శాఖ అధికారి గాజర్ల రమేశ్ వ్యవహార సరళిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనపై వచ్చిన విమర్శలకు డీఈఓ సమాధానమిచ్చినా ఉపాధ్యాయ సంఘాల నేతలు శాంతించడం లేదు. దీంతో డీఈఓకు ఉపాధ్యాయల సంఘాల నేతల మధ్య దూరం మరింత పెరిగింది. ఆయన తీరు మారకపోతే ఈనెల 20న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. ఇదిలావుంటే ఉపాధ్యాయ సంఘాల నేతల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాను వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకున్నానని డీఈఓ స్పష్టం చేస్తున్నారు. తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాల నేతలైనా సరే చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేయలేదని చెబుతున్నారు. ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆకస్మికంగా వాయిదా వేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలపై డీఈఓపై కస్సుబుస్సుమంటున్నారు. కౌన్సెలింగ్ వాయిదాకు గల కారణాలను తాను తెలిపినా అర్థం చేసుకోకుండా ఆందోళనలు చేస్తే నష్టపోయే ఉపాధ్యాయులేనని డీఈఓ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో అన్యాయం జరుగుతుందని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలపడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాల్సి వస్తుందని, ఇందులో తన స్వార్థం లేదని, దీన్ని సాకుగా చేసుకొని సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆ సంఘాల నేతలను డీఈఓ ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులపై వచ్చిన ఫిర్యాదులపై ఎంఈఓ విచారణ అనంతరం డిప్యూటీ ఈఓలతో విచారణ జరిపించాకే చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వివరిస్తున్నారు. అకారణంగా సస్పెండ్ అయినట్టు ఏ ఒక్కరైనా నిర్ధారిస్తే అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని డీఈఓ నేరుగా కలెక్టర్‌తో అన్నట్టు తెలిసింది. కలెక్టర్‌కు ఉపాధ్యాయ సంఘాల వినతి.. మరో వైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 20న నిరవధిక సెలవులు పెట్టడంతోపాటు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అందులో హెచ్చరించారు. దీంతో కలెక్టర్ ఉపాధ్యాయుల సమస్యలపై డీఈఓతో చర్చించగా పదోన్నతులు మినహా మిగతా 12 డిమాండ్లు తనకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. ఆ డిమాండ్లు నెరవేర్చడం తన పరిధిలోనూ లేదంటూ కలెక్టర్ సైతం చేతులెత్తేసినట్టు తెలిసింది. ఉపాధ్యాయులకు పోటీగా.. ఉపాధ్యాయ సంఘాల తీరును విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగితే తాము సైతం పోటీ ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈనెల 20న ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తే అదే రోజు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓల కార్యాలయాలను ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సురేశ్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.రవి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పాఠశాలకు డుమ్మాలు కొట్టే వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని వారంటున్నారు. ఈ రకంగా వారు డీఈఓకు బాసటగా నిలవాలని భావిస్తున్నారు. 20న చలో సంగారెడ్డి... మెదక్ టౌన్: డీఈఓ రమేశ్ వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 20న చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ సమితి జిల్లా కన్వీనర్ సడిమెల యాదగిరి పేర్కొన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఐక్య ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఈఓ ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు, కించపర్చే విధానాలు మానుకోవాలని హితవు పలికారు. సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, చిన్న చిన్న పొరపాట్లకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న విద్యా వలంటీ ర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో ఉపాధ్యాయుల పాత్రలేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు మల్లారెడ్డి, హీరాలాల్, సంగయ్య, సదన్, విరాట్ స్వరూప్, మహేశ్ కుమార్, ప్రవీణ్, అశోక్, దేవయ్య, సిద్ధిరాములు, తుకారం, వెంకటేశం తదితరులు ఉన్నారు. -
సేవలు బంద్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర లక్ష్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నాయి. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. 52 ప్రభుత్వ 55వేల మంది సమ్మెలో పాల్గొననున్నారు. ఉపాధ్యాయులు 13, 14 తేదీల్లో మాస్ క్యాజువల్ లీవు పెట్టి ఉద్యమంలో పాల్గొంటారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిరవధిక సమ్మెను పర్యవేక్షిస్తోంది. సమైక్యాంధ్ర సాధనకు చేపట్టనున్న సమ్మెలో గెజిటెడ్ అధికారులు కూడా పాల్పంచుకుంటున్నారు. కర్నూలులోని జనరల్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటన్నింటిని సమ్మె పరిధిలోకి తీసుకొచ్చారు. పశువైద్య సేవలు కూడా స్తంభించనున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచే ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటుండటంతో పాలన వ్యవహారాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇక నిరవధిక సమ్మెతో పాలన సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. తాగునీరు, శానిటేషన్ వంటి అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో వాణిజ్య పన్నుల శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, గనుల శాఖ ముఖ్యమైనవి. ఈ శాఖలు కూడా సమ్మెలోకి వస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది. నిరవధిక సమ్మెలో భాగంగా ప్రతిరోజు కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోను ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇళ్లను ముట్టడించి పరిసరాలను శుభ్రం చేయడానికి నిర్ణయించారు. సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు జిల్లా అధికారుల సంఘం నేతలు ఆనంద్‌నాయక్, వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమ్మెలో పాల్గొంటుండటంతో సేవలు స్తంభించనున్నాయి. వైద్యులు అత్యవసర సేవలకే పరిమితం కానున్నారు. అదేవిధంగా మూడు రోజుల పాటు పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగా బంద్ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సమ్మెకు సహకరించండి నిరవధిక సమ్మెకు సహకరించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగల్రెడ్డి జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ సోమవారం రాత్రి కలెక్టర్‌ను కోరారు. జిల్లా అధికారులంతా సహకరించాలని విన్నవించారు. 108 సిబ్బంది కొంతకాలంగా సమ్మెలో ఉన్నందున పారామెడికల్ సిబ్బందిని ప్రత్యామ్నాయంగా వినియోగించుకుంటున్నారని.. వారు కూడా మంగళవారం నుంచి సమ్మెలో వెళ్తున్నారని కలెక్టర్‌కు తెలియజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు. జేఏసీ కార్యదర్శి శ్రీరాములు, నగర అధ్యక్షుడు లక్ష్మన్న, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు కలెక్టర్‌ను కలిశారు.