ఉపాధ్యా య సంఘాలు, దళిత సంఘాలు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులతో నిబంధనల ను పాటించడం లేదన్న విమర్శలలో ఏ మాత్రం వాస్తవం లేదని జీవోలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రమే శ్ తెలిపారు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:ఉపాధ్యా య సంఘాలు, దళిత సంఘాలు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులతో నిబంధనల ను పాటించడం లేదన్న విమర్శలలో ఏ మాత్రం వాస్తవం లేదని జీవోలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రమే శ్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘా లు తనపై చేస్తున్న విమర్శలు సరైనవి కావన్నారు. 2004 జనవరి 9న జారీ అయిన జీవో నంబరు 2, 2005 ఫిబ్రవరి 17న జారీ అయిన జీవోలు 16, 18, 2004 అక్టోబర్ 19న జారీ అయిన జీవో నంబరు 76, 2007 జనవరి 24న జారీ ఆయిన జీవో నంబరు 4 ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ జీవోల ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తాను వ్యక్తిగతంగా ప్రమోషన్ల లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఈ జీవోల ఆధారంగానే ఖమ్మం, కరీంనగర్, ఆది లాబాద్ జిల్లాలలో ఎస్సీలకు 16, ఎస్టీల 6 శాతం అంతకంటే ఎక్కువగా ఉంటే జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ కల్పించడం జరిగిందని ఆ జిల్లాలలో జరిగిన మాదిరిగానే నిబంధనల మేరకు తాను పదోన్నతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ జీవో కాపీలను ఠీఠీఠీ.ఛీౌ్ఛఝ్ఛఛ్చీజు.జీ వెబ్‌సైట్‌లో ఉంచామని ఎంఈవో, డిప్యూటీ ఈవో కార్యాలయాలలో జీవో కాపీల ప్రతుల ను అందుబాటులో ఉంచామని తెలిపారు.వీటిపై అవగాహన చేసుకుని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌కు సహరించాలని డీఈవో ఆయా సంఘాలను కోరారు.