మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తా | santosh srinivas interview with sakshi | Sakshi
Sakshi News home page

మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తా

Published Thu, Oct 13 2016 8:07 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తా - Sakshi

మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తా

త్వరలో పెద్ద హీరో సినిమాకు దర్శకత్వం
నేను విశాఖ వాసినే
’హైపర్’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్

ద్వారకానగర్ : తాను పుట్టింది విశాఖలోనేనని, డాబాగార్డెన్‌‌సలో తమకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని హైపర్ సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ’హైపర్’ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. సినిమా పరిశ్రమపై మక్కువ, సోదరులు సహకారమే ఈ స్థాయికి చేరానన్నారు.

చెన్నైలో అసిస్టెంట్ కెమెరామన్‌గా కెరీర్ ప్రారంభించి,  అంచెలంచెలుగా ఎదిగి దర్శకుడిని అయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు కందిరీగ, రభస, హైపర్ సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. ఓ పెద్ద హీరోతో తీసే సినిమాకు త్వరలో దర్శకత్వం వహించనున్నట్టు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు.

కమర్షియల్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తానన్నారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని, స్నేహితులతో ఎక్కువగా బీచ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ అభిమానంతోనే హైపవర్ సినిమాలో విశాఖపట్నాన్ని ఓ ప్రత్యేక నగరంగా చూపించానని చెప్పారు. ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement