Hyper Movie
-
మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తా
త్వరలో పెద్ద హీరో సినిమాకు దర్శకత్వం నేను విశాఖ వాసినే ’హైపర్’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ద్వారకానగర్ : తాను పుట్టింది విశాఖలోనేనని, డాబాగార్డెన్సలో తమకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని హైపర్ సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ’హైపర్’ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. సినిమా పరిశ్రమపై మక్కువ, సోదరులు సహకారమే ఈ స్థాయికి చేరానన్నారు. చెన్నైలో అసిస్టెంట్ కెమెరామన్‌గా కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి దర్శకుడిని అయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు కందిరీగ, రభస, హైపర్ సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. ఓ పెద్ద హీరోతో తీసే సినిమాకు త్వరలో దర్శకత్వం వహించనున్నట్టు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. కమర్షియల్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తానన్నారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని, స్నేహితులతో ఎక్కువగా బీచ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ అభిమానంతోనే హైపవర్ సినిమాలో విశాఖపట్నాన్ని ఓ ప్రత్యేక నగరంగా చూపించానని చెప్పారు. ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. -
హైపర్... అవునా?
రామ్ అంటే ఎనర్జీ.. ఎనర్జీ అంటే రామ్ అన్నంత హుషారుగా తెరపై కనిపిస్తుంటారు. అందుకే, యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ అని రామ్‌ని అభిమానులు పిలుచుకుంటారు. రామ్‌లో హుషారుని ‘కందిరీగ’తో పోల్చారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆ టైటిల్, సినిమా రెండూ సూపర్ హిట్టే. మళ్లీ ఈ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈసారి రామ్‌లో ఎనర్జీని ‘హైపర్’గా చూపించనున్నారట. ప్రస్తుతం రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని నిర్మిస్తున్న 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇటీవల ఫిల్మ్ చాంబర్లో ‘హైపర్’ టైటిల్ రిజిస్టర్ చేయించింది. ఈ టైటిల్ రామ్ సినిమా కోసమే అని సమాచారం. ‘శివమ్’ తర్వాత మరోసారి రాశీఖన్నా ఈ చిత్రంలో రామ్‌తో జోడీ కట్టారు. ‘కందిరీగ’ తరహాలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ ఈ నెల 14వ తేదీ నుంచి మొదలు కానుంది. నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట.