పవర్‌ఫుల్‌గా... | ntr new movie rabasa song in pollachi | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌గా...

Published Sun, Feb 2 2014 9:40 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

పవర్‌ఫుల్‌గా... - Sakshi

పవర్‌ఫుల్‌గా...

నటన, నాట్యం... ఈ రెండూ తారక్‌కి అలంకారాలు. అయితే వాటిని సరిగ్గా ప్రదర్శించే స్థాయి కథలు ఇటీవల ఆయనకు రావడంలేదు. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి మాస్‌కి అమితంగా చేరువైన తారక్‌కి... గతంలో చేసిన పాత్రలకు దీటైన పాత్రలు దొరక్కపోవడం నిజంగా లోటే. ఆ లోటుని భర్తీ చేసేలా ‘రభస’(వర్కింగ్ టైటిల్) ఉంటుందని సమాచారం.

‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ స్డూడియోలో జరుగుతోంది. ‘ఆది’ తర్వాత తారక్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘ఆది’ కంటే అత్యంత శక్తిమంతంగా ఇందులోని తారక్ పాత్ర ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం.

మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత తొలుత ప్లాన్ చేశారు. కానీ... సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో మే నెలలో విడుదల చేయడానికి నిర్ణయించారు. సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement