Rabasa
-
సంతోష్ శ్రీనివాస్‌తో "రభస" ముచ్చట్లు
-
ఎన్టీఆర్ రభస మూవీ స్టిల్స్
-
తారక్ ‘రభస’ వర్కింగ్ స్టిల్స్
-
అది అంత తేలికైన విషయం కాదు!
సినిమా విషయంలో ఎక్కువ కష్టపడేది హీరోనే. పాటలనీ ఫైట్లనీ ఒళ్లు హూనం చేసుకోవాల్సిన పరిస్థితి వారిది. అందుకే పారితోషికం కూడా వారికే ఎక్కువ. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ... మరో కోణంలో ఆలోచిస్తే మాత్రం హీరోయిన్ల కష్టం కూడా సాధారణమైంది కాదని అర్థమవుతుంది. హీరో మహా అయితే... ఏడాదికి రెండు సినిమాలు చేస్తాడు. ఇచ్చిన డేట్స్ ప్రకారం నింపాదిగా షూటింగులు చేసుకుంటూ పోతుంటాడు. ఈ క్రమంలో వారికి కావల్సినంత విశ్రాంతి. కానీ, హీరోయిన్ల పరిస్థితి అలాకాదు. ఏడాదికి నాలుగైదు సినిమాలైనా చేయాలి. ఇచ్చిన డేట్స్‌ని సద్వినియోగం చేసుకుంటూ చకచకా షూటింగులు చేసుకుపోవాలి. కాంబినేషన్స్ సెట్ చేయడం దర్శక, నిర్మాతలకు పెద్ద పరీక్ష. ఆ విషయంలో వారికి పూర్తిగా సహకరించాలి. ఏ యూనిట్‌నీ ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని కారణాలవల్ల అదనపు రోజులు షూటింగ్ చేయాల్సి వస్తే... హీరోయిన్లు అనుభవించే టెన్షన్ వర్ణనాతీతం. ముఖ్యంగా సమంత లాంటి నంబర్‌వన్ హీరోయిన్కైతే... ఇక చెప్పేదేముంది! నిజంగా మోయలేనంత బరువే. కానీ.. అంతటి బాధ్యతనీ సునాయాసంగా నెరవేర్చేస్తున్నారు సమంత. చకచకా షూటింగులను పూర్తి చేసుకుంటూ... అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. శనివారంతో ‘మనం’ యూనిట్ నుంచి సెలవు తీసేసుకున్నారామె. ఆ సినిమాకు సంబంధించిన తన పనంతా పూర్తి చేసేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన అనుభూతిని తెలిపారు సమంత. ‘‘శనివారంతో ‘మనం’కి సంబంధించిన నా వర్క్ పూర్తయింది. ఆ యూనిట్‌ని వదిలి వెళుతుంటే బాధేసింది. నిజంగా వాళ్లందర్నీ మిస్ అవుతున్నాను. ఆహ్లాదకరంగా సాగిందా షూటింగ్. ప్రస్తుతం వి.వి.వినాయక్ డెరైక్షన్‌లో రూపొందుతోన్న చిత్రం షూటింగ్లో ఉన్నా. అలాగే, ఎన్టీఆర్‌తో ‘రభస’(వర్కింగ్ టైటిల్) పాట షూటింగ్లో పాల్గొంటా. ఎన్టీఆర్‌తో డాన్సంటే అంత తేలికైన విషయం కాదు కదా’ అని ట్వీట్ చేశారు. నిజంగా సమంత డెడికేషన్ని అభినందించాల్సిందే. -
పవర్‌ఫుల్‌గా...
నటన, నాట్యం... ఈ రెండూ తారక్‌కి అలంకారాలు. అయితే వాటిని సరిగ్గా ప్రదర్శించే స్థాయి కథలు ఇటీవల ఆయనకు రావడంలేదు. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి మాస్‌కి అమితంగా చేరువైన తారక్‌కి... గతంలో చేసిన పాత్రలకు దీటైన పాత్రలు దొరక్కపోవడం నిజంగా లోటే. ఆ లోటుని భర్తీ చేసేలా ‘రభస’(వర్కింగ్ టైటిల్) ఉంటుందని సమాచారం. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ స్డూడియోలో జరుగుతోంది. ‘ఆది’ తర్వాత తారక్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘ఆది’ కంటే అత్యంత శక్తిమంతంగా ఇందులోని తారక్ పాత్ర ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత తొలుత ప్లాన్ చేశారు. కానీ... సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో మే నెలలో విడుదల చేయడానికి నిర్ణయించారు. సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
అత్తమడుగు వాగులోనా.. అత్త కొడుకో...
మహానటుడు ఎన్టీఆర్ సాధించిన ఘనవిజయాలలో ‘కొండవీటి సింహం’ సినిమా ఒకటి. అందులో ఎన్టీఆర్, శ్రీదేవిపై చిత్రీకరించిన ‘అత్తమడుగు వాగులోనా... అత్త కొడుకో...’ పాట అప్పట్లో మాస్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడా పాటని రీమిక్స్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలో ఈ పాట పెట్టాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారట. ఈ రీమిక్స్‌ని ఎన్టీఆర్, అక్షపై ప్రత్యేక గీతంగా చిత్రీకరించే అవకాశం ఉందనేది యూనిట్ వర్గాల సమాచారం. ఇలా తాతయ్య ఎన్టీఆర్ పాటలను రీమిక్స్ చేసి ఉపయోగించుకోవడం ఎన్టీఆర్‌కి కొత్త కాదు. ఇంతకు ముందు ‘వేటగాడు’లోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటను ‘అల్లరి రాముడు’లోనూ, ‘యమగోల’లోని ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాటను ‘యమదొంగ’లోనూ రీమిక్స్ చేశారు. ‘రభస’గా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల మూడోవారం నుంచి హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూలు జరుగనుంది. అతి ముఖ్య సన్నివేశాలను ఈ షెడ్యూలులో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత జైపూర్‌లో మరో షెడ్యూలు జరగనుంది. ఇందులో సమంత, ప్రణీత నాయికలు. -
నేను బికినీ వేయడంలేదు : సమంత
సమంతకు కోపం వచ్చింది. ‘‘నా సినిమాల్లో నా పాత్రలు చూసి కూడా నా గురించి ఇలాంటి గాసిప్పులు ఎలా పుట్టించగ లుగుతున్నారు?’’ అని మీడియాపై నిప్పులు కక్కింది. ఇంతకీ ఈ చెన్నయ్ చందమామకు అంత కోపాన్ని తెచ్చేపని మీడియావారు ఏంచేశారు? అనుకుంటున్నారా! విషయం ఏంటంటే... ఎన్టీఆర్ ‘రభస’చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె బికినీ వేయనుందని, కథానుగుణంగా ఆ సన్నివేశం ఉండటంతో బికినీలో కనిపించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలే సమంత కోపానికి కారణం. దాంతో వాటిని ఖండిస్తూ ట్విట్టర్ ద్వారా తన మనోగతాన్ని పోస్ట్ చేశారు సమంత. ‘‘నాపై జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. నేను బికినీ వేయడం శుద్ధ అబద్ధం. నేనేంటో, ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలేంటో తెలిసి కూడా నాపై ఇలాంటివి పుట్టించడం నిజంగా దారుణం’’ అని ట్విట్టర్ ద్వారా బాధను వ్యక్తం చేశారు సమంత.