tarak
-
తారక్, చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్..!
-
తారక్, చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్
-
HYD: హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం.. ఐటీ ఉద్యోగి రుత్విక్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ముఖ్య కారకుడైన ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్‌రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు. కాగా, ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డి కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే, రుత్విక్ రెడ్డి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాడు. ఈ క్రమంలో తాను పనిచేస్తున్న ఆఫీసును ఫ్రెండ్ చూపిస్తానంటూ వారిని తీసుకుని మాదాపూర్‌కు వెళ్లాడు. అనంతరం, ఫ్రెండ్స్‌తో కలిసి బార్లో ఫుల్‌గా మద్యం సేవించారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బార్లోనే ఫుల్‌గా మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం, ఆఫీసును చూసి తిరిగి వస్తున్నా క్రమంలో మద్యం మత్తులో కారును అతి వేగంతో డ్రైవ్ చేశాడు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో బైక్‌పై వెళ్తున్న తారక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తారక్ మృతిచెందాడు. -
అరుదైన సమస్య.. ఆరు నెలల్లో మాయం!
జగ్గయ్యపేట అర్బన్ : వంకరకాళ్లతో జన్మించిన చిన్నారిని జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆరు నెలల్లోనే మామూలు స్థితికి తెచ్చారు. చిన్నారి తల్లిదండ్రుల మోముల్లో సంతోషాన్ని నింపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన సాయి తారక్, శ్రీలత దంపతులకు ఆరు నెలల కిందట మహన్వితశ్రీ జన్మించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలోనే జన్మించిన ఆ చిన్నారికి కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కఠారి హరిబాబు సలహాతో వారు అదే ఆస్పత్రిలో ఆర్థోపెటిక్‌గా పనిచేస్తున్న డాక్టర్ హరీష్‌ను కలిసి తమ బిడ్డ పరిస్థితిని వివరించారు. బాలికను పరీక్షించి తల్లిదండ్రులకు ఆయన ధైర్యం చెప్పారు. ఆరు నెలల్లో చిన్నారి కాళ్లు మామూలు స్థితికి చేరుకుంటాయని భరోసా ఇచ్చి.. 21వ రోజు నుంచి చికిత్స మొదలెట్టారు. వారం వారం ఆ చిన్నారి కాళ్లకు కట్లు కడుతూ మధ్యలో ఇంజక్షన్లు ఇస్తున్నారు. మధ్యలో విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల ద్వారా కొంత వైద్య సాయం తీసుకున్నారు. ఆరు నెలలు పూర్తి కావస్తుండటంతో చిన్నారి కాళ్లు దాదాపుగా మామూలు స్థితికి వచ్చాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఇలాంటి లోపాలు వస్తుంటాయని, దీనిని క్లబ్ ఫుట్(సీటీఈవీ) అంటారని తెలిపారు. పుట్టిన వెంటనే చికిత్స మొదలెడితే ఫలితం ఉంటుందని చెప్పారు. -
ఆస్కార్ కు అడుగు దూరంలో ఎన్టీఆర్
-
నేను తీసిన సినిమాలలో నా ఫేవరెట్ సీను అదే : రాజమౌళి
-
తగ్గేదేలే అంటున్న తారక్..!
-
అరుదైన రికార్డు సాధించిన ధనుష్..
-
జపాన్ వీధుల్లో చరణ్, తారక్ హంగామా
-
తారక్ చిత్రం నుంచి తప్పుకున్న ఆలియా..?
ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత బాలీవుడ్ భామ ఆలియా భట్ యంగ్‌టైగర్ జూ.ఎన్టీఆర్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఆ సమయంలో ఆలియా కూడా తారక్‌తో కలిసి నటించడానికి ఉత్సాహం చూపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ చిత్రం నుంచి ఆలియా తప్పుకున్నట్టు తెలుస్తోంది. తన బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో ఆలియా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఈ జంట హనీమూన్ ట్రిప్‌కి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ముందుగా వారు కమిటైన సినిమాలను పూర్తి చేయాలి. దాంతో తారక్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆలియా ప్లేస్‌లో మరో హీరోయిన్ను వెతికే పనిలో ఉన్నారట కొరటాల టీమ్. ఇక దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
ఎన్టీఆర్ పేరుతో ఆడేసుకుంటున్నారు..!
నందమూరి వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఎన్టీఆర్... తాతకు తగ్గ మనవడిగా వెండితెర మీద సత్తా చాటుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ తన పేరును నందమూరి తారక రామారావుగానే తెర మీద వేసుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా రాజమౌళి సినిమా కోసం మాత్రం ఎన్టీఆర్ పేరును రామారావు అని మాత్రమే వేశారు. రాజమౌళి, రామ్‌చరణ్‌ల పేరుతో రైమింగ్ కలిసేలా ఎన్టీఆర్ పేరును రామారావు అని వేశారు. ముగ్గురి పేర్లు కలిసేలా ఆర్ఆర్ఆర్ (#RRR) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. తాజాగా మరో సినిమా కోసం ఎన్టీఆర్ పేరును కట్ చేసి వాడేస్తున్నారు. ఎన్టీఆర్‌ను సన్నిహితులు తారక్ అని పిలుస్తుంటారు. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం ఎన్టీఆర్ పేరు తారక్ అని వాడేస్తున్నారు. రాజమౌళి సినిమా తరహాలో టీటీటీ (#TTT) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ల పేర్లతో కలిసేలా ఎన్టీఆర్ పేరు తారక్ అని వేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ టీటీటీ అంటూ ట్వీట్ చేశాడు. #TTT 👍🏽#tarak#trivikram #thaman Compositions started today ♥️✨💪🏼 — thaman S (@MusicThaman) 25 March 2018 The much awaited confirmation you all have been waiting for since November 18th 2017... Its OFFICIAL.. The Massive Multi Starrer is ON!#RRR .. It's not the TITLE.. Just the TITANS coming together! @ssrajamouli @tarak9999 #RamCharan https://t.co/PTENUB7pwV — RRR Movie (@RRRMovie) 22 March 2018 -
యంగ్ టైగర్ ముఖ్యమంత్రి అట?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న ప్రముఖ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరోసారి తప్పులో కాలేసింది. టాలీవుడ్ హీర్ నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేసింది. అవును..గూగుల్ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ లో తారక్ (Tarak) అని టైప్ చేసినపుడు ముఖ్యమంత్రి అని తర్జుమా చేస్తోంది. దీంతో తెలుగు సినీలోకం గర్వించ దగ్గ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జూ. ఎన్టీఆర్ ఇపుడు ముఖ్యమంత్రిగా అవతరించారు. వివిధ భాషలకు సంబంధించిన అర్ధాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ టూల్ తమ అభిమాన నటుడి పేరుకి ముఖ్యమంత్రి అర్థాన్ని చెబుతుడడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యంతో పాటూ...మరింత సంతోషానికి లోనవుతున్నారట. తాత సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న యంగ్ హీరో ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకోనున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తిరుగులేదని... గూగుల్ నిజం చేసిందంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారట! అయితే గూగుల్ ట్రాన్స్‌లేట్ పై గతంలో కూడా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ భాషలపై పట్టులేకపోవడం వలనే ఇది జరిగిందని, ఒక్క 'తారక్' విషయంలోనే కాదు, అనేక పదాల అనువాదం విషయంలోనూ నెటిజన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయంటూ భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఏదైమైనా 'తారక్' అనే పదానికి 'ముఖ్యమంత్రి' అని తర్జుమా చేయడం విశేషమే. మరి దీనిపై గూగుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా జూ. ఎన్టీఆర్ ని అభిమానుల ముద్దుగా తారక్ అని పిలుచుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల
సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త లుక్‌తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమా టీజర్ విడుదలైంది. ముందునుంచి అన్నట్లుగానే దసరా కానుకగా బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేశారు. 'ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు' అనే పాటతో కూడిన ఈ టీజర్‌ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. తారక్ నటిస్తున్న 25వ సినిమా కావడం, విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దీనికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై అంచనాలు బాగా పెరిగాయి. దేవిశ్రీ ప్రసాద్ మార్కు సంగీతం ఈ టీజర్లో కనిపిస్తోంది. టెంపర్ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న జూనియర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. 'వన్' ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు. -
పూరీ డైరెక్షన్లో తారక్ సినిమా
-
విడుదలకు సిద్ధమైన ‘నేను నేనే.. రామూనే’!
-
తారక్ ‘రభస’ వర్కింగ్ స్టిల్స్
-
పవర్‌ఫుల్‌గా...
నటన, నాట్యం... ఈ రెండూ తారక్‌కి అలంకారాలు. అయితే వాటిని సరిగ్గా ప్రదర్శించే స్థాయి కథలు ఇటీవల ఆయనకు రావడంలేదు. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి మాస్‌కి అమితంగా చేరువైన తారక్‌కి... గతంలో చేసిన పాత్రలకు దీటైన పాత్రలు దొరక్కపోవడం నిజంగా లోటే. ఆ లోటుని భర్తీ చేసేలా ‘రభస’(వర్కింగ్ టైటిల్) ఉంటుందని సమాచారం. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ స్డూడియోలో జరుగుతోంది. ‘ఆది’ తర్వాత తారక్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘ఆది’ కంటే అత్యంత శక్తిమంతంగా ఇందులోని తారక్ పాత్ర ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత తొలుత ప్లాన్ చేశారు. కానీ... సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో మే నెలలో విడుదల చేయడానికి నిర్ణయించారు. సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
జోరుమీదున్న ఎన్టీఆర్
తారక్‌ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘ఆది’. ఆ సినిమాతో బెల్లంకొండ సురేష్ కూడా స్టార్ నిర్మాతఅయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుండటం విశేషం. ‘కందిరీగ’ లాంటి వినోదభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. తారక్‌ని ఎలా చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారో ఇందులో ఆయన పాత్ర చిత్రణ అలా ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ‘అత్తారింటికి దారేది’ లాంటి సంచలన విజయం సాధించిన చిత్రంలో నటించిన సమంత, ప్రణీత ఇందులో ఎన్టీఆర్‌తో జతకట్టడం మరో విశేషం. ఈ సినిమాకు ‘రభస’ అనే టైటిల్ మొన్నటిదాకా ప్రచారంలో ఉంది. అయితే... ఆ టైటిల్ కరెక్ట్ కాదని, చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు. ‘జోరు’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కావచ్చని సమాచారం.