సాక్షి, హైదరాబాద్: నగరంలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ముఖ్య కారకుడైన ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్‌రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు. కాగా, ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డి కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే, రుత్విక్ రెడ్డి ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందాడు.
ఈ క్రమంలో తాను పనిచేస్తున్న ఆఫీసును ఫ్రెండ్ చూపిస్తానంటూ వారిని తీసుకుని మాదాపూర్‌కు వెళ్లాడు. అనంతరం, ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌లో ఫుల్‌గా మద్యం సేవించారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బార్‌లోనే ఫుల్‌గా మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం, ఆఫీసును చూసి తిరిగి వస్తున్నా క్రమంలో మద్యం మత్తులో కారును అతి వేగంతో డ్రైవ్ చేశాడు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో బైక్‌పై వెళ్తున్న తారక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తారక్ మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment