హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జిపై హిట్‌ అండ్‌ రన్‌ | Madhapur Cable Bridge Hit And Run Case Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జిపై హిట్‌ అండ్‌ రన్‌, ఒకరి మృతి, ఒకరికి సీరియస్‌

Published Sat, Apr 6 2024 12:05 PM | Last Updated on Sat, Apr 6 2024 12:25 PM

Madhapur Cable Bridge Hit And Run Case Details - Sakshi

కేబుల్‌ బ్రిడ్జిపై సరదాగా ఫొటోలు దిగుతున్న ఇద్దరు యువకులను దూసుకొచ్చిన ఓ కారు.. 

సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.  

ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement