cable bridge
-
చుక్ చుక్ బండిలో.. వెండి కొండల యాత్ర
(జమ్మూ–కశ్మీర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : 77 ఏళ్ల స్వతంత్ర భారతం నిరీక్షణకు గ్రీన్ సిగ్నల్ లభించింది! 25 ఏళ్ల నాటి ప్రణాళిక పట్టాలెక్కుతోంది! రెండు దశాబ్దాల అకుంఠిత దీక్ష ఫలిస్తోంది!! కశ్మీర్‌ను మిగతా దేశంతో అనుసంధానిస్తూ మన రైల్వేల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావచ్చింది. హిమాలయాల మీదుగా భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైన 338 కి.మీ. ‘ఉద్దమ్‌పూర్– శ్రీనగర్–బారాముల్లా’ రైల్వే లైన్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఏకంగా 38 సొరంగాలు (టన్నెళ్లు), 931 చిన్నా, పెద్ద వంతెనలతో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చెనాబ్ వంతెన, దేశంలో మొదటి కేబుల్ రైల్వే వంతెనతోపాటు ఎన్నో ప్రత్యేకతలను ఈ విశిష్ట ప్రాజెక్టు సంతరించుకుంది. వ్యాపార, పర్యాటక, రవాణా రంగాల ప్రగతిని విప్లవాత్మక మలుపు తిప్పుతూ జమ్మూ–కశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడనుంది. దేశ రక్షణ వ్యూహాత్మక అవసరాలను తీర్చడంలోనూ అత్యంత కీలకంగా మారనుంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో భద్రతాపరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దీన్ని చేపట్టారు. మొత్తం రూ.41 వేల కోట్లతో చేపట్టి.. 2025 జనవరిలో ప్రారంభించనున్న ఈ రైల్వే ప్రాజెక్ట్ ప్రధాన అంశాలు ఇవీ..27 సొరంగాలు.. 37 వంతెనలు ఉద్దమ్‌పూర్– శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన 111 కి.మీ. కట్రా– బనిహల్ లైన్ నిర్మాణాన్ని రైల్వే శాఖ తాజాగా పూర్తి చేసింది. అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు, లోతైన లోయలు, అతి వేగంగా ప్రవహించే నదులతో కూడుకున్న ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉండగా వాటిలో 27 ఈ లైన్లోనే ఉండటం గమనార్హం. ఇక 37 వంతెనలు కూడా ఈ లైన్లోనే నిర్మించారు. వాటిలో అత్యంత ప్రధానమైన చెనాబ్ వంతెన, ఆంజిఖడ్ వంతెనలున్నాయి. హిమాలయ ప్రాంత వాసులకు రైలు రవాణాను అందుబాటులోకి తెస్తూ కొత్తగా రియాసీ, బక్కల్, దుగ్గా, సావల్‌కోట్, సంగల్దాన్, సుంబుర్, ఖరీ రైల్వే స్టేషన్లను నిర్మించారు. హిమాలయాలను తొలిచి ప్రత్యేకంగా నిరి్మంచిన ఎత్తైన ప్రదేశాలు, సొరంగాల వద్ద ఈ రైల్వే స్టేషన్లను నిర్మించడం విశేషం. ఇక మిగిలింది 17 కి.మీ. లైనే కట్రా–రియాసీ మధ్య మరో 17 కి.మీ. మేర రైల్వే లైన్‌ను ఇంకా నిరి్మంచాల్సి ఉంది. ఆ ప్రాంతంలో హిమాలయాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. ఆంజిఖడ్ కేబుల్ వంతెనకు ఆవల ఓ సొరంగాన్ని నిర్మించి ఈ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఆ పనులను కొన సాగిస్తూ పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.ఉగ్ర దాడులను తట్టుకునేలా.. చెనాబ్ వంతెన పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 45 కి.మీ. దూరంలోనే ఉండటంతో రక్షణశాఖ సమన్వయంతో రైల్వే శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. వంతెన సమీపానికి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 24/7 సీసీ కెమెరాల నిఘాతో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఒక్కొక్కటి రూ.500 ఖరీదు చేసే ఐదు లక్షల బోల్టులను నిర్మాణంలో వినియోగించారు. ఒకసారి బిగించిన వాటిని ఇతరులు విప్పలేని రీతిలో తయారు చేసిన భారీ బోల్టులను వంతెన నిర్మాణంలో ప్రత్యేకంగా వాడారు. చెనాబ్ వంతెన సమీపంలో డ్రోన్లు ఎగుర వేయడాన్ని నిషేధించారు. సరిహద్దులకు అవతలి వైపు నుంచి 40 కేజీల గ్రెనేడ్లు విసిరినా వంతెన ధ్వంసం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వంతెనపై ఒక అడుగు ఎత్తులో ఇనుప జాలీలతో ఫ్లోర్ నిర్మించారు. గ్రెనేడ్లు విసిరినా అవి నేరుగా వంతెనను తాకకుండా ఈ ఇనుప జాలీలు అడ్డుకుంటాయి. దేశంలో తొలి రైల్వే కేబుల్ వంతెన కట్రా– రియాసీ సెక్షన్లో అంజీఖడ్ వద్ద దేశంలోనే తొలి రైల్వే కేబుల్ వంతెనను నిర్మించారు. భూకంపాలు, వరదలు, ప్రకృత్తి విపత్తులకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతంలో రెండు కొండలను అనుసంధానిస్తూ కేబుల్ వంతెన నిర్మాణమే సరైన పరిష్కారమని ఇంజనీరింగ్ నిపుణులు నిర్ణయించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ సాంకేతిక పరిశోధన సహకారంతో 725.5 మీటర్ల వంతెనను నిర్మించారు. అందులో 290 బలమైన కేబుల్ వైర్లతో నిర్మించిన వంతెన 473.25 మీటర్ల పొడవు ఉంటుంది. పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా..చలి కాలంలో పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా ఉండేందుకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రత్యేక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డబుల్ వాల్డ్ కాంపోజిట్ ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకులను నిరి్మంచారు. దీంతో పట్టాలపై చేరే నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది. చలికి గడ్డ కట్టదు. రైళ్లకు నీటి సరఫరా కోసం రక్షణ శాఖ సహకారంతో హీటెడ్ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లలోని టాయిలెట్లలో గీజర్ల సదుపాయం ఉంటుంది. సెంట్రల్లీ హీటెడ్ స్లీపర్ వందే భారత్ రైళ్లను ఈ లైన్లో ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
కేబుల్ బ్రిడ్జీపై స్టంట్లు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ వెర్రి వేషాలు
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు హల్చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్‌పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్‌పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్‌కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్‌తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్‌కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్శుక్రవారం రాత్రి బైక్ రేస్‌కు పాల్పడిన 15 మంది, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేస్‌కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 -
కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు బ్రిడ్డిపైన ఉన్న డివైడర్ని ఢీకొట్టి కిందపడ్డారు. ఈ ఘటనలో బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్, జాబ్ సెర్చింగ్‌లో ఉన్న బాలప్రసన్న మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బైక్‌పై అతివేగంగా బైక్ నడపడటంతో డివైడర్‌ను ఢీకొని వంతెనపై నుంచి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
మాదాపూర్: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు రక్షించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (25) హైదరాబాద్‌కు వచి్చంది. ఆరి్థక కారణాల నేపథ్యంలో నిద్రమాత్రలు మింగిన ఆమె కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకుని దుర్గం చెరువులో దూకేందుకు యతి్నస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆమెను కాపాడారు. అనంతరం సమీపంలోని విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సదరు యువతికి మతిస్థిమితం లేదని పోలీసులు తేలిపారు. Madhapur Traffic Police's intervention saved a woman's life as they prevented her from jumping off the Durgam Cheruvu Cable bridge.A 25-year-old woman has been taken to Vikram Hospital for treatment after reportedly ingesting pills.#CyberabadTrafficPolice pic.twitter.com/e22GP5bYL7— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 17, 2024 -
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
గచ్చిబౌలి: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా..సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయితే డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్‌తో పాటు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిబంధనలు పెట్టిన పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులతో పాటు సందర్శకులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా... పోలీసులకు వర్తించవా అని సోషల్ మీడియా ప్రశ్నించడం గమనార్హం. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్హెచ్ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్ పై కేక్ కట్ చేయగా , మాదాపూర్ ఎస్హెచ్ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఈ ఫొటోలో రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్సెక్టర్ సంజయ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు. -
కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ ట్రాఫిక్ సీఐ నర్సింహ్మ, లా అండ్ ఆర్డర్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్థరాత్రి దాటే వరకు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేసిన 23 మందికి చలానా విధించారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రాత్రి సమయంలో దుర్గం చెరువు అందాలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కేబుల్ బ్రిడ్జిపైకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేయడం, బర్త్ డేలు జరుపుకోవడం, సెల్ఫీలు దిగడం సరికాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను బ్రిడ్జి బయట పార్కింగ్ చేసి రెండు వైపులా ఉన్న పాత్ వేలోనే సందర్శకులు ఉండాలని పేర్కొంటున్నారు. -
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. -
దయచేసి 'న్యూ ఇయర్' రోజు ఇటువైపు వెళ్లకండి!
కరీంనగర్: న్యూ ఇయర్ సందర్భంగా లోయర్ మానేరు డ్యాం, కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలి పారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 01(సోమవారం) ఉదయం 5 గంటల వరకు ఎల్ఎండీ కట్ట, తీగల వంతెనపై ఆ ంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు జరుపుకునేందుకు వాటి పైకి అనుమతించబోమన్నారు. వాహనదారులు గమనించి, ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అలాగే, రోడ్లమీద వేడుకలు నిర్వహించడం, డీజేలను వినియోగించడం, బైక్ సైలెన్సర్లను మార్చి శబ్ధ కాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ వంటి వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ముందస్తు అ నుమతి లేకుండా జనసమూహంగా ఏర్పడి, కార్యక్రమాలు చేపట్టినా, ప్రైవేట్ పార్టీలు నిర్వహించినా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా! -
హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్.. గులాబీ వర్ణంలో కట్టడాల వెలుగులు (ఫోటోలు)
-
Durgam Cheruvu Musical Fountain Pics: దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం (ఫోటోలు)
-
Hyderabad: డ్రైవర్ అత్యుత్సాహం.. కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై ఓ ఆటో బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతోవ వైరల్‌గా మారాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో దుర్గం చెరువు తీగల వంతెనపై అకస్మాత్తుగా బోల్తా కొట్టింది. డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ ఆటో నడుపుతూ ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటుమరో ఇద్దరికి స్పల్పంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యంత వేగంతో ఆటో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆటో పల్టీ కొట్టిన సమయంలో వెనుకనుంచి వచ్చిన కారు చాకచక్యంగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత -
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్.. వీకెండ్ మస్తీతో ఉర్రూతలు (ఫోటోలు)
-
HYD: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంలో ఉన్న కారు కేబుల్ బ్రిడ్జి వద్ద పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్తున్న బ్రీజా కారు(B.No: TS09FB4896) పల్టీ కొట్టింది. కాగా, కారు డ్రైవర్ హైస్పీడ్‌లో ఉండటం, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కారును ఘటనా స్థలం నుంచి తొలగించారు. ఇది కూడా చదవండి: సంధ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. ఆటోడ్రైవర్‌కు అర్ధరాత్రి ఫోన్.. -
కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే..
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్‌వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. Traffic movement on the Cable bridge is smooth. We request commuters not to park vehicles on carriageway which obstructs traffic flow. If any are found parking illegally on the bridge will attract a hefty penalty. Public can also report these issues through WhatsApp 9490617346. pic.twitter.com/UZiy5MjMQd — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 8, 2023 -
HYD: కేబుల్‌బ్రిడ్జి దగ్గరకు వెళ్తున్నారా.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.!
హైదరాబాద్(మాదాపూర్): కేబుల్‌బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు కేబుల్‌బ్రిడ్జి వద్దకు వచ్చి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ఇక్కడకు వచ్చి చెరువు మధ్యలోకి దూకుతున్నారు. అక్కడ ఎక్కువ లోతుగా ఉండడంతో దూకిన వారు బురదలో చిక్కుకుంటున్నారు. ఇటీవల తొమ్మిదిమంది ఆత్మహత్యాయత్నం చేయగా లేక్ పోలీసులు ముగ్గురిని కాపాడారు. మాదాపూర్‌లో దుర్గం చెరువు ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల వారికి దూరాన్ని తగ్గించేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ తీగల వంతెనను నిత్యం సందర్శకులు సందర్శిస్తుంటారు. అయితే ఈ కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. ►కేబుల్ బ్రిడ్జిపై కేవలం 4 అడుగుల ఎత్తు ఉండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ►లేక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ►ఆకస్మాత్తుగా చెరువు మధ్య భాగంలో దూకడంతో ఊబిలోకి చొచ్చుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ►చెరువు మధ్యభాగంలో దాదాపు 40 అడుగుల లోతు ఉండడంతో బయటకు తీయాలంటే ఎక్కువ సమయం పడుతోంది. ►ఇప్పటికి 9 మంది సూసైడ్ చేసుకున్నారని అందులో ముగ్గురిని రక్షించినట్టు తెలిపారు. ►కేబుల్‌బ్రిడ్జిపై 12 నుండి 14 అడుగుల ఎత్తు ఉండే విధంగా రక్షణ కంచె ఏర్పాటు చేయాలని దుర్గం చెరువు లేక్‌పోలీసులు తెలిపారు. ►సూసైడ్ చేసుకునే వారు పైకిఎక్కే క్రమంలో తొందరగా స్పందించవచ్చన్నారు. ►ఎవరైనా అదృశ్యమైతే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఈ సమాచారం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు ► కాగా సందర్శకులు కేబుల్‌బ్రిడ్జిపై నిలబడకుండా ఐటీ పెట్రోలింగ్ 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అయిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ►ఎత్తైన కంచెను ఏర్పాటు చేస్తే కొంతవరకు ఆత్మహత్యలను నివారించవచ్చని సీనియర్ సిటిజన్లు తెలిపారు. ►అనుమతులు లేకుండా డ్రోన్లు వాడకూడదన్నారు. ►లేక్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు జమీందర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లును అందుబాటులో ఉంచారు. వీరితో పాటు ఒక ఎస్సై ఉంటారు. ►రిస్క్ చేసేందుకు ఒక స్పీడ్ బోటు ఉన్నాయి. చెరువు చుట్టూరా తిరిగేందుకు నాలుగు బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ►చెరువులో పడ్డ వారిని ఏ విధంగా రక్షించాలో ఫైర్ సిబ్బంది శిక్షణ పొందారు ►పైనుంచి దూకిన వారిని, నీటిలో మునిగిపోతున్న వారిని ఏ విధంగా కాపాడాలో, బయటికి తీసుకువచి్చన తరువాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో శిక్షణ ఇచ్చారు. ►మూడు పద్దతులలో కాపాడనున్నట్టు తెలిపారు. డ్రైలాండ్ రిసు్క, సెమి కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్ పద్ధతులను వాడాలని పోలీసులు తెలిపారు. ►బోట్ నడిపే విధానం, బోటు చెడిపోతే బాగు చేసుకునే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. సమస్యలకు చావు పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అలా అని చావు పరిష్కారం కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో, బంధువులతో కలసి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అధైర్యపడవద్దు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్లు చేసుకోవద్దు. విలువైన కట్టడానికి అర్థం మారిపోతుంది. ఎవరైనా అదృశ్యమైనా, అనుమానాస్పదంగా ఉన్నా పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్ ట్రేస్ చేసి లోకేషన్‌ని గుర్తించి ప్రాణాలను కాపాడవచ్చు. –మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి -
ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారు?
బంజారాహిల్స్: ట్రాఫిక్‌లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సినీ నటి డింపుల్ హయతి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఫొటోను ట్యాగ్ చేస్తూ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి ఘోరంగా ఉందని, ఇంటికి చేరుకోవాలంటే గంటకుపైగా సమయం పడుతుందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఒక వేళ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి..? మళ్లీ మనం హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా..? ప్రియమైన ప్రభుత్వమా మాకు ఉచితంగా ఇంధనం లభించదు అంటూ పోస్టు చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నగర వాసులు ఆమెను సమర్ధిస్తూ రీ ట్వీట్లు చేశారు. ఆమెను సమర్థించేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. -
ప్రపంచంలోనే రెండవాదిగా తీగెల వంతెన
-
కరీంనగర్ :కేబుల్ బ్రిడ్జి వద్ద అలరించిన ఆటపాటలు (ఫొటోలు)
-
కన్నులవిందుగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
కేటీఆర్ సార్ ఈవెంట్‌కు రారా.. ఫైన్ కట్టాల్సిందే!
-
కేటీఆర్ సార్ మీటింగ్‌కు వస్తారా.. లేకుంటే ఫైన్ కడతారా?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ హాజరుకావాలని మహిళా సంఘాలకు బెదిరింపు కాల్ వెళ్లింది. రానిపక్షంలో ప్రతీ ఒక్కరికి రూ.100 జరిమానా విధిస్తామని హెచ్చరించిన ఆడియో కాల్ చక్కర్లు కొడుతోంది. అయితే, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ మహిళా సంఘాలకు ఫోన్ కాల్ వెళ్లింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ సమన్వయ కార్యకర్త మహిళా సంఘాలకు ఫోన్ చేసి..‘కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి వస్తారా.. లేక, ఫైన్ కడతారా?. దశాబ్ది ఉత్సవాల్లో మీరెవ్వరూ ఏ ప్రోగ్రామ్‌కు అటెండ్ కాకపోయినా మేం పట్టించుకోలేదు. మేమే వెళ్లాం.. కానీ, ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్‌కు మాత్రం మంత్రి కేటీఆర్ వస్తున్నారు. కాబట్టి మీరంతా హాజరు కావాలి. ఒక్కో గ్రూప్ నుంచి కనీసం పది మంది రావాల్సిందే. ఎవరైనా ఒకరో, ఇద్దరో ఆరోగ్యపరంగా బాగా లేకపోతే సరేగానీ.. మిగిలిన వాళ్లంతా హాజరు కావాల్సిందే. లేకపోతే.. హాజరుకాని మహిళా సంఘాల్లో ఒక్కొక్కరి నుంచి వంద రూపాయల జరిమానా వసూల్ చేయమని మేడమే చెప్పారని ఆమె అన్నారు. ఇక, ఈ ఫోన్ కాల్ ఇప్పుడు కరీంనగర్లో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: గద్దర్ కొత్త పార్టీ.. కేసీఆర్ మీద పోటీకి రెడీ -
కరీంనగర్‌కు మణిహారం.. సుందరమయంగా కేబుల్ బ్రిడ్జి (ఫొటోలు)
-
Karimnagar: అద్భుతం.. ఆకర్షణీయం
ఎప్పుడెపుడా అంటూ ఎదురుచూస్తున్న తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్ 14న వంతెన ప్రారంభించాలి. కానీ.. పనులు పూర్తికాకపోవడం.. ఓ సభలో మంత్రి కాలికి గాయంకావడం తదితర కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండురోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. #KarimNagar Cable Bridge 🌉. pic.twitter.com/MJgXbQHadO — Aravind Alishetty (@aravindalishety) June 16, 2023 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పర్యాటకంలో కలికితురాయిగా నిలి చే కేబుల్ బ్రిడ్జిని తొలుత నగరవాసులకు పరిచయం చేయాలని మంత్రి కమలాకర్ నిర్ణయించారు. స్థాని కులు వంతెనపై తిరిగేందుకు వీలుగా ప్రతీ ఆదివా రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాలకు అనుమతి నిలిపివేశారు. పర్యాటకులను రంజింపజేసేలా మ్యాజిక్ షో, మ్యూజిక్ షో, కళకారుల ఆటాపాటలు తదితర వినోద కార్యక్రమాలు సిద్ధంచేశారు. రకరకాల ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేయనున్నారు.దసరా వరకు కు టుంబాలతో వచ్చి సరదాగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. వంతెన వద్ద కొరియా సాంకేతికతతో రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నేపథ్యమిదీ.. వరంగల్ – కరీంనగర్ నగరాల మధ్య దాదాపు 7. కి.మీల దూరం తగ్గించడం, హైదరాబాద్–కరీంనగర్ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది. 2018లో రూ.180 కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెన తర్వాత తెలంగాణలో రెండో బ్రిడ్జి కరీంనగర్‌దే కావడం విశేషం. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో వంతెనను నిర్మించారు. రేపటి నుంచి కార్పొరేషన్ పరిధిలోకి.. వంతెన నిర్వహణ బాధ్యతలు గురువారం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్(ఎంసీకే) చేతుల్లోకి వెళ్లనుంది. వంతెనపై లైటింగ్, పారిశుధ్యం నిర్వహణ, విద్యుత్ తదితరాలు ఇకపై బల్దియా చూసుకుంటుంది. రెండేళ్లపాటు వంతెనకు సంబంధించిన సాంకేతికపరమైన నిర్వహణను మాత్రం ఆర్ అండ్ బీ అధికారులు చూస్తారు. వంతెనపై రెండు భారీ పిల్లర్ల అంచున నాలుగు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు ప్రకటనలు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చే యాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బ్రిడ్జి విశేషాలు.. 500 మీటర్ల పొడవైన రోడ్డు, ఫోర్‌లేన్ ఇటలీ నుంచి తెప్పించిన 26 పొడవైన స్టీల్ కేబుల్స్ వంతెనకు రెండు పైలాన్లు.. వీటి మధ్యదూరం 220 మీటర్లుపైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు దూరం 110 మీటర్లు రూ.180 కోట్ల బడ్జెట్.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్ వ్యవస్థ రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్వెడల్పు 21.5 మీటర్లు, ఒక్కోటి 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం 2017 డిసెంబర్లో నిర్మాణానికి శంకుస్థాపన 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం 2023 జనవరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి2023 జూన్ 21న వంతెన ప్రారంభం పర్యాటక కేంద్రంగా.. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని టూరిజం స్పాట్‌గా నిలపాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల్లో భాగంగానే తీగల వంతెన ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయనకు కరీంనగర్ మీద ఉన్న మమకారం అలాంటిది. రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి, రూ.410 కోట్లు వెచ్చించి మానేరు పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్ ఫ్రంట్(ఎంఆర్ఎఫ్) ప్రాజెక్టును మంజూరుచేశారు. – మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్ పర్యటన ఇలా.. కేబుల్ బ్రిడ్జితోపాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మున్సిపల్, ఐటీ మినిస్టర్ కె.తారకరామారావు బుధవారం సాయంత్రం 5 గంటలకు రూ.10 కోట్లతో కశ్మీర్గడ్డలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 5.05 గంటలకు రూ.7 కోట్లు వెచ్చించి నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 కోట్ల వ్యయంతో సిటిజన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐసీసీ వీడియో వాల్ కంట్రోల్ రూం, 14 జంక్షన్ల ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్), 18 చోట్ల ఏర్పాటు చేసిన పబ్లిక్ అండ్రసింగ్ సిస్టం(పీఏఎస్), 8 చోట్ల వేరియబుల్ మెసేజింగ్ సిస్టం, ఐదుచోట్ల వాతావరణ సూచికలు, 18 ప్రాంతాల్లో వైఫై హాట్స్పాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు కమాన్‌మీదుగా ఓపెన్‌టాప్ జీపులో ర్యాలీగా వెళ్లి కేబుల్ బ్రిడ్జి ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన డైనిమిక్ లైటింగ్ సిస్టమ్‌కు స్విచ్ఛాన్ చేయనున్నారు. -
బిహార్‌లో కూలిన తీగల వంతెన
-
బిహార్‌లో కూలిన తీగల వంతెన
పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్‌గంజ్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
దేశంలో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జి సిద్ధం
జమ్మూ: దేశంలోనే మొట్టమొదటి రైల్వే తీగల వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. కేవలం 11 నెలల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యిందని తెలియజేశారు. వంతెన వీడియోను షేర్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా అంజీ ఖద్‌లో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దీని మొత్తం పొడవు 473.25 మీటర్లు. 96 ప్రధాన తీగలు ఉన్నాయి. ఉదంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్)లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కాట్రా వైపు ఉన్న టన్నెల్ టీ2, రియాసీ వైపు ఉన్న టన్నెల్ టీ3ని ఇది అనుసంధానిస్తుంది. వంతెన నిర్మాణంలో ఉపయోగించిన మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై ఉన్న రైల్వే వంతెన తర్వాత ఇది దేశంలోనే రెండో అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన. బలమైన గాలులు, తుఫాన్లు, పేలుళ్లను సైతం తట్టుకొనేలా డిజైన్ చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్సలెంట్(అద్భుతం) అంటూ స్పందించారు. -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మూడు రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో భారీ బరువున్న క్రేన్లను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్ సూచించారు. మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. చదవండి: Alert: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
Karimnagar: తీగల వంతెనకు ముహూర్తం ఖరారు.. ఆరోజే ఓపెనింగ్!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ సిగలో మరో మణిహారంగా నిలిచే తీగల వంతెన ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వచ్చేనెల 14న వంతెన ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా వంతెనను ప్రారంభిస్తారని సమాచారం. వాస్తవానికి తీగల వంతెనను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభింపజేయాలని అంతా అనుకున్నారు. కానీ.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం, సెక్రటేరియట్ పనుల కారణంగా ఆయన పర్యటన సాధ్యపడలేదని తెలిసింది. అందుకే మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి మేరకు వంతెన ప్రారంభానికి స్వయంగా కేటీఆర్ రానున్నారని సమాచారం. వేగంగా డైనమిక్.. అప్రోచ్ రోడ్డు పనులు వరంగల్– కరీంనగర్ నగరాల మధ్య దాదాపు 7 కిలోమీటర్ల దూరం తగ్గించడం, హైదరాబాద్– కరీంనగర్ రహదారి మీద ట్రాఫిక్ జామ్ బెడద నివారణకు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి పూనుకుంది. 2018లో రూ.180 కోట్ల బడ్జెట్‌తో వంతెన పనులు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని తీగల వంతెన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కేబుల్ బ్రిడ్జి ఇదే కావడం విశేషం. పూర్తిగా విదేశీ ఇంజినీరింగ్ సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి నాణ్యతను ఇప్పటికే పలుమార్లు ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు. వచ్చేనెల 14న ప్రారంభ తేదీ ఖరారు కావడంతో ఇప్పటికే రూ.8కోట్లతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనులు, సదాశివపల్లి నుంచి తీగలవంతెన వరకు, ఇటువైపు హౌజింగ్ బోర్డు వైపు కమాన్ వెళ్లే మార్గాన్ని కలిపే అప్రోచ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల కోసం సామగ్రిని తరలించేందుకు జనవరి 26 నుంచి తీగల వంతెనపైకి వాహనాలను కూడా అనుమతించారు. ప్రతి ఆదివారం సెలవు..! ఏప్రిల్ 14న ప్రారంభించిన అనంతరం వాహనాలను వంతెన మీదికి అనుమతిస్తారు. అయితే ప్రతి ఆదివారం మాత్రం వాహనాలను అనుమతించరు. వంతెనపై ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్‌ను ఆస్వాదించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వంతెన నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆర్అండ్బీ అధికారుల సమక్షంలోనే బ్రిడ్జిపై నగరవాసులకు ఉపయోగపడే ఫుడ్, వినోదాత్మక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం పూట వెలుగుజిలుగుల మధ్య మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు వీలుగా మ్యూజిక్, కొరియా సాంకేతికతతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్, నాలుగు భారీ ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి విశేషాలు ►500 మీటర్ల పొడవైన రోడ్డు, ►నాలుగు వరుసల రహదారి. ►26 పొడవైన స్టీల్ కేబుల్స్.. ►ఇటలీ నుంచి తెప్పించినవి. ►వంతెనకు 2 పైలాన్లు, ►రెండు పైలాన్ల మధ్య దూరం ►220 మీటర్లు. ►పైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు దూరం 110 మీటర్లు. ►రూ.180 కోట్ల బడ్జెట్.. ►పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్. ►రూ.8 కోట్లతో కొరియా ►డైనమిక్ లైటింగ్ సిస్టమ్. ►వెడల్పు 21.5 మీటర్లు, ►7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు. ►రోడ్డుకు ఇరువైపులా ►2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు. ►టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం. ►2017 డిసెంబరులో శంకుస్థాపన, 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం. ►2023 జవనరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి. ►2023 ఏప్రిల్ 14న వంతెన ప్రారంభం. సీఎంకు కరీంనగర్ అంటే మమకారం ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే నిధుల కేటాయింపులో కరీంనగర్‌కు పెద్దపీట వేస్తారు. రూ.180 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ మంజూరు చేశారు. ఇందులో తీగల వంతెనను ఏప్రిల్ 14న కేటీఆర్ జాతికి అంకితం చేస్తారు. నగరవాసులకు పూర్తిస్థాయిలో ఉల్లాసం, ఆహ్లాదం కలిగించేందుకు కొంతకాలంపాటు ప్రతి ఆదివారం తీగల వంతెనపై రాకపోకలు నిలిపివేస్తాం. నగరవాసులు సంతోషంగా గడిపేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి -
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫౌంటేన్.. 150 మీటర్ల ఎత్తుతో నీరు పైకి
సాక్షి, కరీంనగర్: మానేరు తీరాన్ని సుందరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే రిటెయినింగ్ వాల్ నిర్మాణం వేగంగా సాగుతున్న క్రమంలో ఫౌంటేన్‌కు సంబంధించిన పనులు సమాంతరంగా ఊపందుకున్నాయి. ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న మానేరు వంతెనల నడుమ ఏర్పాటు చేస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టు.. కరీంనగర్ పర్యాటకానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టు పనులను మంత్రి గంగుల కమలాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఈ ప్రాజెక్టు పురోగతిపై నిరంతర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో హైలైట్‌గా నిలిచే ఫౌంటేన్ పనులకు ఈనెల 26వ తేదీన మంత్రి భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలన్న సంకల్పంతో జిల్లా మంత్రి,అధికారులు పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫౌంటేన్.. కరీంనగర్లో ఇన్స్టాల్ చేయబోయే ఫౌంటేన్ ప్రపంచంలోనే మూడోఅతిపెద్దది కావడం విశేషం. మొదటిది దక్షిణ కొరియాలోని సియోల్‌లో, రెండోది చైనాలోని షాంఘైలో మూడోది మన కరీంనగర్‌లోనే కావడం గమనార్హం. నీటి మీద 100 మీటర్ల ఎత్తున నిర్మించనున్న ఈ ఫౌంటేన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాత్రిపూట అందమైన రంగులు చిమ్మే లైటింగ్‌తోపాటు, సంగీతానికి అనుగుణంగా 150 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుతో నీరు పైకి చిమ్మడం పర్యాటకులను ముగ్గుదలను చేస్తుంది. దీనిపై నీటినే తెరగా చేసుకుని లఘు చిత్రాల ప్రదర్శన ప్రజలను అబ్బురపోయేలా చేస్తుందని మంత్రి తెలిపారు. భారతదేశ, తెలంగాణ చరిత్రలను తెలియజేసేలా పలు లఘుచిత్రాలను ప్రదర్శించే వీలు ఫౌంటేన్‌లో ఉండటం దీని ప్రతేకత. ఇందులో నీటిపారుదల శాఖ రూ.310 కోట్లు, పర్యాటకశాఖ రూ.100 కోట్లు మొత్తం రూ.410 కోట్ల ప్రాజెక్టు ఇది. ఇందులో కేవలం ఫౌంటేన్కే రూ.70 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఫౌంటేన్ ఒక హైలైట్ తొలిదశలో మానేరు రివర్ ఫ్రంట్ పనులను మొదటి దశలో 3.75 కి.మీ వరకు అభివద్ధి చేస్తాం. రెండవ దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తాం. మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము. మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టులో ఫౌంటేన్ ఒక హైలైట్‌గా నిలవనుంది. అలాగే తీగల వంతెనపై నాలుగు భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నాం. వాటి ద్వారా వాణిజ్య ప్రకటనలతోపాటు, ప్రభుత్వ పథకాలనూ ప్రచారం చేసుకోవచ్చు. -
కరీంనగర్: 26న తీగల వంతెన ఓపెన్!.. విశేషాలు ఇవే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనను ఈనెల 26వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వంతెనను ప్రారంభించనున్న నేపథ్యంలో బ్రిడ్జిపైకి 26వ తేదీ నుంచి వాహనాలను అనుమతించనున్నారు. ప్రస్తుతం అప్రోచ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. వంతెనకు రెండువైపులా ఇటు హౌజింగ్ బోర్డును అటు సదాశివపల్లిని కలిపేలా అప్రోచ్ రోడ్ పనులు వేగంగా నడుస్తున్న క్రమంలో వంతెనపై వాహనాలు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. 26 నుంచి హౌజింగ్ బోర్డు వద్ద పూర్తయిన అప్రోచ్ నుంచి వంతెనపైకి వాహనాలు నడిపించనున్నారు. అప్రోచ్ రోడ్డును కలిపే రెండు భారీ బీమ్స్ త్వరలోనే అధికారులు వంతెనకు అనుసంధానం చేయనున్నారు. దీంతో వాహనాలు వంతెనను ఎక్కేస్తాయి. డైనమిక్ లైటింగ్ పనులు..! వంతెనకు తుదిమెరుగులు దిద్దే కార్యక్రమం కూడా వేగవంతం నడుస్తోంది. ఇందులో భాగంగా.. వంతెనకు రాత్రిపూట మరింత అందాన్ని తెచ్చేలా డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రూ.8 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఎల్ఐఈడీ లైటింగ్ సిస్టం పనులు రెండుమూడు రోజుల్లో మొదలు కానున్నాయి. రాత్రిపూట కళ్లు జిగేల్ అనిపించేలా, పర్యాటకులకు కనువిందు చేసేలా రంగురంగుల ఎల్ఈడీ లైట్లు వంతెనకు ఏర్పాటు చేయనున్నా రు. ఈ లైట్లు వారధికి మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. నగర పర్యాటకానికి కొత్త శోభను తెచ్చేలా, చారిత్రక కరీంనగర్ పట్టణం సిగలో మరో మణిహా రంగా నిలిచిపోయే ఈ తీగల వంతెనను వచ్చే నెల తొలివారంలో ప్రారంభించేందుకు మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్ పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్డు పనులు డైనమిక్ లైటింగ్ ప నులపై నిరంతరం సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఒకే వరుసలో నాలుగు వారధులు..! శరవేగంగా తుదిమెరుగులు దిద్దుకుంటున్న తీగల వంతెనను ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీగల వంతెనను ప్రారంభించేందుకు జిల్లాకు రానున్నారు. అందుకే.. పట్టణ అభివృద్ధికి సాధారణ నిధులతోపాటు రూ.400 కోట్ల సీఎం అసూ్యరెన్స్ నిధులు, రూ.180 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను మంజూరు చేశారు. ఫిబ్రవరి నాటికి వంతెనను పూర్తిస్థాయిలో సిద్ధం చేయనున్నారు. జనవరి నెలాఖరునాటికి డైనమిక్ లైటింగ్ పూర్తవనుందని సమాచారం. ఇప్పటికే.. మానేరుపై నిర్మించిన ఎల్ఎండీ ఆనకట్ట, మధ్యలో రెండు వంతెనలు ఉన్నాయి. తరువాత తీగల వంతెన ప్రారంభమైతే.. కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో నాలుగు భారీ వంతెనలు ఒకే చోట ఉన్నట్లవుతుంది. ఇప్పటికే ఎల్ఎండీ వంతెనకు ప్రత్యేక లైటింగ్ ఉంది, ఇక మధ్య వంతెనలపై కార్పొరేషన్ లైటింగ్ సిస్టం ఉంది. తీగల వంతెన వెలుగులు వీటికి తోడైతే.. రాత్రిపూట మానేరు తీరం అంతా రంగురంగుల విద్యుత్తు కాంతులతో ఈ వారధులన్నీ ధగధగలాడనున్నాయి. పలు దఫాల్లో లోడింగ్ టెస్టు.. తీరనున్న ట్రాఫిక్ చిక్కులు.. గతేడాది జూన్‌లో వంతెనకు లోడింగ్ టెస్టు నిర్వహించారు. 28 టిప్పర్లలో 30 టన్నుల చొప్పున ఇసుక నింపి మొత్తం 840 టన్నుల బరువును ఒకేసారి వంతెనపై వివిధ ప్రాంతాల్లో ఉంచి పరిశీలించి, ప్రతీ అంశాన్ని నోట్ చేసుకున్నారు. అలాగే, ఫుట్‌పాత్‌లపై 110 టన్నుల ఇసుక బస్తాలను ఉంచి వాటి సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. రెండో దఫాలోనూ జూలై మొదటివారంలో ఇదే బరువుతో మరోసారి వంతెన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ అన్ని పరీక్షలను వంతెన విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ అతిపెద్ద ఇండస్ట్రీ. ఈ వంతెనపై నుంచి టన్నుల కొద్దీ బరువున్న గ్రానైట్ రాళ్లను కూడా తీసుకెళ్లవచ్చు. - అదే విధంగా ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పడనుంది. వరంగల్– హైదరాబాద్– కరీంనగర్ నగరాలకు అలుగునూరు కూడలిగా ఉంది. ఇప్పుడు అలుగునూరు కూడలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే.. మూడు నగరాలకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. వరంగల్– కరీంనగర్ మధ్య రాకపోకలకు సరికొత్త మార్గంగా మారుతుంది. అదే సమయంలో ఈ రెండునగరాల మధ్య దూరం 79 కిమీలలో సుమారు 7 కి.మీలు తగ్గనుంది. ఫిబ్రవరి నాటికి సిద్ధం: మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. పనులు తుదిదశలో ఉన్నాయి. వంతెనకు ఇప్పటికే పలుమార్లు లోడింగ్ టెస్టు కూడా పూర్తి చేశాం. ప్రస్తుతం అప్రోచ్ పనులు వేగంగా నడుస్తున్నాయి. త్వరలోనే డైనమిక్ లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేయనున్నాం. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో నగర కీర్తి ప్రతిష్టలు రెండింతలు అవుతాయి. నగర పర్యాటకానికి సరికొత్త శోభ చేకూరుతుంది. వరంగల్– కరీంనగర్ నగరాల మధ్య దూరం కూడా 7 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ఫిబ్రవరిలో సీఎం స్వయంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. వంతెన విశేషాలు ఇవే.. - 500 మీటర్ల పొడవైన రోడ్డు, నాలుగు వరుసల రహదారి.. - 26 పొడవైన స్టీల్ కేబుల్స్.. ఇటలీ నుంచి తెప్పించినవి. - వంతెనకు 2 పైలాన్లు, రెండు పైలాన్ల మధ్య దూరం 220 మీటర్లు - పైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు దూరం 110 మీటర్లు - రూ.180 కోట్ల బడ్జెట్.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్. - రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ - వెడల్పు 21.5 మీటర్లు, 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు.. - రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు - టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం - 2017 డిసెంబరులో శంకుస్థాపన - 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం - 2023 ఫిబ్రవరిలో వంతెన ప్రారంభం. -
ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం
పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు సీఎంతో పాటు కేబినెట్ మొత్తాన్నీ మార్చేసి ప్రభుత్వ వ్యతిరేకత బారి నుంచి తప్పించుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా దశా దిశా లేకుండా సాగిన కాంగ్రెస్ చివరికి చతికిలపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత గడ్డ అయిన గుజరాత్లో 27 ఏళ్ల అధికార వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ ఏడాది ముందు నుంచి సన్నాహాలు చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయడంతోపాటు ప్రభుత్వానికి కొత్త రూపు రేఖ కల్పించింది. సీఎంగా విజయ్ రూపానిని సీఎం పీఠం నుంచి తొలగించి రాష్ట్రంలో అత్యంత కీలకమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి పార్టీని గాడిన పెట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాకిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలకు కాస్త ముందు 2020 జులైలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ సామాజిక వర్గానికి చెందిన జితు విఘానిని తొలగించి ఆయన స్థానంలో సీ.ఆర్.పాటిల్‌కు అవకాశం కల్పించారు. టిక్కెట్ల పంపిణీలో కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినంగానే వ్యవహరించారు. ఏకంగా 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించి కొత్త ముఖాలను ప్రోత్సహించారు. చివరికి ఎన్నికలకి ముందు 140 మంది ప్రాణాలు కోల్పోయిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయిన మోర్బీలో కూడా బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధించిందంటే ఆ పార్టీ రచించిన పకడ్బందీ వ్యూహాలే కారణం. మోదీకి దేశ విదేశాల్లో ఉన్న జనాదరణ కూడా ఈ ఎన్నికల ఫలితాలను బాగా ప్రభావితం చేసింది. ఆయన 34 ర్యాలీలు, రెండు భారీ రోడ్ షోలతో దాదాపుగా కోటి మంది ఓటర్లను నేరుగా కలిశారు. ‘గుజరాత్‌ను నేనే నిర్మించాను, నన్ను చూసి ఓటు వెయ్యండ’న్న మోదీ విజ్ఞప్తికి ఓటర్లు సానుకూలంగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా సెల్ఫ్ గోల్ వేసుకోవడం బీజేపీ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నేతలందరూ బిజీగా ఉండి గుజరాత్‌ను పూర్తిగా వదిలేశారు. గతంలో కాంగ్రెస్‌కు బాగా కలిసొచి్చన క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చి దళిత ఉద్యమకారుడు జిగ్నేశ్ మేవానీ, ముస్లిం వర్గంలో పట్టున్న ఖాదిర్ ఫిర్జాదాలకు అక్కున చేర్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కొల్లగొట్టి కొన్ని సీట్లు సొంతం చేసుకోవడం బీజేపీకి లాభించింది. సామాజిక సమీకరణలు సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకుని పోయే వ్యూహాలనే బీజేపీ రచించింది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమంతో బీజేపీకి దూరమైన వారిని అక్కున చేర్చుకోవడానికి ఉద్యమ సారథి హార్దిక్ పటేల్‌ను పార్టీలో చేర్చుకుంది. 37శాతం ఉన్న ఓబీసీ ఓటర్లపై దృష్టి పెట్టి కాంగ్రెస్ నుంచి అల్వేష్ ఠాకూర్‌ని చేర్చుకుంది. ఫలితంగా 90 నియోజకవర్గాల్లో పై చేయి సాధించింది. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) -
కేబుల్‌బ్రిడ్జి పైనుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: కేబుల్‌బ్రిడ్జి పైనుండి యువతి చెరువులోకి దూకిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ ప రిధిలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్క ర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడారి హర్షిత(19) జ్ఞానదీపిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. మెహిదీపట్నంలోని సప్తగిరి కాలనీ, రేతిబౌలిలో నివాసముంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కేబుల్‌బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులోకి దూకింది. పెట్రోలింగ్ పోలీసులు గమనించి లేక్ పోలీసులను ఆప్రమత్తం చేయగా లేక్ డిపార్ట్మెంట్ ఎస్సై భాను ప్రకాశ్ వెంటనే బోటు డ్రైవర్ మనోహర్‌తో కలసి ఆమె దూకిన చోట గాలించి రక్షించారు. వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
తుప్పుపట్టిన కేబుళ్లు, వదులైన బోల్టులు.. మోర్బి ఘటనలో షాకింగ్ నిజాలు..!
గాంధీనగర్: 135 మంది అమాయకులు చనిపోయిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జ్ విషాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణం బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు నియమించిన కాంట్రాక్టర్లేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ప్రాథమిక దార్యాప్తులో తేలింది. స్థానిక కోర్టుకు సమర్పించిన ఈ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. బ్రిడ్జిని పునరుద్ధరించిన కాంట్రాక్టర్లు కేవలం మెటల్ ఫ్లోరింగ్‌ను మాత్రమే మార్చారని నివేదిక పేర్కొంది. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులుగా ఉన్న బోల్టులు, విరిగిన యాంకర్ పిన్స్ వంటి కీలక సమస్యలను పట్టించుకోలేదని తెలిపింది. కొత్తగా వేసిన మెటల్ ఫ్లోరింగ్ వల్ల వంతెన బరువు పెరిగినట్లు వెల్లడించింది. అసలు వంతెన పునరుద్ధరించేందుకు నియమించిన రెండు సంస్థలకు బ్రిడ్జిలకు మరమ్మతులు చేసే అర్హతే లేదనే షాకింగ్ విషయాన్ని నివేదిక బహిర్గతం చేసింది. నిపుణుడి సలహా తీసుకోకుండానే.. ప్రజల కోసం బ్రిడ్జిని తిరిగి ఓపెన్ చేసే ముందు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఒరెవా గ్రూప్ ఎలాంటి నిపుణుడి సలహా తీసుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. ఘటన జరిగిన అక్టోబర్ 30న ఈ సంస్థ 3,615 టికెట్లను విక్రయించిందని, బ్రిడ్జికి రెండువైపులా ఉన్న బుకింగ్ ఆఫీస్‌ల మధ్య సమన్వయం లేదని చెప్పింది. బ్రిడ్జి కూలినప్పుడు సామర్థ్యానికి మించి 250-300 మంది దానిపై ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ బ్రిడ్జిని రినోవేట్ చేసేందుకు గుజరాత్‌లోని ధ్రాగధ్రాకు చెందిన దేవ్ ప్రకాశ్ సోల్యుషన్ సంస్థను నియమించింది ఒరెవా సంస్థ. ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలను ఒరెవానే చూసుకుంటోంది. మరమ్మతులు చేసినప్పుడు బ్రిడ్జి మెటల్‌ను మాత్రమే మార్చామని దేవ్ ప్రకాశ్ సొల్యూషన్స్ కోర్టులో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు అధికారులు. వీరిలో ఒరెవా గ్రూప్ మేనెజర్లు దీపక్ పర్కేష్, దినేశ్ దావే సహా ఈ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు. దేవ్ ప్రకాశ్ సొల్యూషన్ సంస్థ ఓనర్లు ప్రకాశ్ పర్మార్, దేవంగ్ పర్మార్ కూడా అరెస్టయ్యారు. వీరంతా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ఇవ్వాల్సి ఉంది. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. -
Gujarat Assembly Election 2022: మోదీ నుంచి మోర్బీ వరకు...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తొలిసారిగా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతూ ఉండడంతో ప్రతీ అంశమూ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అధికార బీజేపీ ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం దగ్గర్నుంచి ఇటీవల జరిగిన మోర్బీ కేబుల్ వంతెన దుర్ఘటన వరకు ఎన్నో అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించనున్నాయి. అవేంటో చూద్దాం.. అధికార వ్యతిరేకత రాష్ట్రంలో 1998 నుంచి అంటే 24 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వంపై వివిధ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, తడిసిమోపెడైన జీవన వ్యయం, నాసిరకమైన రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం వంటివన్నీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లపై పడనున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ ఈ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం కానుంది. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మా తగ్గలేదు. 2001 నుంచి 2014 వరకు ఆయన రాష్ట్రాన్ని నడిపించిన తీరు, అంతర్జాతీయంగా మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు గుజరాత్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గుజరాత్ మనం తయారు చేసుకున్నదే అంటూ మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ మోడల్‌నే అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతూ ఉండడం గమనార్హం. బిల్కిస్ బానో దోషుల విడుదల గుజరాత్ మత ఘర్షణల సమయంలో జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను శిక్షా కాలం కంటే ముందుగానే విడిచిపెట్టడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ముస్లిం వర్గంపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. 6.5 కోట్లున్న గుజరాత్ జనాభాలో ముస్లింలు 11% ఉన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో వీరు ప్రభావం చూపించగలరు. బిల్కిస్ బానోకి న్యాయం జరగాలని వీరు చేస్తున్న ఆందోళనలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న చర్చ జరుగుతోంది. కరెంట్ కష్టాలు దేశంలో కరెంట్ చార్జీలు అత్యంత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నెల తిరిగేసరికల్లా వచ్చే బిల్లుని చూసి సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. ఇక కమర్షియల్ విద్యుత్ టారిఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంట్ చార్జీలు ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కి రూ.4 ఉంటే గుజరాత్లో ఏకంగా రూ.7.50గా ఉండడంతో వాణిజ్యవేత్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఆప్, కాంగ్రెస్ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలు ఇచ్చారు. రైతు సమస్యలు గుజరాత్ రాష్ట్రాన్ని గత రెండేళ్లుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పంట నీటిపాలై రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. అయినప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఇక అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం భారీగా భూముల్ని సేకరించింది. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వడోదర, ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం చేసిన భూ సేకరణ వివాదాస్పదమైంది. పేపర్ లీక్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష పేపర్ల లీకేజీ యువతలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. తరచుగా పేపర్స్ లీక్ కావడం పరీక్షలు వాయిదా పడడం నిరుద్యోగుల ఆశల్ని అడియాసలు చేస్తోంది. గత ఏడేళ్ల కాలంలో ఎనిమిది సార్లు వివిధ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకయ్యాయి. మోర్బీ వంతెన దుర్ఘటన సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ 30న కుప్పకూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాంట్రాక్టులు, స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి బదులుగా ప్రమాద సమయంలో నదిలోకి దూకి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే కాంతి అమృతియకు టికెట్ ఇవ్వడం చూస్తేనే దీని ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలివి ప్రదర్శిస్తున్నారా?.. మోర్బీ విషాదంపై కోర్టు సీరియస్
అహ్మదాబాద్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్‌ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్ వాల్ క్లాక్‌లు తయారు చేసే ఒరేవా గ్రూప్‌నకు 15 ఏళ్లపాటు వేలాడే వంతెన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ‘‘పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లను ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, గుజరాత్ చీఫ్ సెక్రెటరీని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ విభాగమైన మున్సిపాలిటీ(మోర్బీ మున్సిపాలిటీ).. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టానికి లోబడి ఇదంతా జరిగిందా?’’ అని గుజరాత్ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. గుజరాత్ హైకోర్టు మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి వివరణ కోరింది ధర్మాసనం. అయితే.. మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ ఈ విచారణకు హాజరు కాలేదు. ఇక నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ని ధృవీకరించడానికి ఏదైనా షరతు ఒప్పందంలో భాగమేనా?, అసలు ధృవీకరించడానికి బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే దానిపై సమాధానాలతో తిరిగి రావాలని అధికారులను గట్టిగా మందలించింది. అసలు అంత ముఖ్యమైన పనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం.. కేవలం ఒకటిన్నర పేజీలతో ఎలా పూర్తి చేశారు? అని సీజే, సీఎస్‌ను నిలదీశారు. కాంట్రాక్ట్ పత్రాల ఫైల్స్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు! -
లక్నవరం కేబుల్ బ్రిడ్జి సేఫెనా..?
-
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన...మున్సిపల్ ఆఫీసర్‌పై వేటు
అక్టోబర్ 30న మచ్చు నదిపై మోర్బీ తీగల వంతెన కూలి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాలను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్ జాలా ఛీఫ్ ఆఫీసర్‌గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కమిటీ దర్యాప్తులో....మున్సిపాలిటీ బోర్డు అనుమతి పొందకుండానే సుమారు 15 ఏళ్ల పాటు ఒరెవా గ్రూపుతో ఒప్పందంపై మున్సిపాలిటీ సంతకం చేసిందని అధికారులు తెలిపారు. అదీగాక 139 ఏళ్ల నాటి బ్రిడ్జిని ప్రైవేట్ కంపెనీ అనుమతి లేకుండానే మళ్లీ తెరిచినప్పుడూ మున్సిపాలిటీ చేతులు దులుపుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిని తిరిగి తెరిచేటప్పుడూ కూడా కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందా లేదా అనేది తెలియదని మున్సిపాలిటీ చీఫ్ సందీప్ జాలా అన్నారు. ఈ బ్రిడ్జిని ఒరెవా కంపెనీ మార్చి7 నుంచి మరమత్తుల నిర్వహణ విషయమై ఏడు నెలలపాటు మూసేసింది. న్యూయర్ వేడుకల నేపథ్యంలోనే అక్టోబర్ 26న వంతెనను తిరిగి ప్రారంభించింది. అయితే ఒరేవా మేనేజింగ్ డ్రైరెక్టర్ జయసుఖ్ పటేల్ మోర్బి జిల్లా కలెక్టర్ మధ్య 2008 ఒప్పందం ప్రకారం సుమారు 10 సవంత్సరాల పాటు వంతెనను నిర్వహించడానకి కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఒరెవా కాంట్రాక్టుకు ఎలాంటి టెండర్లు నిర్వహించలేదని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ బుధవారం స్థానిక కోర్టుకు తెలిపారు. అంతేగాదు కేవలం బ్రిడ్జి ప్లాట్‌ఫాంని మాత్రమే ఒరెవా గ్రూప్ మార్చిందని, తెగిపడిన కేబుల్ విభాగం బలహీనంగా తుప్పుపట్టి ఉందని పాంచల్ ఆరోపణలు చేశారు. అయితే మరో ప్రభుత్వ అధికారి 2018లోనే ఒప్పందం ముగిసిన ఒరెవాతో అనబంధ సాగించిందని, రాజ్‌కోట్ కలెక్టర్ కార్యాలయం కొత్త ఒప్పందం కుదుర్చుకునే వరకు వంతెనను నిర్వహించడానికి ఒరేవా మేనేజింగ్ డైరెక్టర్ పటేల్‌కు అనుమతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టులో టికెట్ పీజు పెంచాలన్న కంపెనీ ప్రతిపాదనను సైతం మున్సిపల్ బోర్డు తిరస్కరించిందని అధికారి తెలిపారు. ఈ ఏడాది ఒప్పందం ప్రకారం పెద్దలకు రూ.15, 12 సంవత్సారాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ. 10గా నిర్ణయించారు. ఈ మేరకు ఒరెవా గ్రూపుకు చెందని నలుగురు అధికారులను, మరమత్తులు కేటాయించిన కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మార్, దేవాంగ్ పర్మార్‌లతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసి త్వరతగతిన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
పరమ నాసిరకంగా మోర్బీ మరమ్మతులు
అహ్మదాబాద్: మోర్బి వంతెన పునర్నిర్మాణ పనులపై గుజరాత్ పోలీసు శాఖ విచారణలో కళ్లు తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘ఎటువంటి అనుభవం లేని అజంతా– ఓరెవా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. అది కేవలం వంతెన కేబుళ్లకు రంగులు, పాలిష్ వేసి హడావుడిగా ప్రారంభించేసింది. నాసిరకమైన బరువైన మెటీరియల్ వాడకం ఒక దుర్ఘటనకు కారణమైంది. పనులు చేసిన సిబ్బందికి వేలాడే వంతెనకు సంబంధించిన ఎలాంటి పరిజ్ఞానమూ లేదని తేలింది. పనులపై ఆడిట్ జరగలేదు. నిపుణుల పర్యవేక్షణా లేదు. తుప్పుపట్టిన పాత కేబుళ్ల స్థానంలో కొత్తవి వేయకపోవడం, సామర్థ్యానికి మించి జనాన్ని అనుమతించడం ఘోరానికి దారితీసింది. -
మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో సంచలన విషయాలు
-
మోర్బీ దుర్ఘటన.. దైవ నిర్ణయం!
మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో కూలిన కేబుల్ బ్రిడ్జి కేసులో అరెస్టయిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మచ్చు నదిపై బ్రిడ్జి పునరుద్దరణ పనులు చేపట్టిన అజంతా ఒరేవా కంపెనీని ప్రాసిక్యూషన్ తప్పుబట్టారు. పునరుద్దరణ పనులకు ఒరివా కంపెనీకి అసలు అర్హత లేదని మోర్బీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ ఇదే కంపెనీకి 2007, 2022లో బ్రిడ్జి రిపేర్ పనులకు కాంట్రాక్టు అప్పగించినట్లు తెలిపారు. వంతెన పునరుద్ధరణ సమయంలో ఫ్లోరింగ్ మార్చారు. కానీ అరిగిపోయిన తీగల స్థానంలో కొత్తవి అమర్చలేదని, పాత వాటిని అలాగే ఉంచారని ఆరోపించారు. దీనివల్ల కొత్తగా వేసిన నాలుగు లేయర్ల అల్యూమినియం ఫ్లోర్ బరువు ఎక్కువగా ఉండటంతో పాత తీగలు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసిందన్నారు. చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనకు సంబంధించి కోర్టులో హాజరు పరిచిన నిందితుల్లో ఒరేవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ కూడా ఒకరు. అయితే వంతెన ప్రమాదంలో తమ ప్రమేయం ఏం లేదని.. అది ‘గాడ్ విల్’(దైవ నిర్ణయం) అని దీపక్ కోర్టుకు తెలిపారు. ఇలాంటి దురదృష్ట ఘటన జరగకుండా ఉండాల్సిందని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎంజే ఖాన్ ముందు దీపక్ విన్నపించారు. విచారణ అనంతరం నలుగురు నిందితులను కోర్టు నలుగురికి కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా అయిదుగురికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మచ్చు నదిపై కూలిన తీగల వంతెన దుర్ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిపై నవంబర్ 14న సర్వన్నోత న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటి వరకు 135 మంది మృతిచెందగా.. 170 మందిని కాపాడినట్లు గుజరాత్ మంత్రి రాజేంద్ర త్రివేది వెల్లడించారు. మచ్చునదిలో ఇంకా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఘటనలో కంపెనీకి చెందిన 9 మందిని అరెస్టు చేయగా.. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, ఇతర అధికారులు పత్తా లేకుండా పోయారు. చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా? -
వైరల్ వీడియో: ‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా?
-
‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా?
బెంగళూరు: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జిల సామర్థ్యం, నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. మోర్బీ విషాదం చూసైనా కొందరు మారటం లేదు. మోర్బీ ఘటన జరిగిన మరుసటి రోజునే కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అత్యుత్సాహంతో కేబుల్ బ్రిడ్జిపైకి ఏకంగా కారునే తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యెల్లపురా నగరంలోని నదిపై ఉన్న తీగల వంతెనపైకి ఓ వ్యక్తి కారును తీసుకొచ్చాడు. అయితే, ముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో స్థానికులు అతడికి సాయం చేసి కారును వెనక్కి తీసుకెళ్లి ప్రమాదం నుంచి తప్పించారు. ఈ వంతెనను కేవలం ద్విచక్రవాహనాలు, నడక కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ, ఏకంగా కారునే తీసుకురావటం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు ఈ అంశంపై అధికారులకు సమాచారం అందించి అలర్ట్ చేశారు. అయితే, బ్రిడ్జిపై బైక్‌లు వెళ్లటాన్ని చూసి.. కారు సైతం వెళ్తుందని భావించినట్లు డ్రైవర్ తెలిపాడు. తాను స్థానికుడిని కాదని, ఫోర్వీలర్స్కు బ్రిడ్జి సరికాదని తెలియదని చెప్పాడు. ఇదీ చదవండి: మోర్బీలో ప్రధాని మోదీ.. కేబుల్ బ్రిడ్జి ప్రమాద బాధితులకు పరామర్శ -
మోర్బీ బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ
గాంధీనగర్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనాస్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మంగళవారం సాయంత్రం మోర్బీ పర్యటనకు వెళ్లిన ఆయన.. ప్రమాదం జరిగిన స్థలంలో కలియదిరిగారు. ఆ సమయంలో ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఈ సందర్భంగా.. అధికారులతో ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ప్రధాని. అనంతరం మోర్బీ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. త్వరగా బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి చెందిన కుటుంబాలను ప్రధాని మోదీ కలిసి సంఘీభావం తెలపనున్నారు. Prime Minister Narendra Modi, along with Gujarat CM Bhupendra Patel, visits the incident site in Morbi, Gujarat, while the search and rescue operation is underway in the Machchhu river. Death toll in the incident stands at 135 so far. pic.twitter.com/JefTWaTiNL — ANI (@ANI) November 1, 2022 #WATCH | PM Modi along with Gujarat CM Bhupendra Patel visits the cable bridge collapse site in Morbi, Gujarat 135 people lost their lives in the tragic incident pic.twitter.com/pXJhV7aqyi — ANI (@ANI) November 1, 2022 Gujarat | Prime Minister Narendra Modi met the injured admitted to Morbi Civil Hospital.#MorbiBridgeCollapse led to the deaths of 135 people so far. pic.twitter.com/UaKF2XcbCP — ANI (@ANI) November 1, 2022 #WATCH | PM Modi meets the injured in the #MorbiBridgeCollapse incident that happened on October 30 (Source: DD) pic.twitter.com/26tXlAvnmJ — ANI (@ANI) November 1, 2022 అక్టోబర్ 30న సాయంత్రం సమయంలో గుజరాత్ మోర్బీలోని మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తెగిపోవడంతో.. వందల మంది నీళ్లలో పడిపోయారు. ఘటనలో 140 మంది దాకా మృతి చెందగా.. పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని సమాచారం. మచ్చు నదిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. -
మోర్బీ హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ
-
గుజరాత్ లోని మోర్బీ లో ప్రధాని మోడీ పర్యటన
-
కూలిన తీగల వంతెన
కూలిన తీగల వంతెన -
మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు
మోర్బీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) మోర్బీకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. తీగల వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడి మోర్బీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలవనున్నారు. అయితే మోదీ సందర్శన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టారు. సోమవారం అర్థరాత్రి హడావిడీ సృష్టించి ఆసుపత్రికి మెరుగులు దిద్దారు. ఆసుపత్రి గోడలు, పైకప్పు భాగాలకు పెయింట్ వేశారు. టైల్స్ మార్చారు. కొత్త కూలర్లను తీసుకువచ్చారు. వంతెన దుర్ఘటనలో గాయపడిన 13 మందిని చేర్చుకున్న రెండు వార్డులలో బెడ్షీట్లు ఉన్నపళంగా మార్చేశారు. సిబ్బంది అంతా అర్థరాత్రి ప్రాంగణాన్ని ఊడ్చి క్లీన్‌గా చేశారు. మొత్తంగా ఆసుపత్రిని తళతళ మెరిసేలా చేశారు. కాగా ఆసుపత్రికి మెరుగులు దిద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాడైన గోడలు, పెచ్చులూడిన పైకప్పుకు పెయింటింగ్ వేయడం వంటి ఫోటోలు చూస్తుంటే ఆసుపత్రిలో అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అద్దం పడుతుంది. చదవండి: మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్, కమలా హారిస్ મોરબીમાં કાલે કમા ની મુલાકાત હોવાથી અત્યારે રાત્રે સિવિલ હોસ્પિટલ માં કલર કામ કરી રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. #Morbi #મોરબી #morbihospital pic.twitter.com/OS6EFlHyxf — Baraiya Nikunj (@NIKKUGAMING11) October 31, 2022 అయితే కేవలం మోదీ సందర్శన ముందు ఆసుపత్రి పునర్నిర్మాణ పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రి దృశ్యాలను షేర్ చేస్తూ.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కాషాయ పార్టీపై విరుచుకుపడ్డాయి. ప్రధానమంత్రికి ఫోటోషూట్ కోసం బీజేపీ ఈవెంట్ మేనేజ్మెంట్లో బిజీగా ఉందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా వ్యంగ్యసత్రాలు ఎక్కుపెట్టాయి. त्रासदी का इवेंट कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं। PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है। इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC — Congress (@INCIndia) October 31, 2022 ఓ పక్క బ్రిడ్జి కూలిన విషాద ఘటనలో వందలాది మంది చనిపోతే మరో పక్క మోదీ ఫోటోషూట్‌లో ఎలాంటి లోపం లేదని నిర్ధారించడానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని మండిపడ్డాయి. మోదీ కోసం పెయింటింగ్ వేస్తూ, టైల్స్‌ను మెరిపిస్తూ బిజీగా ఉన్న వారికి సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 27 ఏళ్లగా బీజేపీ సరిగా పని చేసి ఉంటే, అర్ధరాత్రి ఆసుపత్రిని అలంకరించాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశాయి. Morbi Civil Hospital का दृश्य... कल प्रधानमंत्री के Photoshoot में कोई कमी ना रह जाए इसलिए अस्पताल की मरम्मत की जा रही है। अगर भाजपा ने 27 वर्षों में काम किया होता तो आधी रात को अस्पताल को चमकाने की जरूरत न पड़ती।#BJPCheatsGujarat pic.twitter.com/h83iUmPzKA — AAP (@AamAadmiParty) October 31, 2022 గుజరాత్లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన పెను విషాద ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉండటం మరింత బాధకర విషయం.మరో 100 మంది గాయాలపాలయ్యారు. నదిలో గల్లంతైన వారికోసం సంఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటి వరకు దీనితో సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టు పొందిన ఒరివా కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్, కమలా హారిస్
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు గుజరాత్ ప్రజలతో కలిసి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బైడెన్ ట్వీట్ చేశారు. Jill and I send our deepest condolences to the families who lost loved ones during the bridge collapse in India, and join the people of Gujarat in mourning the loss of too many lives cut short. In this difficult hour, we will continue to stand with and support the Indian people. — President Biden (@POTUS) October 31, 2022 అదే విధంగా గుజరాత్ దుర్ఘటనపై అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ హృదయాలు భారత్‌లో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు మద్దతుగా ఉంటామని తెలిపారు. We stand with the people of India who are mourning the victims of the devastating bridge collapse in Gujarat. Our hearts are with those who lost loved ones and all those impacted. — Vice President Kamala Harris (@VP) October 31, 2022 అంతులేని విషాదం మోర్బి ప్రాంతంలో కూలిన బ్రిటిష్ కాలపు తీగల వంతెన విషాదం 140 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కూలిపోయిన విషయం తెలిసిందే. నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీ జలాల్లో పడిపోయిన తీరు కలిచివేస్తోంది. చదవండి: శాపమా? పాలకుల పాపమా? మొత్తం 140 మందికి పైగా సందర్శకులు ప్రమాదం బారినపడి అన్యాయంగా అసువులు బాసారు. ఆరంభించిన అయిదు రోజులకే రోప్ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఘటనా ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, భారత నేవీ సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ముమ్మాటికీ మానవ తప్పిదమే! మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. బ్రిడ్జికి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ జారీ చేయలేదని, మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని అధికారులు తెలిపారు. అంతేగాక ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది కాగా అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. అయినా ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యహరించి.. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు తెలిసింది. చదవండి: మోర్బీ వారధి విషాదం: మృతుల్లో 47 మంది పిల్లలు.. మరో వంద మందికిపైగా జలసమాధి! కేసు నమోదు, అరెస్టులు ఇప్పటివరకు 141 మృతదేహాలను వెలికి తీయగా అందులో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు.వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కొంతమంది మంది కుర్రాళ్లు.. బ్రిడ్జిని ఒక్కసారిగా ఊపేశారని అందుకే ప్రమాదం జరిగిందంటూ ఓ బాధితుడు మీడియాకు తెలిపాడు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు.దర్యాప్తు సిట్ ఏర్పాటుచేశారు. -
Morbi bridge collapse: మోర్బీ వంతెన ప్రమాదంలో... 134కు పెరిగిన మృతులు
మోర్బీ/న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై బ్రిటిష్ కాలపు తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 134కు పెరిగింది! మరో ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దుర్ఘటన నేపథ్యంలో గుజరాత్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో రోడ్డు షో రద్దు చేసుకోగా కాంగ్రెస్ పరివర్తన్ సంకల్ప యాత్రను వాయిదా వేసుకుంది. గుజరాత్‌లోనే ఉన్న మోదీ ఈ ఘటనపై సోమవారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బాధితులకు అన్ని విధాలా సాయమందించాలని ఆదేశించారు. మంగళవారంఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. మోర్బీ వంతెన ప్రమాదంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ కుటుంబంలో పెను విషాదం వంతెన ప్రమాదానికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కల్యాణ్‌జీ కుందారియా కుటుంబంలో ఏకంగా 12 మంది బలయ్యారు! వారంతా ఆయన సోదరుడు, సోదరీమణుల కుటుంబాలకు చెందినవారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. బ్రిడ్జిని చూసేందుకని వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోయారంటూ ఎంపీ కంటతడి పెట్టారు. ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘అజంతా’కు నిర్వహణ కాంట్రాక్ట్ మోర్బీ వంతెన నిర్వహణ, అపరేషన్ కాంట్రాక్ట్‌ను అజంతా ఒరెవా కంపెనీకి అప్పగించారు. సీఎఫ్ఎల్ బల్బులు, గోడ గడియారాలు, ఎలక్ట్రానిక్ బైక్‌ల తయారీకి అజంతా గ్రూప్ పేరొందింది. ఎల్ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లు, సెరామిక్ ఉత్పత్తులనూ తయారు చేస్తోంది. గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్ల పైమాటే. ‘ఫిట్‌నెట్ సర్టిఫికెట్’ లేకుండానే.. బ్రిడ్జికి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ జారీ చేయలేదని మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ చెప్పారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని తెలిపారు. ‘‘వంతెనపైకి 20–25 మందిని ఒక గ్రూప్‌గా అనుమతిస్తుంటారు. కానీ నిర్వాహక సంస్థ అజంతా ఒరెవా నిర్లక్ష్యంగా ఒకేసారి దాదాపు 500 మందిని వెళ్లనిచ్చింది. అదే ఘోర ప్రమాదానికి దారి తీసింది’’ అన్నారు. 9 మంది అరెస్టు ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఐపీసీ సెక్షన్ 304, సెక్షన్ 308 కింద కేసు పెట్టామన్నారు. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడి స్థానంలో అజంతా కంపెనీ పేరు చేర్చామన్నారు. పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించారు. అరెస్టయిన 9 మందిలో అజంతా ఒవెరా గ్రూప్‌నకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టిక్కెట్ బుకింగ్ క్లర్కులు ఉన్నారు. బతుకుతెరువు కోసం వెళ్లి బలయ్యాడు బర్ధమాన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్బ బర్ధమాన్ జిల్లా కేశబ్బతి గ్రామానికి చెందిన 18 ఏళ్ల షేక్ హబీబుల్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని మోర్బీకి చేరుకున్నాడు. నగల దుకాణంలో పనికి కుదిరాడు. గత 10 నెలలుగా అక్కడే పనిచేస్తున్నాడు. ఆదివారం తీగల వంతెన చూసేందుకు వెళ్లాడు. దానిపైకి చేరుకొని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. షేక్ హబీబుల్ మృతితో స్వగ్రామం కేశబ్బతిలో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కలలన్నీ చెదిరిపోయాయని హబీబుల్ తండ్రి మహీబుల్ షేక్ వాపోయాడు. హబీబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కునాల్ ఘోష్ భరోసానిచ్చారు. 675 టికెట్లు అమ్మారా? మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది. అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నా చెల్లెలు కనిపించడం లేదు ప్రమాదంలో చెల్లెలు కనిపించకుండా పోయిందని ఓ యువకుడు రోదిస్తున్నాడు. ‘‘ఆ వంతెనపైకి మొదటిసారి వెళ్లాం. అప్పటికే వందలాది మంది ఉన్నారు. సెల్ఫీలు తీసుకుంటుండగానే కుప్పకూలింది. నేను మాత్రం ఈదుకొచ్చా. చెల్లి కోసం నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నా’’ అన్నాడు. భారీ శబ్దం వినిపించింది ‘‘స్నేహితులతో కలిసి వంతెన సమీపంలోనే కూర్చున్నా. అంతలో భారీ శబ్దం వినిపించింది. వంతెన కూలింది. వెంటనే అక్కడికి పరుగెత్తాం. కొందరు ఈదుతూ, మరికొందరు మునిగిపోతూ కనిపించారు. మేం పైపు సాయంతో 8 మందిని రక్షించాం’’ అని సుభాష్ భాయ్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. నా మిత్రుడు రాజేశ్ ఏమయ్యాడు? తన మిత్రుడు రాజేశ్ గల్లంతయ్యాడంటూ జయేశ్ భాయ్ అనే యువకుడు కంటతడి పెట్టాడు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని వాపోయాడు. 15 మృతదేహాలను బయటకు చేర్చా వంతెనపై 60 మందికి పైగా వేలాడుతూ కనిపించారని రమేశ్ భాయ్ చెప్పాడు. మిత్రులతో కలిసి తాడు సాయంతో 15 మృతదేహాలను బయటకు తెచ్చామన్నాడు. -
శాపమా? పాలకుల పాపమా?
దారుణం... దిగ్భ్రాంతికరం. ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మోర్బీ వద్ద కుప్పకూలిన తీగల వంతెన దుర్ఘటనను అభివర్ణించడానికి బహుశా ఇలాంటి మాటలేవీ సరిపోవేమో! నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీజలాల్లో పడిపోయిన తీరును వీడియోల్లో చూస్తుంటే గొంతు పెగలడం కష్టం. తెగిపోయిన తీగల మొదలు అందిన అవశేషం ఏదైనా సరే పట్టుకొని, ప్రాణాలు దక్కించుకొనేందుకు పైకి ఎగబాకాలని బాధితులు శతవిధాల ప్రయత్నిస్తూనే ప్రాణాలు కోల్పోయిన తీరు ఎంతటివారినైనా కన్నీరు పెట్టిస్తుంది. రెండేళ్ళ చిన్నారి సహా 47 మంది పిల్లలు... కడపటి వార్తలందేసరికి మొత్తం 140 మందికి పైగా అమాయకులు... అన్యాయంగా వారి ప్రాణాలు తీసిన ఈ ఘటన పరిహారమిచ్చి తప్పించుకోలేని పాపం. ఆరంభించిన అయిదు రోజులకే రోప్ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ! గుజరాత్‌లోని మచ్ఛు నదిపై దాదాపు 150 ఏళ్ళ క్రితం బ్రిటీషు కాలంలో కట్టిన ఈ తీగల వంతెన పేరున్న పర్యాటక ప్రాంతం. ఇప్పుడిది మరుభూమికి మారుపేరు. కొన్ని కుటుంబాలకు కుటుంబాలు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాయి. ఓ పార్లమెంట్ సభ్యుడి సోదరి సహా సమీప బంధువులు 12 మంది ఒకేసారి ఈ దుర్ఘటనలో చనిపోయారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు తక్షణ నష్టపరిహారాలు ప్రకటించి, సహాయక చర్యలు దిగాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సారథ్యంలో దర్యాప్తునకు ఆదేశించి, పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, ప్రస్తుతానికి ఈ బిడ్జి మరమ్మత్తులు చేసిన కంపెనీ ఉద్యోగులతో పాటు టికెట్లు అమ్మిన ఇద్దరు క్లర్కుల్నీ, ఒక బ్రిడ్జి కాంట్రాక్టర్నీ, భద్రతా సిబ్బందినీ అంతా కలిపి 9 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికీ మరో 100 మందికి పైగా జాడ తెలియని పరిస్థితుల్లో ఇవేవీ బాధితుల కన్నీళ్ళను తుడిచేయలేవు. ప్రకృతి కాక, మానవ తప్పిదాలే ఈ ఘోరకలికి కారణం కావడం విచారకరం. అనేక అంశాల్లో పాతుకుపోయిన ప్రభుత్వ యంత్రాంగ నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అజంతా బ్రాండ్ పేరుతో గోడ గడియారాలు, కాలిక్యులేటర్లకు ప్రసిద్ధమై, సీఎఫ్ఎల్ దీపాలు, ఇ– బైక్స్ రూపొందిస్తున్న ప్రైవేటు సంస్థ ఒరేవా. ఏటా రూ. 800 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ గడియారాల కంపెనీకి వంతెన మరమ్మత్తుతో సంబంధం ఏమిటో, దానికి ఈ పని ఎందుకు అప్పగించారో అర్థం కాదు. 51 ఏళ్ళుగా వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ బ్రిడ్జి నిర్వహణను 15 ఏళ్ళకు లీజు తీసుకొని, మరమ్మత్తుల పని మూడోవ్యక్తికి కట్టబెట్టింది. బ్రిడ్జి పనులకు అధికారికంగా 8 నుంచి 12 నెలల టైమ్ ఇచ్చినా, హడావిడిగా 5 నెలల్లో పూర్తి చేశారు. ఏడాదికి పైగా పట్టే మరమ్మత్తులను హడావిడిగా అయిందనిపించి, గుజరాతీ సంవత్సరాదికి అక్టోబర్ 26న ప్రారంభించాల్సిన తొందర ఏమిటి? స్థానిక మునిసిపాలిటీ నుంచి అనుమతి లేకుండానే, బ్రిడ్జి దృఢత్వంపై పరీక్షలు చేయకుం డానే ఒరేవా సంస్థ రోప్బ్రిడ్జిపై పర్యాటకం ఎలా ప్రారంభించింది? ఏకకాలంలో 125 మందిని మించి మోయలేని వంతెనపై అదే పనిగా టికెట్లమ్ముతూ 500 పైచిలుకు మందిని ఎలా అనుమతిం చారు? తీగల వంతెన పైకి చేరిన కొందరు ప్రమాదకరంగా ఆ తీగలను పట్టుకొని ఊగుతుంటే వారిని ఆపేందుకు సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబు లేదు. మరో నెలలో గుజరాత్లో ఎన్నికలున్న వేళ ఈ ప్రమాదం రాజకీయ ఆరోపణల పర్వానికి దారి తీసింది. 2016లో కోల్‌కతాలో ఫ్లై–ఓవర్ కూలి, పలువురు మరణించినప్పుడు అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ తప్పుపడుతూ ‘ఇది దేవుడి శాపమా, లేక అవినీతి పాపమా’ అంటూ చేసిన మాటల దాడిని ప్రతిపక్షాలు వ్యంగ్యంగా గుర్తు చేస్తున్నాయి. శవ రాజకీయాలు ఎవరు చేసినా సమర్థనీయం కాదు కానీ, ఎఫ్ఐఆర్లోని నిందితుల పేర్లలో సంస్థ పేరు కానీ, దాని అధిపతి పేరు కానీ, వ్యక్తుల పేర్లు కానీ లేకపోవడం కచ్చితంగా ప్రశ్నార్హమే. చిన్న చేపల్ని పట్టుకొని వ్యాపార తిమింగలాల్ని వదిలేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కార్పొరేట్లకూ, రాజకీయాలకూ మధ్య పెరుగుతున్న బంధాన్ని సూచిస్తోంది. దాదాపు పాతికేళ్ళుగా గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీకి ఇది కొంత ఇబ్బందికరమైన విషయమే. మోదీ, షాలిద్దరూ గుజరాత్ వారే కావడం మరో ఇబ్బంది. యూపీలోని చందౌలీ దగ్గరా ఛఠ్ పూజ సందర్భంగా ఆదివారం ఓ వంతెన పాక్షికంగా కూలినట్టు ఆలస్యంగా వార్తలందుతున్నాయి. ఎలాంటి ప్రాణహానీ జరగనప్పటికీ, ఇలాంటి ఘటనలన్నీ మన ప్రాథమిక వసతి సౌకర్యాలలోని లోటుపాట్లను ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికల వేళ 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పర్యటించనున్నారు. కానీ అంతకన్నా ముఖ్యం ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడం! ప్రతిపక్షాలు కోరుతున్నట్టు రాష్ట్ర సర్కార్ హయాంలోని అధికారులతో కాక, రిటైర్డ్ జడ్జీల్లాంటి వారితో స్వతంత్ర దర్యాప్తు జరిపి, అసలైన బాధ్యుల్ని కనిపెట్టడం కఠినంగా శిక్షించడం! అలవి మాలిన నిర్లక్ష్యం అన్నింటా ప్రమాదకరమే. ప్రజా సౌకర్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొన్నిసార్లు అది ప్రజల ప్రాణాలకే ముప్పు. ఏమైనా, మోర్బీ ఘటన అక్షరాలా పాలకుల, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే. కొందరి బాధ్యతారాహిత్యానికీ, అవినీతికీ ప్రజలు బలి కావాలా? ఆత్మవిమర్శ చేసుకో వాలి. పర్యాటకంతో ఆర్థిక ఆర్జన కన్నా అమాయకుల ప్రాణాలు ముఖ్యమని అర్థం చేసుకోవాలి. -
మోర్బీ విషాదంపై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
గాంధీనగర్: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా ఆచూకీ గల్లంతైన క్రమంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మోర్బీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ వేదికగా ఈ రీవ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జి కూలిపోయినప్పటి నుంచి తీసుకుంటున్న సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లను ప్రధానికి వివరించారు అధికారులు. ఈ విషాదానికి కారణమైన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలోని బాధితులకు అన్ని విధాల సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదీ చదవండి: మోర్బీ ఘటన.. మరో వంద మందికిపైగా జలసమాధి! -
మోర్బీ ఘటన.. మరో వంద మందికిపైగా జలసమాధి!
న్యూఢిల్లీ: సరదా.. పెను విషాదాన్నే మిగిల్చింది. గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ప్రమాదంలో.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఘటన సమయంలో ఐదు వందల మందికి పైగా బ్రిడ్జి మీద ఉన్నట్లు ఒక అంచనా. ఇప్పటిదాకా 140 మందికిపైగా మృతదేహాలను వెలికి తీశాయి సహాయక సిబ్బంది. ఈ తరుణంలో.. సోమవారం చీకటి పడడంతో ఇవాళ్టికి రెస్క్యూ ఆపరేషన్ నిలిపి వేశారు. తిరిగి మంగళవారం ఉదయం సహాయక చర్యలు చేపడతామని వెల్లడించారు అధికారులు. ఇక ఘటనకు సంబంధించి గాయపడిన వాళ్లకు చికిత్స అందుతుండగా.. మరో వంద మందికిపైగా జాడ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో బుదర, మురికితో కూడి ఉన్న మచ్చు నది నీళ్లలో వందకుపైగా మృతదేహాలు చిక్కుకుని ఉంటాయని భావిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జికి.. ఏడు నెలలపాటు మరమ్మతుల పనులు జరిగాయి. అయితే.. రూల్స్ ప్రకారం ఎనిమిది నుంచి 12 నెలల పనుల తర్వాతే బ్రిడ్జి ప్రారంభం కావాలి. కానీ, గడువు కంటే ముందుగానే బ్రిడ్జిని అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించారు నిర్వాహకులు. ఆదివారం సాయంత్రం బ్రిడ్జి కూలిన ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటివరకు 141 మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది చిన్నారుల బాడీలు ఉన్నట్లు గుర్తించారు. "15-20 boys were shaking the #MorbiBridge, after that the accident happened" : ◆ A person who survived the Accident speaks.#MorbiBridgeCollapse #MorbiBridge #MorbiTragedy pic.twitter.com/q9TySIreDx — The Analyzer- ELECTION UPDATES (@Indian_Analyzer) October 31, 2022 వారాంతం కావడంతో ఒక్కసారిగా బ్రిడ్జి మీదకు ఎక్కువ సంఖ్యలో జనాలు చేరారని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ ప్రమాదానికి గల కారణాలు గుర్తించింది. బ్రిడ్జి నిర్మాణం నమునాను సైతం గ్యాస్ కట్టర్ల సాయంతో సేకరించి మరీ పరిశీలిస్తోంది బృందం. అయితే పది నుంచి పదిహేను మంది కుర్రాళ్లు.. బ్రిడ్జిని ఒక్కసారిగా ఊపేశారని అందుకే ప్రమాదం జరిగిందంటూ ఓ బాధితుడు మీడియాకు వెల్లడించాడు. So Sad, it's horrible#Morbi #MorbiBridgeCollapse#Corruption pic.twitter.com/RSXZFqvdIN — Yuvrajsinh Jadeja (@YAJadeja) October 31, 2022 మోర్బీ మున్సిపల్ అథారిటీ, అజంతా మానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మొత్తం పదిహేనేళ్ల పాటు కాంట్రాక్ట్ జరిగింది. ఇందులో భాగంగా గుజరాత్‌కు చెందిన వాచ్‌తయారీ కంపెనీ ఒరెవా గ్రూప్ బ్రిడ్జిని మెయింటెన్ చేస్తూ.. టికెట్ల మీద వచ్చే కలెక్షన్స్‌ను తీసుకుంటోంది. ఒక్కో వ్యక్తికి రూ.12-రూ.17 చొప్పున వసూలు చేస్తూ వస్తోంది. ఒరెవా గ్రూప్.. దేవ్‌ప్రకాశ్ సొల్యూషన్స్ అనే ఓ చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీకి రినోవేషన్ బాధ్యతలను అప్పజెప్పింది. ఇక బ్రిడ్జి పునప్రారంభం గురించి మోర్బీ మున్సిపాలిటీకి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. అయితే ఒరెవా మాత్రం సుమారు 2 కోట్ల రూపాయలతో.. ఏడు నెలల్లోనే పటిష్టంగా పనులు జరిపినట్లు ప్రకటించుకుంది. ఒక్కసారిగా చేరిన జనం.. కొందరు కావాలని ఊగిపోవడంతో.. మెటల్ కేబుల్స్ తెగిపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వీడియో ఆధారంగా తెలుస్తోంది. ఒరెవా మాత్రం.. ఒకవేళ జనాలు డ్యామేజ్ చేస్తే తప్పించి తాము చేపట్టిన రినోవేషన్ పనులకు ఎనిమిది ఏళ్ల మినిమమ్ గ్యారెంటీ నుంచి గరిష్టంగా పదిహేనేళ్ల గ్యారెంటీ ఉంటుందని ఒక ప్రకటన విడుదల చేసింది. అదీ బ్రిడ్జి ప్రారంభం కాకముందే.. 24వ తేదీనే కావడం గమనార్హం. ఇక ఈ ఘటనకు సంబంధించి కాంట్రాక్ట్‌తో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఇద్దరు ఒరెవా గ్రూప్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక కంపెనీకి సంబంధించిన ప్రధాన అధికారులు పరారీలో ఉన్నారన్న కథనాలపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఎంతటి వాళ్లనైనా ఉపేక్షించేది లేదంటూ గుజరాత్ పోలీసులు ప్రకటించారు. ప్రత్యేక విచారణ బృందం (SIT) ద్వారా మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇదీ చదవండి: మోర్బీ తరహాలో దేశంలో జరిగిన విషాదాలు ఇవే.. -
ప్రపంచవ్యాప్తంగా పలు బ్రిడ్జిల ఘోర ప్రమాదాలు (ఫొటోలు)
-
మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే..
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం. 2022, జనవరి 1: జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 2016, ఏప్రిల్ 10: కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2016, మార్చి 31: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్పై హత్య కేసు నమోదైంది. 2014, అక్టోబర్ 3: బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు. 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది. 2013, ఫిబ్రవరి 10: కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు. 2012, నవంబర్ 19: బిహార్ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్ ఘాట్ వద్ద చట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011, జనవరి 14: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. 2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు. 2008, సెప్టెంబర్ 30: రాజస్థాన్, జోధ్‌పుర్ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. 2008, ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. 2005, జనవరి 25: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. 1997, జూన్ 13: దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్ థియేటర్లో బాలీవుడ్ సినిమా ‘బార్డర్’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 1997, ఫిబ్రవరి 23: ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 1954, ఫిబ్రవరి 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన పలు బ్రిడ్జిలు (ఫొటోలు) ఇదీ చదవండి: మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. కిందిస్థాయి ఉద్యోగుల అరెస్టు.. పత్తా లేకుండా పోయిన పైఅధికారులు -
మోర్బీ విషాదం.. అరెస్టులు షురూ
గాంధీనగర్: దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు తీసిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన కేసులో పోలీసుల చర్యలు మొదలయ్యాయి. బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపట్టిన ఓరేవా కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అయితే వాళ్లిద్దరూ మధ్య స్థాయి ఉద్యోగులని తెలుస్తోంది. బ్రిడ్జి దుర్ఘటన జరిగినప్పటి నుంచి కంపెనీ సీనియర్లు పత్తా లేకుండా పోయారు. వాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జి పునఃప్రారంభ విషయంలో ఒరేవా ఎన్నో తప్పిదాలకు పాల్పడిందని.. ఫిట్నెస్ సర్టిఫికెట్ దగ్గరి నుంచి బ్రిడ్జిని తిరిగి ప్రారంభించడం దాకా.. అన్నింట్లోనూ వైఫల్యాలే ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో విచారణ అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముందు ముందు మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయని విచారణ జరుపుతున్న సిట్ ప్రకటించింది. ఇక ప్రమాదానికి ముందు కొందరు కుర్రాళ్లు.. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తాళ్లను విపరీతంగా ఊపారని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఓ బాధితుడు మీడియాకు వెల్లడించాడు. #WATCH | An injured survivor in the #MorbiBridgeCollapse recounts the harrowing moment when the suspension bridge collapsed and how he saved himself pic.twitter.com/MWX3HpwqmT — ANI (@ANI) October 31, 2022 -
Morbi Tragedy: కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై పుతిన్ సంతాపం
మాస్కో: గుజరాత్ మొర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద దుర్ఘటన.. దేశాన్ని విస్మయానికి గురి చేసింది. మృతుల సంఖ్య 141కి చేరుకోగా.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఘటనాస్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది. మొర్బి కేబుల్ బ్రిడ్జి ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధానిలను ఉద్దేశిస్తూ.. ఈ మేరకు పుతిన్ సంతాప ప్రకటనగా క్రెమ్లిన్ ఒక సందేశం విడుదల చేసింది. అంతేకాదు.. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఇదిలా ఉంటే.. స్వరాష్ట్రంలో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వాళ్లకు రూ.50వేల పరిహారం ప్రకటించారు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడ్డ వాళ్లకు రూ.50వేలు పరిహారం ప్రకటించింది. Here is the authentic CCTV footage of the Morbi bridge collapse: NOT the old videos that are being made viral to blame the public. Yes, bridge is crowded but to blame crowds would be to shun responsibility for multiple level failures of those involved in ensuring safety. pic.twitter.com/6wVA0xddXl — Rajdeep Sardesai (@sardesairajdeep) October 31, 2022 -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాదం.. వంతెన కూలడానికి కారణాలివేనా?
గుజరాత్లో మచ్చు నదిపై నిర్మించిన మోర్బీ తీగల వంతెన కూలిపోయిన ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలడంతో దాని మీదున్న వందలాది మంది సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 130 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మందిని రక్షించారు. మరో వందమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరమ్మతుల కోసం ఆరు నెలల క్రితం మూసేసిన ఈ కేబుల్ బ్రిడ్జిని ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. వారం కూడా గడవక ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కూలిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. చదవండి: Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి విషాదం. 12 మంది ఎంపీ కుటుంబ సభ్యులు మృతి ప్రస్తుతం బ్రిడ్జి కూలడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్న అందరి బుర్రల్లో మెదులుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటం, పాతకాలపు వంతెన, నిర్వహణ లోపం వంటి పలు కారణాలు తెర మీదకు వస్తున్నాయి. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం #Watch the CCTV footage of the bridge collapse in Gujarat's Morbi. Over 200 people have been rescued from the site of the incident, MoS Harsh Sanghvi said Monday. #MorbiBridgeCollapse Follow live updates: https://t.co/yxhdG5Hw3P pic.twitter.com/d1cKoTSDQw — The Indian Express (@IndianExpress) October 31, 2022 ► మచ్చు నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రద్దీ ఎక్కువగా కనిపించింది. దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై స్థానికులతో పాటు సందర్శకులు మొత్తం కలిపి 500మంది వరకు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీరిలో ఛట్ పూజా వేడుకల కోసం, సెలవు దినం కావడంతో కుటుంబంతో వచ్చినవారు అధికంగా ఉన్నారు. ఒకేసారి వంతెనపై పరిమితికి మించి ఎక్కువ మంది నడవటం, జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. Over 100 killed and 170 injured in the tragic #Morbi bridge collapse in Gujarat. Several people still remain missing. Rescue efforts underway by Indian Army, Indian Navy, Indian Air Force, NDRF, SDRF, Fire Brigade and local police. Chief Minister and Home Minister at spot. pic.twitter.com/mocM8UuajY — Aditya Raj Kaul (@AdityaRajKaul) October 30, 2022 ► ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో బ్రిడ్జిపై నడుస్తున్న కొందరు యువకులు ఉద్ధేశ పూర్వకంగా వంతెనను విపరీతంగా ఊపుతుండటం, ఒకరినొకరు తోసుకోవడం కనిపిస్తుంది. యువకుల పిచ్చి చేష్టల వల్లే బ్రిడ్జి కూలిందని నెటిజనన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో పాతదా.. ప్రమాదానికి ముందు తీసిందా అనేది తెలియాల్సి ఉంది. ► మోర్బీ వంతెన 140 ఏళ్ల నాటిది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జి కావడం, బలమైన పునాది లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మరమత్తుల కోసం వంతెనను మూసేశారు. ఏడు నెలలపాటు మరమత్తులు నిర్వహించి గుజరాత్ న్యూయర్ డే వేడుకల కోసం అక్టోబర్ 26నే తిరిగి సందర్శకుల నిమిత్తం తెరిచారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ఛట్ పూజ నేపథ్యంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వందలాది మంది ఒకేసారి వంతెనపైకి వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ►మరమత్తుల అనంతరం వంతెనను తెరవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. అంతేగాక వంతెన పటిష్టతను తనిఖీ చేయలేదని, బ్రిడ్జికి మున్సిపల్ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే రీఓపెన్ చేశారని విమర్శలు గుప్పుముంటున్నాయి. అయితే బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మోర్బీలో వంతెన కూలిన ఘటన
-
మోర్బీ బ్రిడ్జి విషాదం.. 12 మంది బీజేపీ ఎంపీ కుటుంబ సభ్యులు మృతి
గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదీపై తీగల వంతెన కూలిన ఘోర దుర్భటన యావత్ భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సెలవు దినం.. ఆపై ఛట్ పూజ సంబరాలతో వందలాది మంది ఆహ్లాదంగా నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారింది. అందరూ హడావిడిగా ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలడంతో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది నదిలో పడిపోయారు. చేతికి అందిన తీగలు పట్టుకొని కొందరు నదిలో పడకుండా ఆపుకోగలిగారు. వంతెన పునరుద్దరించిన నాలుగు రోజుల్లోనే కూలిపోవడంతో 130 మందికి పైగా జల సమాధి అవ్వడం తీరని విషాదంగా మారింది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉండటం మరింత ఆవేదన కలిగిస్తోంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన పలువురు మృతి చెందారు. రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా సోదరికి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ‘‘వంతెన కూలిన దుర్ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా నా సోదరి కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయాను. ఘటనా స్థలంలో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారికి చికిత్స అందుతోంది. నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బోట్లు కూడా సంఘటనా స్థలంలో ఉన్నాయి. వంతెన కూలిన ఘటనలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. 60 మృతదేహాలను వెలికితీశాం’ అని ఎంపీ పేర్కొన్నారు. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం 132కు చేరిన మృతుల సంఖ్య మోర్భీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. 140 ఏళ్లనాటి వంతెన కాగా ఈ వంతెనను 140 ఏళ్ల నాటిది. 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీనిని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. బ్రిటిష్ కాలం నాటి ఈవంతెనకు రూ. 2 కోట్లతో 7 నెలల పాటు మమరమత్తులు నిర్వహించి ఆధునీకరించారు. అయితే రిపేర్ తర్వాత వంతెనకు సేఫ్టి సర్టిఫికెట్ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
గుజరాత్ లో ఘోరం
-
Photos: గుజరాత్లో ఘోరం.. మచ్చూ నదిపై కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
-
140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం
మోర్బీ: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. Early morning visuals from the accident site in #Morbi where over 130 people have died after a cable bridge collapsed. Gujarat Minister Harsh Sanghavi present at the spot. pic.twitter.com/mOtsYcINt2 — NDTV (@ndtv) October 31, 2022 మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే గుజరాత్ సీఎం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు మోదీ. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఇక మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. కట్టింది 1880లో...! తీగల సాయంతో వేలాడే మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జిపై నడవడం సందర్శకులకు మధురానుభూతి కలిగిస్తుంది. నిత్యం వందలాది మంది దీన్ని సందర్శిస్తుంటారు. ఇది 140 ఏళ్ల నాటిది! 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి. వంతెన పొడవు 765 అడుగులు (233 మీటర్లు). వెడల్పు 1.25 మీటర్లు. దీని నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించారు. నాటి మోర్బీ పాలకుడు సర్ వాగ్జీ ఠాకూర్ అప్పట్లో యూరప్‌లో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాలను రంగరించి దీన్ని కట్టించాడు. ఇది మోర్బీ పట్టణంలోని దర్బార్గఢ్, నజార్బాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు. 7 నెలల పాటు రిపేర్లు.. 26వ తేదీనే రీ ఓపెన్ బ్రిటిష్ హయాంలో కట్టిన ఈ పాదచారుల వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతుంటారు. దీనికి ఇటీవలే మరమ్మతులు చేయడంతో పాటు ఆధునీకరించారు. రూ.2 కోట్లతో 7 నెలలకు పైగా పనులు జరిగాయి. ఈ సందర్భంగా వంతెన ఏ మేరకు సురక్షితమన్న అంశం గుజరాత్ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. దీని పటిష్టతపై పలువురు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేయగా అంతా బాగానే ఉందని ప్రభుత్వం బదులిచ్చింది. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన రీ ఓపెన్ చేసి సందర్శకులను అనుమతిస్తున్నారు. నాలుగు రోజులకే ఘోరం జరిగిపోయింది. మరమ్మతుల తర్వాత వంతెనకు మున్సిపాలిటీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేదని అధికారులు తెలిపారు. 1979లో బద్దలైన మచ్చూ డ్యాం... వేలాదిమంది జలసమాధి మోర్బీ పట్టణంలో తీగల వంతెన ప్రమాదం 1979లో ఇదే మచ్చూ నదిపై జరిగిన ఘోర దుర్ఘటనను మరోసారి గుర్తుకు తెచి్చంది. 1979 ఆగస్టు 11న మోర్బీ సమీపంలోని మచ్చూ–2 డ్యామ్ తెగిపోయింది. దాంతో పట్టణాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ విషాదంలో 2,000 మందికిపైగా చనిపోయారు. సౌరాష్ట్రలో కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఈ డ్యామ్‌ను 1972లో నిర్మించారు. -
గుజరాత్ లో కేబుల్ వంతెన తెగి నదిలో పడ్డ పర్యాటకులు
-
గుజరాత్ లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
-
తీవ్ర విషాదం: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 131 మంది సందర్శకుల మృతి
మోర్బీ/న్యూఢిల్లీ: మాటలకందని మహా విషాదం. సెలవు రోజున నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారిన వైనం. గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలోని మోర్బీ పట్టణంలో ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణి మందిర్ సమీపంలో మచ్చూ నదిపై ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ అయిన 140 ఏళ్ల నాటి వేలాడే తీగల వంతెన ప్రమాదవశాత్తూ తెగి కుప్పకూలిపోయింది. దాంతో వంతెన రెండుగా విడిపోయింది. ఆ సమయంలో వంతెనపై మహిళలు, చిన్నారులతో సహా 400 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వారిలో చాలామంది 100 మీటర్ల ఎత్తు నుంచి హాహాకారాలు చేస్తూ నదిలోకి పడిపోయారు. ఆ విసురుకు 100 మందికి పైగా గల్లంతయ్యారు. 132 మందికి పైగా నీట మునిగి దుర్మరణం పాలైనట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వెల్లడించారు. ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. వారిలో పలువురు నదిలోకి కుంగిపోయిన వంతెనపై వేలాడుతూ కాపాడండంటూ ఆక్రందనలు చేశారు. పైకెక్కేందుకు విశ్వప్రయత్నం చేశారు. #Morbi ब्रिज में दुर्घटना से पहले कुछ युवकों का झुंड केबल को पैरों से मारकर अपनी जगह से खींचते कैमरे में कैद हुआ है। आपिये गुजरात को बदनाम करने के लिए किसी भी हद तक जा सकते हैं। pic.twitter.com/atpJXRJDPT — Prashant Umrao (@ippatel) October 30, 2022 ఆదివారం గుజరాత్లో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో పర్యాటకులు. ప్రమాదం గురించి తెలిసి సహాయక చర్యలు మొదలవడానికి కనీసం గంట సమయం పట్టింది. అప్పటికే అత్యధికులు నిస్సహాయంగా అసువులు బాశారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, పసివాళ్లేనని తెలుస్తోంది. సాయమందేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డవాళ్లు, స్థానికులు వీలైనంత మందిని కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రభుత్వ సిబ్బంది వారికి జత కలిశారు. బాధితులను పడవల్లో ఒడ్డుకు చేర్చారు. Saddened by the terribly tragic news coming from #Morbi in #Gujarat, a renovated cable bridge reopened 5 days ago came crashing down killing 60 people and leaving several hundred people injured. My condolences and prayers to the families who have lost their dear ones. pic.twitter.com/jRahvZVDki — K C Venugopal (@kcvenugopalmp) October 30, 2022 తెగిన బ్రిడ్జిపై చిక్కుబడ్డ బాధితులు జాతీయ విపత్తు సహాయక బృందాలూ రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి దాటాక కూడా వెలికితీత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సామర్థ్యానికి మించిన భారమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి ముందు చాలామంది వంతెనపై గంతులు వేస్తూ, దాని వైర్లను లాగుతూ కన్పించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వంతెన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు తదిరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్‌లోనే ఉన్న మోదీ దీనిపై సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వచ్చారు. బాధితులకు అవసరమైన అన్నిరకాల సాయమూ అందించాలని ఆదేశించారు. సీఎం అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్రాలు చెరో రూ.50 వేలు ఇవ్వనున్నాయి. మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. -
ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశపట్టిన ‘హైదరాబాద్ దర్శిని’ సిటీ టూర్ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శని, ఆదివారాల్లో వీటిని నడుపుతారు. 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు. - శని, ఆదివారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. - బిర్లామందిర్, చౌమొహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తరువాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఛార్జీలు ఇవే.. - మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 . - మెట్రో లగ్జరీ బస్సుల్లో.. పెద్దలకు రూ.450 , పిల్లలకు రూ.340 . -
కృష్ణానదిపై కేబుల్ బ్రిడ్జికి ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణానదిపై ఏపీ, తెలంగాణ మధ్య ఐకానిక్ ‘కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి’ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని.. రూ.1,082.56 కోట్లతో 30 నెలల్లో దీన్ని పూరిచేస్తామని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్లో వివరాలు వెల్లడించారు. ఈ తరహా బ్రిడ్జి ప్రపంచంలోనే రెండోదని, మనదేశంలో మొదటిది కానుందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ విధానం వల్ల ఆర్థిక భారం తగ్గడంతోపాటు చూడటానికి అందంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిడ్జి దిగువన పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మించే గాజుమార్గం, పైలాన్ గోపురాలు, ప్రత్యేకమైన లైటింగ్, నల్లమల అడవులు, కొండలు, శ్రీశైలం రిజర్వాయర్ వంటివి ఆకర్షణీయంగా నిలవనున్నట్టు తెలిపారు. వంతెనకు తెలంగాణవైపు లలితా సోమేశ్వరస్వామి ఆల యం, ఏపీ వైపు సంగమేశ్వర ఆలయం ఉంటాయన్నారు. పుట్టపర్తి–కోడూరు మధ్య 4 లేన్ల రోడ్డు పుట్టపర్తి– కోడూరు మధ్య రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు గడ్కరీ వెల్లడించారు. రెండేళ్లలో రూ.1,318.57 కోట్ల ఖర్చుతో 47.65 కిలోమీటర్ల రోడ్డు ఆధునీకరణను పూర్తి చేస్తామని.. దీనితో పుట్టపర్తి– బుక్కపట్నం మధ్య రవాణా సదుపాయం మెరుగవుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కూడా కనెక్టివిటీని పెంచుతుందన్నారు. -
కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం కేబుల్ వంతెనకు టెండర్లు పిలవబోతోంది. నిర్మాణ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్ డెక్) ఉంటుంది. అక్కడ ఎందుకు..? తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్ చేశారు. 800 మీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి రూ.1,082 కోట్ల వ్యయం అంచనా వేశారు. నదిలోనే నడుస్తున్నట్టుగా..! దుర్గం చెరువు, మానేరు మీద ఉన్న సస్పెన్షన్ వంతెనల తరహాలో ఇప్పుడు సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి (స్తంభాలు లేని వంతెన) నిర్మించనున్నారు. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండా భారీ పైలాన్లను నిర్మిస్తారు. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటిì ఆధారంగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఈ వంతెన పైనుంచి చుట్టూ ఉన్న ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువన కృష్ణమ్మ అందాలను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. పర్యాటకులు నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. -
హైదరాబాద్ : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి
-
కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. అది గమనించిన వాహనదారులు.. ఈ విషయాన్ని లేక్ పోలీసులకు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన లేక్ పోలీసులు.. యువతి కోసం స్పీడ్‌బోట్స్‌తో గాలిస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)గా పోలీసులు గుర్తించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, స్వప్నకు ఇటీవలే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, కేబుల్ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్ ఆధారంగా ఆమె ఆధారాలు సేకరించారు. దీంతో, పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు కేబుల్ బ్రిడ్డి వద్దకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్డిపై నుంచి దూకి దాదాపు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. -
గాజు వంతెన కింద గలగలా కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: గలగలాపారే కృష్ణా నది.. చుట్టూ పాపికొండలను తలపించే పచ్చిక కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. ప్రశాంత వాతావరణం.. ఇది సోమశిల వద్ద సీన్. ఇంతకాలం నది ఇవతలో, ఆవలి తీరం వద్దో నిలబడి ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సి వచ్చేది. కానీ నదిపై గాజు వంతెన మీదుగా నడుస్తూ కింద నీటి ప్రవాహాన్ని చుట్టూ ఉన్న అందాలను వీక్షించడమంటే.. ఆ మజానే వేరు. త్వరలోనే సోమశిల వద్ద కృష్ణా నదిపై గాజు వంతెన ఏర్పాటు కానుంది. దానిపైనే వాహనాలు వెళ్లేందుకు వీలుగా మరో వంతెన ఏర్పాటు చేయనున్నారు. అంటే రెండంతస్తుల వంతెన అన్నమాట. ఇందుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదించినట్టు తెలిసింది. ఈ ఏడాదిలోనే పనులు షురూ రెండు వరసల (మల్టీ లెవల్) వంతెనలు చాలా కనిపిస్తాయి. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైలు ట్రాక్ కోసం మరో మార్గం ఒకదాని పైన ఒకటి ఉండేలా నిర్మించినవి కనిపిస్తాయి. కానీ పర్యాటకులు అక్కడి ప్రకృతిని వీక్షించేందుకు ప్రత్యే క కారిడార్‌తో కూడిన బహుళ అంతస్తుల వంతెన లు విదేశాల్లో ఉన్నా, మనదేశంలో లేవు. తొలిసారి అలాంటి రెండంతస్తుల ఐకానిక్ సస్పెన్షన్ వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను సోమశిల వద్ద నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇందులో పైన నాలుగు వరసల రోడ్డు, దిగువున పర్యాటకుల కోసం చుట్టూ గాజు ప్యానెల్స్‌తో కూడిన వంతెన ఉంటుంది. దాదాపు 800 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మిస్తారు. ఇందుకు దాదాపు రూ.650 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ సంవత్సరమే పనులు మొదలు కానున్నాయి. కొల్లాపూర్ మీదుగా నంద్యాలకు.. తెలంగాణ నుంచి నంద్యాల, తిరుపతిలకు వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గుతుంది. అందుకే గతంలో ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి, విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ రకరకాల కారణాలతో అటకెక్కిన ఈ ప్రా జెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి కల్వ కుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ మీదుగా కృష్ణాతీ రంలోని మల్లేశ్వరం (సోమశిల సమీపంలోని) వర కు ప్రస్తుతం రోడ్డు ఉంది. ఇందులో కొల్లాపూర్ వరకు డబుల్ రోడ్డు ఉండగా, అక్కడి నుంచి కృష్ణా తీరం వరకు సింగిల్ రోడ్డే ఉంది. ఇప్పుడు కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల వరకు 173.73 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ జాతీయ రహదారికి 167కె నంబరు కేటాయించారు. ఈ రోడ్డులో భాగంగానే కృష్ణా నది మీద వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతం అద్భుత సౌందర్యానికి ఆలవాలం కావ డంతో అక్కడ నిర్మించే వంతెనను సాధారణంగా కాకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని నిర్ణయించారు. స్తంభాలు లేని వంతెన.. సోమశిలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. పాపికొండలను మించిన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సేద తీరుతుంటారు. ఇప్పుడు గాజు వంతెన అందుబాటులోకి వస్తే పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంది. ఇది స్తంభాలు లేని వంతెన. ఇటు తెలంగాణ వైపు మల్లేశ్వరం తీరం, అటు ఏపీలోని సంగమేశ్వరం తీరంను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 30 జతల భారీ కేబు ల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలి చేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానెల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్ వేస్ ఉంటాయి. మళ్లీ ఆ చివర, ఈ చివర గాజు ప్యానెల్స్ ఉంటాయి. దీనిద్వారా చుట్టూ ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువ కృష్ణమ్మ సోయగాలను వీక్షించొచ్చు. నదిలో నడుస్తున్న అనుభూతిని పొందొచ్చు. వంతెన ప్రారంభంలోని యాంకర్ బ్లాక్ వద్ద మెట్లు నిర్మించి, అక్కడి నుంచి పాదచారులు దిగువ వరసలోకి (గాజు కారిడార్) ప్రవేశించే ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారనుంది. సోమశిలకు 10 కి.మీ దూరంలోని మల్లేశ్వరం వద్ద ఈ నిర్మాణం ఉంటుంది. -
పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల 17 ఏళ్ల ఓ ఇంటర్ విద్యార్థి కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో దుర్గం చెరువులో పడవతో పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేశారు. కేబుల్ బ్రిడ్జి కింద వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలపై దృష్టి.. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఇంటికే పరిమితమైన పర్యాటకులు క్రమంగా బయటకు వస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే బదులు స్థానికంగా ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై సందర్శకుల తాకిడి పెరిగింది. వారాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో మద్యం తాగడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో సందర్శకులకు భద్రతతో పాటూ అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా ఉండేందుకు పోలీసుల గస్తీని ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్రిడ్జిపై వాచ్ టవర్.. ఇప్పటికే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు 67 కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా బ్రిడ్జి కింద పోలీసు వాచ్‌టవర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అన్ని సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏ మూలన ఏ సంఘటన కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. అనుమానిత వ్యక్తులు సంచరించినా, ట్రాఫిక్‌జాం, ఇతరత్రా ఇబ్బందులు జరిగినా వెంటనే వాచ్ టవర్లోని పోలీసులకు తెలిసిపోతుంది. వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులకు సమాచారం అందించి, ఘటన స్థలానికి వెళ్లి తగిన చర్యలు చేపడతారు. వాచ్ టవర్‌లో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారు. లేక్ పోలీసులకు ఈవీ వాహనాలు.. దుర్గం చెరువు పరిసరాలలో ఆర్టిఫీషియల్ వాటర్ ఫాల్స్, రాక్ గార్డెన్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల వంటివి ఉన్నాయి. దీంతో పిల్లలు, యువకులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి రోడ్డు మధ్యలో నిలబడి సెల్ఫీలు తీసుకోవటం, వాహనాలకు అంతరాయం కలిగిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించేందుకు లేక్ పోలీసులు 24 గంటలు గస్తీ చేస్తుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలతో లేక్ పోలీసులు పెట్రోలింగ్ విధులను నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో మహిళలతో అసభ్యంకరంగా ప్రవర్తించే పోకిరీలను షీ టీమ్ పోలీసులు అక్కడిక్కడే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పలుమార్లు ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తే జైలుకు పంపిస్తున్నారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
జూబ్లీహిల్స్ ప్రమాదం.. కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బాలుడి మృతికి కారణమైన బండిలో.. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రాహిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు.. ఫిలింనగర్ నుండి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. రాహిల్ పక్కనే ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు. గురువారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు మహేంద్ర థార్ వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి.. మృతి చెందిన విషయం తెలిసిందే. బండిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు ఆసక్తికరంగా మారింది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనంటూ ప్రచారం మొదలైంది. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ కారులో తన కొడుకు లేడని ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే శుక్రవారం వివరణ ఇవ్వగా.. అందులో ఆయన కొడుకు కూడా ఉన్నాడంటూ తాజాగా పోలీసులు ప్రకటించడం విశేషం. -
కారు ప్రమాదంపై ట్విస్టుల మీద ట్విస్టులు
బంజారాహిల్స్(హైదరాబాద్)/బోధన్: జూబ్లీహిల్స్ రోడ్డుప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గురువారంరాత్రి జరిగిన ఈ ఘటనలో రెండు నెలల శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వేగంగా వస్తున్న మహేంద్ర థార్ కారు రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. కాజల్ చౌహాన్ చేతు ల్లో ఉన్న రెండున్నర నెలల బాబు అశుతోష్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెం దాడు. ఈ మహిళలు రోడ్డు పక్కన బెలూన్లు విక్రయిస్తుంటారు. కారు నడిపిస్తున్న యువ కుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. అతడితోపాటు కారు లో ఉన్న మరో యువ కుడు తప్పించుకొని పారిపోయారు. కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉంది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే కొడుకే నడిపించారంటూ ప్రచారం ప్రమాదసమయంలో మద్యం సేవించి ఉంటే కేసు తీవ్రత పెరుగుతుందనే ఉద్దేశంతోనే కారు నడిపిన యువకులు పోలీసులకు లొంగిపోకుండా పారిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ భాగస్వామిగా ఉన్న అర్బన్ ఇన్ఫ్రా అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ పేరిట ఉండటంతో అనుమానాలు పెరిగాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే దుబాయిలో ఉన్న ఎమ్మెల్యే షకీల్ రంగంలోకి దిగి కారు తమదేనని, కారును డ్రైవర్ నడిపించినట్లు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారని సమాచారం. అయితే శుక్రవారం మధ్యాహ్నం దాటినా డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో, కారు నడిపిన వ్యక్తి ఎమ్మెల్యే షకీల్ కొడుకే కావచ్చంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో షకీల్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ ప్రమాదం తో తనకు, తన కొడుకుకు సంబంధం లేదని, ఆ కారు తన కజిన్‌దని, అప్పుడప్పు డు తాను ఉపయోగించుకుంటున్నందున దానిపై స్టిక్కర్ ఉందన్నారు. ప్రమాద సమయంలో కజిన్ మిర్జా కొడుకు కారు నడుపుతున్నాడని పేర్కొన్నాడు. బెలూన్లు అమ్ముకునే ఆ మహిళకు కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే శిశువును పడేయడంతో చిన్నారి మృతి చెందిందని ఎమ్మెల్యే తెలిపారు. శిశువు దుర్మరణం బాధాకరమని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తన బంధువును కోరినట్లు పేర్కొన్నారు. నిమ్స్ నుంచి బాధితుల మాయం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్‌తోపాటు మిగిలిన ఇద్దరు మహిళలు శుక్రవారం ఉదయంకల్లా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే షకీల్ సూచనల మేరకు కారు నడిపించిన వ్యక్తికి సంబంధించిన బంధువులు నిమ్స్‌కు వెళ్లి కాజల్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బాబును కోల్పోవడంతోపాటు గాయాలపాలైన తమకు రూ.2 లక్షల ఆర్థికసాయం చేయాలని, మహారాష్ట్రలోని సొంతూరికి వెళ్లిపోతామని ఆమె చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆమె కోరిన విధంగా డబ్బులు ఇవ్వడంతో ఆస్పత్రి వర్గాలకు చెప్పకుండానే వారంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
ఏపీ, తెలంగాణ మధ్య తీగల వంతెన.. పిల్లర్లు లేకుండానే..
అచ్చంపేట (నాగర్‌కర్నూల్): తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారిధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021– 22 బడ్జెట్లో రూ.600కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల– సిద్దేశ్వరం వద్ద అధునాతన ‘ఐకానిక్’ (తీగల) వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలోని 76/400 కి.మీ., కల్వకుర్తి (కొట్ర) నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ., రహదారిగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్‌గా ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారుతుంది. కృష్ణానది బ్యాక్‌వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జి ఏర్పాటు కాబోతుంది. మూడు ప్రతిపాదనలు కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ మూడు ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో మూడో ఆప్షన్‌కు ఆమోదం ముద్ర వేసింది. మొదటి ఆప్షన్ సోమశిల కాటేజీల నుంచి 1,800 మీటర్ల బ్రిడ్జికి, రెండో ఆప్షన్ సోమశిల వెళ్లే రహదారిలో కుడివైపు కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి రోడ్డు, 750 మీటర్ల బ్రిడ్జికి ప్రతిపాదించారు. మూడో ఆప్షన్లో ప్రతిపాదించిన సోమశిల రీ అలాన్‌మెంట్ 9.20 కి.మీ రహదారి 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది.æ కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పథకం కింద 173.73 కి.మీ., జాతీయ రహదారిలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 87.600 కి.మీ., రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు రూ.1,200 కోట్లు కేటాయించింది. సిద్దేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతోపాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. తీగల వంతెన అంటే.. సోమశిల– సిద్దేశ్వరం రెండు కొండల మధ్య (600 మీటర్లు) తక్కువ దూరం ఉండటంతో ఈ స్థలం ఎంపిక చేశారు. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జి మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ రెండు టవర్లకు కేబుల్స్ బిగించి బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్ నుంచి బ్రిడ్జి సప్‌సెంట్ అవుతుంది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. దివంగత సీఎం హయాంలోనే.. సోమశిల బ్రిడ్జి నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్‌రోడ్డులో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు రూ.93 కోట్లు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో పనులు మొదలుకాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జి నిర్మాణానికి రూ.193కోట్లు, రోడ్డుకు రూ.60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తిచేశారు. బ్రిడ్జి నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. అభివృద్ధికి బాటలు.. జాతీయ రహదారి, సోమశిల బ్రిడ్జితో నాగర్‌కర్నూల్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అధునాతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఏర్పాటవుతాయి. వెనకబడిన ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. నల్లమల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తున్నారు. బ్రిడ్జి ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. – రాములు, ఎంపీ, నాగర్‌కర్నూల్ -
పంజగుట్ట కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి సర్వం సిద్ధం
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 1/3లోని పంజగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు చేసిన విస్తరణతో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు జంక్షన్‌కు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. గ్రేవియార్డ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు తీరుతాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ రూ.17 కోట్లు మంజూరు చేసింది. కేబుల్ బ్రిడ్జి, పాత గేటు నుంచి హెచ్‌టీ లైన్ వరకు రోడ్డును విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఈ బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. చదవండి: హైదరాబాద్: చలో అంటే చల్తా నై! -
దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!
సాక్షి, మాదాపూర్: ఇటు ఆకాశ హార్మ్యాలు.. అటు ఎత్తైన కేబుల్ బ్రిడ్జి.. చుట్టూ పచ్చని చెట్లు.. కొలువైన వివిధ రకాల విగ్రహాలు...సరస్సులోని నీటిని ముద్దాడుతున్న సూర్యకిరణాలు... విదేశాల్లో ఉన్నామా .. అనే అనుభూతి.. ఇలాంటి వాతావరణంలో బోటింగ్ అంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి?.ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌గా ఉన్న మాదాపూర్ దుర్గంచెరువులో బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చదవండి: దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ? చెరువు వద్ద ఏర్పాటు చేసిన రాతి జంట చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్నా.. పెద్దా అంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా బోటింగ్ చేస్తున్నారు. సందర్శకులు బోటింగ్ చేసేందుకు కలి్పంచిన ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనల అమలుకు తీసు కున్న చర్యలు తదితర అంశాలపై దుర్గం చెరువు ఏజీఎం బాలకృష్ణతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... సాక్షి : ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి? జవాబు: మొత్తం ఏడు ఉన్నాయి. నాలుగు పెడల్ బోట్లు, ఒకటి డీలక్స్ బోటు, ఒకటి స్పీడ్ బోటు, ఒకటి ఫ్యామిలీ బోటు ఉన్నాయి. సాక్షి: బోటింగ్ ఫీజుల వివరాలు తెలపండి. జవాబు:బోట్లు పూర్తి కండీషన్‌తో ఉండేలా చూస్తున్నాం. పెడల్ బోటింగ్ ఒకరికి రూ.50 (15 నిమిషాలు), డీలక్స్ బోట్ రూ.50 (15 నిమిషాలు), స్పీడ్‌బోట్ రూ.400 (నలుగురికి 6 నిమిషాలు)క్రూస్ బోట్ (ఫ్యామిలీ బోట్) 50 మంది కెపాసిటీ ఉంటుంది. ఒకరికి రూ.50 (15 నిమిషాలు) సాక్షి: కోవిడ్ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? జవాబు:కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నాం. సందర్శకులు దిగిన వెంటనే బోట్లకు శానిటైజ్ చేయడం, తప్పని సరిగా సందర్శకులు మాస్‌్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం., ప్రతి సందర్శకుడు లైఫ్ జాకెట్లు ధరించేలా చూస్తున్నాం. సాక్షి: సందర్శకుల తాకిడి ఎలా ఉంది? జవాబు: సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శకులు 200 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. అదే శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తుంటారు. ఆదివారం సుమారు 600 నుంచి 800 మంది బోటింగ్ చేస్తుంటారు. సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సాక్షి: కొత్త ప్రణాళికలు ఏమైన ఉన్నాయా? జవాబు:పిల్లలకు, పెద్దలకు, సెయిలింగ్, కయాకింగ్, కానోయింగ్ వంటి పర్యావరణ అనుకూల క్రీడలను నేర్పించడానికి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరా>బాద్ ముందుకొచి్చంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాక్షి: సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారా? జవాబు: సీనియర్ సిటిజన్లు తమకు రాయితీ ఇవ్వాలని, తినుబండారాలు అందుబాటులో ఉంచాలని, సేద తీరేందుకు కూర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. పై విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. -
దుర్గం చెరువు బ్రిడ్జ్ పై బైక్ రేసింగ్‌లు
-
దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ?
హైదరాబాద్ నగరానికి ఐకాన్ చార్మినార్... ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి సైబర్ టవర్స్‌కి దక్కింది. ఇప్పుడు వాటి సరసన చేరేందుకు సిద్ధమవుతోంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. స్థానికులకే కాదు విదేశీయులను సైతం అబ్బురపరుస్తోంది. బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఇటీవల దుర్గం చెరువుపై నుంచి ప్రయాణించారు. చక్కని సాయంత్రం వేళ భారీ భవంతుల చాటున అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు తీగల వంతెన మీద ప్రతిబింబిస్తోంది. ఈ మనోహర దృశ్యాన్ని మొబైల్లో షూట్ చేసి ట్విట్టర్లో మనతో ఆండ్రూ ఫ్లెమింగ్ పంచుకున్నారు. మీరు ఓ సారి ఆ వీడియో చూడండి . -
Photo Story: తీగల వంతెన.. మబ్బులు అందేనా!
సిద్దిపేట: ఆకాశంలో దోబూచులాడుతున్న కారు మబ్బులు.. నిండుకుండలా ఉన్న చెరువుపై వేలాడుతున్న తీగల వంతెన.. ఈ చిత్రం చూపురులను కట్టిపడేస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా రోజుల తర్వాత పర్యాటక ప్రాంతాలకు ప్రజలను అనుమతిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ట్యాంక్‌బండ్‌పై ఉన్న సస్సెన్షన్ బ్రిడ్జ్ కారుమబ్బుల నేపథ్యంలో ఇలా అందాలను చిందించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట అటవీప్రాంతంలో మంచెపై ఐసోలేషన్‌లో ఉన్న గిరిజనుడు గూడెంలో కోవిడ్ గడబిడ మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గొత్తికోయలగూడెంలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ 36 కుటుంబాలు, 174 మంది జనాభా ఉన్నారు. కొందరు గిరిజనులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసి వైద్యసిబ్బంది మూడు రోజుల క్రితం గూడేనికి వెళ్లి వైద్యపరీక్షలు చేయగా నలుగురికీ పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలున్న కొంతమంది నాటుమందులు వాడుతూ అటవీప్రాంతంలోని పంటపొలాల్లో మంచెలు, డేరాలలో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కరోనా లక్షణాలున్న మరో 50మందికి వైద్యసిబ్బంది కిట్లను అందజేశారు. గూడెంవాసులు కరోనా పరీక్షలకు సహకరించట్లేదని జిల్లా మండల వైద్యాధికారి గోపీనాథ్ తెలిపారు. సాగు బడిలో బడి పాఠం పత్తి పంటలో కలుపు తీస్తూ పిల్లల పనులు ఓ వైపు... మరోవైపు పనుల్లో మునిగి తేలుతూ ఫోన్లో స్పీకర్ ఆన్ చేసుకొని బడి పాటాలు వింటూ చకచకా చిట్టి చేతులతో కొంకలు పట్టి పనుల్ని పరుగులు పెటించారు చిన్నారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవ్పల్లి గ్రామ çశివారు పత్తి పంటలో బడి పాఠాలు వింటూ పనులు చేస్తున్న పిల్లలు ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
Photo Feature: ఇలా కూడా టీకాలు వేస్తారు!
భారీ వర్షంతో భాగ్యనరం తడిసిముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. టీకాలు వేయించుకునేందుకు ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. బెంగాల్లో పడవలో వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు. మరిన్ని ‘చిత్ర’ వార్తల కోసం ఇక్కడ చూడండి. -
కరీంనగర్ సిగలో మరో తీగల మణిహారం, కేబుల్ బ్రిడ్జికి సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్‌లో దుర్గం చెరువు తర్వాత.. కరీంనగర్ సిగలో మెరిసేందుకు మరో తీగల మణిహారం సిద్ధమైంది. రూ.149 కోట్ల వ్యయంతో మానేరు నది మీద 500 మీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారి గల ఈ తీగల వంతెన (కేబుల్ బ్రిడ్జి) పర్యాటకులను విశేషంగా ఆకర్షించనుంది. ఇటీవలే రూ.315 కోట్లు మంజూరైన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) ఈ తీగల వంతెన కిందనే కనువిందు చేయనుంది. హైదరాబాద్‌లో శరవేగంగా నిర్మాణం పూర్తయిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కన్నా ముందే కరీంనగర్ తీగల వంతెన పనులు మొదలైనప్పటికీ.. వివిధ కారణాల వల్ల పూర్తికావడంలో ఆలస్యమైంది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రిడ్జికి సంబంధించి లోడ్ టెస్టింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో అధికారులు కృషి చేస్తున్నారు. కరీంనగర్–వరంగల్ రహదారిగా.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లాలన్నా, వరంగల్ వెళ్లాలన్నా మానేర్ డ్యాం దిగువన ఉన్న అలుగునూరు బ్రిడ్జి ఒక్కటే దిక్కు. పెరిగిన ట్రాఫిక్‌ను ఈ నాలుగు వరుసల రహదారి తీర్చలేకపోతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్–వరంగల్ రహదారిగా మానేరు నది మీదే మరో బ్రిడ్జి నిర్మించాలన్న సంకల్పమే తీగల వంతెనకు నాంది పలికింది. కరీంనగర్ కమాన్ నుంచి హౌసింగ్ బోర్డు మీదుగా మానేరు నది దాటి మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని సదాశివపల్లికి వెళితే.. అక్కడి నుంచి వరంగల్ హైవేకు లింక్ అవుతుంది. తద్వారా వరంగల్‌కు ఏడు కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సాధారణ బ్రిడ్జి కన్నా పర్యాటకులను ఆకర్షించేలా కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని, అప్పట్లో స్థానిక ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. నిర్మాణం పనులు కొంత మందకొడిగా సాగినా ఎట్టకేలకు పూర్తయింది. ముగిసిన లోడ్ టెస్టింగ్ శుక్రవారం ప్రారంభమైన వంతెన సామర్థ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. తొలుత శుక్ర, శనివారాల్లో వంతెనకు ఇరువైపులా 28 టిప్పర్లను నిలిపి.. ఒక్కో దానిలో 30 టన్నుల ఇసుకను నింపారు. మొత్తం 840 మెట్రిక్ టన్నుల బరువుతో బ్రిడ్జి సామర్థ్యాన్ని పరీక్షించారు. అలాగే వంతెన ఇరువైపులా నిర్మించిన ఫుట్‌పాత్‌లపై మరో 110టన్నుల ఇసుక సంచు లను వేశారు. వంతెన కింద 17 ప్రాంతాల్లో సెన్సార్లను ఉంచి మొత్తం 950 టన్నుల బరువును పరీక్షించారు. సోమ, మంగళవారాల్లో కూడా 20 వాహనాల్లో ఇసుకను నింపి, ఫుట్‌పాత్‌లపై ఇసుక బస్తాలు పెట్టి వంతెన సామర్థ్యాన్ని అంచనా వేశారు. అప్రోచ్ రోడ్లు పూర్తయితే.. కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్లతో పాటు కనెక్టివిటీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం రూ.34కోట్లను వెచ్చించనున్నారు. కరీంనగర్ కమాన్ నుండి కేబుల్ బ్రిడ్జి వరకు, అలాగే ఈ బ్రిడ్జి నుంచి సదాశివపల్లి వరకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే తీగల వంతెన అందాలను వీక్షిస్తూ వాహనాలను మానేరు దాటించవచ్చు. ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ తీగల వంతెనతో కరీంనగర్ సరికొత్త శోభ సంతరించుకుంటుంది. పర్యాటకంగా ఇప్పటికే మానేరు డ్యాం, ఎలగందుల ఖిల్లా వివిధ ప్రాంతాల వాసులను ఆకర్షిస్తున్నాయి. కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చూపించిన చొరవను ప్రజలు మరువలేరు. ‘సీఎం హామీ’పేరుతో ఏటా రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో కరీంనగర్‌ను చేర్చి దీని రూపురేఖలే మార్చేశారు. తాజాగా కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్లు అదనపు సొబగులు అద్దనున్నాయి. వీటి నిర్మాణంతో ఉత్తర తెలంగాణకు కరీంనగర్ గేట్వేగా మారనుంది. – గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమాంతం కిందపడిపోయిన కేబుల్ కారు, 13 మంది మృతి
రోమ్: ఉత్తర ఇటలీ ఆదివారం ఓ కేబుల్ కారు తెగిపడి... 13 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడగా... వీరి పరిస్థితి విషమంగా ఉంది. మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్ పర్వతం పైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్లు వెళితే పర్వత శిఖరంపై దిగుతారనగా... ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. 15 మంది ప్రయాణికులు కూర్చున్న కేబుల్ కారు అమాంతం కిందపడిపోయి పల్టీలు కొడుతూ చెట్లను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు దూరంగా విసిరేసినట్లుగా పడిపోయారు. 2016లోనే ఈ కేబుల్ లైన్‌ను పునర్నిర్మించారని స్టెసా మేయర్ మార్సెల్లా సెవెరినో తెలిపారు. కరోనా కారణంగా మూతబడిన ఈ పర్యాటక ప్రదేశాన్ని ఇటీవలే తెరిచారని వెల్లడించారు. 1998 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని మీడియా తెలిపింది. -
ప్రపంచ అతి పొడవైన వేలాడే బ్రిడ్జి ఎక్కడుందో తెలుసా?
మీకు భయమంటే ఎంటో తెలియదా? సాహసాలు చేయడమంటే ఇష్టమా? అయితే ఈ రెండింటినీ పరిచయం చేస్తానంటోంది పోర్చుగల్‌లోని అరౌకా బ్రిడ్జి. ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే బ్రిడ్జిని ఇటీవల పోర్చుగల్ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ‘బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్’ లేదా ‘అరౌకా 516’గా దీన్ని పిలుస్తారు. ఉత్తర పోర్చుగల్‌లోని పావియ నదిపై 175 మీటర్ల ఎత్తు (574 అడుగులు) లో నిర్మించిన అరౌకా బ్రిడ్జి పొడవు 516 మీటర్లు (1693 అడుగులు). అరకిలోమీటరు పొడువు ఉన్న అరౌకా.. వేళాడుతూ అగ్యిరాస్ జలపాతం నుంచి పావియా జార్జ్‌ను కలుపుతూ.. ‘అరౌకా జియోపార్క్’లో మంచి అడ్వెంచర్ స్పాట్‌గా మారింది. 2017లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభించిన ‘చార్లెస్ కుయోనెన్ సస్పెన్షన్’ బ్రిడ్జిను అరౌకా వెనక్కు నెట్టేసింది. ఇది పరుచుకోనంత వరకు 494 మీటర్ల(1621 అడుగుల) పొడవుతో ‘చార్లెస్ కుయోనెన్ సస్పెన్షన్’ బ్రిడ్జే ప్రపంచలోని అతి పొడవైన వేలాడే వంతెనగా నడకసాగించింది. ప్రస్తుతం ఆ ప్రస్థానాన్ని 516 మీటర్ల పొడవుతో అరౌకా కొనసాగిస్తోంది. VIDEO: Portugal opens the longest suspended pedestrian bridge in the world in Arouca. The bridge hangs on heavy steel cables strung between V-shaped concrete towers and runs 516 metres (1700 feet) across a canyon, at a height of 175 metres pic.twitter.com/bOL5CrNCJZ — AFP News Agency (@AFP) April 30, 2021 అందుకే అరౌకా.. యునెస్కో గుర్తింపు పొందిన అరౌకా జియోపార్క్ సమీపంలో ఈ బ్రిడ్జిను నిర్మించడంతో దీనికి అరౌకా అని పేరు పెట్టారు. 2018లో నిర్మాణం ప్రారంభించి 2020లో పూర్తి చేశారు. ఇది ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జి అయినప్పటికీ కాస్త ఇరుకుగా ఉంటుంది. పోర్చుగీస్ స్టూడియో ఇటెకాన్స్ టిబేటన్ శైలీలో ఈ బ్రిడ్జి డిజైన్‌ను రూపొందించింది. ఈ వారధికి ఇరువైపులా ‘వి’ ఆకారంలో ఉన్న మూల స్థంబాల్లాంటి రెండు టవర్లు ఉన్నాయి. వాటి మధ్య స్టీల్ కేబుల్స్‌తో ఉంటుంది వంతెన వేళాడుతూ. నాలుగు మీటర్ల పొడవున్న 127 మాడ్యూల్స్‌ను ఉపయోగించి బ్రిడ్జి డెక్‌ను నిర్మించారు. డెక్కు రెండువైపులా నెట్‌తో రెయిలింగ్‌ను పటిష్ఠంగా అమర్చారు. అరౌకా నిర్మాణానికి మొత్తం 2.8 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే మన రూపాయాల్లో అక్షరాల 20.68 కోట్లు. గుండె గుబేలే.. ఈ వారధి నిర్మించక ముందు పర్యాటకులు అరౌకా జియోపార్క్ చూట్టు ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు వాహానాల మీద వెళ్లేవారు. ట్రెకింగ్ చేసేవారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి ప్రారంభించడంతో పెద్దగా శ్రమపడకుండా హాయిగా నడకసాగించొచ్చు. అయితే నడిచేటప్పుడు కిందకు చూస్తే మాత్రం గుండె గుబేలుమంటోందని స్థానికులు చెబుతున్నారు. అరౌకా బ్రిడ్జి మొదలైన తరువాత నడిచిన తొలి వ్యక్తి హ్యూగో జేవియర్. వంతెన ఇవతలి నుంచి అవతలికి దాటిన తరువాత జేవియర్ మాట్లాడుతూ..‘‘ బ్రిడ్జిపై ఈ చివరి నుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పదినిముషాలు పట్టింది. బ్రిడ్జి మీద నడిచేటప్పుడు చాలా భయమేసింది.అయినా జీవితంలో మర్చిపోలేని అసాధారణమైన, ప్రత్యేకమైన అనుభూతి అది’’ అని చెప్పాడు. ఏంటీ మీరూ అక్కడకు వెళ్లాలనుకుంటు న్నారా! అయితే కరోనా తగ్గిన తరువాతే కుదురుతుంది! అప్పుడు కూడా ఆరేళ్ల లోపు పిల్లలను బ్రిడ్జిమీదకు అనుమతించరు. పెద్దవాళ్లైనా సరే గైడ్‌ను వెంటబెట్టుకుని వెళ్లాల్సిందే. సందర్శనకు 12 – 14 డాలర్ల రుసుము చెల్లించాల్సిందే!! – పి. విజయా దిలీప్ -
కేబుల్ బ్రిడ్జి మీద బన్నీ బర్త్‌డే వేడుకలు
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సుకుమార్ డైరెక్షన్లో చేసిన 'ఆర్య' సినిమాతో బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు వచ్చింది. ఇక అదే డైరెక్టర్‌తో చేస్తున్న 'పుష్ప'తో బన్నీకి ఐకాన్ స్టార్ అన్న కొత్త పేరొచ్చింది. ఇక పుష్పరాజ్ ఎలా ఉంటాడనేది టీజర్ ద్వారా శాంపిల్ చూపించింది చిత్రయూనిట్. ఇందులో ఎర్రచందనాన్ని లారీలో లోడ్ నింపుతూ, అడ్డొచ్చినవారిని చితకబాదుతూ ఊరమాస్ లుక్‌లో కనిపించాడు బన్నీ. అభిమాన హీరోను తొలిసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో చూసి విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. పైగా ఈ రోజు హీరో బర్త్‌డే కావడంతో రచ్చరచ్చ చేస్తున్నారు. అటు చిత్రయూనిట్ కూడా అతడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద లేజర్, లైట్ షో ఉంటుందని ప్రకటించింది. ఈరోజు రాత్రి 7- 8.30 గంటల మధ్య ఈ స్పెషల్ షో ఉంటుందని వెల్లడించింది. గతంలో ఏ తెలుగు హీరోకు దక్కని ఈ అరుదైన గౌరవం అల్లు అర్జున్‌కు దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. హీరో బర్త్‌డే కోసం ఇలా లేజర్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేయడం విశేషమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప టీజర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది. చదవండి: పుష్ప టీజర్: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై 10కె, 5కె రన్ ఫోటోలు..
-
కేబుల్ బ్రిడ్జి పై సండే సందడి
-
కొత్త అందాలు
-
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద బోటింగ్ ప్రారంభం
-
కేబుల్ బ్రిడ్జిపై బిగ్‌బాస్ చూస్తున్నాడు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వస్తున్నారు. ఆకట్టుకుంటున్న లైటింగ్స్ ధగధగల్లో ఫొటోలు, సెల్ఫీలతో మురిసిపోతున్నారు. ఈనేపథ్యంలో వంతెనపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. వాహన ప్రమాదాలకు అవకాశాలున్నాయి. దీనిపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ అధికారులు వంతెనపై వాహనాలు నిలపకుండా నిషేదం విధించారు. అయినప్పటికీ కొందరి తీరు మారకపోవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టారు. బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడని, ఇకనైనా మారండని అంటున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి అనవసరంగా చలానాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక పర్యాటకుల రద్దీ దృష్ట్యా శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి్ ప్రారంభమైంది. (చదవండి: ప్రమాదకరంగా తీగల వంతెనపై ఫోటోలు) -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై అద్భుతమైన ఆర్మీ బ్యాండ్
-
కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
-
కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో పెద్ద బ్రిడ్జి ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగనుంది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్ మంటూ ఇట్టే ఆకర్షించే రీతిలో విద్యుత్ కాంతుల ఉన్న దృశ్యాలు అందరినీ కట్టి పడేస్తున్నాయనే చెప్పాలి. ( హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ) జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐటీ కారిడార్‌ను కేబుల్ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు. 233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్ మంటోంది. కేబుల్ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయనున్నారు. -
హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
-
కేబుల్ బ్రిడ్జి వచ్చే వారంలో ప్రారంభం
సాక్షి, గచ్చిబౌలి: హుస్సేన్ సాగర్ తరువాత చెప్పుకోదగ్గ చారిత్రక సుందర తటాకం మన దుర్గం చెరువు. నిజాం నవాబుల కాలంలోనే హుస్సేన్ సాగర్ నిర్మించగా రెండు గుట్టల మధ్యలో గలగల పారే సేలయేరు లాంటి దుర్గం చెరువు ఆ నిజాం నవాబులు నివాసం ఉండే సెవన్ టూంబ్స్కు తాగునీరు అందించినట్లు చరిత్ర చెబుతోంది. అంతటి ప్రాధాన్యత ఉన్న దుర్గం చెరువు మొన్నటి వరకు దుర్గంధంగా మారిందనే చెప్పాలి. ఐటీ కారిడార్‌లో ఉన్న మేటి చెరువుగా ప్రసిద్ధి గాంచిన దుర్గంచెరువు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోగా కె.రహేజా గ్రూపు చెరువు అభివృద్ధికి నడుం బిగించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రహేజా గ్రూపు దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తి కాగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కేబుల్ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్ మంటూ ఇట్టే ఆకర్షించే రీతిలో విద్యుత్ కాంతుల ఉన్న దృశ్యాలు అందరినీ కట్టి పడేస్తున్నాయనే చెప్పాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో బోటింగ్, రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మనోహర్‌ను ఆదేశించారు. విద్యుత్ వెలుగు జిలుగులు మధ్య కేబుల్ బ్రిడ్జిపై విహరిస్తూ దుర్గం చెరువు అందాలను మనసారా చూస్తూ పర్యాటకులు సేదదీరే అరుదైన అవకాశం చిక్కనుంది. ఇది నిజంగా నగర వాసులకు సరికొత్త అనుభూతిగా చెప్పవచ్చు. మరి కొద్ది రోజుల్లోనే దుర్గం చెరువు మరో ఐకాన్‌గా నిలువనుంది. వచ్చే వారంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐటీ కారిడార్‌ను కేబుల్ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు. 233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్ మంటోంది. కేబుల్ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని వచ్చే వారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ప్రారంభానికి జీహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్‌తో పాటు హెచ్ఎండీఏ, టూరిజం శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్‌కు రావాలంటే దాదాపు 30–40 నిమిషాల సమయం అవసరం. రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి ద్వారా ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్‌కు కేవలం10 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. సర్వాంగ సుందరంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జికి తగ్గట్టుగా దుర్గం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధేందుకు ‘మన దుర్గం పేరిట’ కె రహేజా గ్రూపు రూ.40 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చుచేసింది. చెరువు చుట్టూ 4.5 కిలో మీటర్ల పొడవునా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసింది. భద్రతలో భాగంగా ఇన్నర్ సైడ్ సేఫ్టీ రెయిలింగ్‌ను అమర్చారు. ట్రాక్ పొడవునా ప్లాంటేషన్‌తో పాటు ఎలక్ట్రికల్ లైటింగ్ అమర్చనున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటు ఓపెన్ జిమ్, రెండు ఎంట్రెన్స్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఇనార్బిట్ మాల్ వైపు ఉన్న బ్రిడ్జి కింది భాగం నుంచి ఎన్సీసీ బిల్డింగ్ వద్ద ఉన్న ఎంట్రెన్స్ పాలజా వరకు ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేస్తున్నారు. అందులో వర్టికల్ ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్ చేపట్టి ఆహ్లాదంగా తీర్చి దిద్దనున్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభంలోపే సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. దుర్గంధంగా ఉన్న దుర్గం చెరువులో గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించారు. అంతే కాకుండా చెరువులో మురుగు నీరు కలువ కుండా ఉంచేందుకు రెండున్నర కిలో మీటర్ల పొడవునా పైపులైన్ వేసి మురుగు నీరును కిందికి పంపిస్తున్నారు. కేవలం వర్షం వచ్చినప్పడే మాత్రమే ఇన్లెట్స్ ద్వారా కొద్ది మేర మురుగు నీరు చెరువులోకి వచ్చే అవకాశం ఉంది. చెరువులోకి వచ్చే ఇన్లెట్స్ వద్ద మురుగు నీరు శుద్ధి చేసే అంశాల్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ బోటింగ్ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించినట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. సోఫాలో కూర్చుని పర్యాటకులు జాలీ రైడ్‌కు వెళ్లేందుకు డీలక్స్ బోట్ అందుబాటులోకి తెస్తామన్నారు. నలుగురు కూర్చునే స్పీడ్ బోట్‌తో పాటు రెండు ఫెడల్ బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. దుర్గం చెరువులో పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను నెలకొల్పుతామని పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే బోటింగ్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. నగరానికే తలమానికింగా ఉండే కేబుల్ బ్రిడ్జి ప్రారంభం అనంతం రెండవ ఫేజ్‌లో పర్యాటకుల సౌకర్యార్ధం మరిన్ని ఏర్పాట్లు చేసే ఆలోచన ఉందని అన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మరో అద్బుతం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
-
భాగ్యనగరం మెడలో మరో మణిహారం
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మిస్తోంది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ తీగల వంతెనతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గనున్నది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ఈ వంతెన అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి సుందరమైన ఈ కట్టడం నగర ప్రజలను మంత్రముగ్ధులను చేస్తోంది. (‘కేబుల్ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!) దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ మొట్టమొదటి హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతోపాటు పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. దీనికి సంబంధించిన వీడియోను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ‘దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైన అంశం. మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో 60 శాతానికి పైగా నిధులను ఖర్చు చేస్తోంది. వంతెనను నిర్మించిన ఇంజనీర్లకు ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు. ఇక రంగురంగుల విద్యుత్ కాంతులతో జిగేలుమంటున్న ఈ వీడియో ప్రస్తుతం నగర ప్రజలను ఆకర్షిస్తోంది. A sneak peek of the very soon to be unveiled cable stay bridge on Durgam Cheruvu 😊 Infrastructure is the key to growth & #Telangana Govt spends over 60% budget on infra creation Great job engineering team 👍@GHMCOnline @bonthurammohan @arvindkumar_ias #HappeningHyderabad pic.twitter.com/CvHwwk4l6X — KTR (@KTRTRS) September 2, 2020 -
హైదరాబాద్ : ప్రారంభానికి సిద్ధమవుతున్న కేబుల్ బ్రిడ్జి
-
‘కేబుల్ వంతెన’.. పర్యాటక ఆకర్షణ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం. వీటితో పాటు సైబర్ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి కూడా.. ఇక తాజాగా ఈ వరుసలో చేరనున్నది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ప్రారంభానికి ముందే ఎంతగానో ప్రచారమైన దుర్గం చెరువు కేబుల్ వంతెన.. ప్రారంభానంతరం పర్యాటక ప్రాంతంగానూ మారనుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తూ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ వంతెన.. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ రెండ్రోజుల్లో వంతెన పైకి వాహనాలకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. వచ్చే నెలాఖరులో ప్రారంభం.. బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ముహూర్తం నిర్ణయించారు. ఇది ప్రారంభమయ్యాక ఆ సొగసులకు పర్యాటకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని అంటున్నారు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను కాలినడకన మాత్రమే బ్రిడ్జిపైకి అనుమతి స్తారని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు ప్రకృతిని, ప్రశాంతతను ఆస్వాదించాలనే కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాహ నాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇక, ప్రత్యేక తరహా లైటింగ్ సిస్టంతో కేబుల్ బ్రిడ్జి రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మనుంది. వివిధ బొమ్మలు వెలుతుర్లో కనువిందు చేయనున్నాయి. దుర్గంచెరువులోని నీళ్లూ మిలమిలా మెరవనున్నాయి. ఈ బ్రిడ్జి ప్రారంభంలోగా జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనుల పూర్తికీ జీహెచ్ఎంసీ శ్రమిస్తోంది. ► ఐటీ శాఖ నిర్వహిస్తున్న ఈ–ప్రొక్యూర్మెంట్ విభాగం ద్వారా సుమారు రూ.1,20,434 అంచనా వ్యయం కలిగిన 1,55,182 టెండర్లను నిర్వహించారు. ఈ గణాంకాలతో టెండర్ల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ► టెక్నాలజీ ఎంపవరింగ్ గరŠల్స్ పేరుతో 560 మంది స్త్రీలకు డిజిటల్ లిటరసీ నైపుణ్యాన్ని అందించింది. ► కరోనా రోగుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్‌ను టీ–వర్క్స్ తయారుచేసింది. ► తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తెలుగు వికీపీడియా రూపకల్పనకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌తో కలిసి పనిచేస్తోంది. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం ఉన్న లక్ష వ్యాసాలను 30 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ► తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరఫున తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర నిర్వహించి 120 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను గుర్తించారు. ► నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘టీ–వ్యాలెట్’యాప్‌ను 11 లక్షల మంది వినియోగదారులు క్రియాశీలంగా వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు రూ.6,795 కోట్ల లావాదేవీలు దీని ద్వారా జరిగాయి. ► ఐటీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ఇప్పటికే నాలుగేళ్లను పూర్తి చేసుకుంది. ఫేస్బుక్, యూటీసీ, బోయింగ్ వంటి కంపెనీలతో కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలను కొనసాగిస్తున్నది. ► తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా 3.50 లక్షల మంది నిరుద్యోగ యువతకు, 1,500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 40కిపైగా కార్పొరేట్ కంపెనీలతో 4,500 మంది విద్యార్థులకు టాస్క్ ద్వారా ఉద్యోగావకాశాలు లభించాయి. ► దేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 6 శాతం. 250కిపైగా కంపెనీలు రాష్ట్రంలో లక్షా 16 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. ► 2019లో తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం రూ.7,337 కోట్ల పెట్టుబడులను తెచ్చింది. స్కైవర్త్ గ్రూప్, ఇన్నోలియా ఎనర్జీ వంటి భారీ పెట్టుబడులతో పాటు ప్రస్తుతం ఉన్న కంపెనీలు కూడా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ► మైక్రాన్ తన ఉద్యోగులను 700 నుంచి 2,000 పెంచింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో వన్ ప్లస్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నది. -
రోడ్ నెంబర్ 45లో ఆస్తుల సేకరణ పూర్తి
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తుల సేకరణ పూర్తికానందున ఎంతోకాలంగా ముందుకు సాగని జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనులిక వేగం పుంజుకోనున్నాయి. వాస్తవానికి గత సంవత్సరమేఈ కారిడార్ పనులు పూర్తి కావాల్సి ఉండగా, నిర్మాణ పనులకు అవసరమైన ఆస్తుల సేకరణలో 21 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఆస్తుల సేకరణ పూర్తయిందని, ఇప్పుడిక పనుల వేగం పెంచుతామనిఅధికారులు చెబుతున్నారు. దుర్గం చెరువుకు అనుసంధానం.. దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయినప్పటికీ, రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితేనే దాన్ని ప్రారంభించనున్నారు. లేని పక్షంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తనుండటంతో రోడ్‌నెంబర్ 45 పనుల్ని వీలైనంత త్వరితంగా పూర్తిచేసేందుకుఅధికారులు చర్యల్లో మునిగారు. దుర్గం చెరువు, రోడ్‌నెంబర్ 45 పనులు పూర్తయితే ఐటీ కారిడార్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని భావించిన మునిసిపల్ మంత్రి కేటీఆర్ సైతం వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నెల ఆరంభంలో ఈ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించారు. విద్యుత్ లైన్ల తరలింపు పనులు జరగాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడారు. వారు రెండు వారాల్లోగా విద్యుత్ లైన్లు తరలిస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కారిడార్ పనులు జరిపేందుకు అవసరమైన మేర విద్యుత్ లైన్ల తరలింపు మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. దాంతో ఎలివేటెడ్ కారిడార్ పనులు చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ తరలింపు పనుల సమస్యలు కొలిక్కి రావడంతో సత్వరం పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ 2న ప్రారంభించే యోచనలో.. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన దుర్గం చెరువు కేబుల్ వంతెనతో పాటు రోడ్‌నెంబర్ 45 కారిడార్లను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచైనా సరే పనులు పూర్తిచేయాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దుర్గం చెరువు పనులు దాదాపుగా ఇప్పటికే పూర్తయినా, రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనులు జరగాల్సి ఉంది. రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే, పంజగుట్ట, బంజారాహిల్స్‌ల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వరకు సాఫీగా సాగిపోవచ్చు. తద్వారా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ.150 కోట్లు. షేక్‌పేట కారిడార్‌కు తొలగనున్న ఇబ్బందులు.. దీంతోపాటు దాదాపు రూ.335 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన షేక్‌పేట ఎలివేటెడ్ కారిడార్ పనులకు కూడా సమస్యలు తొలగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీని నిర్మాణానికి అవసరమైన భారీ ఆస్తి సేకరణ పూర్తయిందని, అంతమేర పనులు చేపట్టేందుకు వీలుందని అధికారులు తెలిపారు. మిగతా ఆస్తుల సేకరణ కూడా ఈనెలాఖరు వరకు పూర్తిచేయనున్నట్లు సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం చెబుతోంది. దీని నిర్మాణం పూర్తయితే మెహిదీపట్నం, సెవెన్ టూంబ్స్, ఫిల్మ్‌నగర్ తదితర మార్గాల నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. -
జతకట్టిన ఆ గట్టు.. ఈ గట్టు
సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పనుల్లో అత్యంత కీలక ఘట్టం తుది సెగ్మెంట్ అమరికను ప్రాజెక్ట్ టీమ్ మంగళవారం రాత్రి విజయవంతంగా పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయి భద్రత,నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మొత్తం 53 సెగ్మెంట్ల ఏర్పాటును 22 నెలల్లో పూర్తి చేశారు. తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టŠస్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ నేతృత్వంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటరమణ పర్యవేక్షణలో చివరి కీ సెగ్మెంట్ అమరికను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తి చేశారు. సాయంత్రం 4:30గంటలకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన సెగ్మెంట్ అమరిక పనిని రిమోట్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. సెగ్మెంట్లలో చివరి ఘట్టాన్ని పురస్కరించుకొని టీమ్ సభ్యులు ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చారు. ఇంజినీరింగ్ అద్భుతం... ఇప్పటి వరకు హైదరాబాద్ అంటే ప్రసిద్ధి చెందిన చార్మినార్, గోల్కొండ గుర్తుకొస్తాయి. ఇప్పుడీ జాబితాలో కేబుల్ బ్రిడ్జి చేరనుంది. దుర్గం చెరువుపై ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పనులు 21వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతమని పలువురు పేర్కొంటున్నారు. మూడు మిలియన్లకు పైగా పనిగంటలతో అధునాతన సాంకేతికతతతో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేశారు. ప్రపంచంలోనే పొడవైన స్పాన్లు కలిగిన కేబుల్ బ్రిడ్జిలు జపాన్‌లో 275, 271 మీటర్లతో రెండుండగా... 234 మీటర్లతో మూడోది ఇదేనని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తెలిపారు. స్టీల్ లేకుండా ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిలో మాత్రం ప్రపంచంలో ఇదే పొడవైనదన్నారు. మన దేశానికి సంబంధించినంత వరకు గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్డే అతి పెద్దది. ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ రూ.184 కోట్లతో ఈ బ్రిడ్జి పనులు చేపట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఈ బ్రిడ్జి పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ బ్రిడ్జికి సంబంధించి ఫినిషింగ్ పనులతో పాటు రెయిలింగ్, ప్రత్యేక విద్యుదీకరణ తదితర పనులు చేయాల్సి ఉంది. అన్నీ పూర్తయి వినియోగంలోకి రావడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఐకియా స్టోర్ వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కి.మీ.ల మేర దూరం తగ్గడంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్‌లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. -
జిగేల్ లైటింగ్
పంద్రాగస్టు రోజున మన జాతీయ జెండా...అక్టోబర్ 2న జాతిపిత చిత్రం...జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ముఖచిత్రం...జాతీయ నేతల పుట్టిన రోజు వేళ వారి ఫొటోలు....ఇవన్నీ విద్యుత్ కాంతుల రూపంలో దర్శనమివ్వబోతున్నాయి. ఎక్కడో తెలుసా...దుర్గంచెరువు వద్ద. అవును...సిటీకే ఐకానిక్‌గా ఇక్కడ నిర్మిస్తున్న కేబుల్ స్ట్రేబిడ్జిపై దేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ‘మీడియా డిస్ప్లే..నోడ్ లైటింగ్ సిస్టం’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిస్టం ద్వారా బ్రిడ్జి కొత్త తరహాలో వెలుగులు విరజిమ్మనుంది. సందర్భానుసారంగా వంతెనపై లైటింగ్‌ను మార్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు చైనా సాంకేతిక సహకారం తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ తరహా లైటింగ్ గోవాలో ఉండగా...‘మీడియా డిస్ప్లే’ మాత్రం దేశంలో మన దగ్గరే మొదటిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: పనుల ప్రారంభోత్సవం నుంచే పలు ప్రత్యేకతలతో అందర్నీ ఆకర్షిస్తోన్న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేక వెలుగుజిలుగులను అద్దుకోనుంది. ఓవైపు నిర్మాణంలోనూ పలు ప్రత్యేకతలు కలిగిన ఈ బ్రిడ్జిపై ప్రత్యేక దీపకాంతులద్దనున్నారు. ఇవి మామూలు వెలుగులనే ఇవ్వవు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయపతాకం బ్రిడ్జిపై ప్రత్యక్షమవుతుంది. బతుకుమ్మ పండుగ రోజున బతుకమ్మ ఉత్సవాలు విద్యుత్ వెలుగుల్లో కనిపిస్తాయి. అంతే కాదు.. జాతీయ నేతలు, ఇతర ముఖ్యుల జన్మదినాల సందర్భంగా వారి చిత్రాలు కూడా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతాయి. కేబుల్‌బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్న ‘మీడియా కంటెంట్ డిస్ప్లేతో ఇలా ఏ చిత్రమంటే ఆ చిత్రం..ఏ ఉత్సవమంటే ఆ ఉత్సవం..ఏ బొమ్మ అంటే ఆ బొమ్మ దుర్గం చెరువుపై రాత్రివేళల్లో తళుకులీనుతాయి. చేయి తిరిగిన చిత్రకారుడు తన కుంచెతో కాన్వాస్‌పై చిత్రించినట్లుగా విద్యుత్ నోడ్స్తోనే ఇవి సాధ్యం కానున్నాయి. ఇందుకుగాను ప్రత్యేకమైన డీఎంఎఫ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ఇందుకుగాను దాదాపు రూ.5 కోట్లు ఖర్చుకానుంది. ఎంబీఈ ఏజెన్సీ చైనా సహకారంతో ఈ ప్రత్యేక లైటింగ్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా బ్రిడ్జి సౌందర్యం మరింత ఇనుమడించనుంది. రెండు దశల్లో లైటింగ్ ఏర్పాట్లు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. తొలిదశలో రూ.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి కేబుళ్లు, టవర్లకు లైటింగ్ పనులు పూర్తిచేస్తారు. రెండోదశలో దుర్గం చెరువులో నీళ్లు మిలమిల మెరిసేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు. రానున్న దసరాలోగా బ్రిడ్జి పనులు పూర్తయ్యేనాటికే ఈ ప్రత్యేక విద్యుత్ వెలుగుల పనులు కూడా పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. గోవాలో రంగులు మారే ఏర్పాట్లు మాత్రమే ఉండగా, మీడియా డిస్ప్లే మాత్రం దేశంలో ఇదే మొదటిది కానుంది. హైదరాబాద్‌కే ఐకానిక్‌గా... హైదరాబాద్ నగరానికే ప్రత్యేక ఐకానిక్‌గా ప్రభుత్వం చేపట్టిన దుర్గంచెరువుపై కేబుల్‌బ్రిడ్జి దక్షిణ భారతదేశంలోనే తొలి కేబుల్‌బ్రిడ్జి. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జి అంచనా వ్యయం రూ.184 కోట్లు. ఇప్పటికే పలువురి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్రిడ్జి పనులు పూర్తయితే దుర్గంచెరువు ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారనుంది. స్టీల్ లేకుండా ఎక్స్ట్రా డోస్ట్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిల్లో ప్రపంచంలో ఇదే పొడవైన బ్రిడ్జిగా కూడా రికార్డు కానుంది. ఈ కేబుల్‌బ్రిడ్జిపై మూడు లేన్ల వాహనాల రహదారితో పాటు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లుంటాయి. కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్–జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గడమే కాక జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కి.మీ.ల దూరం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. -
అక్టోబర్‌లో పూర్తి కానున్న దుర్గం చేరువు కేబుల్ బ్రిడ్జి
-
టూరిస్ట్ ఆకర్షణగా మారనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
-
అక్టోబర్ నాటికి అందాల దుర్గం
సాక్షి, గచ్చిబౌలి: దక్షిణ భారతదేశంలో తొలి కేబుల్ బ్రిడ్జిగా.. మహానగరానికి ఐకానిక్‌గా దుర్గం చెరువుపై నిర్మిస్తున్న హ్యాంగింగ్ బ్రిడ్జి పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే గనుక అందుబాటులోకి వస్తే నగర సిగలో మరో మణిహారముతుందనడంతో సందేహం లేదు. దీంతో దుర్గం చెరువు ప్రాంతం ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇక్కడ జరుగుతున్న పనులను శనివారం శనివారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు. ఈ బ్రిడ్జి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని వంతెనను విద్యుత్ వెలుగులతో అలంకరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి రెండు మిలియన్ల పని గంటలు ఎలాంటి ప్రమాదం లేకుండా పూర్తి చేశారు. అత్యంత భద్రతా చర్యలతో పనులు కొనసాగిస్తున్నారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో 238 మీటర్ల పొడవుతో చేపట్టిన ఈ భారీ కాంక్రీట్ నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని ప్రాజెక్ట్ పనులు చేస్తున్న ఇంజినీర్లు చెబుతున్నారు. బ్రిడ్జికి మొత్తం 53 సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటికే 13 సెగ్మెంట్లను అమర్చారు. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తు ఉన్న సిమెంట్ కాంక్రీట్ సెగ్మెంట్ల అమరికకు అత్యంతాధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. అక్టోబర్ నాటికి పూర్తి: దానకిశోర్ దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. జీహెచ్ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నామన్నారు. బ్రిడ్జిపై మూడు లేన్ల వాహనాల రహదారితో పాటు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను సైతం నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.10 కోట్ల వ్యయంతో ఆకర్షణీయమైన ఇంటిగ్రేటెడ్ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ లైట్లు మొత్తం స్టీల్ బ్రిడ్జి పిల్లర్లలోనే అమర్చుతున్నట్టు వివరించారు. బ్రిడ్జికి ఇరు వైపులా అత్యాధునిక పద్ధతిలో స్టీల్ రైలింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్–జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గుతుందని, అంతే కాకుండా జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలి వరకు దాదాపు రెండు కి.మీ. దూరం తగ్గుతుందన్నారు. కొండాపూర్‌లో సెగ్మెంట్ల నిర్మాణం పూర్తి చేసి రాత్రి సమయంలో రోడ్డు మార్గం ద్వారా దుర్గం చెరువుపై అమరుస్తున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, శేరిలింగంపల్లి ఉప కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు. -
దుర్గం చెరువుపై అత్యాధునిక కేబుల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో జీహెచ్ఎంసీ దుర్గం చెరువు వద్ద చేపట్టిన కేబుల్‌స్టే బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే అక్టోబర్‌లోగా పూర్తికానున్నాయి. దేశంలోనే అతి పెద్ద, ప్రపంచ వ్యాప్తంగా మూడవ పెద్ద కేబుల్ బ్రిడ్జిగా చరిత్రకెక్కనుంది. ఇప్పటివరకు గుజరాత్ బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జే అతి పెద్దది. జపాన్‌లో మరో రెండు పెద్ద కేబుల్ బ్రిడ్జిలున్నాయి. బ్రిడ్జి పనుల్ని త్వరగా పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ఇంజ నీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో 754.38 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు 60% పూర్తయ్యాయి. వంతెన సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని అధికారులు పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జి ఎత్తు- 20 మీటర్లు పొడవు- 754.38 మీటర్లు నిర్మాణ వ్యయం- 184కోట్లు ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతికత.. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతిక విధానాన్ని అవలంబిస్తున్నారు. దీంతో వంతెన ఎత్తు తగ్గడంతో పాటు చెరువుకు ఇరువైపులా, చెరువు మధ్యలో బ్రిడ్జికి పిల్లర్‌ను నిర్మించకుండానే పూర్తి చేయనున్నారు. సంప్రదాయ సాంకేతిక విధానంలో నిర్మిస్తే 75 మీటర్ల ఎత్తు వరకు పిల్లర్లను నిర్మించడంతో పాటు చెరువు మధ్యలో అంతే ఎత్తులో సపోర్టింగ్‌గా మరో పిల్లర్‌ను నిర్మించాల్సి వచ్చేది. దీంతో ఎంతో ఎత్తుపై ఈ కేబుల్ బ్రిడ్జి మహానగరాల ప్రమాణాలకు విరుద్ధంగా ఉండేది. ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతిక విధానంతో 75 మీటర్లకు బదులుగా 57 మీటర్ల ఎత్తులోనే పిల్లర్లను నిర్మిస్తున్నారు. ఇలాంటి సాంకేతిక పద్ధతితో కేబుల్ బ్రిడ్జి నిర్మించడం ప్రపంచంలో ఇది మూడోది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మాదా పూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గ డంతో పాటు హైదరాబాద్‌లో తొలి హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందనుంది. దీంతో మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. దీనికి అవసరమైన స్టే కేబుళ్లను ఆస్ట్రియా నుంచి తెప్పించారు. ట్రాక్ బీమ్ ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తుతో ఉం డే ప్రధాన బ్రిడ్జికి సంబంధించిన ప్రీ కాస్టింగ్ నిర్మాణ పనులు కొండాపూర్‌లో జరుగుతున్నాయి. సిగ్నల్ ఫ్రీ కారిడార్.. నగరంలో వివిధ ఐటీ పరిశ్రమలు హైటెక్ సిటీ, మాదాపూర్ వైపున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ మంది నివాసాలు పంజాగుట్ట, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్లేందుకు ఎన్ఎఫ్సీఎల్ నుంచి ఖాజాగూడ వరకు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ప్రయాణం సాఫీగా పలు ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో కేబీఆర్ జంక్షన్ చుట్టూ ఫ్లై ఓవర్లు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్, ఇనార్బిట్ మాల్ నుంచి ఖాజాగూడ టన్నెల్‌తో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కూడా ఉంది. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రయోజనాలు.. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఇది ప్రత్యేక ఐకాన్‌గా నిలుస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36, మాదాపూర్‌పై ట్రాఫిక్ తగ్గుతుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కి.మీ. మేర దూరం తగ్గనుంది. నమూనా చిత్రం రూ.2,988 కోట్లతో పనులు: మేయర్ దుర్గం చెరువు బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్ ఫ్లై ఓవర్ పనుల్ని గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనతో కలసి మాట్లాడుతూ... సిగ్నల్ ఫ్రీ పనుల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.2,988 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని, వచ్చే మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే రూ.65.82 కోట్లతో చేపట్టిన రాజీవ్ గాంధీ ఫ్లైఓవర్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. రూ.150 కోట్లతో చేపట్టిన రోడ్ నం.45 ఎలివేటెడ్ కారిడార్‌ను వచ్చే సెప్టెంబర్‌లో... రూ.333.55 కోట్లతో నిర్మిస్తున్న షేక్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్, రూ. 263 కోట్లతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్, అంబర్‌పేట చే నంబర్ వద్ద రూ. 270 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్లు డిసెంబర్‌లోగా పూర్తికానున్నాయన్నారు. ఓవైసీ హాస్పిటల్ నుంచి బహదూర్‌పురా మార్గంలో రూ.132 కోట్ల వ్యయంతో చేపట్టిన కారిడార్ నిర్మాణం సెప్టెంబర్‌లోగా పూర్తి కానుందన్నారు. ఇంకా రూ. 2,353 కోట్ల ఖర్చుతో ఏడు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల పనులకు టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉందని వెల్లడించారు. రూ.1,186 కోట్ల వ్యయంతో ఖాజాగూడ టన్నెల్, ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్ క్రాస్‌రోడ్ ఫ్లైఓవర్లు అనుమతి దశలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, సూపరింటిండింగ్ ఇంజనీర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు భవిష్యత్ శూన్యం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోకాలడ్డుతోందని.. ఎన్ని కుప్పిగంతులేసినా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం కరీంనగర్‌లోని మానేరువాగుపై రూ.149 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి, కమాన్ నుంచి సదాశివపల్లి వరకు రూ.34 కోట్లతో చేపట్టనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ పట్టించుకునే స్థితిలో లేరని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరాలను తెలుసుకుని పనిచేస్తోందన్నారు. ప్రాజెక్టులు, కరెంటు, రహదారులు, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. కరీంనగర్లో రూ.149 కోట్లతో నిర్మాణం జరగనున్న కేబుల్ బ్రిడ్జి సౌతిండియాలోనే మొదటిదని అన్నారు. బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్‌కు మణిహారంలా ఉంటుందన్నారు. కరీంనగర్ ప్రజలు హక్కుదారులు.. ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడిన కరీంనగర్ ప్రజలు ప్రభుత్వంలో హక్కుదారులని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనని కేసీఆర్ క్లాక్‌టవర్ సాక్షిగా చెప్పారని అన్నారు. ఎన్ని నిధులైనా అడిగి తీసుకునే హక్కు మనకుందన్నారు. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ పచ్చగా మారిపోతుందని, కరీంనగర్ వాటర్‌హబ్‌గా నిలుస్తుందని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సౌతిండియాలో మొదటి కేబుల్ బ్రిడ్జి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కరీంనగర్లో జరగనుంది. దేశంలో ఇది మూడో బ్రిడ్జిగా ప్రసిద్ధిచెందనుంది. మానేరు నదిపై అత్యాధునిక టెక్నాలజీతో రూ.149 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కేబుల్ బ్రిడ్జి పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించనున్నారు. నిర్మాణ పనులను టాటా కన్సల్టెన్సీ, థాయ్‌లాండ్‌కు చెందిన గులేర్మాక్ సంస్థతో కలిసి చేపట్టనుంది. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ కేబుల్ బ్రిడ్జి కరీంనగర్‌కు మణిహారంలా మారనుంది. గత అక్టోబర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చి, నిధులు విడుదల చేసింది. 21.5 మీటర్ల వెడల్పు, 520 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తుతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. కేబుల్‌కు సపోర్టు ఇచ్చేందుకు 45 మీటర్ల ఎత్తులో రెండు టవర్లు ఏర్పాటు చేయనున్నారు. 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రూ.34 కోట్లతో కమాన్ నుంచి సదాశివపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మంత్రులు మాట్లాడనున్నారు. రోడ్డు, బ్రిడ్జి పనులు పూర్తయితే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లేందుకు సుమారు 7 కి.మీ. దూరం తగ్గనుంది. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని ఇటీవలి పర్యటనలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐటీ టవర్లను మంజూరు చేశారు. -
ఉత్తర భారతంలో తొలి కేబుల్ ఆధారిత వంతెన
బాసోహ్లి(జమ్మూకశ్మీర్): ఉత్తర భారతదేశంలోనే తొలి కేబుల్ ఆధారిత వంతెనను రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. ఈ వంతెనను భారత జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారు. ఇది మూడు రాష్ట్రాల రాకపోకలను దగ్గర చేయనుంది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఈ వంతెన ఉపయోగించుకోవడం ద్వారా మరింత దగ్గరి సంబంధాలు కొనసాగించనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా పాల్గొన్నారు. బాసోహ్లి వద్ద రావి నదిపై ఈ కేబుల్ ఆధారిత వంతెనను నిర్మించారు. ఇది దునేరా-బాసోహ్లి-భదర్వా రోడ్డు మార్గంలో ఉంది. ఇలాంటి వంతెనలు మొత్తం నాలుగు ఉండగా మిగితా మూడు ఒక కోల్ కతాలో హూగ్లీ నదిపైన, మరోకటి అలహాబాద్ లోని నైనీ బ్రిడ్జి, మరోకటి ముంబయిలోని రాజీవ్ గాంధీ సీలింక్ వంతెన. తాజాగా నిర్మించిన వంతెన పనులు 2011 సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యాయి.