
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ వీకెండ్ మస్తీతో ఉర్రూతలూగింది ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి వీకెండ్ మస్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

కళాకారుల ఆటపాటలతో కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతం జరిగిన మ్యూజికల్ షో ఆహూతులను ఆకట్టుకుంది


మంత్రి గంగులతో పాటు.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ గోపీ, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, మేయర్ సునీల్ రావు తదితరులు ఆటవిడుపుగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మొట్టమొదటిసారిగా ఈరోజే వీకెండ్ మస్తీని ప్రారంభించగా.. పర్యాటకులతో కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది

ప్రతీ శని, ఆదివారాల్లో వీకెండ్ మస్తీ ఉంటుందని వెల్లడించారు












