
ఉత్తర భారతంలో తొలి కేబుల్ ఆధారిత వంతెన
ఉత్తర భారతదేశంలోనే తొలి కేబుల్ ఆధారిత వంతెనను రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. ఈ వంతెనను భారత జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారు.
బాసోహ్లి(జమ్మూకశ్మీర్): ఉత్తర భారతదేశంలోనే తొలి కేబుల్ ఆధారిత వంతెనను రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. ఈ వంతెనను భారత జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారు. ఇది మూడు రాష్ట్రాల రాకపోకలను దగ్గర చేయనుంది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఈ వంతెన ఉపయోగించుకోవడం ద్వారా మరింత దగ్గరి సంబంధాలు కొనసాగించనున్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా పాల్గొన్నారు. బాసోహ్లి వద్ద రావి నదిపై ఈ కేబుల్ ఆధారిత వంతెనను నిర్మించారు. ఇది దునేరా-బాసోహ్లి-భదర్వా రోడ్డు మార్గంలో ఉంది. ఇలాంటి వంతెనలు మొత్తం నాలుగు ఉండగా మిగితా మూడు ఒక కోల్ కతాలో హూగ్లీ నదిపైన, మరోకటి అలహాబాద్ లోని నైనీ బ్రిడ్జి, మరోకటి ముంబయిలోని రాజీవ్ గాంధీ సీలింక్ వంతెన. తాజాగా నిర్మించిన వంతెన పనులు 2011 సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యాయి.