సిద్దిపేట: ఆకాశంలో దోబూచులాడుతున్న కారు మబ్బులు.. నిండుకుండలా ఉన్న చెరువుపై వేలాడుతున్న తీగల వంతెన.. ఈ చిత్రం చూపురులను కట్టిపడేస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా రోజుల తర్వాత పర్యాటక ప్రాంతాలకు ప్రజలను అనుమతిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ట్యాంక్‌బండ్‌పై ఉన్న సస్సెన్షన్ బ్రిడ్జ్ కారుమబ్బుల నేపథ్యంలో ఇలా అందాలను చిందించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
అటవీప్రాంతంలో మంచెపై ఐసోలేషన్‌లో ఉన్న గిరిజనుడు
గూడెంలో కోవిడ్ గడబిడ
మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గొత్తికోయలగూడెంలో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ 36 కుటుంబాలు, 174 మంది జనాభా ఉన్నారు. కొందరు గిరిజనులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసి వైద్యసిబ్బంది మూడు రోజుల క్రితం గూడేనికి వెళ్లి వైద్యపరీక్షలు చేయగా నలుగురికీ పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలున్న కొంతమంది నాటుమందులు వాడుతూ అటవీప్రాంతంలోని పంటపొలాల్లో మంచెలు, డేరాలలో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కరోనా లక్షణాలున్న మరో 50మందికి వైద్యసిబ్బంది కిట్లను అందజేశారు. గూడెంవాసులు కరోనా పరీక్షలకు సహకరించట్లేదని జిల్లా మండల వైద్యాధికారి గోపీనాథ్ తెలిపారు.
సాగు బడిలో బడి పాఠం
పత్తి పంటలో కలుపు తీస్తూ పిల్లల పనులు ఓ వైపు... మరోవైపు పనుల్లో మునిగి తేలుతూ ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేసుకొని బడి పాటాలు వింటూ చకచకా చిట్టి చేతులతో కొంకలు పట్టి పనుల్ని పరుగులు పెటించారు చిన్నారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రెబ్బల్‌దేవ్‌పల్లి గ్రామ çశివారు పత్తి పంటలో బడి పాఠాలు వింటూ పనులు చేస్తున్న పిల్లలు ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment